Balarama
-
ఆర్థిక విజయానికి రామబాణం
కోట్లాది మంది దశాబ్దాల స్వప్నం సాకారమై, అయోధ్యలో బాలరాముడు కొలువు దీరాడు. రామాయణాన్ని గృహస్థ ధర్మానికి అద్భుతమైన నిదర్శనంగా పేర్కొంటారు. శ్రీరాముడి జీవన మార్గాన్ని పరిశీలించి చూస్తే వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో ఎలా నడుచుకోవాలనే విషయమై విలువైన పాఠాలు కనిపిస్తాయి. శ్రీరాముడిని విశ్వసించే ప్రతి ఒక్కరూ, తమ ఆర్థిక విజయానికి కావాల్సిన సూత్రాలను రామాయణం నుంచి తీసుకోవచ్చు. రాముడి వనవాసం.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక అవసరాన్ని గుర్తు చేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితానికి ఆలోచనాత్మక ఆర్థిక ప్రణాళిక ఎంతో అవసరమని నిపుణులు తరచూ సూచిస్తుంటారు. ఆర్థిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటికి తగిన బడ్జెట్ కేటాయించుకోవడం, వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితంలో అనిశ్చితులు ఎదురైనా, వాటిని సులభంగా అధిగమించొచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాముడు తన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. అందుకే ఊహించని పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఎలా అన్నది రాముడి చేసి చూపించాడు. మనం కూడా ఆర్థిక ప్రణాళిక ఆధారంగా జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సన్నద్ధత ఏర్పాటు చేసుకోవాలి. జీవితానికి తగినంత బీమా కవరేజీ, ఆరోగ్య బీమా తీసుకోవాలి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. జీవిత లక్ష్యాలు, అందుకు కావాల్సిన మొత్తం, చేయాల్సిన పెట్టుబడి, వివిధ సాధనాల మధ్య రిస్క్ ఆధారంగా కేటాయింపులు.. వీటన్నింటికీ ఆర్థిక ప్రణాళిక మార్గం చూపిస్తుంది. ధర్మ మార్గం ధర్మం పట్ల రాముడి అచంచలమైన నిబద్ధత ఆయన జీవన గమనానికి మూలస్తంభంగా కనిపిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలో నైతిక ఆర్థిక విధానాల ఆచరణ అవసరాన్ని ఇది తెలియజేస్తుంది. ఇదే దీర్ఘకాలంలో విజయానికి బాటలు పరుస్తుంది. నిజాయితీ, చిత్తశుద్ధి, ఆర్థిక నిర్ణయాల్లో పారదర్శకత, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ, వేగంగా ధనవంతులు కావచ్చనే ప్రచారానికి ఆకర్షితులు కాకపోవడం వంటివి ఆర్థిక విజయాలకు భరోసానిస్తుంది. ఆర్థిక విషయాల్లో ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల అది స్థిరమైన, నైతిక సంపద సృష్టికి దారితీస్తుంది. రిస్క్ నిర్వహణ రావణుడితో రాముడు సాగించిన యుద్ధం.. ధైర్యం, రిస్క్ నిర్వహణ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక విషయాల్లోనూ వీటి అవసరం ఎంతో ఉంది. సంపద సృష్టికి, ఆర్థిక లక్ష్యాల సాధనకు ధైర్యంగా, తమకు సరిపడే రిస్‌్కలను తీసుకోవాల్సిందే. రిస్‌్కలను మదించే విషయమై, అనిశి్చతులను అధిగమించేందుకు అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడాన్ని మర్చిపోవద్దు. ధర్మం కోసం రాముడు యుద్ధం చేయక తప్పలేదు. అలాగే, సంపద సృష్టి కోరుకునే వారు కూడా రిస్‌్కతో కలసి నడవాల్సిందే. అది కూడా తాము భరించే స్థాయిలోనే రిస్‌్కను పరిమితం చేసుకోవాలి. పెట్టుబడికి సైతం ముప్పు ఉంటుందని ఈక్విటీలకు దూరంగా ఉండడం సరికాదు. రాబడులకు, పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఒక్కదాని దృష్టితోనో పరుగులు తీయకూడదు. సరళతరం వనవాస సమయంలో రాముడి నిరాడంబర, సాధారణ జీవన శైలి.. పొదుపు ధర్మాన్ని తెలియజేస్తుంది. వ్యక్తిగత ఆర్థిక జీవితంలోనూ పొదుపుతో కూడిన జీవనశైలిని అనుసరించడం, అనవసర దుబారాని నియంత్రించడం ఆర్థిక శ్రేయస్సుకు దారి చూపుతుంది. నేడు ప్రతి ఒక్క అవసరానికీ సులభంగా రుణాలు లభిస్తున్నాయి. అవసరాలు, కోరికల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాలతో కోరికలు తీర్చుకోవడం ఆర్థిక శ్రేయస్సుకు మేలు చేయదు. పొదుపు మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. తెలివిగా ఖర్చు చేస్తూ, పొదుపు, పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. క్రెడిట్ కార్డ్ రుణాల నుంచి త్వరగా బయటకు రావాలి. అధిక ఖర్చుకు కళ్లెం వేయాలి. సరైన అవకాశాలు, అనుకూల సమయం కోసం వేచి చూస్తూ ఈక్విటీ మార్కెట్లో వచ్చే విలువైన అవకాశాలను కోల్పోవద్దు. సహనం, పట్టుదల కష్టపడి సంపాదించిన ధనానికి రక్షణగా నిలవాలి. మార్గదర్శకం రాముడి విధేయత, తన అనుచరులతో ఉన్న బలమైన బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెట్టుబడుల విషయంలోనూ సత్సంబంధాలు ఎంతో అవసరం. పరస్పర గౌరవం, నమ్మకం, మద్దతు అనేవి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సాయపడతాయి. అవసరం మేరకు ఆర్థిక నిపుణుల సాయాన్ని, మద్దతును, మార్గదర్శకాన్ని తీసుకోవాలి. ఇన్వెస్టర్ రిస్‌్కను మదింపు వేసి, అనుకూలమైన పెట్టుబడి సాధనాలు, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఆచరించాల్సి మార్గాన్ని వారు సూచిస్తారు. ఆర్థిక ప్రపంచంలో ఉండే సంక్లిష్టతలను అధిగమించేందుకు సాయపడతారు. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో రాముడి సైన్యంలో కనిపించే వైవిధ్యాన్ని, తమ పెట్టుబడులకూ అన్వయించుకోవాలి. వానరాలు, ఎలుగుబంట్లు, ఉడతలు, గద్దలు ఇవన్నీ రామదండులో కనిపిస్తాయి. ఇదే మాదిరిగా పెట్టుబడుల్లోనూ వైవిధ్యం ఉండాలి. కేవలం పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్లకే (ఎఫ్డీలు) పరిమితం కాకూడదు. అన్ని ముఖ్య సాధనాల్లోకీ పెట్టుబడులు వర్గీకరించుకోవాలి. దీనివల్ల రిస్‌్కను తగ్గించుకోవచ్చు. రాబడులు స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. ఈక్విటీలు, డెట్, గోల్డ్, ఏఐఎఫ్‌లకు పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. నేనే సుపీరియర్ అనుకోవద్దు..! పెట్టుబడుల విషయంలో అంతా తనకే తెలుసన్న అహంకారం అస్సలు పనికిరాదు. రావణుడి పతనానికి ఇదే దారితీసింది. మెరుగైన పనితీరు చూపించని సాధనాల విషయంలో అహంకారం విడిచి పెట్టి ఆలోచించాలి. నిరీ్ణత కాలానికోసారి సమీక్షించుకుని పెట్టుబడుల్లో మార్పులు చేసుకోవాలి. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసి పని అయిపోందని అనుకోవడం ఆర్థిక విజయాలకు దారితీయదు. సంపద సృష్టికి, పెట్టుబడుల మార్గంలో తప్పొప్పులను అంగీకరించాలి. దీనివల్ల నష్టాలను పరిమితం చేసుకునేందుకు వీలుంటుంది. మారుతున్న పరిస్థితులను ఆహా్వనించడం ఆర్థిక శ్రేయస్సుకు అవసరం. శ్రీరాముడి జీవితంలో పొందుపరిచిన జ్ఞానం కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియచెపుతుంది. ఇన్వెస్టర్లకు విలువైన అంశాలను తెలియజేస్తుంది. రామాయణాన్ని చదవడం, అందులోని ముఖ్యమైన అంశాలను గ్రహించి, వాటిని తమ పెట్టుబడులకు అన్వయించుకోవడం వల్ల ఆర్థిక విజయాలకు మార్గాన్ని సులభం చేసుకోవచ్చు. చెడుపై మంచి విజయం సాధించడం రామాయణంలో కనిపిస్తుంది. అదే మాదిరిగా ఇన్వెస్టర్లు ఆర్థిక అవరోధాలను అధిగమించి, మంచి ఆర్థిక అలవాట్లతో, క్రమశిక్షణతో మెలగడం ద్వారా సంపద సృష్టికి చేరువకావచ్చు. హద్దులకు కట్టుబడి ఉండడం సంపద సృష్టి కోరుకునే వారు అందుకు అడ్డదారులు (షార్ట్‌కట్స్) వెతుక్కోకూడదు. లంకాధిపతి రావణుడు సీతమ్మ వారిని కోరుకోవడం వల్ల ఎంతటి ఉపద్రవం జరిగిందో రామాయణం చెబుతోంది. కోరికలపై నియంత్రణ అవసరమని, సన్మార్గమే శ్రేష్టమని ఇది సందేశం ఇస్తుంది. పెట్టుబడులపై రాబడుల విషయంలోనూ కోరికలను అదుపులో పెట్టుకుని వ్యవహరించాలి. తమకంటూ ఆర్థిక సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్రేకంతో కూడిన నిర్ణయాలకు చోటు ఇవ్వకూడదు. టిప్స్‌ను అనుసరించడం కాకుండా కాల పరీక్షకు నిలిచిన బలమైన పెట్టుబడుల వ్యూహాలను అనుసరించాలి. దీనివల్ల విజయం తేలిక అవుతుంది. ఓపిక, క్రమశిక్షణ సముద్రంలో రామసేతు వారధి నిర్మాణం ఎంతో ఓపిక, పట్టుదలతో, ఎంతో మంది కృషితో, సుదీర్ఘ కాలానికి కానీ సాధ్యం కాలేదు. సందప సృష్టి కూడా అంతే. స్వల్ప కాలంలో కుబేరులు కావడం అనేది ఆచరణలో అంత సులభం కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. సిప్ అవసరాన్ని ఇక్కడ గుర్తించాలి. సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే, చిన్న మొత్తమే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. దీర్ఘకాలంలో సంపద సృష్టిని సిప్ సులభతరం చేస్తుంది. స్థిరత్వం, సహనం అనేవి దీర్ఘకాల ప్రయాణానికి ఎంతో అవసరం. లక్ష్మణుడి కోసం ఆంజనేయుడు సంజీవని కోసం వెళ్లడం, దాన్ని గుర్తించలేక తన చేత్తో మొత్తం సుమేరు పర్వతాన్ని పెకిలించి చేత్తో తీసుకురావడం తెలిసిందే. ప్రతీ ఇన్వెస్టర్ సంజీవని వంటి కంపెనీలను గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు వారి ముందున్న మార్గం మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇన్వెస్టర్లు ఒక్కో కంపెనీ వారీ రిస్‌్కను తగ్గించుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సూచీల్లో ఇన్వెస్ట్ చేసే ప్యాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. అందులోని కొన్ని స్టాక్స్ బలహీన పనితీరు చూపించినా కానీ, మిగిలిన వాటి అండతో దీర్ఘకాలంలో మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చు. -
ద్వివిధుడి వధ
ద్వివిధుడనే వానరుడు నరకాసురుడికి నమ్మకమైన స్నేహితుడిగా ఉండేవాడు. కృష్ణుడి చేతిలో నరకుడు హతమైపోయాక, తన మిత్రుణ్ణి చంపిన కృష్ణుడి మీద, అతడి పరివారమైన యాదవుల మీద పగబట్టాడు. కృష్ణుడి ఆనర్త దేశంలో అడపా దడపా నానా బీభత్సం సృష్టించేవాడు. పొలాల మీద పడి పంటలు నాశనం చేసేవాడు. ఊళ్లకు ఊళ్లను తగులబెట్టేవాడు. ఉద్యానవనాల్లోకి చొరబడి వాటిని ధ్వంసం చేసేవాడు. ద్వారక మీదకు రాళ్లు రువ్వేవాడు. ఆలమందలను చెదరగొట్టేవాడు. ఇలా నానా ఆగడం చేసి, చెట్ల మీద నుంచి గెంతుతూ ఎవరకీ దొరక్కుండా క్షణాల్లో పారిపోయేవాడు. ఇలా ఉండగా, ఒకసారి బలరాముడు ప్రియురాళ్లతోను, వాళ్ల చెలికత్తెలతోను కలసి రైవత పర్వతం మీదకు వనవిహారానికి వెళ్లాడు. సముద్రం మీద నుంచి వీచే చల్లగాలి హాయిగొలుపుతుండగా, అందరూ కొండ మీద చదునైన చోట కూర్చుని సేదదీరసాగారు. బలరాముడు హాయిగా మధువు తాగుతూ, ఆ తన్మయత్వంలో పాటలు పాడసాగాడు. బలరాముడి సంగీతానికి అనుగుణంగా ప్రియురాళ్లు నాట్యం చేయసాగారు. వారి వినోద కాలక్షేపం పాన గానాలతో ఆహ్లాదభరితంగా సాగుతుండగా, ఎక్కడి నుంచి చూశాడో ద్వివిధుడు చెట్ల మీద నుంచి దూకుతూ రైవత పర్వతం మీదకు చేరుకున్నాడు. కొండ మీదనున్న చెట్లపై వేలాడుతూ, ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ కోతిచేష్టలు మొదలుపెట్టాడు. చెట్లను బలంగా ఊపుతూ, వాటికి ఉన్న పండ్లను దులిపేశాడు. పూలను రాల్చేశాడు. ఆడవాళ్ల ఎదుటికొచ్చి చిందులు వేశాడు. వాళ్లు అతణ్ణి వింతగా చూశారు. కొందరు నవ్వారు. ఇంత జరుగుతున్నా బలరాముడు తన మైకంలో, తన లోకంలో తానుండి హాయిగా గానాలాపన సాగిస్తూనే ఉన్నాడు. తాను ఎంత ఆగడం చేస్తున్నా, బలరాముడు చలించకపోవడంతో ద్వివిధుడు చిర్రెత్తిపోయాడు. ఏకంగా బలరాముడి ఎదుటికే వచ్చి, జబ్బలు చరుచుకుని రంకెలు వేశాడు. కాళ్లు నేలకు తాటిస్తూ, కయ్యానికి కాలు దువ్వాడు. ఈ చేష్టలను బలరాముడు అరమూత కళ్లతో ఒకసారి చూసి, తన మానాన పాడుకోసాగాడు. ద్వివిధుడు మరింతగా కోపంతో పెట్రేగి ఊగిపోయాడు. పళ్లు పటపట కొరికాడు. బలరాముడి ముందున్న మధుపాత్రను పైకెత్తి నేలకేసి కొట్టాడు. మధుపాత్ర పగిలి, మధువు నేలపాలైంది. ఏదో ఘనకార్యం చేసినట్టు వికటాట్టహాసం చేశాడు. రెప్పలెత్తి చూశాడు బలరాముడు. మామూలు కోతిని అదిలించినట్లుగానే, పక్కనే ఉన్న ఒక చిన్నరాయిని తీసుకుని అదిలించాడు. బలరాముడి ధోరణికి ద్వివిధుడు బాగా రెచ్చిపోయాడు. ఈసారి ఆడవాళ్ల గుంపులోకి దూకాడు. వాళ్లను మిర్రి మిర్రి చూస్తూ కిచకిచలాడాడు. బెదిరిస్తున్నట్లుగా పైపైకి వచ్చాడు. గంతులు వేశాడు. వాళ్లు ఇదంతా వినోదంగా అనుకుంటున్నంతలోనే ఒక్కసారిగా వాళ్ల జడలు గుంజి, చీరలు చించేశాడు. మీదపడి దొరికిన వాళ్లను దొరికినట్లుగా గోళ్లతో రక్కాడు. వానరం ఆగడం మితిమీరడంతో వాళ్లంతా హాహాకారాలు చేస్తూ, ఏడుపు మొదలుపెట్టారు. అప్పుడు వాణ్ణి తేరిపార చూశాడు బలరాముడు. దేశంలో ఆగడాలు సాగిస్తున్న వానరుడు వీడేనని గుర్తించాడు. ఆడవాళ్ల మీద ఆగడం సాగిస్తుండటంతో ఏమాత్రం సహించలేకపోయాడు. ఇక ఆలస్యం చేయకుండా, ఒక చేత నాగలి, మరో చేత ముసలం పట్టుకుని పైకి లేచాడు. బలరాముడు ఆయుధాలతో పైకి లేవడం గమనించిన ద్వివిధుడు, ఒక భారీ గుగ్గిలం చెట్టును పెరికి, బలరాముడి మీదకు విసిరాడు. ఎడమచేత్తో దాన్ని అడ్డుకున్నాడు బలరాముడు. ఒక మద్దిచెట్టును విసిరాడు. దాన్ని ముసలంతో నేలకూల్చేశాడు బలరాముడు. ఒక్క ఊపుతో ముందుకు దూసుకొచ్చాడు ద్వివిధుడు. ముసలంతో చాచిపెట్టి వాడి నెత్తి మీద కొట్టాడు బలరాముడు. వాడి తల పగిలి నెత్తురోడసాగింది. అయినా లక్ష్యపెట్టలేదు వాడు. భయంకరంగా పెడబొబ్బలు పెడుతూ, చెట్టు మీద చెట్టు పెరికి బలరాముడి మీదకు దండెత్తాడు. చుట్టు పక్కల చెట్లన్నీ ఖాళీ అయిపోయాక, పెద్ద పెద్ద బండరాళ్లు విసిరి ఊపిరాడనివ్వకుండా చేశాడు. అంతటితో ఆగకుండా బలరాముడి మీదకు దూకి, నేలకేసి అదిమి పిడిగుద్దులు కురిపించాడు. ఉపేక్షిస్తున్న కొద్దీ వానరం రెచ్చిపోతుండటంతో బలరాముడికి కోపం తలకెక్కింది. ఆగ్రహంతో కళ్లెర్రచేసి, కాలసర్పంలా బుసకొట్టాడు. ద్వివిధుడి మీద పిడుగుల్లా పిడిగుద్దులు కురిపించాడు. ఇద్దరూ కచాకచీ బాహాబాహీ ఒకరితో ఒకరు తలపడ్డారు. రైవతపర్వతం అదిరిపోయేలా రంకెలు వేస్తూ భీకరంగా ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు నేలపైకి పడదోసుకుంటూ యుద్ధం సాగించారు. ఒకరినొకరు తన్నుకుంటూ, చరుచుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ కలియబడ్డారు. అదను చూసుకుని బలరాముడు ద్వివిధుణ్ణి ఒడుపుగా పట్టుకుని, నేలకేసి తోశాడు. పైకి లేచేలోగానే అతడిపై కలబడ్డాడు. అతడి గుండెల మీద కూర్చుని, లేవనివ్వకుండా అతణ్ణి కట్టడి చేశాడు. ప్రతిఘటించేలోపే వ్యవధినివ్వకుండా పిడిగుద్దులు కురిపించాడు. గుండెల మీద పిడుగులాంటి పోటు పిడికిటితో పొడిచాడు. దెబ్బకు నెత్తురు కక్కుకుంటూ, భీకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు ద్వివిధుడు. బలరాముడి చేతిలో వానరం హతమవడంతో అతడితో కొండ మీదకు వచ్చిన ఆడవాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. బలరాముడిని పొగుడుతూ ఆనందంతో పాటలు పాడారు. యుద్ధంలో అలసిపోయిన బలరాముడికి సపర్యలు చేశారు. కొండ మీద కాసేపు సేదదీరాక, తిరిగి ద్వారకకు మళ్లారు. -సాంఖ్యాయన -
40 మంది అన్నదాతలకు సన్మానాలు
బలరామ జయంతి వేళ బీకేఎస్చే రైతులకు సముచిత స్థానం అమలాపురం : సాగు కష్టాలు దిగమింగి శ్రమను పెట్టుబడిగా పెట్టి ప్రతికూల పరిస్థితులను అధిగమించిన అన్నదాతలకు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) సముచిత స్థానం ఇచ్చి సత్కరించింది. బలరామ జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 40 మంది రైతులకు స్థానిక గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలకు ఆహ్వానించి ఒకే వేదికపై ఘనంగా సన్మానించారు. మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలిచేలా ఈ 40 మంది రైతులు గో ఆధారితం, సేంద్రియ సాగు, అంతర పంటలు, ఉద్యాన పంటలను విరివిగా పండిస్తూ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. సాధారణంగా రైతులకు రైతు సంఘాలు సత్కరించటమే అరుదు. ఈ అరుదైన ఘట్టాన్ని బీకేఎస్ ఆవిష్కరించింది. 40 మంది రైతులతోపాటు రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్న అమలాపురం ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు సీహెచ్ శ్రీనివాసులు, పి.గన్నవరం వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు ఎలియాజర్, ముమ్మిడివరం పశుసంవర్ధక శాఖ వైద్యుడు మధులను కూడా బీకేఎస్ ఇదే వేదికపై సత్కరించింది. అలాగే ఇటీవల మృతి చెందిన బీకేస్ సభ్యులు, రైతులు గనిశెట్టి రామచంద్రరావు (సన్నవిల్లి), చేకూరి రంగరాజు (మాగం) జ్ఞాపకార్ధం రైతులు అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, చేకూరి సత్యనారాయణరాజులను కూడా బీకేస్ సత్కరించింది. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ రైతు సత్కార సభలో బీకేస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు, జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి, బీకేఎస్ ప్రతినిధులు అడ్డాల గోపాలకృష్ణ, యాళ్ల వెంకటానందం, బొక్కా ఆదినారాయణ,అప్పారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా బలరామ జయంతి
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఇస్కాన్‌సిటీలోని ఇస్కాన్ మందిరంలో గురువారం బలరామ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు, ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు సంకీర్తనలను అలపించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నెల్లూరు మందిరం అధ్యక్షుడు సుఖదేవ్స్వామి దైవసందేశాన్ని అందించారు. బలరాముడిని పూజించడం ద్వారా పొందే ఆధ్యాత్మిక శక్తి,అనుగ్రహంతో జీవితాన్ని సుఖసంతోషాలతో గడపగలమని పేర్కొన్నారు. -
క్రోధానికి విరుగుడు శాంతమే!
