Atal Innovation Center
-
త్వరలో 18 ఏళ్లకు పైగా వయస్సు ఉన్న వారందరికీ వ్యాక్సిన్
-
గురుకుల విద్యార్థినుల ఘనత
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ మేలో నిర్వహించిన అటల్ కమ్యూనిటీ డే ఛాలెంజ్ – 2020లో ఈ విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఈ ఫలితాలు శుక్రవారం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ల కోసం 1,100కు పైగా ఎంట్రీలు రాగా అందులో 30 ప్రాజెక్టు ఐడియాలను జడ్జిలు ఎంపిక చేశారు. ఈ 30 ప్రాజెక్టుల్లో రెండు ప్రాజెక్టు ఐడియాలు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో చదివే విద్యార్థులు సమర్పించారు. ► విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గురుకుల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కేఎల్‌ఎస్‌పీ వర్షిణి ‘పీఐసీఓ’ (పికో–ద కోవిడ్ చాట్‌బాట్)ను రూపొందించింది. ఇది వాయిస్ కమాండ్లు, టెక్టస్ మెజేస్‌లను లేదా రెండింటి ద్వారా మానవ సంభాషణలు అనుకరించే కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది ఏదైనా పెద్ద మేసేజింగ్ ఆవర్తనాల ద్వారా ఉపయోగించే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. కోవిడ్–19 లాక్డౌన్, అన్‌లాక్ సమయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సహాయం చేయడానికి, ముందస్తు జాగ్రత్తలు చెప్పటానికి, కోవిడ్‌పై పోరాటానికి ‘పికో’ను వర్షిణి పరిచయం చేసింది. వర్షిణి స్వస్థలం విశాఖ జిల్లా బక్కన్నపాలెం. ► విజయనగరం జిల్లా చీపురుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గర్భపు ప్రవల్లిక ‘వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం అందించేందుకు డ్రోన్లు ఉపయోగించుట’ అనే అంశంపై ప్రాజెక్టును సమర్పించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించి మెడికల్ కిట్లతో పాటు ఇతర అత్యవసర సామగ్రిని సరఫరా చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు రక్షించవచ్చు. వరద సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మెడికల్ కిట్స్ సరఫరా చేయడం, పరిస్థితిపై అవగాహన కల్పించడం ఈ ప్రోగ్రాం లక్ష్యం. ప్రవల్లిక స్వస్థలం విజయనగరం జిల్లా తెర్లాం మండలం కుసుమూరు. ► ఈ రెండు ప్రోగ్రామ్‌ల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు దేశవ్యాప్త గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో నిర్వహించే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లోని కొత్తకొత్త ఆలోచనలకు పదును పెడుతున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కల్నల్ వి రాములు తెలిపారు. (అందరూ ఉన్నా అనాథలయ్యారు..) -
జూన్‌లో ఏఐఎం నుంచి కొత్త స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) వచ్చే జూన్ నుంచి మరొక సరికొత్త పథకంతో రానుంది. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ), స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు లఘు వ్యాపార ఆవిష్కరణలు (స్మాల్ బిజినెస్ ఇన్నోవేషన్) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ ఆర్ రామనన్ రామనాథన్ తెలిపారు. ‘ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సదస్సు అనంతరం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ∙లఘు వ్యాపార పరిశ్రమల పథకం కింద స్థానిక సమస్యలను పరిష్కరించే నూతన ఆవిష్కరణలు చేసే ఎంఎస్ఎంఈ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాంకేతికత, మౌలిక సదుపాయాలతో పాటూ నిధుల సహాయం కూడా అందిస్తాం. ∙ప్రస్తుతం ఏఎంఐలో థింకరింగ్ ల్యాబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ పేరిట ఇన్నోవేషన్ ప్రోగ్సామ్ ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు థింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ∙ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌లను ప్రోత్సహించేందుకు విశ్వ విద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 ఇంక్యుబేషన్ సెంటర్లు మంజూరు కాగా.. 30 సెంటర్లు నిర్వహణలో ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి 100 ఇంక్యుబేషన్ సెంటర్లలో 5 వేల స్టార్టప్స్ ఉండాలన్నది ఏఐఎం లక్ష్యం. ∙తెలుగు రాష్ట్రాల్లో 13 ఇంక్యుబేషన్ సెంటర్లున్నాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఐఎస్బీ, టీ–హబ్. విశాఖపట్నంలల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగ వృద్ధి, తీర ప్రాంతాల ఆదాయ వనరుల వృద్ధికి ఆయా స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఇంక్యుబేషన్ ఏర్పాటుకు యూనివర్సిటీ విస్తీర్ణం కనీసం 10 వేల చ.అ. ఉండాలి. ది థింగ్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం.. సైబర్ ఐ, ఐబీ హబ్స్ ఆధ్వర్యంలో లోరావన్, ఐఓటీ టెక్నాలజీ అవకాశాలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి, నిర్వహణ వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై చర్చించే ‘ది థింగ్స్ కాన్ఫరెన్స్’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యూరప్ వెలువల ఆసియాలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. రెండు రోజలు ఈ సదస్సులో టెక్నాలజీ నిపుణులు, కంపెనీ సీఈవోలు, స్పీకర్లు తదితరులు పాల్గొన్నారు. ‘‘చైనా, యూరప్ దేశాలు లోరావాన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని.. దీంతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని సైబర్ ఐ సీఈఓ రామ్ గణేష్ తెలిపారు. తెలంగాణలోనూ లోరావాన్ టెక్నాలజీ అభివృద్ధి, నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని.. ప్రస్తుతం టెక్నాలజీ టెస్టింగ్ పైలెట్ ప్రాజెక్ట్ జరుగుతుందని.. త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ది థింగ్స్ ఇండస్ట్రీస్ సీఈఓ అండ్ కో–ఫౌండర్ వింకీ గిజీమాన్ తదితరులు పాల్గొన్నారు. -
అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా సీసీఎంబీ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతకు ప్రోత్సాహించే లక్ష్యంతో కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఎంపికైనట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. వినూత్నమై ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు సీసీఎంబీలోని సౌకర్యాలన్నీ అందుబాటులోకి తేవడం, తద్వారా సామాజిక ప్రయోజనాలున్న ఉత్పత్తి లేదా సేవగా అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపు 3,780 సంస్థలు వరకూ ఈ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయగా నీతి ఆయోగ్ పదింటిని ఎంపిక చేసిందని, ఇందులో సీసీఎంబీ ఒకటని మిశ్రా తెలిపారు. ఈ కేంద్రంలో బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తామని, సీసీఎంబీ అనెక్స్–2లో దాదాపు పదివేల చదరపు అడుగుల స్థలం, రెండు – మూడు కోట్ల విలువైన యంత్ర సామాగ్రి అందుబాటులో ఉంటుందన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను అంచనా వేయడం మొదలుకొని.. మేధోహక్కుల పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఫార్మా, ప్రిస్కిప్షన్ మెడిసన్, స్టెమ్‌సెల్ వైద్య రంగాల్లో స్టార్టప్‌లపై తాము దృష్టిపెడతామని చెప్పారు. దీని కోసం నీతి ఆయోగ్ ఏడాదికి గరిష్టంగా రూ.పది కోట్ల వంతున ఐదేళ్లపాటు నిధులు అందిస్తుందని.. ఆ తరువాత సంస్థ తనంతట తానే మనుగడ సాగించాలన్నారు. సీసీఎంబీలో ఇప్పటికే ఇలాంటి ఇన్క్యుబేషన్ కేంద్రం ఒకటి పనిచేస్తోందని.. అటల్ ఇన్నొవేషన్ సెంటర్ దీనికి అదనమని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సీసీఎంబీ ఒక సెక్షన్ –8 కంపెనీని ఏర్పాటు చేస్తోందని.. వ్యాపార సంస్థ మాదిరిగానే దీనికి సీఈవో, బోర్డ్ ఆఫ్డైరెక్టర్లు తదితరులు ఉంటారని తెలిపారు. ఔత్సాహికుల ఐడియాలను మదింపు చేసేందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతోపాటు ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రైవేట్ వ్యక్తుల సేవలను తీసుకుంటామని తెలిపారు.