Bajrang Dal activists
-
రాజస్తాన్‌లో కిడ్నాప్.. హరియాణాలో హత్య
జైపూర్: హరియాణాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గో సంరక్షకులుగా అనుమానిస్తున్న కొందరు రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు ముస్లింలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి కాలిన మృతదేహాలు ఒక కారులో లభించడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన అరడజను మందికిపైగా బజరంగ్ దళ్ కార్యకర్తల్ని రాజస్తాన్ పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్యలను రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లా ఘట్‌మీక గ్రామానికి చెందిన నజీర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. గురువారం వారిద్దరి మృతదేహాలు హరియాణాలోని భివానిలో లోహారు ప్రాంతంలో ఒక దగ్ధమైన కారులో కనిపించాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేశారని వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు అరడజనుకుపైగా బజరంగ్దళ్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ‘‘వారికి ఈ నేరంలో ప్రమేయం ఉందో లేదో తేలాల్సి ఉంది’’ అని పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ చెప్పారు. మృతి చెందిన వారిలో జునైద్‌కి నేరచరిత్ర ఉందని, ఐదుకి పైగా కేసుల్లో అతను నిందితుడని చెప్పారు. రింకూ సైనీ అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. -
పార్కులు వెలవెల
ముషీరాబాద్/వెంగళరావునగర్: పార్కులు వెలవెలపోయాయి. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో పార్కులను మూసివేశారు. మరికొన్ని పార్కుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సంవదర్శకులను సైతం అనుమతించలేదు, ‘తాము ప్రేమికులం కాద’ని చెప్పినప్పటికీ అనుమతించలేదని పలువురు సందర్శకులు విస్మయం వ్యక్తం చేశారు. వాలెంటైన్స్‌డే బహిష్కరించాలని భజరంగ్‌దళ్ తదితర సంస్థలు కొంత కాలంగా పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి రోజు సందర్శకులతో కిటకిటలాడే ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్‌పార్కు తదితర పార్కులు జన సంచారం లేక బోసిపోయాయి. ఇదిలా ఉండగా ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చే వాకర్లు, ఇతర సందర్శకులు సైతం ఇబ్బందికి గురయ్యారు. జీహెచ్ఎంసి పార్కును మూసివేయాలంటే అటు పోలీసులు, లేదా అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు గాని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే అలాంటి ఉత్తర్వులు లేకపోయినా వెంగళరావునగర్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడకు చెందిన కొందరు యువకులు బుధవారం తెల్లవారుజామున కృష్ణకాంత్ పార్కుకు వచ్చి సెక్యూరిటీని బెదిరించి తాళాలు వేయాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది భయపడి పార్కుకు తాళాలు వేయకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. అదే సమయంలో పార్కుకు వచ్చిన వాకర్స్, సీనియర్ సిటిజన్స్, మహిళలు పార్కుకు వచ్చినప్పటికీ వారిని లోపలికి అనుమతించలేదు. పోలీసుల అదుపులో కృష్ణకాంత్‌పార్కు... కొందరు వాకర్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ సిబ్బంది హుటాహుటిన పార్కు వద్దకు చేరుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కేవలం మగవారిని మాత్రమే లోపలికి ప్రవేశించడానికి అటు పోలీసులు, ఇటు పార్కు అధికారులు అనుమతించారు. అంతేగాకుండా బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మధ్యాహ్నం వరకు పార్కుకు వచ్చిన ప్రేమికులు, సందర్శకులను అనుమతించకపోవడంతో నిరుత్సాహంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో పార్కులో 50 టిక్కెట్లు కూడా (ప్రైవేటు స్కూల్ చిన్నారులు మినహా) విక్రయించలేదని సిబ్బంది తెలిపారు. నిత్యం పండగ వాతావరణాన్ని తలపించే పార్కుల బయట కూడా కళా విహీనంగా మారిపోయింది. -
‘నమాజ్ చేస్తే తప్పులేదు.. కానీ పూజలు చేయకూడదా’
ఆగ్రా : బజరంగ్ దళ్‌కు చెందిన మహిళా కార్యకర్తలు కొందరు తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తాజ్ మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా ఇతర రోజుల్లో నమాజ్ చేయకూడదంటూ సుప్రీం కోర్టుతో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కూడా ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎస్ఐ ఉత్తర్వులను పట్టింకుకోండా కొందరు ముస్లింలు తాజ్ వద్ద ఉన్న మసీదులో గత బుధవారం నమాజ్ చేశారు. విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ మహిళా కార్యకర్తలు కొందరు ఏఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా తాజ్ వద్ద హరతి కార్యక్రమం నిర్వహించి.. గంగా జలాన్ని చల్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఇక్కడ నమాజ్ చేసి తాజ్ పరిసరాలను అపవిత్రం చేశారు. అందుకనే మేం గంగా జలంతో దాన్ని శుద్ది చేశాం. ఇతరులు(ముస్లింలు) వచ్చి ఇక్కడ నమాజ్ చేస్తున్నప్పుడు.. మేం తాజ్ మహల్లోకి పూజాద్రవ్యాలు తీసుకెళ్లడం తప్పా అంటూ వారు ప్రశ్నించారు. వారికి(ముస్లింలకు) శుక్రవారం మాత్రమే తాజ్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతించారు. కానీ మిగతా రోజుల్లో ఎందుకు ఇక్కడ నమాజ్ చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మేం చేసింది తప్పని భావిస్తే ఎలాంటి చర్యలనై తీసుకోండి.. వాటిని ఎదుర్కొడానికి మేం సిద్దంగా ఉన్నామని తెలిపారు. నమాజ్ కోసం వెళ్లిన వారిన ఆపలేదు.. కానీ మమ్మల్ని మాత్రం ఎలా అడ్డగిస్తారంటూ ప్రశ్నించారు. -
బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఓ టీవీ చానెల్లో శ్రీరాముడు, సీతలపై చర్చావేదిక సందర్భంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు, ప్రతినిధులు సదరు చానెల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఈ ఘటనపై చానెల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్పీఎ, బజరంగ్దళ్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు వెస్ట్‌జోన్ ఇన్చార్జి డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు నేతృత్వంలో భారీగా బలగాలను మోహరించారు. అప్పటికే వీహెచ్‌పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు భారీగా పోలీసు స్టేషన్ బయట గుమిగూడారు. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఒకవైపు భారీగా మోహరించిన పోలీసులు, మరో వైపు న్యాయం చేయాలంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కూడా స్టేషన్‌కు వచ్చారు. ఎట్టకేలకు అరెస్ట్ చేసిన కార్యకర్తలను విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
దాడులు చేసేది వాళ్లే... సెక్యూరిటీ కల్పించేది వాళ్లే
న్యూఢిల్లీ: కర్ణాటకలోని మంగళూరులో షరాన్ పాంప్‌వెల్ అనే 40 ఏళ్ల యువకుడికి ‘ఈశ్వరీ మ్యాన్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్’ అనే కంపెనీ ఉంది. కావాల్సిన మాల్స్‌కు, దుకాణాలకు, వ్యాపారవేత్తలకు భద్రతా కల్పించడమే ఆయన కంపెనీ కర్తవ్యం. మంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆయన కంపెనీకి నగరంలోని సిటీ సెంటర్, ఫోరమ్ ఫిజా, బిగ్ బజార్ అనే పెద్ద మాళ్లతోపాటు అనేక అపార్ట్మెంట్లు, దుకాణాలకు సెక్యూరిటీ కంట్రాక్టులు ఉన్నాయి. ఇందులో పెద్ద విశేషమేముందని మనం అనుకోవచ్చు. షరాన్ పాంప్‌వెల్ నేడు విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థయిన ‘బజరంగ్ దళ్’ దక్షణ కర్ణాటక డివిజన్‌కు కన్వీనర్. ఆయన బజరంగ దళ్‌లో అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ వచ్చారో, వ్యాపార రంగంలోనూ అలాగే ఎదుగుతూ వచ్చారు. ఇందుకు ఆయన నిర్వహిస్తున్న విధులకు విడదీయలేని విరుద్ధమైన సంబంధం ఉండడమే కారణం. బజరంగ్ దళ్ కన్వీనర్‌గా మాల్స్ మీద, దుకాణాల మీద, ముఖ్యంగా ముస్లిం వ్యాపారులకు చెందన సంస్థల మీద దాడులు జరిపించేది షరానే. వాటికి సెక్యూరిటీ కల్పించేది ఆయనే. బజరంగ్ దళ్ కార్యకర్తలను ముందుగా గొడవలకు పంపించి దాడులు చేయించడం, దౌర్జన్యాలకు దిగడం, ఆ తర్వాత తన సంస్థ సెక్యూరిటీని తీసుకొంటే హిందూ సంస్థల నుంచి ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగవని హామీ ఇవ్వడం, సెక్యూరిటీ కాంట్రాక్టులు కుదుర్చుకోవడం షరాన్‌కు అది నుంచి అబ్బిన విద్య. ఆయన సెక్యూరిటీ సంస్థలో పనిచేసేది ఎక్కువ మంది బజరంగ్ దళ్ కార్యకర్తలే. కొంత మంది ముస్లింలు కూడా ఉన్నారని షరానే తెలిపారు. ‘నేను 2005లో బజరంగ్ దళ్‌లో చేరాను. 2011లో మంగళూరు డివిజన్‌కు కన్వీనర్‌గా అయ్యాను. అప్పుడే నేను ఈశ్వరి మ్యాన్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాను. 2014లో దక్షిణ కర్ణాటక డివిజన్‌కు కన్వీనర్‌గా నియమితులయ్యాను. పదవితో పాటు నా వ్యాపారం విస్తరించింది. కేఎస్ రావు నగరంలోని సిటీ సెంటర్, పండేశ్వర్‌లోని ఫోరమ్ ఫిజా, లాల్ బాగ్ ఏరియాలోని బిగ్ బజార్‌కు సెక్యూరిటీ కాంట్రాక్టు నాదే’ అని షరాన్ తెలిపారు. సిటీ సెంటర్, ఫోరమ్ ఫిజా మాల్స్‌లలో ముస్లిం వ్యాపారులకే ఎక్కువ షాపులు ఉన్నాయి. గతంలో ఏ గొడవలు జరిగినా బజరంగ్ దళ్ కార్యకర్తలే వీటిపై దాడులు జరిపేవారు. ఇప్పుడు ఎక్కువ మంది ముస్లిం వ్యాపారులే తన క్లైంట్లుగా ఉన్నారని, దాంతో తన వ్యాపారం రెండింతలయిందని షరాన్ తెలిపారు. ‘ఎవరు దాడులు చేస్తారో, ఎవరు సెక్యూరిటీ కల్పిస్తారో మాకు తెలుసు. దాడులు జరిపించే వారికే సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఇస్తే సేఫ్గదా! మరో సంస్థకు సెక్యురిటీ కాంట్రాక్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ దాడులు జరగొచ్చు. మా వ్యాపారం సర్వనాశనం కావడానికి ఒక్క దాడి చాలదా! గతంలో ఇలాంటి దాడులను నిలువరించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు’ అని ఈశ్వరీ మ్యాన్ పవర్ సొల్యూషన్స్‌కు ఎందుకు సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రశ్నించగా సెటీ సెంటర్లోని ఓ ముస్లిం వ్యాపారస్థుడు సమాధానమిచ్చారు. ‘హిందుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికిగానీ, బజరంగ్ దళ్ కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి మా వద్ద ప్రత్యేక నిధులేమీ ఉండవు. పైగా కార్యకర్తలందరూ నిరుద్యోగ యువకులు. వారికి ఏదో ఉపాధి చూపించాలిగదా? అందుకే వారినే నేను ఎక్కువగా నా సెక్యూరిటీ సంస్థలోకి తీసుకుంటున్నాను. నా దొగ్గరికొచ్చి ఉద్యోగం అడిగిన కార్యకర్తలెవరికీ ఇంతవరకు నేను కాదనలేదు. నా దగ్గర ఎలా అయితే వారి సంఖ్య పెరుగుతుందో అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి గదా! ఎంతో కష్టపడితేగానీ వ్యాపారం ఈ స్థాయికి రాలేదు’ అని షరాన్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బజరంగ దళ్‌కు ఉత్తర, దక్షిణ పేరిట రెండు విభాగాలున్నాయి. షరాన్ నాయకత్వంలోని దక్షిణ విభాగం అతి క్రీయాశీలకంగా ఉండగా, ఉత్తర విభాగం స్తబ్ధుగా ఉంది. ప్రతిచోట కొంత మంది నాయకులు ఇలా బజరంగ దళ్‌ను ఉపయోగించుకుంటున్నారని అనలేం. పోలీసు వ్యవస్థ బలహీనంగా ఉన్న కర్ణాటకలో ఇలా జరుగుతోంది. (‘బజరంగ్ దళ్’ అంటే బలిష్టమైన దళమని అర్థం. అయోధ్య ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం 1984లో విశ్వహిందూ పరిషద్ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ధీరేంద్ర కే. ఝా పరిశోధనాత్మక జర్నలిజంలో భాగంగా ‘షాడో ఆర్మీస్: ఫింజ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫుట్ సోల్జర్స్ ఆఫ్ హిందుత్వ’ పేరిట రాసిన పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం. ఈ పుస్తకం ఏప్రిల్ 28వ తేదీన మార్కెట్లోకి విడుదలవుతోంది). -
దిల్వాలే సినిమాకు చుక్కెదురు
షారుఖ్ ఖాన్ నటించిన దిల్వాలే సినిమాకు 'అసహనం' సెగ తగిలింది. ఇటీవల ఈ అంశంపై షారుఖ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని మంగళూరులో ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బజరంగ్దళ్ కార్యకర్తలు థియేటర్ల వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేయడంతో.. భద్రతా కారణాల రీత్యా థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శన ఆపేశారు. మంగళూరులోని సిటీ సెంటర్ మాల్, ఫోరం ఫిజా మాల్, భరత్ మాల్.. ఈ మూడు చోట్లా ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చినా, థియేటర్లను మూసేయక తప్పలేదు. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలు వేటినీ ప్రదర్శించవద్దని కార్యకర్తలు బెదిరించినట్లు తెలుస్తోంది. దిల్వాలే సినిమా విడుదల అయినప్పటి నుంచి ఆ సినిమా మీద వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ కేవలం కొన్ని సంస్థలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడం వల్లే ఆయన సినిమాలను వ్యతిరేకిస్తున్నట్లు బజరంగ్ దళ్ కన్వీనర్ శరణ్ పంప్‌వెల్ తెలిపారు. -
మధ్యప్రదేశ్ చర్చి, క్రైస్తవ పాఠశాలపై దాడి
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో హిందుత్వ సంస్థలు క్రైస్తవ పాఠశాల , చర్చిపై దాడికి దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఈ నెల 20 న చోటు చేసుకుంది. వికార్ ఫాదర్ థాంక్చన్ జోస్ మత మార్పిళ్లకు పాల్పుడుతున్నారంటూ ధర్మసేన, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన నివాసం, థామస్ స్కూల్, చర్చి ప్రాంగణాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారు.