balasubramaniam
-
టీడీపీలో విభేదాలు.. దర్జాగా దోపిడీ
రాజంపేట: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు గుప్పుమన్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జినైన తనకు మంత్రి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బాలసుబ్రమణ్యం సోమవారం విరుచుకుపడ్డారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.ఇసుక, మట్టి దోపిడీలో.. ఎర్రచందనం అక్రమ రవాణాలో, బదిలీలకు సిఫారసు లేఖలను అమ్ముకుంటూ మంత్రి పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం గుండ్లపల్లెలో సోమవారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం ఏమన్నారంటే..ఇసుక అక్రమ రవాణాలో మంత్రికి వాటాలు..కేవీ పల్లెలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుంటే సుండుపల్లెలో పోలీసులకు అడ్డుకునే హక్కులేనప్పుడు, రాయచోటి మండలంలో అనుంపల్లె మట్టి ఎత్తితే, దానిని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా? రాజంపేట మండలంలోని ఆర్.బుడుగుంటపల్లె ఇసుక రీచ్ ప్రారంభోత్సవానికి రాజంపేట ఇన్చార్జిగా ఉన్న నన్ను పిలవలేదు. మంత్రికి ఇసుకలో వాటా ఉందని కలెక్టరేట్లో చర్చించుకుంటున్నారు. అలాగే, అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రి తన సిఫార్సు లేఖలను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. మంచి పోస్టుకు రూ.5 లక్షలు, గ్రామస్థాయి పోస్టుకైతే రూ.30వేలు వసూలుచేస్తున్నారు. మట్టి అక్రమ రవాణాపై కలెక్టర్ ప్రేక్షకపాత్ర..అలాగే, సుండుపల్లె మండలం తిమ్మసముద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తుంటే నేను, మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఆయన తెలియనట్లు వ్యవహరించారు. తహసీల్దారును కలెక్టరు మొక్కుబడిగా మందలించారుగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనుంపల్లె నుంచి మట్టి తోలుతుంటే తనకు సంబంధంలేదని తహసీల్దారు చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న వారిని అడ్డుకుంటాం.నా సభలకు అధికారులను అడ్డుకుంటున్నారు..మరోవైపు.. నేను పాల్గొంటున్న ‘ఇది మంచి ప్రభుత్వం’ సభలకు అధికారులను రానివ్వకుండా సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లె గ్రామ పెద్దలకు ఫోన్‌చేసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం జరగకూడదని చెప్పాడు. కానీ, గ్రామస్తులు జిల్లా అధ్యక్షుడి మాట లెక్కచేయకుండా ఈ సభ నిర్వహించారు. వాస్తవానికి.. రాంగోపాల్‌రెడ్డి సీఎం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నియమించిన వ్యక్తి కాదు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా.సభ్యత సంస్కారం లేనివారిని పదవుల్లో పెట్టుకోవడంవల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఇక మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వైఎస్సార్సీపీలోని తన బంధువులకు వత్తాసు పలుకుతూ వారికి పనులు చేసిపెడుతున్నాడు. రాయచోటిలో టీడీపీ సీనియర్లందరూ కలిసి పనిచేస్తేనే రాంప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఆశయాలకు మంత్రి తూట్లు పొడుస్తున్నారు. రవాణాశాఖలో ఆయన లీలలు, బాగోతాలు పత్రికల్లో వస్తున్నాయి. -
ఏపీలో అరుదైన క్షీరదం గుర్తింపు
అనంతపురం: కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి చెందిన టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ బాలసుబ్రమణ్యం గుర్తించారు. అరుదైన జాతికి చెందిన క్షీరదంగా నిర్ధారించారు. పొడుచుకు వచ్చినట్టు ఏనుగు తొండంలా, కదలికలు గల మూతి భాగం(రోష్ట్రం) నిర్మాణ శైలిని కలిగి వెడల్పాటి చెవులు, ఒంటె మూపురం వంటి దేహ నిర్మాణం కలిగి ఉంది.సొరిసిడే కుటుంబానికి చెందిన ఈ క్షీరదం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. దీని సహజ నివాసం ఉష్ణ లేదా ఉష్ణమండల పొడి అడవులు మాత్రమే. డీఎన్ఏ అనాలిసిస్ కోసం వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డెహ్రాడూన్)కు పంపించారు. ఇప్పటి దాకా పేరు లేని జీవి» ప్రస్తుతం గుర్తించిన ఈ అరుదైన జీవికి ఇప్పటి దాకా ఎలాంటి పేరు లేదు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ 465 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జీవ వైవిధ్యం పెంపొందించేలా మియావాకీ అడవులను పెంచుతున్నారు. ఇందులోనే దీనిని గుర్తించారు. » ఈ జాతి అటవీ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, మానవ కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలలో అరుదుగా కనిపిస్తుంది. రక్షిత ఆవాసాలలో గూడు కట్టుకుని నివసిస్తుంది. ఆకులు, అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర గూడు పదార్థాలను సేకరించి, ఆపై గూడును నిర్మించడానికి ఒక రహస్య ప్రాంతాన్ని కనుగొంటాయి. » చిట్టెలుకలు ప్రధానంగా కీటకాహారులు. ఇవి 82 శాతం కీటకాలను తింటాయి. కొన్ని సార్లు మొక్కలను, విత్తనాలను తింటాయి. అలాగే అనేక రకాల అకశేరుకాలు, మానవ ఆహార పదార్థాలను కూడా తింటాయి. » ఇవి రాత్రి పూట ఎక్కువగా అడవులు, సాగు చేసిన పొలాలు, మానవ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఆహారం తీసుకుంటాయి. కీటకాలు, తెగుళ్లు రాకుండా అరికడతాయి. రైతులకు కీటకాలను నియంత్రించడంలో దోహదం చేస్తాయి.పొడి అడవుల్లో మాత్రమేజీవించే అరుదైన జీవికొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని ఎస్కేయూలో గుర్తించాం. పొడి అడవుల్లో మాత్రమే జీవించే అరుదైన జీవి ఇది. డీఎన్ఏ అనాలిసిస్ కోసం వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డెహ్రాడూన్)కు పంపాము.– డాక్టర్ బాలసుబ్రమణ్యం, జువాలజీ విభాగం టీచింగ్ అసిస్టెంట్, ఎస్కేయూ -
లెజెండ్స్ లైవ్
-
గొడవ చేసిన వారు క్షమాపణలు చెప్పారు
-
మైసూర్ ప్యాలెస్ ప్రధాన అర్చకుడి ఆత్మహత్య
ఆదోని టౌన్: కర్ణాటక రాష్ట్రం మైసూర్ మహరాజ్ ప్యాలెస్‌లో ప్రధాన అర్చకుడు బాలసుబ్రమణ్యం (54) అనారోగ్యంతో బాధపడుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుని భార్య శ్రీలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. బాలసుబ్రమణ్యం కొంతకాలంగా బీపీ, షుగర్‌తో బాధపడేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బుధవారం.. మంత్రాలయం వెళ్లేందుకు బసవ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాడు. మార్గమధ్యలో కోసిగి మండలం ఐరన్గల్ వద్ద రైలు దిగి పొలాల్లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో బాధితున్ని ఆదోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కోసిగి ఎస్ఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. -
న్యాయం జరగకపోతే ఆత్మహత్యే
-
గాన గంధర్వుడికి సన్మానం
-
లెజెండ్స్ - బాలసుబ్రమణ్యం