Bamboo sticks
-
వెదురుతో ఆదరువు.. చేతిపనికి సాంకేతికత జోడింపు
రాజాం (విజయనగరం జిల్లా): వెదురుకర్రతో తయారు చేసిన బుట్టలు అందరికీ తెలిసినవే. వెదురు కర్ర తట్టల గురించి చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఇవన్నీ ఎప్పటినుంచే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్న వస్తుసామాగ్రే. అయితే వాటికి భిన్నంగా ఇదే ముడిసరుకుతో మరెన్నో వస్తువులు కూడా తయారుచేసి ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వొచ్చు. కాస్తా సాంకేతికత తోడైతే చాలు ఇదే వెదురుకర్ర ఎన్నో అధ్బుతాలు సృష్టిస్తుందని రాజాం పట్టణానికి చెందిన జీఎంఆర్‌ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిరూపిస్తోంది. గత ఏడాది కాలంగా రాజాం చుట్టపక్కల గ్రామాలకు చెందిన వెదురుపనివారికి వెదురుతో తయారు చేసే అందమైన వస్తుసామగ్రిపై శిక్షణ ఇస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధమే లక్ష్యంగా.. న్యూఢిల్లీకి చెందిన సైన్స్ ఫర్ ఈక్యూటీ ఎంపవర్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ (సీడ్) ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు ప్రారంభించింది. ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తుసామగ్రిలో కొన్నింటిని ప్లాస్టిక్ నుంచి దూరంచేసేందుకు చేతితో తయారీచేసే వస్తుసామగ్రిపై దృష్టిసారించింది. ఓ వైపు ప్లాస్టిక్‌ను నివారించేందుకు వెదురుపుల్లలతో తయారుచేసే వస్తుసామగ్రిని ప్రోత్సహించడం, మరో వైపు వాటిని తయారీచేసే కులవృత్తుల చేతిపనివారికి సాంకేతికత అందించి వారి జీవన నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేసుకుంది. దేశంలోని పలు ఐటీ కళాశాలల్లో చేతి వృత్తుల వారికి సాంకేతిక నైపుణ్యాలు అందించే కార్యక్రమాలు చేపట్టగా రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏడాది క్రితం ఒక ప్రాజెక్ట్ ప్రారంభించింది. వెదురుకర్రలు, పుల్లలతో తయారయ్యే వస్తుసామగ్రిని మరింత అందంగా తయారీచేసే విధానాన్ని చేతిపనివారికి నేర్పుతోంది. శిక్షణకు విశేష ఆదరణ జీఎంఆర్‌ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంకేతిక శిక్షణకు విశేష ఆదరణ కనిపిస్తోంది. ప్రస్తుతం రాజాం, సంతకవిటి, రేగిడి, జి.సిగడాం తదితర మండలాలకు చెందిన వెదురుపనివారు ఈ శిక్షణ వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ 150 మంది శిక్షణ పొందారు. ఒక వ్యక్తికి 25 రోజులు శిక్షణ ఇస్తుండగా, శిక్షణ సమయంలో రోజుకు రూ. 200లు స్టైపెండ్ ఇస్తున్నారు. శిక్షణ బాగా సద్వినియోగం చేసుకున్నవారు సొంతంగా మెషీన్లు కొనుగోలుచేసేవిధంగా బ్యాంకు రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శిక్షణను పూర్తిగా వెదురుపని తెలిసిన శిక్షకుల ద్వారా ఇప్పించడంతో పాటు శిక్షణలో మెలకువలు నేర్చుకుని, బాగా వస్తుసామగ్రి తయారు చేస్తున్నవారితో కూడా కొత్తవారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. సీడ్ ప్రాజెక్ట్‌లో బాగంగా తయారీచేస్తున్న వెదురు వస్తుసామగ్రి చాలా అందంగా, అపురూపంగా దర్శనమిస్తోంది. టీ, కాఫీ కప్పులు, ట్రేలు, సజ్జలు, ఫ్లవర్ బొకేలు, కూజాలు, దుస్తులు పెట్టే తొట్టెలు, చిన్నారుల ఊయల తొట్టెలు, పెన్నుల స్టాండ్లు, బట్టల స్టాండ్లు ఇలా వినూత్న వస్తుసామాగ్రి రూపొందుతోంది. ఇవన్నీ ప్లాస్టిక్ రహిత వస్తుసామగ్రి కావడంతో పాటు పర్యావరణ హితమైనవి. ఎటువంటి విద్యార్హత లేకున్నా వెదురుపనితెలిసి, 18 