Audit Officers
-
బేగంపేటలో కిడ్నాప్ కలకలం.. సొంత ఊరికి వచ్చాను!
∙సాక్షి, సనత్‌నగర్: బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టింంది. ఆడిటర్ కిడ్నాప్‌కు గురయ్యాడని పోలీసులకు అందిన ఫిర్యాదు వారిని హైరానా పెట్టింది. చివరకు క్షేమంగా ఉన్నట్లు వీడియో కాల్ ద్వారా తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండకు చెందిన సాంబశివరావు ఆడిటర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ సికింద్రాబాద్, భరణీ కాంప్లెక్స్‌లోని తన కార్యాలయానికి వెళ్లేవాడు. ఆదివారం ఆఫీసుకు వెళ్లిన సాంబశివరావు రాత్రికి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని ఆరా తీసినా ప్రయోజనం కనిపించ లేదు. అయితే బేగంపేట ప్రకాష్‌నగర్‌లోని సాంబశివరావు బంధువు ఇంటి వద్ద అతని కారు ఉన్నట్లు తెలిసింది. అతనికి భారీగా అప్పులు ఉన్న నేపథ్యంలో దగ్గరి బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానంతో అతడి భార్య సరిత బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అందుబాటులోకి వ్చన సాంబశివరావు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావుతో వీడియో కాల్లో మాట్లాడారు. తాను క్షేమంగా ఉన్నానని, బంధువులతో తన స్వస్థలమైన ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’ -
మింగింది కక్కాల్సిందే...
సాక్షి, మోర్తాడ్(నిజామాబాద్) : గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులకు ఆడిట్ అధికారులు నోటీసులను జారీ చేస్తున్నారు. 2001 నుంచి 2018 వరకు పంచాయతీల ఆడిట్‌ను ఇటీవల పూర్తి చేసిన అధికారులు నిధులు పక్కదారి పట్టిన పంచాయతీలను గుర్తించి నోటీసులు అందిస్తున్నారు. 18 ఏళ్ల నుంచి గడచిన ఏడాది వరకు వివిధ పీరియడ్లలో సర్పంచ్‌లుగా వ్యవహరించిన వారికి కార్యదర్శులుగా పని చేసిన ఉద్యోగులలో బాధ్యులు ఎవరు ఉంటే వారికి నోటీసులు ఇవ్వాలని ఆడిట్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో పంచాయతీల పునరి్వభజన జరుగకముందు 393 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ అన్ని పంచాయతీల్లో ఆడిట్ అధికారులు జమా ఖర్చుల వివరాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన ఆంశాలను గుర్తించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలా జిల్లాలో 50,346 అభ్యంతరాలు వెల్లడయ్యాయి. ఈ అభ్యంతరాలకు సంబంధించి మొత్తం రూ.64.06 కోట్లు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించేవి. అలాగే తలసరి నిధులతో పాటు పంచాయతీలకు ఇంటి పన్నులు, నీటి కుళాయి బిల్లులు, లైసెన్స్‌ల జారీ, తైబజార్ వేలం వల్ల కూడా ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ఖాతాలు, జనరల్ ఫండ్ ఖాతాల ద్వారా జరిపిన చెల్లింపులను ఆడిట్ అధికారులు పరిశీలించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎంబీ రికార్డు సరిగా ఉన్నవాటిని మినహాయించి సరైన రసీదులు లేకుండా నిధులు ఖర్చు చేసిన వాటిపై అధికారులు ఆడిట్లో అభ్యంతరం తెలిపారు. -
ఖర్చు చేశారు... లెక్కచెప్పరు
