ఫైనల్లో మిష్గాన్, అవంతిక
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీఎల్టీఏ ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలికల సింగిల్స్ విభాగంలో మిష్గాన్ ఒమర్, అవంతిక రెడ్డి ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్లో మిష్గాన్ 7-1తో స్మృతి బాసిన్‌పై, అవంతిక రెడ్డి 7-4తో రాయల సంజనపై విజయం సాధించారు.
అండర్-12 బాలుర విభాగంలో రాహుల్ చందన ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో రాహుల్ 7-2తో కౌశిక్ కుమార్ రెడ్డిపై విజయం సాధించాడు. మరో సెమీఫైనల్లో అన్నే ఆకాశ్ 7-0తో భాస్కర్ మోహన్ రాయ్‌పై నెగ్గి తుది పోరుకు సిద్ధమయ్యాడు.
మరోవైపు బాలికల విభాగం క్వార్టర్ఫైనల్లో రాయల సంజన 7-2తో సుమనను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. స్మృతి బాసిన్ 7-6 (7/4 )తో ఇషికా అగర్వాల్‌పై గెలవగా... అవంతిక రెడ్డి 7-4తో రాయల సృజనపై గెలుపొందింది. అయితే సంజన సిరిమల్లతో జరిగిన మ్యాచ్‌లో వేద వర్షిత వాకోవర్ ఇచ్చింది.
ఇతర ఫలితాలు
బాలుర అండర్-10 సెమీఫైనల్స్: ఆయుష్ భట్ 7-1తో యశ్వంత్‌పై, దాసరి అభిరామ్ 7-6 (7/2)తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలిచారు.
అండర్-14 సెమీఫైనల్స్: సాహి 7-5తో అఖి ల్ని, శశి ప్రీతమ్ 7-4తో నిషాద్‌ను ఓడించారు.
బాలికల అండర్-10 సెమీఫైనల్స్: తనుషితా రెడ్డి 7-4తో వేద వర్షితపై, సంజన సిరిమల్ల 7-2తో నేహపై నెగ్గారు.