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్నవారు ఇక్కడికి శిక్షణకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. విడతల వారీగా.. జీఎంఆర్‌ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాల్లో భాగంగా చేతివృత్తుల వారికి సాంకేతికతను అందిస్తున్నాం. ఓ వైపు చేతివృత్తుల వారికి మెలకువలు నేర్పడంతో పాటు మరో వైపు ప్లాస్టిక్ వస్తుసామగ్రి వినియోగం తగ్గించడం లక్ష్యంగా ఈకార్యక్రమం జరుగుతోంది. ఒక బ్యాచ్‌కి 20 మంది వరకూ శిక్షణ ఇస్తున్నాం. విడతల వారీగా, వెదురుపనివారికి ఖాళీగా ఉన్న సమయంలో ఈ శిక్షణ ఇస్తున్నాం. – డాక్టర్ పీఎన్ఎల్ పావని, కో ప్రిన్సిపాల్ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్‌ఐటీ చాలా మంచి ప్రాజెక్ట్ చేతివృత్తి చేసుకునేవారిలో నైపుణ్యం మెరుగుపరిచేందుకు, వారికి సాంకేతికత అందించేందుకు సీడ్ సాయంతో వెదురుపనిచేసే చేతివృత్తుల వారికి శిక్షణ శిబిరం ఏర్పాటుచేశాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని వెదురుపనివారికి అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటివరకూ 150 మంది శిక్షణ పొందారు. – డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ప్రాజెక్ట్ ప్రిన్సిపాల్ ఇన్విస్టిగేటర్, జీఎంఆర్‌ఐటీ, రాజాం -
లోకల్ టేస్ట్.. చికెన్ చీకులు
నరసన్నపేట: ఎర్రగా మండే నిప్పులు.. పైన వెదురుపుల్లలకు గుచ్చిన చిన్నచిన్న మాంసపు ముక్కలు.. వాటిపై నిమ్మరసం చుక్కలు.. ఈ వంటకం సిక్కోలు ఈవినింగ్ స్నాక్. పేరు చీకులు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో లభిస్తున్నా ‘నరసన్నపేట చీకులది’ మాత్రం ప్రత్యేక రుచి అంటున్నారు మాంసాహార ప్రియులు. దీనిని ఆరగించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, బరంపురం, గుణపురం నుంచి వచ్చి లొట్టలేసుకుంటూ తింటున్నారు భోజనప్రియులు. పక్కా లోకల్.. స్థానికంగా లభించే కారం, మసాలా దినుసుల్నే చీకుల తయారీకి వినియోగిస్తామని చెబుతున్నారు వ్యాపారులు. మార్కెట్లో లభించే ఎలాంటి కృత్రిమ మసాలాలు గానీ, హానికరమైన రంగులు, ఇతర పదార్థాలను వాడమని అందుకే వీటి రుచి విభిన్నమైనదనేది వారి మాట. తయారీ ఇలా.. మాంసపు ముక్కల్ని చిన్నగా ఒకటే సైజ్‌లో కట్ చేస్తారు. వాటిని మసాలా, కారం ఇతర పదార్థాలతో చేసిన మిశ్రమంలో నాలుగు గంటల సేపు ఉంచుతారు. తరువాత వెదురుపుల్లలకు ఈ ముక్కల్ని గుచ్చి.. ఎర్రగా కాలుతున్న బొగ్గులపై పెడతారు. 10 నిమిషాలు సేపు బాగా ఉడికిన తరువాత వడ్డిస్తారు. ఏఏ రకాలు.. ►చికెన్, లివర్, రొయ్యలతో చీకులను తయారు చేస్తారు. ఒక్కో రకానిదీ ఒక్కో రేటు. ►నరసన్నపేట బజారు వీధిలో 20 ఏళ్ల నుంచి చీకుల్ని విక్రయిస్తున్నారు. -
కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు వద్దన్నా జరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనా నేపథ్యంలో కొత్త తరహాలో వివాహాలు జరుగుతున్నాయి. మొన్న ఒకచోట పీపీఈ కిట్లు ధరించి ఓ జంట వివాహం చేసుకోగా.. నిన్న మై విలేజ్‌షో నటుడు అనిల్ వినూత్నంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట మరీ కొత్తగా చేసుకున్నారు. బొంగుల పెళ్లి అని ఎవరైనా అంటారు. ఇక్కడ అదే నిజమైంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు బొంగుల సహాయంతో ఒకరినొకరు దండలు మార్చుకున్నారు. బొంగులు అంటే వెదురు కర్రలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెళ్లిని అత్యంత జాగ్రత్తల నడుమ చేసుకున్నారు. అందంగా ముస్తాబు చేసిన కల్యాణ మండపంపై అంతే అందంగా ముస్తాబైన వధూవరులు ముఖానికి మాస్క్‌లు ధరించారు. పెళ్లికి వచ్చినవారు కూడా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ హాజరయ్యారు. అయితే దండలు మార్చుకునే సమయంలో వెదురు కర్రలు ఉపయోగించారు. కర్రల సహాయంతో వరుడు వధువు మెడలో.. ఆమె అతడి మెడలో దండలు వేసుకున్నారు. కొత్తగా దండలు మార్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు దీన్ని చూసి నవ్వుతుండగా.. మరికొందరు ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇదేం పెళ్లి రా నాయన. కొన్నాళ్లు ఆగలేకపోయావా?’ ఒకరు, ‘మరి పిచ్చి ముదిరింది’ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే చదవండి: 10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు #कोरोना में शादियां सफलतापूर्वक संपन्न कराने के लिए इवेंट मैनेजर्स को क्या क्या जुगाड़ू समाधान निकालना पड़ता है.... 😅😅 pic.twitter.com/2WOc9ld0rU — Dipanshu Kabra (@ipskabra) May 2, 2021 -
అడవిలోకి రానివ్వడం లేదు
వెదురు కోసం తమను అటవీ అధికారులు అడవిలోకి అనుమతించడం లేదని మేదరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మేదరులు ర్యాలీలు తీశారు. వెదురు పెంపకానికి గ్రామాల్లో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరుతూ కలెక్టర్ శరత్‌కు వినతిపత్రం ఇచ్చారు. సాక్షి, సారంగాపూర్: ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తేనే మేదరులు బతికి బట్టకడతారని మండల మేదరులు పేర్కొన్నారు. ఈమేరకు తహసీల్దార్ నవీన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా సారంగాపూర్‌లో మేదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం స్పందించి ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకంతో తాము ఉపాధి కోల్పోతున్నానమని, తమ వెదురు వస్తువులను కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు తమను అడవిలోకి అనుమతించడం లేదన్నారు. వెదరు పెంపకాన్ని ప్రొత్సహించేందుకు ప్రతీ మండలంలో ఐదెకరాలు వెదురు పెంపకానికి అటవీశాఖకు సంబంధం లేకుండా భూమిని కేటాయించాలని కోరారు. మేదరులా ర్యాలీలో వారు ధరించిన వెదురు టోపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వెదరుతో చేసిన టోపీలు నీడతోపాటు చల్లని గాలిని ఇస్తుండడంతో పలువురు కొనేందుకు ఆసక్తి చూపారు. ర్యాలీలో మేదరుల సంఘం మండలాధ్యక్షుడు చంద శ్రీహరి, ఉపాధ్యక్షులు బొమ్మిడి లచ్చన్న, ప్రధాన కార్యదర్శి మామిడిపెల్లి శ్రీనివాస్, కోశాధికారి బొమ్మిడి వెంకటేశ్, గౌరవ అధ్యక్షుడు లస్మయ్య, సలహాదారు చింతల చిన్నగంగరాజం, ప్రచార కార్యదర్శి వేముల లక్ష్మీరాజం, కార్యవర్గ సభ్యులు చంద మల్లేశం, పోతు నర్సయ్య, తుమ్మల రాజేశం, మామిడిపెల్లి రాజేందర్, చింతల దుబ్బరాజం పాల్గొన్నారు. జగిత్యాలటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేదరులు బుధవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ శరత్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వెదురుబొం గులు దొరకడం లేదని, వెదురు పెంపకానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరారు. మే దరులకు డబుల్బెడ్రూం ఇళ్లు, ప్రభుత్వ రుణా లు ఇప్పించాలని కోరారు. అటవీశాఖ సిబ్బంది వేధింపుల నుంచి రక్షించాలని కోరారు. -
నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా
శృంగవరపుకోట రూరల్ : మండలంలోని బొడ్డవర పంచాయతీ శివారు గాదెల్లోవ గిరిజన ప్రాంతం నుంచి నిబంధనలకు విరుద్ధంగా వెదురు రవాణా జరుగుతోంది. గాదెల్లోవ ప్రాంతం నుంచి వెదురు మోపులు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన విషయమై బుధవారం ఉదయం విలేకరులకు సమాచారం అందింది. దీంతో విలేకరులు ఆ ప్రాంతానికి వెళ్లే సరికి భారీ సంఖ్యలో వెదురు మోపులు రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వెదురు మోపులు ఉంచిన స్థలంలోను, చుట్టు పక్కల మనుషుల జాడ మాత్రం లేదు. వెదురు మోపుల రవాణా విషయమై బొడ్డవర వద్ద పలువురిని ప్రశ్నించగా ఎప్పటికప్పుడు గాదెల్లోవ, దబ్బగుంట, తదితర ప్రాంతాల నుంచి వెదురుతో పాటు ఇతర కలప కూడా పెద్ద ఎత్తున రవాణా జరుగుతోందని స్పష్టం చేశారు. అలాగే కాశీపట్నం, తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి బొగ్గు మూటలు కూడా క్రమం తప్పకుండా సైకిళ్లపై అక్రమంగా తరలుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అటవీశాఖ సిబ్బంది, అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. వెదురు మోపుల అక్రమ రవాణా విషయమై విజయనగరం రేంజ్ అటవీశాఖ గార్డు బ్రహ్మాజీ వద్ద ప్రస్తావించగా, గాదెల్లోవ ప్రాంతం విశాఖ జిల్లా అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గిరిజన ప్రాంతాల నుంచి జరుగుతున్న వెదురు, కలప, బొగ్గుల రవాణాపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
కాయల్ని కోసే పట్టకర్ర
చెట్టుకున్న కాయల్ని కోయడంతో పాటు కొమ్మలను కత్తిరించేందుకు అనువైన పట్టకర్ర (కట్టింగ్ ప్లయిర్) పరికరం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది పూణేసమీపంలోని పబల్‌కు చెందిన విజ్ఞానాశ్రమం. కాయల్ని కోసేందుకు రైతులు పొడవైన చేతికర్ర లేదా వెదురు కర్రలను ఉపయోగిస్తారు. కాయల్ని కొట్టే సమయంలో దెబ్బల తాకిడికి పక్వానికి రాని కాయలు కూడా రాలిపోతుంటాయి. చిటారు కొమ్మల్లో కాయలను కోసేందుకు వీలుకాక వదిలేస్తుంటారు. చెట్లపైకి ఎక్కి దిగడంతో కొమ్మలు విరిగి దెబ్బలు తగిలే ప్రమాదంతో పాటు పంటనష్టపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పద్ధతుల వల్ల రైతు కూడా ఆర్థికంగా నష్టపోతుంటాడు. ఇటువంటి సమస్యల్ని అధిగమించేలా ఓ పట్టకర్రను తయారు చేసింది విజ్ఞాన్ ఆశ్రమం. ఈ పట్టకర్రతో కాయల్ని కోయటం వల్ల పంట నష్టాన్ని నివారించటంతో పాటు సమయమూ కలిసివస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ సేపు కాయలు కోయగలుగుతారు. తుఫాన్లు, ఈదురుగాలులు వచ్చే సందర్భాల్లో త క్కువ మంది కూలీలతోనే త్వరగా కోతను పూర్తి చే యవచ్చు. నారింజ, మామిడి వంటి ఉద్యాన పంటల్లో అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను, తెగుళ్లు సోకి ఎండిపోయిన కొమ్మలను కత్తిరించేందుకు ఈ పట్టకర్ర ఉపయోగపడుతుంది. అల్యూమినియం పైపుకు పై భాగంలో కాయల్ని కత్తిరించేందుకు వీలుగా పట్టకర్రను పైప్ కింది భాగంలో పట్టుకునే పిడికిలి వద్ద మోటార్ సైకిల్ లివర్లను వెల్డింగ్ చేశారు. ఈ రెంటినీ క్లచ్ వైరుతో అనుసంధానించారు. పిడికిలి వద్ద క్లచ్‌ను నొక్కగానే పట్టకర్ర చీలికలు కాయ తొడిమలను క త్తిరిస్తాయి. కత్తిరింపు పూర్తవగానే ఈ చీలికలు రెండూ వాటంతటవే యథాస్థానానికి వచ్చేలా అధిక ఒత్తిడితో పనిచేసే స్ప్రింగ్‌ను పట్టకర్రకు అమర్చారు. దీని తయారీకి 10-12 అడుగుల పొడవైన అల్యూమినియం పైపు, పట్టకర్ర, స్ప్రింగ్, క్లచ్ వైర్, మెటార్ సైకిల్ లివర్, మూడు బోల్ట్‌లు అవసరమవుతాయి. స్థానికంగా ఉండే మోకానిక్ షెడ్లలో రైతులే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్