
ఆగిరిపల్లి(నూజివీడు): వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు బీరు సీసాలతో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కృష్ణాజిల్లా ఆగిరిపల్లి ఎస్‌ఐ నంబూరి చంటిబాబు తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని వట్టిగుడిపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త యలవర్తి సుదర్శనం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 3 రోజుల నుంచి అదే గ్రామానికి చెందిన యలమర్తి బసవరాజుకు చెందిన గేదెలు సుదర్శనం ఇంటి ఆవరణలోకి వచ్చి వంగ మొక్కలను నాశనం చేశాయి.
దీంతో 2 కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఈ నెల 9న పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టగా అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు యలమర్తి వంశీ, రామస్వామి, వసంతబాబు, బసవరాజు, రాంబాబు ఖాళీ బీరు సీసాలతో సుదర్శనం, అతని బంధువులు రాజేష్, యలమర్తి రాజేష్, ప్రశాంత్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన నలుగురిని స్థానికులు నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వంశీ, రామస్వామి, వసంతబాబు, బసవరాజు, రాంబాబుపై కేసు నమోదు
చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment