Bansal
-
ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఎడెల్వీస్ ఏఆర్సీ చీఫ్‌గా 'ఆర్కే బన్సాల్' రిజెక్ట్
ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా 'రాజ్‌కుమార్ బన్సాల్'ను మళ్ళీ నియమించాలనే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరస్కరించింది.రాజ్‌కుమార్ బన్సాల్ ఏప్రిల్ 2018లో ఎడెల్వీస్ ఏఆర్‌సీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. సుమారు మూడు దశాబ్దాలపాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న ఈయన.. ఐడీబీఐ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల.. ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఇప్పటి వరకు 8.2 శాతం క్షీణించాయి. -
ఈడీని కట్టడి చేయాల్సిందే
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుల్లో విచారణ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అపరిమితాధికారాలు కట్టబెట్టారని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. లేదంటే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందన్నారు. దేశంలో ఎవరికీ భద్రత కూడా ఉండబోదన్నారు. ఎం3ఎం రియల్టీ గ్రూప్ డైరెక్టర్లు బన్సల్ బ్రదర్స్ అరెస్టు కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఏఎస్ బొపన్న, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ముందు ఆయన వాదనలు విని్పంచారు. విచారణకు డైరెక్టర్లు అన్నివిధాలా సహకరిస్తున్నా ఈడీ నిరంకుశ పద్ధతిలో అరెస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ముందస్తు బెయిల్ నిబంధనల్లో ఒక్కదానికి కూడా విరుద్ధంగా నడుచుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు జస్టిస్ సుందరేశ్ సరదాగా స్పందించారు. ‘‘మీరన్నది నిజమే. ఇది పిల్లీ ఎలుకా చెలగాటం. వాళ్లు చట్టాలను ఉపయోగిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. బన్సల్ సోదరులను ఈడీ జూన్ 14న అరెస్టు చేసింది. హరియాణాలోని పంచకుల కోర్టు విధించిన ఐదు రోజుల కస్టడీని వాళ్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు విజ్ఞప్తి మేరకు విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. -
బన్సల్‌కే బాధ్యతలన్నీ..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీని చక్కదిద్దేపనిలో భాగంగా అటు రాజకీయ వ్యవహారాలు, ఇటు సంస్థాగత అంశాలకు సంబంధించిన బాధ్యతలను ఒక్కరికే అప్పగించే దిశలో బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. నలుగురైదుగురు ఇన్చార్జీలు కాకుండా ఒక్కరికే పూర్తిస్థాయి ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. గత లోక్‌సభ ఎన్నికలతో పాటు, యూపీలో పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకుని రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సునీల్ బన్సల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అసంతృప్తిని చల్లార్చే చర్యలేవీ..? తెలంగాణకు ఏకంగా నలుగురైదురు ఇన్చార్జీలను నియమించి వారి ద్వారానే జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి ఎన్నికల దిశానిర్దేశం చేస్తున్న సంగతి విదితమే. జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జిగా, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జిగా కొనసాగుతుండగా మరో ఇద్దరు జాతీయ నేతలు శివప్రకాష్, అర్వింద్ మీనన్‌లు కూడా ఇన్చార్జిలుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు దాదాపు ఆరేడు నెలలుగా వివిధ కార్యక్రమాలు, పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గత 20, 30 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేసిన సీనియర్లకు సరైన ప్రాధాన్యత, గౌరవం లేదని, వారికి తగిన బాధ్యతలు కూ డా ఇవ్వడం లేదన్నది ప్రధాన విమర్శ. కాగా సొంత ప్రచారానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ నాయకుల్లో అసంతృప్తి వివిధ సందర్భాల్లో బయటపడుతున్నా ఈ సమస్యను అధిగమించే దిశగా ఇన్చార్జిలు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటున్న జాతీయ నాయకత్వం ఒక్కరికే పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కేడర్‌లో స్తబ్ధత తొలిగేలా చర్యలు.. ప్రస్తుతం పార్టీలో పాత, కొత్తనేతల మధ్య సమన్వయలేమి, క్షేత్రస్థాయిలో ఎదురౌతున్న సమస్యలతో కేడర్‌లోనూ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత స్తబ్ధత కూడా నెలకొంది. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, ముఖ్య నేతల వ్యవహారశైలి, అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం కావడం, అసమ్మతి కార్యక్రమాలకు తావిచ్చేలా కొందరు వ్యవహరించడం వంటివి క్రమశిక్షణా రాహిత్యంగా జాతీయ నాయకత్వం పరిగణిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థాయి నాయకుల్లో అసంతృప్తిని, ముఖ్యంగా కిందిస్థాయి కేడర్‌లో ఏర్పడిన స్తబ్ధతను తొలగించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. పార్టీ క్రమశిక్షణ గీతను దాటుతున్న వారికి, పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని హెచ్చరించడంతో పాటు ఒకరిద్దరిపై క్రమశిక్షణ చర్యలకు కూడా దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఈ మేరకు త్వరలో చేపట్టబోయే చర్యలపై రాష్ట్ర ముఖ్య నేతలకు సంకేతాలు కూడా అందినట్టు తెలుస్తోంది. -
‘కమలం’ కార్యాచరణ మారాలి సారూ!
సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పార్టీకి కీలకంగా మారిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై అంతర్గత చర్చ సాగుతోంది. ప్రాంతీయ పార్టీగా ఆర్థికంగా, ఇతరత్రా రూపాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ను, రాజకీయ చతురుడు సీఎం కేసీఆర్ వ్యూహాలను ఢీకొనేందుకు ప్రస్తుతం ఇక్కడ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పని పద్ధతులు సరిపోవనే అభిప్రాయంతో కొందరు ముఖ్య నేతలున్నట్టు సమాచారం. ఇటీవల పలువురు నేతలను ఢిల్లీకి పిలిపించి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ వివిధ అంశాలపై సమాలోచనలతో పాటు, ముఖ్యమైన విషయాలపై అభిప్రాయసేకరణ జరిపారు. ముఖ్య నేతల ఒంటెద్దు పోకడలు.. రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న ముఖ్య నేతలు కొందరు ఒంటెద్దుపోకడలతో అన్ని కార్యక్రమాల్లో తామే ఫోకస్ అయ్యేలా, మిగతా వారెవరికీ ప్రాధాన్యత రాకుండా అనుసరిస్తున్న పద్ధతులను ముఖ్యనేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీనితో పాటు రాష్ట్ర నాయకుల మధ్య సరైన పని విభజన లేకపోవడం, ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి, తెలంగాణలో అతిగా హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం వల్ల ఇబ్బందులు తదితర అంశాలను గురించి నాయకత్వానికి వివరించినట్టు తెలిసింది. పీడన, అణచివేతకు వ్యతిరేకంగా దశాబ్దాల పోరాట చరిత్ర, చైతన్య, ప్రగతిశీలమైన తెలంగాణ సమాజం కరడుగట్టిన మతవాదాన్ని, అతి హిందుత్వ భావజాలాన్ని అంగీకరించదని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా లౌకికవాద ముద్రతో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ, వర్గాలను ఆకట్టుకునేలా ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకుంటేనే ఫలితం ఉంటుందనే వాదనను కూడా కొందరు నేతలు బలంగా వినిపించినట్టు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ రాజకీయాల నేపథ్యంలో బయటి రాష్ట్రాలు, జాతీయపార్టీ నేతల ప్రమేయం తగ్గించి స్థానిక నేతలకు ప్రాధాన్యత పెంచి, స్థానిక అంశాలపైనే అధిక దృష్టి కేంద్రీకరించాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ముఖ్యనేతల్లో ఏర్పడిన అసంతృప్తిని దూరం చేసేందుకు ఎలాంటి ఫార్మూలాను ముందుకు తేనుంది అనే అంశాలు ఇప్పుడు చర్చకు తెరలేపాయి. అదేవిధంగా ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబో తోంది... అధికార బీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికను అమలుచేయబోతున్నదనేది ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశమైంది. ఈటలకు కీలక బాధ్యతలు ? ఎన్నికలకు సన్నద్ధమౌతున్న సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి వాటితో పార్టీలో, కేడర్‌లో అయోమయం, అసందిగ్ధత ఏర్పడే అవకాశాలున్నందున మరో ప్రత్నామాయ మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని జాతీయపార్టీ నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఉద్యమ కాలంతో సహా రెండుదశాబ్దాల పాటు టీఆర్ఎస్లో వివిధ దశల్లో ప్రయాణం సాధించి అగ్రనేతగా ఎదిగిన ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ లేదా ప్రచార సారథ్య బాధ్యతలు వంటి కీలకబాధ్యతలు అప్పగించవచ్చునని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక... అంటే వారం, పదిరోజుల వ్యవ ధిలోనే దీనికి సంబంధించిన నిర్ణయాన్ని నాయకత్వం వెల్లడిస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈటలతో పాటు... మరికొన్ని బాధ్యతల్లో పనిచేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న ఇతర¯ó తలకు కూడా సమన్వయం, పర్యవేక్షణ, ఇతర ముఖ్యమైన విధులు అప్పగించే ఆలోచనతో నాయకత్వం ఉన్నట్టు తెలిసింది. ‘ఇంటి’ సమావేశాలు ఎక్కడ? గతంలో ఢిల్లీలో జరిగిన ప్రత్యేకభేటీలో ముఖ్యనేతలంతా తరచుగా ఒక్కోసారి ఒక్కొక్కరి నేత ఇంట్లో సమావేశం కావాలని అమిత్‌షా చేసిన సూచన కూడా నేతలంతా పెడచెవినపెట్టారు. అలా ఒక్క సమా వేశం కూడా జరిగిన దాఖలాల్లేవు దీంతో నేతల మధ్య సమన్వయం సాధించి, ఐకమత్యంతో వారు ఉమ్మడిగా ముందుకు సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. -
ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్‌షా, సునీల్ బన్సల్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కర్ణాటకలో ఓటమితో అప్రమత్తమైన బీజేపీ అధినాయకత్వం అది పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది. నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున పార్టీ నాయకులు, యంత్రాంగం ఐకమత్యంతో ముందుకు సాగే విషయంపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా సీనియర్–జూనియర్లు, కొత్తగా పార్టీలో చేరినవారు– గతం నుంచి పార్టీలో ఉన్న వారు, ముఖ్యనేతల మధ్య అంతరం లేకుండా ఉండేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో బీజేపీ గెలుపుపై విశ్వాసం కలిగించేందుకు సీనియర్లతో వేర్వేరుగా సమాలోచనలు సాగిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌తో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఢిల్లీలోనే ఉన్న జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్రెడ్డితోనూ ఆయా విషయాలపై మాట్లాడారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తమే వచ్చారని పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ... కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యనేతల నుంచి జరుపుతున్న అభిప్రాయసేకరణలో భాగంగానే బండికి పిలుపు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త అధ్యక్షుడు.. కొత్త కేబినెట్ కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో తెలంగాణలో గెలుపునకు అవసరమయ్యే అన్ని వ్యూహాలను పార్టీ అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే పారీ్టకి కొత్త అధ్యక్షుడితోపాటు, కొత్త ఎన్నికల కమిటీ చైర్మన్, ప్రచార కమిటీ చైర్మన్లు రానున్నారని ఢిల్లీ పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ని మారిస్తే ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికలను సైతం దృష్టిలో పెట్టుకొని కేబినెట్ బెర్తుల భర్తీ ఉంటుందని, అందులోభాగంగానే తెలంగాణ నుంచి సంజయ్‌కు అవకాశం ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను శుక్రవారం ఢిల్లీ పిలిపించారని, ఆయన ఢిల్లీలోని కొందరు పెద్దలను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. కీలక బాధ్యతల అప్పగింతపై దృష్టి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ పట్టిష్టత, నేతలకు కీలక బాధ్యతల అప్పగింతపై దృష్టి పెట్టిన బీజేపీ అధినాయకత్వం కార్యాచరణలో వేగం పెంచింది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు సహా ఇతర కీలక పోస్టుల్లో నియామకాలకు సంబంధించి రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది. కులాలు, ప్రాంతాలు, వర్గాలు, సీనియార్టీ, అనుభవం ఆధారంగా లెక్కలు వేసుకుంటున్న పార్టీ ఎవరికి ఏ పదవి కట్టబెట్టాలన్న దానిపై వివరాలు తీసుకుంటోంది. మరో రెండ్రోజులపాటు అందరి అభిప్రాయాలను తెలుసుకున్నాక జూన్ 2కి ముందే నియామకాలపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అలాగే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఇతర నేతల చేరికల విషయంలో హైకమాండ్ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. -
‘కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం’
రసూల్‌పుర(హైదరాబాద్): సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న జరగనున్న హైదరాబాద్ విమోచన అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నుంచి 1948లో విముక్తి కలిగిందని కానీ కొత్త నిజాం కేసీఆర్ నుంచి విముక్తి కలి్పంచేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ విముక్తి దినోత్సవం గురించి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని, అక్టోబర్ 2వరకు ఇవి కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాల్లోని గడీలపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రజాకార్ల అకృత్యాలను తెలిపేలా పరేడ్ మైదానంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 12న రంగోలి, 13న హైదరాబాద్ విమోచన చేయాలని పోరాడిన వారి విగ్రహాలకు అభిషేకం, 14న యువమోర్చా ఆ«ధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ, 15న చార్మినార్ నుంచి మహిళా మోర్చా ర్యాలీ, 16న షోయాబుల్లా ఖాన్ విగ్రహానికి నివాళులు లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 17న ప్రతి డివిజన్ నుంచి వంద మోటర్ సైకిళ్లతో పరేడ్ మైదానానికి రావాల్సిందిగా కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తగ్గేదే లేదని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం.. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డాలు తగ్గేదెలే అని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. సెపె్టంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేసీఆర్.. ఎంఐఎం నేత అసదుద్దీన్ అనుమతి అడిగారన్నారు. అత్యంత క్రూరుడైన ఖాసీం రిజ్వీ వారసుల అనుమతి అడగడం హేయమైన చర్య అని ఆరోపించారు. గతంలో అసదుద్దీన్ జాతీయ జెండా పట్టుకునే వారు కాదని.. కానీ, ఇప్పుడు నమాజ్ చేస్తున్నప్పుడు కూడా జెండా పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డా.లక్ష్మణ్, రాంచందర్ రావు, వివేక్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం -
గాడ్సే చెప్పిందేంటి?
గాంధీ హత్య కేసు వివరాలు చెప్పాలంటూ ఎన్ఏఐని ఆదేశించిన సీఐసీ న్యూఢిల్లీ: గాంధీజీ హత్య కేసు వివరాలను, హంతకుడు నాథురామ్ గాడ్సే విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెల్లడించాలని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాను (ఎన్ఏఐ) కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ఆ వివరాలన్నింటిని ఎన్ఏఐ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించింది. చార్జ్‌షీట్, వాంగ్మూలాన్ని వెల్లడించాలని అశుతోష్ బన్సాల్ అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును ఢిల్లీ పోలీసులు ఎన్ ఏఐకి బదిలీ చేశారు. కాగా, ఆ వివరాలను తమ వెబ్సైట్లో శోధించి కావాల్సిన సమాచారాన్ని పొందాలని దరఖాస్తుదారుడికి ఎన్ ఏఐ సూచించింది. దీంతో సమాచారాన్ని పొందడంలో విఫలమైన బన్సాల్.. సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులును ఆశ్రయించాడు. ఆయన స్పందించి దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని రికార్డ్స్‌లో ఇండెక్స్‌తో సహా అందించాలన్నారు. దరఖాస్తుదారుడి నుంచి పేజీకి రూ. 2 చొప్పున వసూలు చేస్తూ 20 రోజుల్లోగా గాంధీ హత్య కేసు చార్జ్‌షీట్ పత్రాలను, గాడ్సే వాంగ్మూలాన్ని సీడీ రూపంలో అందించాలని ఆదేశించారు. -
ఫ్లిప్ కార్ట్ సీఈవో ఇంటి ఖరీదు 32 కోట్లు!
బెంగళూరు నగరంలో ఇటీవల అతిపెద్ద నివాస ఒప్పందం జరిగింది. పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ గృహాన్ని 32 కోట్ల రూపాయలతో కొనేందుకు ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ముందుకొచ్చారు. నగరంలోని ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి దగ్గరలో ఉన్న ఆ ఇంటిని కొనేందుకు ఆయన భారీగా రుణం తీసుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఐటీ కంపెనీలకు నెలవు, ఇండియాలోనే సుందర నగరంగా పేరొందిన బెంగళూరులో నివాస గృహాలకూ భారీ డిమాండ్ పెరిగిపోయినట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. నగరంలో ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ ఇటీవల అతిపెద్ద నివాస గృహాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 10,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న నివాస గృహాన్ని బిన్నీ బన్సాల్ సుమారు 32 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆ నివాసం స్థానిక ఫ్లిప్ కార్ట్ కార్యాలయానికి అతి సమీపంలోనే ఉన్నట్లు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. నందన్ నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్, రాజీవ్ చంద్రశేఖర్ నివాసాలు బిన్నీ ఇంటికి పొరుగున ఉన్నాయని, బిన్నీ ఆ ఇంటిని కొనేందుకు భారీగానే రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మాజీమంత్రి పవన్‌కుమార్ బన్సల్‌కు ఊరట