పురానీతి ఒకనాటి సాయంత్రం శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వనవిహారానికి వెళ్లారు. కబుర్లాడుకుంటూ వెళుతుండటంతో కాలం తెలియలేదు. చీకటి ముసురుకునే వేళకు ముగ్గురూ ఒక కీకారణ్యంలోకి చేరుకున్నారు. ముందుకు సాగడానికైనా, వెనక్కు మళ్లడానికైనా ఏ మాత్రం అనువుకాని సమయం. ఇక చేసేదేమీ లేక ఆ రాత్రికి ఎలాగోలా కీకారణ్యంలోనే గడపాలని నిశ్చయించుకున్నారు. అడవిలో ముగ్గురూ ఒకేసారి ఆదమరచి నిద్రపోవడం క్షేమం కాదని, అందువల్ల ఇద్దరు నిద్రిస్తున్నప్పుడు మిగిలిన వారు కాపలా ఉండాలని, ఇలా వంతుల వారీగా మేలుకొని కాపలా ఉంటూ రాత్రి పొద్దుపుచ్చాలని అనుకున్నారు. ముందుగా శ్రీకృష్ణుడు, బలరాముడు ఒక చెట్టు కింద నిద్రకు ఉపక్రమించారు. సాత్యకి వారికి కాపలాగా మేలుకొని ఉన్నాడు. ఒళ్లంతా కళ్లు చేసుకుని, చుట్టూ గస్తీ తిరగసాగాడు. అంతలోనే ఒక రాక్షసుడు కృష్ణ బలరాముల వైపు వడివడిగా రావడం కనిపించింది. సాత్యకి వెంటనే ఆ రాక్షసుడిని అడ్డగించాడు. రాక్షసుడు సాత్యకిపై దాడికి దిగాడు. సాత్యకి క్రోధావేశాలతో తన గదాయుధంతో అతడిని ఎదుర్కొన్నాడు. సాత్యకిలో క్రోధం మొదలైన మరుక్షణమే రాక్షసుడి శరీరం రెట్టింపైంది. సాత్యకికి కోపం మరింత పెరిగింది. రాక్షసుడి శరీరం కూడా పెరిగింది. సాత్యకి కోపం చల్లారకపోగా, అంతకంతకూ పెరగడంతో రాక్షసుడి శరీరం విపరీతంగా పెరిగింది. రాక్షసుడి శరీరం ముందు సాత్యకి ఆటబొమ్మలా కనిపించసాగాడు. రాక్షసుడు సాత్యకిని ఎత్తిపట్టుకుని, గిరగిరా తిప్పి కింద పడేసి వెళ్లిపోయాడు. గాయాలపాలైన సాత్యకి కొద్దిసేపటికి శక్తి కూడదీసుకుని తెప్పరిల్లాడు. అదే సమయానికి మేలుకున్న బలరాముడు ఇక తాను కాపలాగా ఉంటానని చెప్పి, సాత్యకిని నిద్రపొమ్మన్నాడు. రాక్షసుడితో పోరులో అలసి సొలసిన సాత్యకి నెమ్మదిగా చెట్టు కిందకు చేరుకుని, ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. బలరాముడు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయసాగాడు. సాత్యకికి ఎదురైన రాక్షసుడే బలరాముడికీ ఎదురయ్యాడు. యుద్ధానికి కవ్వించాడు. బలరాముడు అసలే ప్రథమకోపి. కట్టలు తెంచుకున్న కోపంతో తన హలాయుధాన్ని ఎత్తి రాక్షసుడిపై దాడి చేశాడు. రాక్షసుడు వికటాట్టహాసం చేస్తూ తన శరీరాన్ని పెంచాడు. బలరాముడి కోపం మరింత పెరిగింది. బలరాముడి కోపంతో పాటే రాక్షసుడి శరీరం పెరుగుతూ రాసాగింది. చివరకు భీకరాకారం దాల్చిన రాక్షసుడు బలరాముడిని కూడా మట్టికరిపించి, వెనుదిరిగాడు. ఇంతలోగా తనవంతు కాపలా కాయడానికి శ్రీకృష్ణుడు మేలుకున్నాడు. ఇంకా తెల్లారలేదు కదా, ఓ కునుకు తీయమన్నాడు బలరాముడిని. రాక్షసుడి ధాటికి ఒళ్లు హూనమైన బలరాముడు నెమ్మదిగా చెట్టుకిందకు చేరుకుని నడుం వాల్చాడు. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. శ్రీకృష్ణుడు అటూ ఇటూ కలియదిరుగుతూ కాపలా కాయసాగాడు. కొద్దిసేపటికి సాత్యకిని, బలరాముడిని మట్టికరిపించిన రాక్షసుడు శ్రీకృష్ణుడి ఎదుటికి వచ్చాడు. యుద్ధం చేయమంటూ కవ్వించాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ సై అన్నాడు. రాక్షసుడు కృష్ణుడి మీదకు లంఘించాడు. కృష్ణుడు ఒడుపుగా తప్పించుకున్నాడు. ప్రశాంతంగా అతడి వైపు చూసి మల్లయుద్ధానికి చెయ్యి కలిపాడు. రాక్షసుడి శరీరం సగానికి సగం తగ్గిపోయింది. అతడు ఎంతగా కవ్విస్తున్నా, కృష్ణుడు చెక్కుచెదరని చిరునవ్వుతో అతడిని ఎదుర్కోసాగాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తున్న కొద్దీ రాక్షసుడి శరీరం అంతకంతకూ తగ్గిపోసాగింది. చివరకు గుప్పిట్లో పట్టేంత చిన్నగా తయారయ్యాడు ఆ రాక్షసుడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడిని అరచేత పట్టుకుని, తన ఉత్తరీయం అంచుకు మూటలా కట్టేశాడు. కొద్దిసేపటికి తెల్లవారింది. అడవిలో పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. సాత్యకి, బలరాముడు మేలుకున్నారు. తమ దగ్గరే ఉన్న కృష్ణుడిని చూశారు. తమ ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకున్నారు. రాత్రి తమకు కనిపించిన రాక్షసుడి గురించి చెప్పారు. ‘అలాంటి రాక్షసుడు నీకు కనిపించలేదా?’ అని అడిగారు. ‘వీడేనా ఆ రాక్షసుడు’ అంటూ తన ఉత్తరీయం అంచున కట్టిన మూటను విప్పాడు కృష్ణుడు. అందులోంచి బయటపడ్డాడు గుప్పెండంత పరిమాణంలో ఉన్న రాక్షసుడు. బలరాముడు, సాత్యకి ఆశ్చర్యపోయారు. ‘నిన్న మాకు కనిపించింది వీడే. అయితే, అప్పుడు బాగా పెద్దగా ఉన్నాడు. కోపంగా అతడితో పోరు సాగించే కొద్దీ మరింతగా పెరిగిపోసాగాడు’ అని చెప్పారు. ‘ఈ రాక్షసుడు మూర్తీభవించిన క్రోధం. క్రోధానికి విరుగుడు క్రోధం కాదు, శాంతం. మీరిద్దరూ కోపంతో రెచ్చిపోయి తలపడ్డారు. అందుకే ఇతడి చేతుల్లో పరాజితులయ్యారు’ అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు జ్ఞానోదయమైంది సాత్యకీ బలరాములకు. నీతి: క్రోధం వల్ల సాధించేదేమీ ఉండదు. కోపానికి విరుగుడు శాంతమే. శాంతం వహిస్తే, క్రోధాన్ని అవలీలగా జయించవచ్చు. -
బలరాముడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 37 బలరాముడు దేవకీ గర్భం నుంచి ఏడవ వాడిగా పుట్టవలసినవాడు. కంసుడికి ఏడూ ఎనిమిదీ గర్భాల గురించిన సందిగ్ధతను పుట్టించి, ఇంకా భయాన్ని పెంచడానికి ఈ బలరాముణ్ని దేవకీ గర్భం నుంచి సంకర్షించి, గొల్లపల్లెలో ఉన్న వసుదేవుడి భార్యే అయిన రోహిణి గర్భంలో ఉంచారు. ఆ కాలంలోనే ఈ గర్భమార్పిడి పద్ధతి జరిగింది. అందుకనే బలరాముణ్ని సంకర్షణుడని అంటారు. సంకర్షించడమంటే అసలైన అర్థం, బ్రహ్మ చైతన్యం నుంచి దూరంగా లాగడమని. ఇలా భగవంతుణ్నించి దూరంగా లాగుతూ ప్రపంచ విలాసాల ప్రలోభా లను చూపించేది ప్రకృతి. అంచేత ఇలా సంకర్షణ చేసే ప్రకృతే బలరాముడు. కానీ ప్రకృతి అంటే, భగవంతుడి ప్రకృష్టమైన, గొప్పదైన కృతి, పని, కావ్యం. కావ్యం కాంతలాగ బుర్రకెక్కేలాగ చెబుతుందని చెబుతారు. భగవంతుడనే పురుషుడు గీసిన గిరిలోనే ఉంటూ పనిచేస్తుంది ఈ ప్రకృతి అనే కావ్యకాంత. ప్రకృతి మనను దూరంగా లాగుతున్నా, దూరంగా పోవడం వల్ల కలుగుతూన్న కష్టనష్టాలను అనుభవించేలాగ చేసి, తిరిగి భగవంతుడి వైపు మళ్లేలాగ చేస్తుంది కూడాను. ఆ విధంగా కూటస్థుడైన శ్రీకృష్ణుణ్ని దాటి ఎప్పుడూ ప్రవర్తించదు అతిబలిష్ఠమూ ప్రకృతి రూపమూ అయిన బలరామత్వం. బలరాముడు ప్రకృతిగా దుర్యోధన పక్షపాతిగా, భగవంతుడి దగ్గరే ఉన్నా అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూన్నట్టు అవుపిస్తాడు. మోసం చేసి సంపాయించిన పాండవుల రాజ్యాన్ని కౌరవులు తిరిగి ఇయ్యాలి లేదా యుద్ధంలో చావాలి అని శ్రీకృష్ణుడు అంటూంటే, జూదమాడడమూ రాజ్యాన్ని పోగొట్టుకోడమూ ధర్మరాజు స్వయంకృతాప రాధాలే తప్ప, వాటిలో దుర్యోధన శకునుల తప్పేమీ లేదన్నట్టు గానే మాట్టాడాడు బలరాముడు. శ్రీకృష్ణుడి సాయాన్ని అడగడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ ద్వారకకు వచ్చారు. కృష్ణుడు వీళ్లను పరీక్షించాలను కొన్నట్టుగా నిద్రపోతున్నాడు. ముందు వచ్చిన దుర్యోధనుడు గర్వం కొద్దీ తల వైపూ తరవాత వచ్చిన అర్జునుడు భక్తి కొద్దీ పాదాల దగ్గర కూర్చున్నారు. కృష్ణుడు లేవగానే ఎదురుగా కూర్చున్న అర్జునుణ్నే చూశాడు సహజంగానే. ‘కానీ బావా! నేనే ముందర వచ్చాను నీ సాయాన్ని అర్థించ డానికి’ అని దుర్యోధనుడు అన్నాడు. ‘నా సాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను: ఒక భాగం, ఏ శస్త్రమూ ఆయుధమూ పట్ట కుండా ఏదో మాట సహాయం మాత్రం చేసే నేను; రెండో భాగం కోట్లాది మంది ఉన్న నా నారాయణీసేన. మీ ఇద్దరిలో చిన్నవాడూ నేను ముందు చూసినవాడూ అర్జునుడు కనక, అతన్నే ముందర కోరుకో మంటాను’ అని కృష్ణుడన్నాడు. దీనికి దుర్యోధనుడు, అర్జునుడు ఆ పెద్దసేనను ఎగరేసుకొనిపోతాడేమోననే బెంగతో గతుక్కుమన్నాడు. అయితే, అర్జునుడు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని ఎరిగినవాడు కనక, శస్త్రం పట్టకపోయినా ఎలా నడచు కోవాలో ఉపాయాలు చెప్పే అతన్నే ఎన్ను కున్నాడు. నారాయణీసేనను సంతోషంగా గ్రహించి దుర్యోధనుడు ఆ మీద తనకు గదాయుద్ధం నేర్పిన బలరాముడి దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు. ‘నేను కృష్ణుడితో మనకు ఇరుపక్షాలవాళ్లూ సమానమని చాలాసార్లే చెప్పాను కానీ అతనికి నా మాట నచ్చలేదు. నేనేమో కృష్ణుణ్ని విడిచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండలేను. అంచేత ఇటు నీకు గానీ అటు అర్జునుడికి గానీ సాయం చేయ కూడదని మనసులో నిశ్చయించుకొన్నాను. సర్వరాజులూ పూజించే భరతవంశంలో పుట్టావు. వెళ్లు, క్షత్రియ ధర్మానుసారమూ యుద్ధం చెయ్యి’ అని బలదేవుడనగానే అతన్ని కౌగిలించుకొని, కృష్ణుణ్ని మోసం చేయ గలిగానని మురిసిపోతూ దుర్యోధనుడు హస్తినా పురానికి చక్కాపోయాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు మామగారైన ద్రుపదుణ్నీ, విరటుణ్నీ, బలరాముణ్నీ, సాత్యకినీ, ధృష్టద్యుమ్నుణ్నీ, శిఖండినీ, సహదేవుణ్నీ ఏడుగురు సేనాపతులుగా అభిషేకం చేశాడు. తిరిగి ఈ ఏడుగురి లోనూ ధృష్టద్యుమ్నుణ్ని సర్వసైన్యాధి పతిగా ఘోషించాడు. వీరికి అధిపతిగా అర్జునుణ్ని నియమించాడు. అర్జునుడి క్కూడా నేతగానూ అతని రథాశ్వాల నియంతగానూ జనార్దనుణ్ని కోరు కున్నాడు యుధిష్ఠిరుడు. ఆ సమయంలోనే మహాయుద్ధానికి సన్నద్ధమయ్యారని తెలిసి బలరాముడు, అక్రూరుడూ గదుడూ సాంబుడూ మొదలైనవాళ్లతో సహా ధర్మ రాజును చూడ్డానికి వచ్చాడు. బల రాముడికి నాగలీ రోకలీ ఆయుధాలుగా వర్ణిం చడంలో కూడా అతను ప్రకృతికి ప్రతీక అని చెప్పడమే ఇమిడి ఉంది. నాగలితో నేలను దున్నగా పండిన ధాన్యాలతోనూ ఆ ధాన్యాలను రోకలితో దంచి ‘పొట్టు’ అనే అడ్డును తొలగించి ఆ అన్నాలతో సర్వభూతాలనూ ప్రకృతి సాకుతోంది. రోహిణి కొడుకు రాగానే ధర్మరాజూ కృష్ణుడూ భీముడూ అర్జునుడూ నకుల సహదేవులూ ఇతర రాజులూ అందరూ వినయంగా లేచి నిలబడి అతన్ని సత్కరించారు. కృష్ణుడి వైపు చూస్తూ బలరా ముడు ‘ఇక ఈ మహా భయంకరమైన యుద్ధం జరగవలసిందేనేమో! యుద్ధానికి ముందే, ఏ దెబ్బలూ సుస్తీలూ లేనప్పుడే చుట్టాల్నీ సుహృత్తుల్నీ చూసిపోదామని వచ్చాను. ఎవరెవరు ఈ కురుక్షేత్రానికి చేరుకున్నారో వాళ్లందరికీ కాలం పక్వ మైందన్న మాట నిస్సంశయం. నువ్వు ఒకవైపు ఉండొద్దని నేను కృష్ణుడికి చెప్పాను. పాండవులు మనకెలాగ బాంధవులో దుర్యోధన మహారాజు కూడా బంధువే. అతనిక్కూడా సాయం చెయ్యి. అతను చాలామార్లే ఇక్కడికి వస్తూ పోతున్నాడు. కానీ నీ కోసమనీ కృష్ణుడు నా మాట పట్టించుకోకుండా దుర్యోధనుణ్ని ఉపేక్షిం చాడు. కృష్ణుడువినా నేను ఈ జగత్తును కన్నెత్తై చూడలేను. అంచేత అతను ఏం చేయదలుచుకున్నాడో దాన్నే నేనూ అనుస రిస్తాను. గదాయుద్ధంలో విశారదులైన భీమదుర్యోధనులిద్దరూ నాకు శిష్యులే. అంచేత వాళ్ల పట్ల నాకు సమానమైన స్నేహముంది. కురువంశీయులు నాశనమవుతూంటే నేను చూస్తూ ఊరకనే ఉండలేను. అందుకే నేను సరస్వతీనది ఒడ్డున ఉన్న తీరాన్ని సేవించుకొందామని వెళ్తున్నాను’ అని సెలవు తీసుకొన్నాడు. ఈ మాటలతోనూ మనకు బలరాముడు తాను పురుషుడి (ఆత్మ) అధీనంలో ఉండే ప్రకృతినని చెప్పకనే చెప్పినట్టయింది. యుద్ధంలో పద్దెనిమిదో రోజుకు నలభై రెండు రోజులపాటు తీర్థయాత్రలు ముగించుకొని బలరాముడు వచ్చాడు. భీమ దుర్యోధనుల యుద్ధం జరుగు తూండగా అర్జునుడు కృష్ణుణ్ని ‘ఈ ఇద్దరిలో నీ ఉద్దేశంలో ఎవరు గొప్ప? ఎవరిలో ఏయే గుణాలున్నాయి? నువ్వు ఎలాగ బేరీజు వేస్తావు?’ అని అడిగాడు. దానికి జవాబుగా వాసుదేవుడు ఇలాగ చెప్పాడు: ‘ఇద్దరికీ సమానమైన శిక్షణే అందింది. భీమసేనుడు బలంలో మిన్న; దుర్యోధనుడేమో గదాయుద్ధంలో బాగా పరిశ్రమ చేశాడు. భీముడు ధర్మపూర్వ కంగా గదా యుద్ధం చేస్తే గెలవడు; అన్యా యంగా చేస్తేనే సుయోధనుణ్ని చంప గలుగుతాడు. దేవతలు అసురుల్ని మాయ తోనే, అంటే ఉపాయంతో కూడిన నేర్పు తోనే జయించారు. అంచేత భీముడు కూడా మాయమయమైన పరాక్రమాన్ని అవలంబించాలి. జూదమాడుతూన్న ప్పుడు సుయోధనుడి తొడలను గదతో విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు గదా! ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు పూర్తి చెయ్యాలి. మాయావి అయిన దుర్యోధనుణ్ని మాయ తోనే నాశనం చేయాలి. అలా కాకుండా బలాన్నే ఆశ్రయించుకొని న్యాయంగా నాభి కింద కొట్టకూడదనే నియమాన్ని పాటిస్తే యుధిష్ఠిరుడు గడ్డు పరిస్థితిలో పడిపోతాడు. ధర్మరాజు దుర్యో ధనుడితో ఈ ద్వంద్వ యుద్ధంలో నువ్వు గెలిస్తే నీదే రాజ్యమంతా అని బుద్ధి లేని మాటల న్నాడు. భీష్మ ద్రోణ కర్ణ శల్య జయద్రథ భగదత్తుల్లాంటి వీరుల్ని చంపిన మీదట ధర్మరాజు ఈ పిచ్చిమాట అని ఇంత కాలమూ కష్టపడి చేసినదాన్నంతనీ ఒక్క సారిగా సంశయంలో పడేశాడు. ఇది ధర్మ రాజు తాలూకు పెద్ద అబుద్ధే. ఈ ఒక్కటీ గెలిస్తే అంతనీ గెలుచుకొన్నట్టే అంటూ ఇంతదాకా గెలుచుకొన్నదాన్నంతనీ పణంగా పెట్టేశాడు. దుర్యో ధనుడు గదా యుద్ధంలో ఆరితేరినవాడు. అదీగాక మిమ్మల్ని గెలవాలన్న అతినిశ్చయంతో ఉన్నాడు. భీముడు గదాయుద్ధ నియమానికి విరుద్ధంగా తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి ప్రయత్నం చెయ్యకపోతే, దుర్యోధనుడు రాజై కూర్చుంటాడు’ అని సుదీర్ఘంగా ఉపన్య సించాడు. అప్పటికే వాళ్లిద్దరూ యుద్ధంలో పరస్పర గదాఘాతాలతో ఎర్రగా తయా రయ్యారు. భీముడి గదావేగం దుర్యో ధనుడి తొడలను విరగ్గొట్టింది. కింద కూలిపోయాడు. భీముడు మునపటి సన్నివేశాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కసి కొద్దీ దుర్యోధనుడి కిరీటాన్ని కాలితో తన్ని అతని తలను తొక్కాడు. ఇది చూసేసరికి బలరాముడి కోపం మిన్నంటింది. ‘ఛీ ఛీ భీమసేనుడా! గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టగూడదనే శాస్త్రీయ నియమాన్ని ఉల్లంఘించావు’ అని అతన్ని నిందించి, కృష్ణుడితో ‘ఈ రోజున నాతో సమానుడైన దుర్యోధనుణ్నే గాదు నన్ను కూడా అవ మానించాడు భీమసేనుడు’ అంటూ అతి కోపంతో భీముడి మీదకు ఉరికాడు. తక్షణమే శ్రీకృష్ణుడు అన్నను ఆపాడు. ‘మనకు శుద్ధపౌరుషులైన పాండవులు సహజ మిత్రులు. స్వయానా మన మేనత్త కొడుకులు. అదీగాక శత్రువుల చేత బాగా మోసానికి గురి అయ్యారు. క్షత్రియుడైన వాడికి ప్రతిజ్ఞా పరిపాలనం అతిధర్మం. సుయోధనుడి తొడల్ని గదతో భేదిస్తానని సభామధ్యంలో భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. తొడలు బొడ్డుకిందే ఉంటాయి. బొడ్డు కింద కొట్టకూడదంటే, ప్రతిజ్ఞను తీర్చుకోడానికి మరో మార్గమేది? అదీగాక మైత్రేయ మహర్షి, అడవిలో పాండవుల కష్టాల్ని కళ్లారా చూసి, దుర్యోధనుడికి పాండవులతో వైరం మానుకోమని చెప్పి నప్పుడు, ఈ దుర్యోధనుడు తొడమీద కొట్టుకొంటూ అతనికి కోపాన్ని తెప్పిం చాడు. ఆయన అప్పుడు భీముడి గద నీ యీ తొడను బద్దలుగొడుతుందని శపించాడు కూడాను. అదీగాకుండా ఇప్పుడు కలియుగం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. వీటన్నిటి దృష్ట్యా వైరాన్నీ ప్రతిజ్ఞనీ తీర్చుకోవడం క్షత్రియుడైన భీముడికి తగినదే. నువ్వు కోపాన్ని దిగమింగాలి’ అని కృష్ణుడు బలరాముణ్ని తగ్గేలాగ చేశాడు. బలరాముడు కృష్ణుడికి ఎదురాడలేక ద్వారకకు వెళ్లిపోయాడు. - డా॥ముంజులూరి నరసింహారావు