బెరైటీస్ జీవో రద్దు ..స్థానిక మిల్లులకు శాపం
80 వేల మంది ఉపాధికి ముప్పు: జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కడప జిల్లా కోడూ రు నియోజకవర్గంలోని మంగంపేట బెరైటీస్ గనుల్లో తవ్వకాలకు సంబంధించిన నిబంధనలు మార్చడం వల్ల స్థానికంగా వేలాది మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని అసెంబ్లీలో ప్రతి పక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోడూరు ప్రాంతంలో 200లకు పైగా బెరైటీస్ మిల్లులున్నాయని, 80 వేల మంది కార్మికులు వాటిలో పని చేస్తున్నార ని తెలిపారు.
గతంలోలానే 40 శాతం ఉత్పత్తిని స్థానికులకు ఇవ్వాలని, కార్మికులు అవస్థలు పడకుండా ఉం డాలంటే ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. శనివారం అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని కోడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు ప్రస్తావించారు. గత 296 జీవోను రద్దు చేసి 206 జీవోను తీసుకువచ్చారని, దీంతో మంగంపేట ప్రాంతంలోని సున్నపురాయి గనులు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు.