Atal Tinkering Labs
-
స్పేస్ చాలెంజ్లో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
సాక్షి, అమరావతి: అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ వివరాలను ఎస్సీ గురుకులాల కార్యదర్శి కె.హర్షవర్థన్ గురువారం మీడియాకు వెల్లడించారు. గతేడాది అక్టోబర్లో జరిగిన ఏటీఎల్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు 2,500 ఆవిష్కరణలను ప్రదర్శించారని చెప్పారు. విశాఖపట్నం జిల్లా మధురవాడ గురుకుల విద్యార్థులు రూపొందించన ఆవిష్కరణ వాటిలో 75 ఉత్తమ ఆవిష్కరణలను బుధవారం ప్రకటించారని వెల్లడించారు. ఇందులో ఏపీకి సంబంధించి మూడు ఆవిష్కరణలకు మంచి పేరొచ్చిందని తెలిపారు. ఆ మూడు ఆవిష్కరణలు కూడా ఎస్సీ గురుకులాల విద్యార్థులవే కావడం గమనార్హమన్నారు. వీరికి త్వరలోనే ఇస్రో, నీతి ఆయోగ్ నుంచి బహుమతులు వస్తాయని తెలిపారు. -
ఆవిష్కరణలకు దన్నుగా ఏటీఎల్
న్యూఢిల్లీ: యువ ఆవిష్కర్తలను ప్రోత్సాహించేందుకు నీతి ఆయోగ్ దేశంలో 10 అటల్ టింకరింగ్ ప్రయోగశాల(ఏటీఎల్)లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. దీని కోసం ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఇంటెల్తో రెండేళ్ల ఒప్పదం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఎఐఎం)లో భాగంగానే వీటిని ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా 12-18 ఏళ్ల వయస్సున్న విద్యార్థుల్లో కొత్త ఆవిష్కరణలకు ఉపయోగపడే గణన ఆలోచన, సంయోజిత అభ్యాసం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే దీని(ల్యాబ్ల ఏర్పాటు) లక్ష్యం. అందుకోసం ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లను వెచ్చించి ఐదేళ్లలో దేశమంతటా 500 ఏటీఎల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. నూతన ఆవిష్కరణలకు కావాల్సిన వస్తువులు, పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థుల్లో ఒకరి నుంచి మరొకరికి జ్ఞానమార్పిడి జరగడానికి ఈ ఏటీఎల్ కేంద్రాలు ఉపయోగపడతాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాభ్ కాంత్ అభిప్రాయపడ్డారు.