Atijam
-
బాబుకు ఆటిజమ్... చికిత్స ఉందా?
మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
బాబుకు ఆటిజమ్... తగ్గుతుందా?
మా బాబుకు నాలుగేళ్లు. వయసుకు తగినట్లుగా ఎదుగుదలగానీ, వికాసం గానీ కనిపించలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స సాధ్యమేనా? ఆటిజమ్ అనే రుగ్మత ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని తీవ్రతలో చాలా తేడాలతో పాటు, ఎన్నో లక్షణాలు, వాటిల్లో తేడాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటిజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడుతుండవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవడలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ అంటేనే నాకు వణుకు వచేస్తోంది. హోమియోలో ఆపరేషన్ లేకుండా చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలపాళ్లు తగ్గడంవల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు ►దీర్ఘకాలిక మలబద్దకం ►ఎక్కువకాలం విరేచనాలు ►వంశపారంపర్యం ►అతిగా మద్యం తీసుకోవడం ►ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు ►తీవ్రమైన నొప్పి, మంట ►చురుకుగా ఉండలేరు ►చిరాకు, కోపం ►విరేచనంలో రక్తం పడుతుంటుంది ►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ రాత్రంతా గురక... మర్నాడంతా మగత పల్మునాలజి కౌన్సెలింగ్స్ నా వయసు 52 ఏళ్లు. ఒక్కోసారి శ్వాస అందనట్లుగా అనిపించి రాత్రిళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను,. నోరు ఎండిపోయి ఉంటోంది. మళ్లీ నిద్రపట్టడం కష్టమవుతోంది. నిద్రలో పెద్ద శబ్దంలో గురక పెడుతున్నట్లు ఇంట్లోవాళ్లు చెబుతున్నారు. ఇక మర్నాడు పగలంతా బాగా అలసటగా ఉంటోంది. నా సమస్య ఏమిటి? ఇదేమైనా ప్రమాదమా? గురక రాకుండా చేయలేమా? స్లీప్ ఆప్నియా అనేది నిద్రకు సంబంధించిన సమస్య. స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారిలో నిద్రలో కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం తాత్కాలికంగా ఆగిపోయి ఒంటికి... అందునా ప్రధానంగా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. దాంతో రాత్రంతా సరైన, నాణ్యమైన నిద్రలేక మర్నాడంతా మగతగా ఉంటుంది. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా ఆక్సిజన్లేమి కారణంగా శరీరంలో జరగాల్సిన జీవక్రియలు సక్రమంగా జరగకపోవచ్చు. దాంతో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే శ్వాస తీసుకోవడం మందగించిపోయి, కొన్ని క్షణాల పాటు ఊపిరి నిలిచిపోవడం ఆప్పియాలో సంభవించే చాలా ప్రమాదకరమైన పరిణామం అన్నమాట. కారణాలు, పరిణామాలు : టాన్సిల్స్, సైనసైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంటాయి. ఈ ఆప్నియా కారణంగా కోపం, అసహనం కలుగుతుంటాయి. స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను క్లాసికల్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అని కూడా అంటారు. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు బలహీనంగా ఉండటం, గండెజబ్బులు ఉన్నవారికి స్లీప్ఆప్నియా కూడా ఉంటే అది ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది. పరిష్కారం / చికిత్స : ఇది పరిష్కారం లేని సమస్యేమీ కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, వైద్యనిపుణులను సంప్రదించి వారి సహాయం తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. స్లీప్ ఆప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా ఒంటికి తగిన ఆక్సిజన్ అందేలా చూసుకోడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. ప్రత్యేకించి రాత్రిపూట భోజనం పరిమితంగానే తీసుకునేలా జాగ్రత్త పడాలి.ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. చికిత్స విషయానికి వస్తే స్లీప్ ఆప్నియాకు సాధారణంగా రెండు రకాల మార్గాలను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం. రెండోది వైద్యపరమైన చికిత్సలు తీసుకోవడం. అంటే ఇందులో సమస్య తీవ్రతను బట్టి మందులను సిఫార్సు చేయడం, మరికొంతమందికి ‘సీ–ప్యాప్’ (కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్) అనే సాధనాన్ని అమర్చడం వంటివి సూచించడం జరుగుతుంటుంది.దీన్ని నిద్రపోయే ముందు ముక్కు మీద లేదా ముఖం మీద అమర్చుకుంటే రాత్రంతా గాలి ఆగిపోకుండా పంప్ చేస్తుంటుంది. నాలుక గొంతుకు అడ్డుపడకుండా చూస్తుంది. ఫలితంగా చాలా ఉపశమనం లభిస్తుంది. సమస్య మరీ తీవ్రంగా ఉండి, దశాబ్దాల తరబడి బాధపడుతున్నవాళ్లయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సిరావచ్చు. మీరు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్ డాక్టరుకు చూపించుకోండి. డాక్టర్ జి. హరికిషన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
స్పెషల్‌గా చూస్తారు.. మార్గం చూపుతారు
పరుగులు పెడుతున్న ఈ సాంకేతిక యుగంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే క్షణాలు సన్నగిల్లుతున్నాయి. ఫలితంగా ఎన్నో మానసిక సమస్యలు మనిషిని చుట్టుముడుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నవారు కొందరైతే.. మానసిక ఎదుగుదల లేని పిల్లల పెంపకం గురించి సమస్యలు ఎదుర్కొనే తల్లిదండ్రులు కొందరు. ‘ఇలాంటి వారికి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఒకే కప్పు కింద వందమంది స్పెషలిస్టులతో అవసరమైన థెరపీలతో చికిత్సనందిస్తున్నా’మన్నారు సరిపల్లి శ్రీజ. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసి తగిన మార్గదర్శకాలను రూపొందించారు. పోషకాహార నిపుణురాలైన శ్రీజ పిల్లల న్యూరలాజికల్ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఎలా పయనించారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.మా అబ్బాయి సంహిత్‌కు ఇప్పుడు నాలుగేళ్లు. చూస్తున్నారుగా చలాకీగా తిరుగుతూ ఎలా మాట్లాడుతున్నాడో.. ఇప్పుడు ఈ మాట ఆనందంగా చెప్పుగలుగుతున్నాను కానీ, మూడేళ్ల క్రితం మేం పడిన బాధ అంతా ఇంతా కాదు. వాడు పుట్టిన ఏడాదికి ఓ రోజు బాగా జ్వరం, నోటి నుంచి నురగలు వచ్చాయి. భయమేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. ట్రీట్మెంట్ పూర్తయ్యి, జ్వరం తగ్గింది కానీ, ఆ తర్వాత నుంచి వాడిలో విచిత్రమైన మార్పులు.. చేతికి ఏది దొరికితే అది విసిరేసేవాడు. పిలిస్తే పలికేవాడు కాదు.. ఈ సమస్యలతో మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్ ‘ఆటిజమ్’కు సంబంధించిన ఓ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. ‘అసలు మా అబ్బాయికున్న సమస్య ఏంటీ, ఇప్పుడీ పుస్తకం నాకెందుకు ఇచ్చారు?’ అని డాక్టర్‌ను అడిగితే ‘మీ అబ్బాయికి ఆటిజమ్ సమస్య ఉంది, మిగతా పిల్లల్లా కాదు తను’ అంటూ ఆటిజమ్ పిల్లల ప్రవర్తన గురించి వివరించి కొన్ని మందులు రాసిచ్చారు. అయితే వీడు మిగతా అందరు పిల్లల్లాగే చక్కగా ఆడుకునేవాడు, పెట్టింది తినేవాడు, అనవసరంగా ఏడ్వడం.. వంటివి చేసేవాడు. డాక్టర్‌తో ఇది ‘ఆటిజమ్’ కాదంటే మళ్లీ చెక్ చేశారు. ఆ పరీక్షలో మా అబ్బాయికి వినికిడి సమస్య ఉందని, దానివల్లే వాడు మేం చెప్పేది సరిగా వినడం లేదని తేల్చారు. బాబుకి మాటలు సరిగా రావాలన్నా, చెప్పింది వినాలన్నా రెండు– మూడేళ్లు స్పీచ్ థెరపీ చేయాలన్నారు. రోజూ స్పీచ్ సెంటర్‌కి తీసుకెళ్లాలి. వాడు రెండు రోజులు థెరపీ సెంటర్‌కి వచ్చాడు. మూడో రోజు నుంచి రానని మొరాయించడంతో అక్కడి వాతావరణం, ఆ థెరపీ విధానం నచ్చడం లేదని అర్థమైంది. ఇలాంటి పిల్లలకు థెరపీ ఇవ్వాలంటే ఇంటిలాంటి ప్లేస్ ఉండాలి. అది వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దేదిలా ఉండాలి. ‘అలాంటి సంస్థను మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు’ అనే ఆలోచనతో వీటికి సంబంధించి ఉన్న రకరకాల సెంటర్స్ గురించి చాలా రీసెర్చి చేశాం. థెరపీతో తెరపి.. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది రకరకాల న్యూరలాజికల్ కండిషన్స్, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ల సర్వే ద్వారా తెలిసింది. ఆ సమస్యలు.. ఆటిజం కావచ్చు, సెరిబ్రల్ పాల్సీ, చిన్న చిన్న ఫోబియాలు, మాటలో లోపాలు, స్ట్రెస్, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు, వైవాహిక బంధాలలో సమస్యలు.. ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారున్నారని తెలిసింది. ఇలాంటి వారికి థెరపీ ఇచ్చి వారి జీవితాలకు తెరపి ఇవ్వాలని మావారు సరిపల్లి కోటిరెడ్డితో కలిసి రెండేళ్ల క్రితం ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో స్పీచ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీంట్లో స్పీచ్ థెరపీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ మోడిఫికేషన్.. అన్నీ ఒకే దగ్గర లభించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక బ్రాండ్... వంద మంది స్పెషలిస్ట్‌లు వంద మంది స్పెషలిస్ట్‌లు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశాం. స్పెషల్ చిల్డ్రన్సే కాదు టీనేజ్ పిల్లల ప్రవర్తనలోనూ మార్పులు తీసుకురాదగిన థెరపీలను ఇక్కడ డెవలప్ చేశాం. రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడకు వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటుంటారు. ఆనందంగా వారి భావి జీవితాలను నిర్మించుకుంటున్నారు. స్పెషల్ చిల్డ్రన్‌కి థెరపీ ఇప్పించలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులకు సేవా, కోటి ఫౌండేషన్ల ద్వారా ఉచితంగా చికిత్సను ఇస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ 300 మంది పిల్లలు థెరపీ పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి 3 నెలల నుంచి రెండేళ్ల వరకు థెరపీ అవసరం. ఇప్పటికి హైదరాబాద్‌లో 11 థెరపీ సెంటర్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పినాకిల్ బ్లూమ్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ ముగించారు శ్రీజ. నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల పరిశీలిస్తూ... పరిష్కరించాలి... పిల్లల చిన్న వయసులోనే ఆటిజమ్‌ను గుర్తించకపోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కొందరిలో మాట ఉండదు. వాళ్లంతట వాళ్లు ఆడుకోలేరు, సోషల్ స్కిల్స్ ఉండవు, పిలిస్తే పలకకపోవడం, ఐ కాంటాక్ట్ ఉండకపోవడం వంటివి ప్రాథమిక లక్షణాలు. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే నలుగురిలో కలవలేకపోవడం, డిప్రెషన్, ఆత్మన్యూనత వంటి సమస్యలను కుటుంబసభ్యులు త్వరగా గుర్తించగలిగితే కౌన్సెలింగ్‌ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. డాక్టర్ శ్రీజ, పినాకిల్ బ్లూమ్స్ నిర్వాహకురాలు -
హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 32 ఏళ్లు. గత రెండు మూడు రోజుల నుంచి చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది. వెంటనే తుమ్ములుకూడా ఎక్కువగా వస్తున్నాయి. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. అలర్జిక్ రైనైటిస్ అన్నారు. మందులు వాడాను. కానీ బాధలు అలాగే కొనసాగుతున్నాయి. