నటిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే | Many count cricketers' runs but no one cares for farmers: MLA | Sakshi
Sakshi News home page

నటిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే

Published Tue, Apr 18 2017 3:19 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

నటిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే

నటిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే

ముంబై: మన దేశంలో చాలామంది ప్రజలు క్రికెటర్లు ఎన్ని పరుగులు చేశారన్న విషయాన్ని లెక్కపెట్టుకుని గుర్త పెట్టుకుంటారు కానీ రైతుల దుస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోరని మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌ బాబారావు అలియాస్‌ బచ్చు కడు ఆవేదన వ్యక్తం చేశాడు. అహ్మద్‌నగర్‌ జిల్లా శ్రీరామ్‌పూర్‌లో జరిగిన రైతుల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

'దేశంలో చాలామంది ప్రజలు క్రికెట్‌లో సచిన్‌ టెండుల్కర్‌ ప్రతి పరుగును లెక్కకట్టి గుర్తు పెట్టుకుంటారు. కానీ పొలాల్లో కష్టపడుతున్న రైతులు గురించి కనీసం ఆలోచించరు' అని కడు అన్నారు. ఇటీవల రైతుల ఆత్యహత్యలపై కడు మాట్లాడుతూ బాలీవుడ్‌ నటి హేమమాలినిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మద్యంతాగే అలవాటున్నవారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం దారుణమని, అలాగైతే హేమమాలిని రోజు మద్యం తాగుతారని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు రాగా, ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. తాను హేమమాలిని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదని, సినిమాల్లో ఆమె మద్యం తాగుతారని చెప్పానని అన్నారు. అమరావతి జిల్లాలోని అచలపూర్‌ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement