దిల్‌వాలే సినిమాకు చుక్కెదురు | Bajrang Dal Activists Stop Screening of Dilwale In Mangaluru | Sakshi
Sakshi News home page

దిల్‌వాలే సినిమాకు చుక్కెదురు

Published Mon, Dec 21 2015 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

దిల్‌వాలే సినిమాకు చుక్కెదురు

దిల్‌వాలే సినిమాకు చుక్కెదురు

షారుఖ్ ఖాన్ నటించిన దిల్‌వాలే సినిమాకు 'అసహనం' సెగ తగిలింది. ఇటీవల ఈ అంశంపై షారుఖ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ కార్యకర్తలు కర్ణాటకలోని మంగళూరులో ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. బజరంగ్‌దళ్ కార్యకర్తలు థియేటర్ల వద్దకు చేరుకుని నిరసన ప్రదర్శన చేయడంతో.. భద్రతా కారణాల రీత్యా థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శన ఆపేశారు. మంగళూరులోని సిటీ సెంటర్ మాల్, ఫోరం ఫిజా మాల్, భరత్ మాల్.. ఈ మూడు చోట్లా ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చినా, థియేటర్లను మూసేయక తప్పలేదు.

షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలు వేటినీ ప్రదర్శించవద్దని కార్యకర్తలు బెదిరించినట్లు తెలుస్తోంది. దిల్‌వాలే సినిమా విడుదల అయినప్పటి నుంచి ఆ సినిమా మీద వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ కేవలం కొన్ని సంస్థలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడం వల్లే ఆయన సినిమాలను వ్యతిరేకిస్తున్నట్లు బజరంగ్ దళ్ కన్వీనర్ శరణ్ పంప్‌వెల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement