bagdad
-
ఈద్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. రద్దీతో భారీగా మృతులు
-
అమెరికన్ ఎంబసీ సమీపంలో రాకెట్ దాడి..
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని హై సెక్యూరిటీ గ్రీన్ జోన్లో మంగళవారం ఉదయం అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో మూడు రాకెట్లు ఢీ కొన్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్లో ప్రభుత్వ, దౌత్య కార్యాలయాలు కొలువుతీరిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ సైనిక కమాండర్ జనరల్ ఖాసి సులేమానిని అమెరికన్ దళాలు ఇరాక్‌లో హతమార్చిన క్రమంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన రేకెత్తిస్తోంది. సులేమాని మృతితో అమెరికా, ఇరాన్‌ల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. కాగా రాకెట్ దాడిలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. చదవండి : అమెరికా దళాలే లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు -
ఖాసీం అంత్యక్రియలు.. హోరెత్తిన నినాదాలు
టెహరాన్: బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి చేయటంతో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం సులేమానీకి వేలాది మంది ప్రజలు అశ్రు నివాళులర్పించారు. అదేవిధంగా సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్న ఇరాక్ దేశ ప్రజలు పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘డెత్ టూ అమెరికా’ అంటూ గర్జించారు. అమెరికాపై ప్రతీకార్య చర్య తప్పదని హెచ్చరించారు. కాగా, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ, లండన్ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వెనుక అతని హస్తముందన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాది సులేమానీని తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం మట్టుబెట్టిందని, దీంతో అతని శకం అంతమైందని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సులేమానీ హత్యపై ఐరాసలోని ఇరాన్ రాయబారి మజీద్ తఖ్త్ రవంచి స్పందిస్తూ.. తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యగా అమెరికానుద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: అమాయకులను చంపినందుకే.. చదవండి: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక చదవండి: ఎప్పుడో చంపేయాల్సింది -
గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు..16 మంది మృతి
బాగ్దాద్ : ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఇరాక్‌లోని సలాహుద్దీన్ ప్రావిన్స్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాగ్దాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుజైల్ పట్టణంలోని ఓ గ్రామంలో ఆయుధాలతో వచ్చిన వ్యక్తి మూడు ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరిపాడని స్థానిక లుటెనంట్ కల్నల్ మహమ్మద్ అల్ జుబౌరీ తెలిపారు. కాల్పులు జరిగిన మూడు ఇళ్లు రహిమ్ అల్ మర్జౌక్ అనే న్యాయమూర్తి ముగ్గురు కుమారులవిగా గుర్తించారు. చనిపోయిన వారంతా ఈ ముగ్గురు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ ఘటనపై భద్రతా బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనాస్థలాన్ని సీజ్ చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు జుబౌరీ తెలిపారు. -
ఆత్మాహుతి దాడుల్లో 26మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో సోమవారం ఉదయం జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో సుమారు 26మంది దుర్మరణం చెందగా, వందలాదిమంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే టెరాన్ స్క్వేర్ సమీపంలోజంట పేలుళ్లు సంభవించినట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. అయితే ఈ పేలుళ్లకు పాల్పడింది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థగా అనుమానిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బాంబు దాడుల్లో 36 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దద్ మంగళవారం బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడుల్లో 36 మంది మృతి చెందగా మరో 100 మంది గాయపడ్డారు. మొదట షాబ్ జిల్లాలోని రద్దీగా ఉన్న ఓ మార్కెట్ వద్ద పేలుడు సంభవించగా.. ఈ ఘటనలో క్షతగాత్రలకు సహాయం చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకొని మరోసారి దాడులకు పాల్పడటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. సహాయక సిబ్బందికి సమీపంలో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు బాగ్దాద్ ఆపరేషన్ కమాండ్(బీఓసీ) వెల్లడించింది. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఆత్మాహుతి దాడికి పాల్పడింది మహిళ కాదని ఐఎస్ తన ప్రకటనలో తెలిపింది. దక్షిణ ఇరాక్‌లో ఆదివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో దాదాపు 33 మంది దుర్మరణం చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.