శ్రీకాకుళం: శ్రీకాకుళం రాజీవ్ విద్యా మిషన్(ప్రస్తుత సర్వశిక్షా అభియాన్)లో నిధుల ఖర్చుకు సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా గత అధికారులు ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదు. గత పీవో రామచంద్రారెడ్డి, అప్పటి ఇన్చార్జి ఎఫ్ఏఓ, ప్రస్తుత అసిస్టెంట్ ఎఫ్ఏఓ అయిన సురేష్ రూ. 2.5 లక్షలను సొంతం పేరిట విత్‌డ్రా చేసి వాటికి తగిన బిల్లులు సమర్పించకపోవడంతో ఆడిట్ అధికారులు కొద్ది నెలల క్రితం అభ్యంతరం తెలిపారు. దీనిపై తక్షణం బిల్లులు సమర్పించాల్సి ఉండగా ఇప్పటివరకు అటువంటి దాఖలాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా శిక్షణకు గాని, మరేదైనా పనులకు గాని నిధులను సొంతం పేరిట విత్‌డ్రా చేసి, అటు తర్వాత బిల్లులను సమర్పించుకునే సౌలభ్యం ఆర్వీఎంలో ఉంది. దీనిని వినియోగించుకునే వీరిద్దరూ నిధులను విత్‌డ్రా చేశారు. అయితే ఇప్పటికీ లెక్కలు చెప్పకపోవడం పలువురి సందేహాలకు కారణమైంది. అప్పటి పీవో రామచంద్రారెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓ సమావేశానికి ఇతడు పూర్తి సమాచారంతో రాలేదన్న కారణంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాతృ శాఖకు సరెండర్ చేసిన విషయం పాఠకులకు విదితమే. అయితే ఏ కారణంగానో తెలియకపోయినా మంత్రి ఆదేశాలు సుమారు రెండు నెలలు అమలుకు నోచుకోలేదు. ఈ రెండు నెలల్లో మరిన్ని ఆరోపణలు రావడంతో కలెక్టర్ రిలీవ్ చేసేశారు. అప్పట్లో ఎఫ్‌ఏఓగా పనిచేసిన రాజు మాతృ సంస్థకు వెళ్లిపోవడంతో సురేష్ ఇన్చార్జి ఎఫ్‌ఏఓగా వ్యవహరించారు. ఈ సమయంలోనే రూ. 2.5 లక్షలు విత్‌డ్రా చేశారు. ఈ మొత్తంతో కేజీబీవీ సిబ్బంది, ఎంఐఎస్ కోర్డినేటర్లకు శిక్షణ ఇచ్చినట్టు మౌఖికంగా చెబుతున్నా బిల్లులు మాత్రం దాఖలు చేయలేదు. ఆడిట్ అధికారుల అభ్యంతరం తర్వాత కూడా బిల్లులు దాఖలుకు ప్రయత్నాలే జరగలేదు. ఈ కారణంగానే పలువురు వ్యక్తం చేస్తున్న అనుమానాలను బలం చేకూరుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రస్తుత ఆర్వీఎం అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారనే ఆక్షేపణలు వినిపిస్తున్నారుు. ఇదే శాఖలో అసిస్టెంట్ ఎఫ్‌ఏఓగా పనిచేస్తున్న సురేష్‌కు ఇప్పటికి రెండు మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాగా సురేష్‌ను ప్రస్తుత పీఓ కూడా సుమారు 6 నెలల పాటు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు కాదని ఇన్చార్జి ఎఫ్‌ఏఓగా కొనసాగించడం, ఎఫ్‌ఏఓగా రాష్ట్ర అధికారుల ద్వారా నియమించబడిన మోహనరావును విధుల్లో చేర్చుకోకుండా గాలిలో ఉంచడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తక్షణం యూసీలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్వీఎం పీఓ త్రినాథరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రెండు రోజుల క్రితమే యూసీలు ఇచ్చారన్నారు. యూసీలు ఇవ్వకపోవడంతో గతంలో ఆడిట్ అభ్యంతరం చెప్పడం నిజమేనని తెలిపారు. -
ఏసీబీ వలలో జిల్లా ఆడిట్ అధికారులు
పెన్షన్ మంజూరుకు లంచం డిమాండ్ రూ.30 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం నెల్లూరు (క్రైమ్) : ఓ యువతికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ జిల్లా ఆడిట్ అధికారి షణ్ముఖరెడ్డి, సీనియర్ ఆడిటర్ వాహీద్‌బాషా ఏసీబీ అధికారులకు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీస్పీ తోట ప్రభాకర్ సమాచారం మేరకు.. బూడిద వెంకటసుబ్బయ్య, లీలావతమ్మ దంపతులు. వీరికి శ్రీనివాసులు, సుభాషిణి, పద్మావతి పిల్లలు. వెంకటసుబ్బయ్య ట్రెజరీలో పని చేస్తూ మృతి చెందాడు. దీంతో తండ్రి ఉద్యోగం శ్రీనివాసులుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన పొదలకూరు సబ్‌ట్రెజరీ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తూ మూలాపేట కోనేటిమిట్టలో నివాసముంటున్నారు. ఓ కుమార్తె సుభాషిణికి వివాహం కాగా, మరో కుమార్తె పద్మావతికి వివాహం కావాల్సి ఉంది. వెంకటసుబ్బయ్య మృతి చెందిన అనంతరం పెన్షన్ లీలావతమ్మకు వచ్చేది. ఆమె సైతం 2013 నవంబర్‌లో మృతి చెందింది. తల్లిదండ్రులు మరణించిన సమయంలో వారి పెన్షన్ పెళ్లి కాని, వితంతువు, వికలాంగురాలైన పిల్లలకు వస్తుంది. దీంతో అవివాహితురాలైన పద్మావతికి పెన్షన్, అరియర్స్ మంజూరు చేయాలని ఆమె అన్న శ్రీనివాసులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వారు రికార్డులన్నింటిని పరిశీలించి జిల్లా ఆడిట్ అధికారి (స్టేట్ ఆడిట్) రాష్ట్ర కార్యాలయానికి పంపారు. రూ.లక్ష లంచం డిమాండ్ ఆడిట్ కార్యాలయంలోని సీనియర్ ఆడిటర్ నరేష్ పెన్షన్ మంజూరు చేయకుండా రిమార్కులున్నాయంటూ శ్రీనివాసులను తిప్పుకుంటూ వచ్చారు. పని కావాలంటే రూ. లక్ష డిమాండ్ చేశారు. ఇటీవల అతను సెలవుపై వెళ్లడంతో సీనియర్ ఆడిటర్ వహీద్‌బాషా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసులు అతన్ని కలవగా జిల్లా ఆడిట్ అధికారికి చెప్పమన్నారు. శ్రీనివాసులు జిల్లా ఆడిట్ అధికారి ఎన్. షణ్ముఖరెడ్డిని కలిసి పరిస్థితి వివరించారు. ఆయన సీనియర్ ఆడిటర్ వహీద్‌బాషాను కలిసి ఎలా చెబితే అలా చేయమని చెప్పాడు. శ్రీనివాసులు తిరిగి వహీద్‌బాషాను కలువగా ఆయన రూ.50 వేలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలన్నింటిని నరేష్ చూస్తుంటాడని అతను ప్రస్తుతం సెలవులో ఉన్నాడని, లేదంటే రూ. లక్ష వరకు ఇచ్చుకోవాల్సి వచ్చేదని చెప్పాడు. ట్రెజరీ కార్యాలయ ఉద్యోగివి కాబట్టి రూ.50 వేలు ఇవ్వమని వహీద్‌బాషా డిమాండ్ చేశాడు. శ్రీనివాసులు తాను అంత ఇవ్వలేనని రూ. 30 వేలు ఇస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించిన వహీద్‌బాషా శనివారం లోపల నగదు ఇవ్వాలని సూచించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌రావును ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో వహీద్‌బాషా శనివారం ఉదయం శ్రీనివాసులుకు ఫోన్ చేసి ఫైల్ రెడీ అయిందని తెలిపాడు. జిల్లా ఆడిట్ అధికారి నెల్లూరు హాస్పిటల్ వద్ద ఉన్నాడని, అక్కడకు వచ్చి డబ్బులు ఇస్తే వెంటనే ఫైల్ ఇస్తామని చెప్పాడు. శ్రీనివాసులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పారు. వారి ఆదేశాల మేరకు నెల్లూరు హాస్పిటల్‌కు చేరుకున్నారు. రూ. 30 వేలు లంచం వహీద్బాషాకు ఇచ్చారు. ఆయన షణుఖ్మరెడ్డికి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి, సిబ్బంది ఆడిట్ అధికారి, సీనియర్ ఆడిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విస్తృతంగా తనిఖీలు జిల్లా ఆడిట్ అధికారి షణ్ముఖరెడ్డి, సీనియర్ ఆడిటర్ వాహీద్‌బాషా ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి రంగనాయకులపేటలోని జిల్లా ఆడిట్ కార్యాలయంలో, చిల్డ్రన్స్ పార్కు వద్దగల షణ్ముఖరెడ్డి, రంగనాయకులపేట ముస్లింవీధిలోని వహీద్‌బాషా ఇళ్లలో సోదాలు నిర్వహించారు. పలుకీలక పత్రాలను స్వాధీనం చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే షణ్ముఖరెడ్డి పిల్లలకు తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీంతో అతన్ని తర్వాత పూర్తిస్థాయిలో విచారిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం ఇవ్వడం ఇష్టంలేకనే : శ్రీనివాసులు, బాధితుడు ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు జిల్లా ఆడిట్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగా. నరేష్ రూ. లక్ష డిమాండ్ చేశారు. ఆయన సెలవులో వెళ్లాడు. జిల్లా ఆడిట్ అధికారికి పరిస్థితి వివరించా. ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వహీద్‌బాషాను కలవమన్నారు. వహీద్‌బాషా రూ. 50 వేలు డిమాండ్ చేశారు. తాను అంత ఇవ్వలేనని చెప్పా. రూ.30 వేలు ఇవ్వాలన్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. -
రూ.4.73 కోట్లు
ఇదీ దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యం ఖరీదు 2012-13 ఆడిట్లో వెలుగుచూసిన వాస్తవాలు దేవస్థాన ఆదాయంతో సమానంగా ఖర్చు విజయవాడ : రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అధికారులు నిర్లక్ష్యం ఖరీదు రూ.4,73,25,868గా ఆడిట్ అధికారులు నిర్ధారించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం రికార్డులను పరిశీలించిన అధికారులు 64 రకాల అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారి ఆదాయం మరో రూ.4.73 కోట్లు పెరిగి ఉండేదని తమ నివేదికలో పేర్కొన్నారు. దేవస్థానానికి వచ్చే ఆదాయం మొత్తం అధికారులు ఖర్చు చేసేస్తున్నారే తప్ప మిగిల్చేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదంటూ అందులో తెలిపారు. 2012-13లో దేవస్థానానికి రూ.78 కోట్లు ఆదాయంవస్తే ఇంచుమించుగా అంతే ఖర్చు చూపించడం గమనార్హం. నిదర్శనాలు ఇవిగో... ► జిల్లాలోని చిన్నచిన్న దేవాలయాలకు అమ్మవారి దేవస్థానం ప్రోనోట్లు రాయించుకుని అప్పుగా ఇస్తుంది. ఈ విధంగా కొన్నేళ్లుగా రూ.2.01 కోట్లు అప్పుగా ఇచ్చారు. వీటిని తిరిగి వసూలు చేయడంపై అధికారులు శ్రద్ధ చూపలేదు. ► నగరపాలక సంస్థకు రోడ్ల మరమ్మతుల నిమిత్తం రూ.50 లక్షల అమ్మవారి సొమ్ము ఇచ్చారు. మరమ్మతుల్లేవు. బకాయి చెల్లింపులూ లేవు. కనీసం కార్పొరేషన్‌కు కట్టే పన్నుల్లో నుంచైనా ఈ సొమ్మును మినహాయించేందుకు దేవస్థానం అధికారులు ప్రయత్నించలేదు. ► దేవస్థానం లడ్డూ ప్రసాదాలను గతంలో ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించేది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బును ఆంధ్రాబ్యాంకులోని దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. 2012 అక్టోబర్ ఒకటి నుంచి 31 మార్చి 2013 వరకు రూ.20,65,134 యూనియన్ సభ్యులు వాడేసుకున్నారు. అధికారులు అప్రమత్తమై దీన్ని రికవరీ చేశారు. ఈ డబ్బుకు సుమారు రూ.5 లక్షలు వరకు వడ్డీ వసూలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ►దేవస్థానం బస్సు కింద పడి ఒక పాపకు గాయం అయితే ఆమెకు అమ్మవారి సొమ్ము రూ.2,03,643 వెచ్చించి వైద్యం చేయించారు. ఈ సొమ్మును బీమా శాఖ నుంచి రికవరీ చేసుకునే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నాలు జరగలేదు. ► ఘాట్ రోడ్డు, దుర్గాఘాట్‌లో ఉండే చిరు వ్యాపారుల నుంచి రూ.55,15,979 వసూలు చేశారు. వారికి రసీదులు కూడా ఇస్తున్నారు. ఈ సొమ్మును రికార్డుల్లో సరిగా నమోదు చేయడం లేదని ఆడిట్ అధికారులు గుర్తించారు. ► దేవస్థానానికి ఎస్బీఐ, ఆంధ్రా, సిండికేట్, ఐసీఐసీఐ, బ్యాంకు ఆఫ్ బరోడాల్లో డిపాజిట్లు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో అకౌంట్లను, దేవస్థానం క్యాష్ బుక్‌ను పరిశీలిస్తే సుమారు రూ.1,88,75,935 మేర తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ► దేవస్థానం పనులు చేసే కాంట్రాక్టర్ వద్ద ఇన్‌కం ట్యాక్స్, ఇసుక