backlog post
-
ఆంధ్రా యూనివర్సిటీలో ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: టైపిస్ట్–01, రికార్డ్ అసిస్టెంట్–02, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్–01, డ్రాఫ్ట్స్‌మన్–01, అటెండర్–02, గార్డెనర్–02, మెస్ బాయ్/మెయిడ్–06, సెక్యూరిటీ గార్డ్–07, పంప్ అటెండర్–04, కార్పెంటర్–01, ప్లంబర్–03, బాయిలర్–01, ఎలక్ట్రీషియన్–01, వైండర్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ(డ్రాఫ్ట్స్‌మెన్), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్, ఇతర కంప్యూటర్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఏయూ, విశాఖపట్నం, ఏపీ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021 ► వెబ్సైట్: andhrauniversity.edu.in -
బ్యాక్లాగ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. బ్యాక్లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ అధారంగా 1ః3 జాబితాను సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఏఓ నర్సయ్య జాబితాలను నోటీస్ బోర్డులో ఉంచారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తెలియజేయాలని పేర్కొన్నారు. మూడు రోజుల అనంతరం అభ్యంతరాలు, మెరిట్లను పరిశీలించి తుది ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. టైపిస్టు ఉద్యోగాలకు 20 మంది, జూనియర్ సహాయకులు కమ్ టైపిస్టు ఉద్యోగాలకు 20 మంది, జూనియర్ సహాయకుడి ఉద్యోగాలకు 40 మందితో మెరిట్ లిస్టు తయారు చేసి నోటీస్ బోర్డులో ఉంచారు. -
బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్, ఏఎన్‌యూ ఆల్ రిజర్వేషన్ ఎంప్లాయిస్ అండ్ స్టూడెంట్ యూనియన్ ఇటీవల సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని యూనివర్సిటీ చేపట్టనున్న బ్యాక్లాగ్ పోస్టులకు మరలా నోటిఫికేషన్ జారీ చేయాలని యూనివర్సిటీ ఎంప్లాయిస్ అండ్ స్టూడెంట్స్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి మరలా నోటిఫికేషన్ జారీ చేయాలని డియాండ్ చేస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస అండ్ స్టూడెంట్ యూనియన్ ప్రత్యక్ష ఆందోళన చేపట్టబోతోందని దానిలో తమ సంఘం కూడా పాల్గొంటుందని పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎం.సురేష్‌కుమార్, వి.జయరావు తదితరులు ఉన్నారు. రిజర్వేషన్ ఎంపాయీస యూనియన్‌కు బీసీ సంఘం మద్దతు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయంలో యూనివర్సిటీ ఆల్ రిజర్వేషన్ ఎంప్లాయిస్ అండ్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టే అన్ని కార్యక్రమాలకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని యూనివర్సిటీ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘ నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2007లో ప్రకటించిన బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రాపోలు భావనారుషి, ఎంవీ ప్రసాదరావు తదితరులు ఉన్నారు.