
ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకుల విద్యార్థులు
సాక్షి, అమరావతి: అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ వివరాలను ఎస్సీ గురుకులాల కార్యదర్శి కె.హర్షవర్థన్ గురువారం మీడియాకు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఏటీఎల్ స్పేస్ చాలెంజ్–2021 పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 6,500 మంది విద్యార్థులు 2,500 ఆవిష్కరణలను ప్రదర్శించారని చెప్పారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ గురుకుల విద్యార్థులు రూపొందించన ఆవిష్కరణ
వాటిలో 75 ఉత్తమ ఆవిష్కరణలను బుధవారం ప్రకటించారని వెల్లడించారు. ఇందులో ఏపీకి సంబంధించి మూడు ఆవిష్కరణలకు మంచి పేరొచ్చిందని తెలిపారు. ఆ మూడు ఆవిష్కరణలు కూడా ఎస్సీ గురుకులాల విద్యార్థులవే కావడం గమనార్హమన్నారు. వీరికి త్వరలోనే ఇస్రో, నీతి ఆయోగ్ నుంచి బహుమతులు వస్తాయని తెలిపారు.