attacks on YSRCP Activists
-
మంత్రులు, నేతలను చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు: విశాఖ సీపీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు శనివారం వీరంగం సృష్టించారు. మంత్రులను, వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. విశాఖ గర్జన ర్యాలీని ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాంతో ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై విశాఖ సీపీ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద అనుమతిలేకుండా 300 మంది వరకు జనసేన నేతలు గుమిగూడారు. మంత్రి రోజాతో పాటు వైఎస్సార్సీపీ నేతలను అగౌరపరిచే పదజాలంతో దూషించడమే కాకుండా చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారు. ప్రజాశాంతికి భంగం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ రూల్స్ అతిక్రమించారు. పెందుర్తి ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మున్నంగి దిలీప్‌కుమార్, సిద్దు, సాయికిరణ్, హరీష్ లాంటి సామాన్య ప్రజలకు గాయాలు చేశారు. జనసేన కార్యకర్తల చర్యలతో విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రజలు భయభ్రాంతుకు గురయ్యారు. నిర్ణీత సమయంలో విమానాశ్రయానికి చేరుకోలేక 30 మంది ప్రయాణీకులు విమాన ప్రయాణం మిస్ చేసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన జనసేన నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశాం’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. మరోవైపు, విశాఖ ఎయిర్పోర్ట్ ఘటనలో అరెస్ట్‌ల పర్వం ప్రారంభమైంది. మంత్రులపై దాడి ఘటనలో పోలీసులు.. పలువురు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. విశాఖ దాడి ఘటనపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మంత్రులపై హత్యాయత్నంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. -
కృష్ణా జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాష్టీకం
ఆగిరిపల్లి(నూజివీడు): వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు బీరు సీసాలతో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కృష్ణాజిల్లా ఆగిరిపల్లి ఎస్ఐ నంబూరి చంటిబాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని వట్టిగుడిపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త యలవర్తి సుదర్శనం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 3 రోజుల నుంచి అదే గ్రామానికి చెందిన యలమర్తి బసవరాజుకు చెందిన గేదెలు సుదర్శనం ఇంటి ఆవరణలోకి వచ్చి వంగ మొక్కలను నాశనం చేశాయి. దీంతో 2 కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఈ నెల 9న పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టగా అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు యలమర్తి వంశీ, రామస్వామి, వసంతబాబు, బసవరాజు, రాంబాబు ఖాళీ బీరు సీసాలతో సుదర్శనం, అతని బంధువులు రాజేష్, యలమర్తి రాజేష్, ప్రశాంత్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన నలుగురిని స్థానికులు నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వంశీ, రామస్వామి, వసంతబాబు, బసవరాజు, రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. -
తట్టుకోలేక తగువు..!
అధికారంలో ఉన్నన్నాళ్లూ వారు చెప్పిందే వేదం. వారి మాటే శాసనం. అధికార బలంతో అక్రమాలు, అవినీతికి అలవాటు పడ్డారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు. వీరికి ఓటు రూపంలో జనం బుద్ధి చెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. నాటి జులుంనే నేడూ ప్రదర్శిస్తున్నారు. ప్రశాంతమైన పల్లెల్లో తగువుల చిచ్చురేపుతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై తెగబడుతున్నారు. తిరిగి కేసుల్లో ఇరికిస్తున్నారు. సభ్యసమాజం ఛీత్కరిస్తున్నా వారి నైజం మారకపోవడం, శాంత్రిభత్రలకు విఘాతం కల్పించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నాటి నుంచి జిల్లాలో టీడీపీ శ్రేణులు అవమానభారంతో అనవసర తగవులకు దిగుతున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ కార్యకర్తను