bacchu kadu
-
నటిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే
ముంబై: మన దేశంలో చాలామంది ప్రజలు క్రికెటర్లు ఎన్ని పరుగులు చేశారన్న విషయాన్ని లెక్కపెట్టుకుని గుర్త పెట్టుకుంటారు కానీ రైతుల దుస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోరని మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ బాబారావు అలియాస్ బచ్చు కడు ఆవేదన వ్యక్తం చేశాడు. అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరామ్‌పూర్‌లో జరిగిన రైతుల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'దేశంలో చాలామంది ప్రజలు క్రికెట్లో సచిన్ టెండుల్కర్ ప్రతి పరుగును లెక్కకట్టి గుర్తు పెట్టుకుంటారు. కానీ పొలాల్లో కష్టపడుతున్న రైతులు గురించి కనీసం ఆలోచించరు' అని కడు అన్నారు. ఇటీవల రైతుల ఆత్యహత్యలపై కడు మాట్లాడుతూ బాలీవుడ్ నటి హేమమాలినిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మద్యంతాగే అలవాటున్నవారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం దారుణమని, అలాగైతే హేమమాలిని రోజు మద్యం తాగుతారని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు రాగా, ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. తాను హేమమాలిని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదని, సినిమాల్లో ఆమె మద్యం తాగుతారని చెప్పానని అన్నారు. అమరావతి జిల్లాలోని అచలపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
ఆమె రోజూ తాగుతుంది.. ఆత్మహత్య చేసుకుందా?
ముంబై: రైతు ఆత్మహత్యలపై పలువురు చేస్తున్న కామెంట్స్ ఓ ఎమ్మెల్యేకు చిరాకు తెప్పించాయి. పూటుగా తాగడం మూలంగానే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఎవరో చేసిన కామెంట్స్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో హేమా మాలిని రోజూ తాగుతారు.. అంతమాత్రాన ఆమె ఆత్మహత్య చేసుకుందా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని అచల్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన బాచ్చు కడు రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ.. '75 శాతం మంది ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు తాగుతారు. హేమా మాలిని రోజూ హెవీగా తాగుతారు. అంతమాత్రాన ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా' అని ప్రశ్నించారు. తాగడం వల్ల రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారనడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా బాచ్చు కడు స్పష్టం చేశారు. -
బ్యూరోక్రాట్‌పై ఎమ్మెల్యే వీరంగం
ముంబై: మహారాష్ట్రలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బాచూ కడు ఓ ఉద్యోగిపై వీరంగం సృష్టించాడు. బ్యూరోక్రాట్‌ను చెంపదెబ్బ కొట్టిన కేసులో ముంబై పోలీసులు బుధవారం బాచూను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 25 వేల రూపాయల పూచీకత్తుపై ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ అప్పగించాల్సిందిగా ఆయన్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాచూ మంగళవారం తన సహాయకుడు అశోక్ జాదవ్‌తో కలసి సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ బీఆర్ గావిట్‌ను కలిశాడు. ప్రభుత్వ క్వార్టర్స్‌లో జాదవ్ ఉండేందుకు అనుమతించాలని, అదనంగా వసతి సౌకర్యాలు కల్పించాలని గావిట్‌ను కోరాడు. ఇందుకు గావిట్ నిరాకరించడంతో గొడవపడ్డ ఎమ్మెల్యే ఆయనపై దాడి చేశాడు. బాచూ తీరుపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్తానాధ్ ఖడ్సె విచారణకు ఆదేశించారు. కాగా ఉద్యోగిని తాను కొట్టలేదని ఎమ్మెల్యే చెప్పాడు. అమరావతి జిల్లా అచల్పూర్ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాచూ గతంలో కూడా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి.