Aziz Ansari
-
కాంగ్రెస్ పార్టీకి చురకలంటించిన ఆ పార్టీ సీనియర్ నేత
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హిందూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ నేతలు హిందూత్వ మంత్రాన్ని జపిస్తుండటంపై ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్ ఖురేషి తమ పార్టీపైనే విమర్శలు చేయడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఇటీవల కాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ హిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించడాన్ని తప్పుబట్టారు సీనియర్ కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషి(82). మంత్రిగానూ, ఎంపీగానూ, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ గానూ సేవలందించిన అజీజ్ ఖురేషీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మీరు చెప్పిందల్లా చెయ్యడానికి ముస్లింలు మీ బానిసలు కాదని. కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖలోనూ, రక్షణ శాఖలోనూ, బ్యాంకుల్లోనూ ముస్లింలకు ఉద్యోగాలు రావు, వారికి కనీసం బ్యాంకు లోనులు కూడా రావు.. అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. ముస్లింల ఇళ్ళు, దుకాణాలు, మందిరాలు తగలబెడుతూ వారి పిల్లలను అనాధలుగా చేస్తుంటే చూస్తూ ఉంటారనుకోకండి. వారేమీ పిరికివారు కాదు. 22 కోట్ల మందిలో 2 కోట్లు మంది ప్రాణాలర్పిస్తే పోయేదేమీ లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ లీడర్లు గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య వారు కొత్తగా హిందూత్వ మంత్రాన్ని జపిస్తున్నారు. పార్టీ ఆఫీసుల్లో దేవుళ్ళ ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల కోసం దిగజారడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ అది ఆయన అభిప్రాయమని కాంగ్రెస్ ఎప్పుడూ లౌకికవాదాన్ని విశ్వసిస్తుందని అన్నారు. ఇక బీజేపీ నేత నరేంద్ర సాలూజ అజీజ్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మైరిటీలను బుజ్జగించే రాజకీయాలు అలవాటేనని రాహుల్ గాంధీ, కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల నేపథ్యంలో హిందువుల అవతారం ఎత్తుతారని మధ్యప్రదేశ్‌లో ఉండే 82 శాతం హిందూ ఓటర్లను ప్రభావితం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని ఆయన అన్నారు. చేతనైతే ఖురేషీ అడిగిన దానికి సమాధానం చెప్పాలని అన్నారు. ఇది కూడా చదవండి: మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది మృతి -
‘నా జీవితంలో భయంకరమైన రాత్రి అదే’
న్యూయార్క్: భారత సంతతి నటుడు, కమెడియన్ అజీజ్ అన్సారీ చిక్కుల్లో పడ్డాడు. 23 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అన్సారీతో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని బ్రూక్లిన్కు చెందిన ఫొటోగ్రాఫర్ గ్రేస్(ఇది అసలు పేరు కాదు) మీడియాకు వెల్లడించింది. అతడితో జరిగిన చాటింగ్‌ను కూడా ఆమె బయటపెట్టింది. అన్సారీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తన జీవితంలో భయంకరమైన రాత్రి గడిపానని ‘బేబ్.నెట్’ వెబ్‌సైట్‌తో చెప్పింది. ‘2017 ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో మొదటిసారి అతడితో పరిచయమైంది. తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. సెలబ్రిటీ కావడంతో ఒకసారి అతడితో డేట్‌కు వెళ్లాను. ఆ రాత్రి నాకు పీడకలను మిగిల్చింది. డిన్నర్ అయిన తర్వాత ఫ్రాంక్లిన్ స్ట్రీట్‌లోని తన అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వెళ్లిన తర్వాత నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బూతులు మాట్లాడుతూ అసహజ శృంగారానికి ఒత్తిడి తెచ్చాడ’ని వెల్లడించింది. గ్రేస్ చేసిన ఆరోపణలపై అన్సారీ ఇంకా స్పందించలేదు. 34 ఏళ్ల అజీజ్ అన్సారీ ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నాడు. టీవీ సిరీస్‌లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ‘ద మాస్టర్ ఆఫ్ నన్’ కామెడీ సిరీస్‌లో నటనగానూ అతడికి ఈ అవార్డు వచ్చింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో అజీజ్ అన్సారీ -
ఆ ఎన్నారై టాప్ పెయిడ్ కమెడియన్!
వాషింగ్టన్: ప్రముఖ ఇండియన్-అమెరికన్ కమెడియన్ అజిజ్ అన్సారీ తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. 2015 సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన కమెడియన్‌గా ఫోర్బ్స్ జాబితాలో ఆయనకు ఆరోస్థానం లభించింది. ఎన్బీసీ చానెల్లో ప్రసారమయ్యే 'పార్క్స్ అండ్ రియాక్షన్' కార్యక్రమంలో టామ్ హవర్ఫోర్డ్గా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆయన ఈ ఏడాది 9.5 మిలియన్ డాలర్ల సంపద ఆర్జించారని ఆ పత్రిక తెలిపింది. చాలామంది సెలబ్రిటీల మాదిరిగానే అన్సారీ ప్రస్థానం నాటకరంగం నుంచి టీవీ, పుస్తక రచన వరకు సాగిందని పేర్కొంది. అన్సారీ రచించిన 'మోడ్రన్ రొమాన్స్' పుస్తకం ఆయనను మరో మెట్టు ఎక్కించింది. ప్రస్తుత మిలినీయంలో డేటింగ్, ప్రేమ వంటి అంశాలపై సామాజిక అధ్యయనం తరహాలో సాగిన ఈ రచన ఆయనకు ఆరోస్థానం కట్టబెట్టింది. 36 మిలియన్ డాలర్ల ఆర్జనతో జెర్రీ సీన్ఫెల్డ్ ఈ జాబితాలో టాప్ కమెడియన్‌గా నిలిచారు. 28.2 మిలియన్ డాలర్ల సంపదతో కెవిన్ హర్ట్, 21.5 మిలియన్ డాలర్ల సంపదతో టెర్రీ ఫాటర్ రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. టెలివిజన్ కామెడీ బిజినెస్‌లో కొన్ని దశాబ్దాల నుంచి మహిళలు వెనుకంజలో ఉండటంతో వారికి ఈ జాబితాలో చోటులభించలేదని ఫోర్బ్స్ మ్యాగజీన్ పేర్కొంది.