వ్యవసాయశాఖలో డిప్యుటేషన్లు రద్దు
వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో అధికారుల డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలోని కమిషనరేట్ సహా పక్క జిల్లాల్లోని కార్యాలయాలకు డిప్యుటేషన్‌పై వచ్చిన వ్యవసాయ అధికారులు తమ ఒరిజి నల్ పోస్టుకు వెళ్లేలా అన్ని స్థాయిల్లో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ మంగళవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఆ శాఖ కార్యదర్శి పార్థసారథి వెల్లడించారు.
‘పల్లెల్లో కరు వు... రాజధానిలో వ్యవసాయం’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. డిప్యుటేషన్ల రద్దు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని, దీనిపై కమిషనర్ జిల్లాలకు ఉత్తర్వులు పం పించారన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అం దుబాటులో ఉండే కీలకమైన ఏవో, ఏడీఏ స్థాయి అధికారులు100 మంది వరకు హైదరాబాద్‌కు, మరికొందరు పక్క జిల్లాలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన సంగతి తెలిసిందే. కరువు నేపథ్యంలో రైతులకు అండగా ఉండేవారే లేరు. డిప్యుటేషన్ల రద్దు నిర్ణయంతో కొందరు తమకు తెలిసిన పెద్దల ద్వారా పైరవీలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.