హత్యచేశారు. తాజాగా చీపురుపల్లి, గజపతినగరం, సాలూరు నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. తిరిగి వారిపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తప్పుడు కేసులు పెట్టారు. దీనికోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. టీడీపీ పెద్దల డైరెక్షన్లోనే ఈ తతంగమంతా సాగుతోంది. గ్రామ స్థాయిలో ఘర్షణలు సృష్టించి, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం వల్లనే ప్రశాంత వాతావరణం కరువైందనే భావాన్ని ప్రజల్లో కలిగించాలన్న లక్ష్యంతో గొడవలు సృష్టిస్తున్నారు. ఇరువర్గాలపైనా కేసులు నమోదయ్యేలా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జనాన్ని వెంటాడుతున్న దాడుల భయం.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాచిపెంట మండలంలోని పి.కోనవలస, మోసూరు గ్రామాల్లో ఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. పి.కోనవలసలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త కరణం రాజు కుటుంబం దెబ్బలతో తప్పించుకున్నారు. మోసూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త గండిపల్లి తవుడును టీడీపీ వర్గీయుడు హతమార్చారు. ఈ కేసు విచారణలో ఉంది. మెం టాడ మండలంలోని తమ్మిరాజుపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయుకులు దాడిచేసి గాయపరిచారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రెండువర్గాల వారూ గాయాలపాలయ్యారు. పైపెచ్చు ముగ్గురు బాధితులపై ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఇరువర్గాలపైనా కేసు నమోదు చేసి ఇరువర్గాలకు చెందిన 30 మందిపై బైండోవర్ నమోదు చేశారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. మెరకముడిదాం మండలం భగీరథపురంలో అక్టోబర్ 30వ తేదీన కంచెమ్మతల్లి జాతర సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా జరిగిన వివాదంలో టీడీపీ నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులపై చేసిన దాడిలో వైఎస్సార్ సీపీకి చెందిన గేదెల తిరుపతి గాయపడ్డాడు. దీంతో ఇరువర్గాల వారు తోపులాటకు దిగారు. దీంతో ఇరుగువర్గాలను చెదరగొట్టిన బుదరాయవలస పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలైన గేదెల తిరుపతి, గేదెల రాము, జమ్ముకృష్ణ, చిట్టిజన, చందక రాము, గేదెల రామ్మోహనరావులపైన, టీడీపీ నాయకులైన పల్లి లక్ష్మణ, పల్లి సింహాచలం, పల్లి చిన్నంనాయుడు, పల్లి గౌరినాయుడు, చిట్టిరాములపై 354–బి,324, 509, 323, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. గజపతినగరంలో వైఎస్సార్ సీపీ నాయకులు కొండపల్లి కొండలరావుపై తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు భూ వివాదాన్ని సృష్టించి గంట్యాడ పోలీసు స్టేషన్లో కొద్దిరోజుల కిందట ఫిర్యాదు చేశారు. కుట్రలెన్ని చేసినా ప్రజల నుంచి దూరం చేయలేరు.. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి టీడీపీ వారు తట్టుకోలేకపోతున్నారు. జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలవడం, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తుండడంతో ఓర్వలేకపోతున్నారు. గొడవలను సృష్టిస్తున్నారు. నాయకులు వెనుకను ఉంటూ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారు. తిరిగి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపైనే పోలీస్ కేసులు పెడుతున్నారు. వారెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో మాకు, మా పార్టీకి ఉన్న ఆదరణను ఏ మాత్రం తగ్గించలేరు. ప్రజల కోసం ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందించడమే ధ్యేయంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహనంతో పని చేస్తున్నారు. ఖాళీగా కూర్చున్న, టీడీపీ వారితో అనవసర గొడవలు పెట్టుకునేంత తీరిక, సమయం మాకులేవు. కావాలని రెచ్చగొడితే మాత్రం వారిపై చట్టపరంగా ముందుకు వెళతాం. –మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త -
పరిటాల శ్రీరాం ఓడిపోతాడనే దాడులు
అనంతపురం న్యూసిటీ: ‘‘రాప్తాడులో శాంతిభద్రతలు చచ్చిపోయాయి. ఖాకీ చొక్కా వేసుకున్న నిజమైన పోలీసులు కనపడి ఐదేళ్లు అయ్యింది.’’ అని వైఎస్పార్ సీపీ రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులను ఆయన శనివారం పరామర్శించారు. గాయపడిన చింతకాయల పోతులయ్య ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన సేవలందించాలని కోరారు. అనంతరం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్ఎస్ గేట్లో దాడులకు పాల్పడిన వారిని ప్రజలే పట్టించినా ఎస్ఐ కనుసైగలు చేసి పారిపోమనే పరిస్థితులు ఉన్నాయి. గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోరు. ధర్మవరం డీఎస్పీ, ఆత్మకూరు సీఐ.. జిల్లా ఎస్పీ సహా తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైనా కొట్టచ్చు. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రాణాలమీదకొచ్చినా, ఆస్పత్రుల్లో అడ్మిట్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఒకవేళ కేసులు కట్టినా బెయిలబుల్ సెక్షన్ల(324, 326)తో సరిపెడుతారు. ఐదేళ్లలో నలుగురు నాయకులను పొట్టనపెట్టుకున్నారు. పోలీసులు కేఎన్ పాళ్యం, కందుకూరులో మర్డర్ కేసులో ఉన్న ముద్దాయిలను తీసుకొచ్చి ఓటు వేయించారు. ఈ విషయంలో స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. జిల్లాలో ఎక్కడ హత్య జరిగినా మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద ఆశ్రయమిస్తారు. ఆ విషయం జిల్లా ఎస్పీకి కూడా తెలుసు.’’ శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తాడు ‘రాప్తాడులో జరిగిన హత్యలకు ప్రధాన కారకుడు మంత్రి కుమారుడు పరిటాల శ్రీరాం అని తెలిసినా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇదే విషయమై ఫిర్యాదు చేస్తే ఆ బాబు అలాంటి వ్యక్తి కాదని వెనుకేసుకొస్తారు. ఎస్పీకి శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తారు కానీ ముద్దాయిగా కన్పించడు. శవ పంచనామలో, ఎఫ్ఐఆర్లో శ్రీరాం పేరు నమోదు చేయాలని బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా ఎక్కడా నమోదు చేయట్లేదు. రాప్తాడు నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ తిరగలేని పరిస్థితి. శ్రీరాం యువసేన పేరుతో రౌడీషీటర్లు(ధర్మవరం) అమాయకులపై దాడులు చేస్తున్నారు. ఎన్ఎస్ గేట్ యూత్ కన్వీనర్‌పై దాడిని స్థానిక ప్రజలు కండించడంతో పోలీసులు కేసు కట్టారు. కేసు కట్టనివి ఎన్నో ఉన్నాయి. తోపుదుర్తి గ్రామంలో పోలింగ్ రోజున పరిటాల శ్రీరాం వచ్చి ప్రజలపై రాళ్లు రువ్వి, దాడులు చేసినా ఆయనపై కేసు కట్టడంతో పాటు అమాయక ప్రజలపైనా కేసులు పెట్టారు. అదే గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకున్ని తెలుగుదేశం నాయకులు చెప్పుతో కొట్టారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై డీఎస్పీ, సీఐను ఆరా తీస్తే ఎస్పీ ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. ఎస్పీ ప్రభుత్వంతో జీతం తీసుకుంటున్నారా? లేక ఎవరితో జీతం తీసుకుంటున్నారో ఆలోచన చేయాలి. ఎస్సీకి చెందిన దళిత రాజన్న అనే వ్యక్తి టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు.’ ఓటమి భయంతోనే దాడులు ‘‘ఈ ఎన్నికలు ప్రజలు, పరిటాల కుటుంబం మధ్య జరిగాయి. ఓటమి భయంతోనే పరిటాల శ్రీరాం ప్రతి గ్రామంలో వర్గాలు, కక్షలు రేకెత్తిస్తున్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌కు తిరిగి బీజం వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. సరైన పోలీసు అధికారులతో శాంతిభద్రతలు కాపాడుతాం.’’ అన్నారు. ప్రకాష్ రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, నాగసముద్రం యూత్ మండల కన్వీనర్ ఓబులేసు, తదితర గ్రామస్తులు ఉన్నారు. -
వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయుల దాడి
ఖమ్మం: ఏనుకూరు మండలం కేసుపల్లిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. గాయపడినవారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ సిపి జిల్లా నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్రకమిటీ సభ్యుడు మదన్‌లాల్, గుమ్మ రోశయ్య క్షతగాత్రులను పరామర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వారు ఓడిపోయారు. దానిని దృష్టిలో పెట్టుకొని, భూవివాదంను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తెలిపారు.