సీనరేజీలు, లేబర్ సెస్‌లు వసూలు చేసి ఆయా శాఖలకు చెల్లించాలి. ఈ విధంగా చెల్లించనందుకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ దేవస్థానం నుంచి రూ.66,069 జరిమానా వసూలు చేసింది. ►దేవస్థానానికి చెందిన చెప్పుల స్టాండ్, కొబ్బరి చిప్పలు, చీరలు, టోల్గేట్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుగా చె ల్లించిన ఈఎండీ డిపాజిట్‌ను కాంట్రాక్టు పూర్తయిన తరువాత ఇవ్వాలి. అధికారులు ఆఖరు వాయిదాకు ఈ సొమ్మును జమ చేసుకోవడం గమనార్హం. కాంట్రాక్టర్ల వద్ద లీజు సొమ్మును సకాలంలో వసూలు చేయకపోవడం వల్ల దేవస్థానం ఆదాయానికి గండి పడుతోంది. ► ఇవేగాక ఇంకా అనేక లోపాలను ఆడిట్ అధికారులు గుర్తించారు. కొత్తగా వచ్చే పాలకవర్గం, ఈవోలు వీటిపై దృష్టి పెట్టి లోపాలను సరిదిద్దాలని భక్తులు కోరుతున్నారు. -
డీసీసీబీ బోర్డు సమావేశం వాయిదా
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బోర్డు సమావేశం ఈ నెల 22న శుక్రవారం జరగాల్సి ఉండగా వాయిదా వేశారు. అనివార్యకారణాల కారణంగా బోర్డు సమావేశం వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ దానికి కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తుంది. వాయిదా తేదీని తరువాత ప్రకటించనున్నట్లు బ్యాంకు అధికారులు చెపుతున్నా ఇప్పట్లో సమావేశం జరిగే అవకాశాలు లేవని కొందరు బోర్డు డెరైక్టర్లు చెపుతున్నారు. వారం రోజుల క్రితం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆడిట్ నివేదికను ఆడిట్ అధికారులు ఆడిట్ కమిటీకి నివేదించారు. దానిని వారం రోజుల ముందు ఇస్తే క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించేవారమని చెబుతూ వారం తరువాత కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదిస్తామన్న కమిటీ సభ్యులు దాన్ని తిరస్కరించారు. తిరిగి ఆడిట్ కమిటీ సమావేశాన్ని బుధవారం ఏర్పాటుచేసినప్పటికీ ఖర్చుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికను తిరస్కరించినట్లు సమాచారం. అసలు ఆడిట్ కమిటీ నివేదికను బుధవారం ఆమోదిస్తే వెంటనే శుక్రవారం జరగాల్సిన పాలకమండలి సమావేశంలో దానిని ప్రవేపెట్టి నివేదికకు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాని నివేదికను కమిటీ ఆమోదించని కారణంగా బోర్డు సమావేశం నిర్వహించని పరిస్థితి ఏర్పడడంతో దానిని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అయితే బోర్డు డెరైక్టర్ల సమాచారం మేరకు వాయిదాకు మరో కారణం కూడా తోడైనట్లు సమాచారం. అక్రమాల చిట్టా పెరుగుతుండడంతో.. ఇటీవల దేవరకొండ అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుండడంతో అక్రమాల చిట్టా పెరుగుతుండడం వలన బోర్డు సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి పరోక్షంగా, ప్రత్యక్షంగా సహరించిన జిల్లాస్థాయి అధికారులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సమావేశంలో బోర్డు సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమావేశం వాయిదా వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా చైర్మన్ పదవి విషయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డిని రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేసే అవకాశం కూడా ఉండడంతో సమావేశం వాయిదా వేసినట్లు వినికిడి. ఏదిఏమైనా డీసీసీబీలో నెలకొన్న పరిస్థితులు రైతులకు ఖరీఫ్ పంటరుణాలు అందక వారి పాలిటశాపంగా మారాయని చెప్పవచ్చు.