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ►కారణాలు: ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. ►లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. సయాటికాబాధతగ్గుతుందా? నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో బాధపడుతున్నాను. ఎమ్మారై తీసి, డిస్క్ బల్జ్‌తో పాటు సయాటికా అన్నారు. హోమియోలో వైద్యం ఉందా? ఇటీవల సయాటికా అనే పదాన్ని వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సయాటికాను గురిచి సరైన సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని హోమియో చికిత్స చేఇంచుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలోని నరాలన్నింటిలోనూ పొడవైనది సయాటికా. ఇది వీపు కింది భాగం నుంచి పిరుదుల మీదుగా పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 – 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ►కారణాలు: ∙ఎముకల్లో ఏర్పడే స్పర్శ వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది ∙దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరంపై వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది ∙గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది ∙శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు. ►లక్షణాలు: ∙కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం ∙కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం ∙రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి రావడం ∙బరువులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►నిర్ధారణ పరీక్షలు: ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై ►చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు ఈ అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది. ఆటిజమ్‌కు చికిత్స ఉందా? మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. -
ఆటిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా అబ్బయి ఐదేళ్లు. మాటలు సరిగా రావడం లేదు. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్ అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? - నాగేశ్వర్రావు, తెనాలి మాటలు సరిగా రాకపోవడం అన్నది ఆటిజమ్ ఉన్నపిల్లల్లోని ఒక లక్షణం. వారిలో చాలా ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే ఆటిజమ్ నిర్ధారణ చేయాలంటే ఇతర సమస్యలు ఉన్నాయేమో చూడాలి. కేవలం పిల్లల లక్షణాలను బట్టి ఆటిజమ్ అని నిర్ధారణకు రాకుండా వైద్యులకు చూపించుకున్న తర్వాతే దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటిజమ్ఉన్న పిల్లలలో ఆరోగ్యంగా ఉన్న పిల్లలలో తేడాను కనిపెట్టడం అంత సులభం కాదు. ఆటిజమ్ లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. దాన్ని క్లాసికల్ ఆటిజమ్ అంటారు. కొందరిలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. అది వారి జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్ ఆటిజమ్, ఆస్పర్జర్ సిండ్రోమ్ అని అంటారు. తీవ్రత ఎలా ఉన్నా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవి... మాట్లాడటం, భావవ్యక్తీకరణలో, ఏకాగ్రతను చూపలేకపోవడం, అందులో ఇబ్బందులు ఎదుర్కోవడం. (ఆటిజమ్ ఉన్న 40 శాతం మందిలో మాటలే రాకపోవచ్చు) పిల్లలు స్నేహితులను చేసుకోలేకపోవడం ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోలేకపోవడం నలుగురిలో కలవలేకపోవడం; ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం ఒకేమాటను పదే పదే ఉచ్చరించడమో లేదా అడిగిన ప్రశ్ననే మళ్లీ తిరిగి అడగటమో చేస్తుంటారు. ఎప్పుడూ రొటీన్‌నే కోరుకోవడం... అంటే ఒకేరకమైన ఆహారం లేదా దుస్తులు వేయమని అడగడం. వయసుకు తగినంత మానసిక పరిపక్వత చూపలేకపోవడం చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం, చుట్టూ తిరగడం, గజిబిజిగా నడవడం, శరీరంలో జర్క్ ఇచ్చినట్లుగా కదలికలు ఉండటం- ఇవన్నీ ‘ఆటిజమ్’ను గుర్తించడానికి బాగా తోడ్పడతాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. మాటలు రాని వారికి స్పీచ్ థెరపీ ఉపయోగపడుతుంది. బిహేవియరల్ థెరపీ వంటి చికిత్స ప్రక్రియల వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. హోమియోలో పిల్లల లక్షణాలు, కారణాల వంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకుని ఔషధాలను సూచిస్తారు. హోమియో చికిత్సలో ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. సరైన హోమియో మందులను, తగిన మోతాదులో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడటం వల్ల పిల్లల్లో ఆటిజమ్ చాలావరకు నయమవుతుంది. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్ పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ లింఫోమా అంటే ఏమిటి? లింఫోమా క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నేను ప్లీహం (స్ల్పీన్) పెరగడం వల్ల బాధపడుతున్నాను. పొట్టలో నొప్పి, గజ్జలలో వాపు, జ్వరం-చలి, రాత్రిపూట చెమటలు పట్టడం లక్షణాలు కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను కలిసి ఈ లక్షణాలను చెబితే, కొన్ని పరీక్షలు నిర్వహించి నేను లింఫోమా వ్యాధితో బాధపడుతున్నాని నిర్ధారణ చేశారు. లింఫోమా అంటే ఏమిటి, దానికి చికిత్స ఏమిటో చెప్పండి. - విశ్వేశ్వరరావు, వైజాగ్ లింఫోమా అనేది లింఫోసైట్స్ (తెల్ల రక్త కణాలను) ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, తీసుకెళ్లే కణజాలాల వ్యవస్థలో కలిగే క్యాన్సర్. ఇది ప్రాథమికంగా రెండు రకాలుగా ఉంటుంది. 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్-హాడ్జ్కిన్స్ లింఫోమా లింఫోమా లక్షణాలు నొప్పి లేకుండా మెడలో, చంకలో, గజ్జల్లో వాపు ప్లీహం (స్ప్లీన్) పెరగడం, పొట్టనొప్పి, అసౌకర్యం జ్వరం చలి లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం నిస్సత్తువగా అనిపించడం. రోగ నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్షలు బయాప్సీ ఎముక మూలుగ పరీక్ష సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్స్ మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు ఎక్స్‌రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ అనే ఇమేజింగ్ పరీక్షలు. వైద్య పరీక్షలను క్షుణ్ణంగా చేశాక మీ శరీరంలో లింఫోమా ఏ దశలో ఉందో మీ వైద్యుడికి తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఎలాంటి చికిత్స అందించాలన్న అంశం మూడు ప్రధాన విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవి... మీకు ఏ రకరమైన లింఫోమా ఉంది మీకు ఉన్న లింఫోమా ఏ దశలో ఉంది (అంటే లింఫోమా వల్ల ఏయే అవయవాలు దెబ్బతిన్నాయి) మీ సాధారణ ఆరోగ్యాన్నీ చూస్తారు. లింఫోమా తర్వాతి జీవితం పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి,. అయితే ఒకేసారి ఎక్కువగా భోజనం చేయకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి మీ నోట్లో ఏదైనా పుండు వంటిది ఉంటే మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, బత్తాయి పండ్ల రసం తీసుకోకూడదు ద్రవాహారం పుష్కలంగా తీసుకోండి మీ డాక్టర్ సలహా మేరకు సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు, కొద్ది పాటి నడక వంటి ఎక్సర్సైజ్లు చేయాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి, కంటి నిండా నిద్రపోవాలి తాజా గాలి బాగా పీల్చాలి కుంగుబాటు లేకుండా జీవించాలి ఒకవేళ కుంగుబాటు ఎక్కువ కాలం ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. లింఫోమాను కనుగొన్న తర్వాత మీ లిపిడ్లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాలను క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండటం ముఖ్యం. అవేగాక మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. డాక్టర్ సోనాలి సదావర్తి కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్ మాటిమాటికీ నిద్ర... ఏం చేయాలి? స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాట కూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
‘టెన్స్’ వాడితే మీ నడుము టెన్షన్ దూరం!
హోమియో కౌన్సెలింగ్ మా పాప వయసు మూడున్నరేళ్లు. ఇప్పటినుంచే చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. అడిగినవి ఇవ్వకపోతే తల గోడకేసి కొట్టుకోవడం వంటివి చేస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్ కావొచ్చని అన్నారు. దీనికి హోమియోలో మందులున్నాయా? - పూర్ణిమ, మంచిర్యాల ఆటిజమ్ మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఆటిజమ్‌లో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజమ్ ఉన్న వారందరూ ఒకేలా ఉండకపోవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే అన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజమ్‌కు దోహదం చేస్తున్నట్లు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయన మార్పులు కూడా కారణం కావచ్చు. లక్షణాలు: అకారణంగా ఏడుస్తూ ఉండటం, గంటల తరబడి స్తబ్దుగా ఉండటం, వయసుకు తగినట్టుగా శారీరక, మానసిక అభివృద్ధి లేకపోవడం మొదలైనవి. ఆటిస్టిక్ డిజార్డర్: ఎక్కువగా కనపడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని చైల్డ్‌హుడ్ ఆటిజం అంటారు. థాట్స్ డిజార్డర్: ఇది ఆడపిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. ఇందులో పుట్టిన ఏడాది వరకు పిల్లలు బాగానే ఉంటారు కాని తర్వాత నెమ్మదిగా లక్షణాలు బయటపడుతుంటాయి. ఇవి రెండు మూడేళ్లలోనే వేగం అవుతాయి. అప్పటికి వచ్చిన ఒకటిరెండు మాటలూ మర్చిపోతారు. ఆస్పర్జెర్స్ డిజార్డర్: సాధారణంగా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి కానీ ఈ ఆటిజంలో మాటలు మామూలు గానే ఉంటాయి. నలుగురిలోకీ వెళ్లడం, తెలివితేటలు బాగానే ఉంటాయి. కాని తక్కువ మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పి ఆపేస్తారు. శరీరాకృతి చిన్నగా ఉంటుంది. మిగతా ఆటిజమ్ పిల్లల్తో పోలిస్తే వీరు చురుగ్గానే ఉంటారు. అయితే ప్రవర్తన సమస్యలు, కోపోద్రేకాలు అధికం. చైల్డ్‌హుడ్ డిజింటిగ్రేటెడ్ డిజార్డర్: ఇది ఆటిజమ్‌లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినప్పుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకు ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లడం మొదలవుతుంది. లక్షణాలు చాలా వేగంగా కనపడతాయి. ముఖం రఫ్‌గా, ముదిరినట్టుగా ఉండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనపడతాయి. మీరు చె బుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు ఆటిజమ్ అంత తీవ్రంగా ఉన్నట్లుగా అనిపించడం లేదు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ క్రమంగా దారిలోకి వస్తారు. అయితే మీరు అశ్రద్ధ చేయకుండా నిపుణులైన హోమియో డాక్టర్‌ను కలిసి, వారి పర్యవేక్షణలో మీ పాపకు చికిత్స చేయించడం మంచిది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ నా వయసు 75 ఏళ్లు. డిస్క్ ప్రొలాప్స్ సమస్యతో బాధపడుతున్నాను. రెండేళ్ల కిందటే ఇలాంటి సమస్య వస్తే ఫిజియోథెరపీ తీసుకొమ్మని డాక్టర్ సూచించారు. అప్పుడు లంబార్ ట్రాక్షన్, స్టిమ్యులేషన్ ప్రక్రియలను 15 రోజుల పాటు తీసుకున్నాను. అప్పట్నుంచి బాగానే ఉంది. కానీ ఇటీవల మళ్లీ అకస్మాత్తుగా భరించలేనంత నొప్పి వస్తోంది. మళ్లీ ట్రాక్షన్ తీసుకోవాలా? దయచేసి వివరించండి. - సాగర్‌రెడ్డి, కర్నూలు మరోసారి మీరు ట్రాక్షన్ తీసుకోవడం అంతగా సిఫార్సు చేయదగ్గ ప్రక్రియ కాదు. మీరు కాసిన్ని రోజులు బెడ్‌రెస్ట్ తీసుకోండి. ఈ టైమ్‌లో చదునుగా ఉండే పడకమీద పడుకోండి. ఆ పరుపు కాస్త గట్టిగా ఉండేలా చూసుకోండి. దీనితో పాటు ‘టెన్స్ అప్లికేషన్’ అనే ప్రక్రియ అవసరం. టెన్స్ అంటే... ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఈ ప్రక్రియ చర్మం ద్వారా అక్కడి నరాన్ని స్టిమ్యులేట్ (ఉత్తేజితం) చేస్తుంది. ఇవి పాకెట్ సైజ్‌లో దొరికేవి లభ్యమవుతుంటాయి. వీటిలో ఒకటి కనీసం ఎనిమిది గంటల పాటు ఉపయోగపడుతుంది. మీ పరిస్థితి మెరుగు పడుతున్న కొద్దీ దీని ఉపయోగాన్ని ఆరు నుంచి నాలుగు గంటలకు తగ్గించవచ్చు. దీన్ని మీరు కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు వాడితే మీ పరిస్థితి నార్మల్కు వస్తుంది. అయితే ఒక్క విషయం తప్పనిసరిగా గుర్తించాలి. ఒకవేళ మీకు పేస్‌మేకర్ ఉపయోగించారా లేదా మీకు ఇతరత్రా ఏవైనా గుండె జబ్బులు ఉన్నా దీన్ని ఉపయోగించడం ఎంతమాత్రమూ మంచిది కాదు. మీరు దీని సహాయం తీసుకోదలిస్తే, దీన్ని ఎలా ఉపయోగించాలన్న అంశాన్ని మీకు ఫిజియోథెరపిస్ట్ వివరిస్తారు. మీరు లంబోశాక్రల్ బెల్ట్ కట్టుకోండి. ఆ తర్వాత మీ పరిస్థితి మెరుగుపడుతున్న కొద్దీ, బెల్ట్ కట్టుకునే వ్యవధిని తగ్గించుకుంటూ పోవచ్చు. ఆ తర్వాత మీ నడుము నొప్పి తగ్గడానికి కొన్ని వ్యాయామాలూ చేయించుకోవాలి. అవి మీకు మీ ఫిజియోథెరపిస్ట్ సూచిస్తారు. మీ వెన్ను మీద భారం వేసేవీ లేదా మీ కాళ్లను విపరీతంగా ఉపయోగించాల్సిన వ్యాయామాలు చేయవద్దు. అలాగే మీ శరీరంపై ఉపయోగించే మెషిన్లను సరిగ్గా ఉపయోగించాలి. వీటన్నింటికంటే చదునైన పడకపై వారం రోజుల పాటు తీసుకునే విశ్రాంతి మీకు బాగా ఉపకరిస్తుంది. మంచి రిలీఫ్ ఇస్తుంది. ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా పాప వయసు తొమ్మిదేళ్లు. ఎప్పుడూ ఎంతో హుషారుగా, చలాకీగాఉండే మా పాప ప్రవర్తనలో గత ఏడాదిగా ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పుడప్పుడు తన ఒక చేయి కొద్దిసేపు కొట్టుకుని ఆగిపోతున్నట్లు ఇటీవల మేము గమనించాం. మా పాపకు ఏ విషయం సరిగ్గా గుర్తుండడం లేదని టీచర్లు చెబుతున్నారు. ఎవరికైనా మంచి వైద్యులకు చూపించండి అని టీచర్లు సూచించారు. మా పాపకు గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు. తనకేమవుతుందో కూడా తను మాతో చెప్పుకోలేకపోతున్నట్లు అనిపిస్తుంది. చిన్న వయసులో మతిమరుపు వస్తుందా? అసలు మా పాపకు ఏమైంది? మా పాప మళ్లీ సాధారణంగా మారుతుందా? దయచేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - హేమలత, విజయవాడ పిల్లల ప్రవర్తనలో మార్పులు, మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు తెలిపిన వివరాలను బట్టి మీ పాప మూర్ఛ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోండి. పిల్లల్లో మూర్ఛ వ్యాధి ఉంటే వారి ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యాధి ఉంటే మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యధి ఏ వయస్సులోనైనా రావచ్చు. చాలా కారణాల వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది. మెదడులో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దాంతో ప్రవర్తనలో కూడా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మీరు వైద్యులను సంప్రదిస్తే వైద్యులు మీతో, మీ పాపతో మాట్లాడి సమస్యను గుర్తిస్తారు. కొన్ని సందర్భాలలో కొన్ని రకాల పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రస్తుతం పిల్లలకు ఈ తరహా సమస్యలు పెడియాట్రిక్ న్యూరాలజిస్టులు, పెడియాట్రిక్ ఎపిలెప్టాలజిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, మార్కులు తక్కువగా వస్తున్నాయని మీ పాపను ఇబ్బంది పెట్టకండి. ఇలాంటి సమస్య ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. వ్యాధితత్వం, వయసు, ఇతర పరిస్థితులను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. సకాలంలో సరైన చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. డాక్టర్ బి.జె. రాజేష్ సీనియర్ న్యూరోసర్జన్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
నదియా‘థెరపీ’
సేవ నదియా ఫాల్కా.. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్. గోవాలోని ఏ పిల్లల ఆసుపత్రికి వెళ్లి అడిగినా నదియా గురించి బోలెడన్ని విశేషాలు చెబుతారు. ఆటిజమ్‌తో ఇబ్బందిపడుతున్న పిల్లల దగ్గరికి వెళ్లి వైద్యం చేస్తున్న నదియా ప్రత్యేకత ఏంటంటే... వైద్యులకు, తల్లిదండ్రులకు ఆ జబ్బు గురించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఆసుపత్రి చుట్టూ తిరగడం. స్పీచ్ థెరపీలతో సరిపెట్టకుండా ఆటిజమ్ బాధితుల కోసం ప్రత్యేకంగా కొన్ని బొమ్మల్ని తయారుచేశారామె. అన్నింటికంటే ముఖ్యంగా ఈ జబ్బుని ముందుగా గుర్తించడంలో విఫలమవుతున్న వైద్యులు, అవగాహన లేని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌లు చేస్తున్నారు. ‘‘బిడ్డకు రెండు మూడేళ్లు వచ్చాక గాని...ఆటిజమ్ బాధితుడని తెలుసుకోలేకపోవడం దురదృష్టకరం. ఈ విషయంలో మనదేశ వైద్య విధానం, ప్రజల అవగాహన చాలా వెనకబడి ఉందనే చెప్పాలి. ఎన్నో రకాల పరీక్షలు చేసి గాని ఆటిజమ్ ఉందని చెప్పలేకపోతున్నారు. అలా కాకుండా బిడ్డపుట్టగానే ‘యూనివర్సెల్ హియరింగ్ స్క్రీనింగ్’ పేరుతో కొన్ని రకాల పరీక్షలు చేస్తే బిడ్డ పరిస్థితి గురించి వివరంగా తెలిసిపోతుంది. దీనిపై అవగాహన పెంచడం కోసం నేను ప్రత్యేకంగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాను. పట్ణణవాసులకు కొంత అవగాహన వస్తోంది కానీ, పల్లె ప్రజలకు దీని గురించి ఇంకా చాలా తెలియాల్సి ఉంది’’ అని చెప్పారు నదియా. ఆటిజమ్‌పై అవగాహన కల్పిస్తూ...తాను చేస్తున్న వైద్యంలో కూడా ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తున్నారు నదియా. ‘‘ఆటిజమ్ పిల్లలకు స్పీచ్ థెరపీతో పాటు రకరకాల బొమ్మలసాయంతో కూడా వారి జ్ఞాపకశక్తిలోపాన్ని, వినికిడి లోపాన్ని అధిగమించవచ్చు. దాని కోసం నేను కొన్ని ప్రత్యేకమైన బొమ్మల్ని తయారుచేశాను. చాలామంది నా లాంటి వైద్యులకు వీటి అవసరం ఉంది. అందుకే ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఫర్ టాయిస్’ వారిని కలిసి నా ఆలోచన గురించి చెప్పాను’’ అని వివరించారు నదియా. వృత్తిలో కొత్త మెలకువలను తెలుసుకుంటూనే గోవాలోని అన్ని ఆసుపత్రులూ తిరుగుతూ ఆటిజమ్ పిల్లలను అక్కున చేర్చుకుంటున్న నదియా లాంటి వైద్యుల ఆలోచనలు ఆదర్శప్రాయమే కాక ఆచరణయోగ్యం కూడా!