Basant Kumar
-
వ్యవసాయం గురించి కలెక్టర్ అద్భుతమైన స్పీచ్
-
కలెక్టర్ బసంత్ కుమార్‌ను కలిసిన సినీ నటుడు నరేష్
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ బసంత్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కళాకారుల సంక్షేమం గురించి చర్చించారు. -
చివరి చూపు చూడలేదు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి (95) ఇటీవలే మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన మనవడు, మిథున్ చక్రవర్తి కుమారుడు నిమిష్ చక్రవర్తి తెలిపారు. లాక్డౌన్ ముందు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూర్ వెళ్లిన మిథున్ చక్రవర్తి లాక్డౌన్ కావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తండ్రిని చివరిసారిగా చూసే అవకాశం దక్కలేదట. -
ప్రముఖ నటుడి తండ్రి మృతి
ముంబై: ప్రముఖ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్‌కుమార్ చక్రవర్తి (95) మంగళవారం సాయంత్రం ముంబైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో బెంగుళూరులో చిక్కుకున్న మిథున్ చక్రవర్తి ముంబై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ తమ తండ్రి మరణించారని బసంత్‌కుమార్ రెండో కుమారుడు నామాషి చక్రవర్తి తెలిపారు. బెంగాళీ నటి రీతూపర్ణ సేన్‌గుప్తా ట్విటర్ వేదికగా.. మిథున్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. (చదవండి: మహమ్మారి కేంద్రంగా మహారాష్ట్ర..) -
తిరుమల జేఈఓగా బసంత్ కుమార్‌కు భాద్యతలు
-
వైవిధ్యానికి మారుపేరు
‘డిసెంబర్ 23, 1912... ఈ తేదీ జాతీయవాది అయిన ప్రతి భారతీయుడి గుండెలలోను పదిలంగా ఉండిపోవాలి. బ్రిటిష్ సామ్రాజ్యం మీద బసంత్ కుమార్ బిశ్వాస్ చావు దెబ్బ కొట్టిన తేదీ ఇదే!’ మహదానందంతో అన్నాడాయన. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి అక్కడే భారతీయ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నలందా క్లబ్‌లోకి ప్రవేశిస్తూనే ఈ మాట అన్నారు. పేరు లాలా హరదయాళ్. ఆయన క్లబ్‌లోకి ప్రవేశించడంతోనే ఒక రాక్‌స్టార్‌ను చూసినంత సంబరంగా చూశారు విద్యార్థులు. అంత ఆరాధన ఆయనంటే. లాలా హరదయాళ్ పేరు భారతదేశ చరిత్రలో రెండు వాక్యాలకు కూడా నోచుకోలేదు. కానీ ఆయన జీవితం, ఉద్యమం, ఆలోచన అద్భుతమనిపిస్తాయి. చదివింది సంస్కృతం. ఆపై ఇంగ్లిష్తో పాటు కొన్ని ప్రపంచ భాషలు కూడా నేర్చారు. అమెరికా, బ్రిటన్, అల్జీరియా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాల వెంట తీవ్ర జాతీయవాద ఉద్యమంలో భాగంగా కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. అసాధారణమైన అధ్యయనం. మాతృభూమి మీద అపారమైన భక్తి. మరో పక్క రష్యన్ అనార్కిజం మీద మమకారం. ఒక పక్క బౌద్ధం మీద ఆసక్తి. ఇంకో పక్క బొల్షివిజం విజయాల మీద అనురక్తి. ఇంత వైవిధ్యమైన ఈ జీవితం లాలా హరదయాళ్కే సొంతం. బ్రిటిష్ జాతి నుంచి భారతదేశాన్ని విముక్తం చేయాలన్న ఆకాంక్ష భారత జాతీయ కాంగ్రెస్ సొంతం కాదు. నిజానికి జాతీయ కాంగ్రెస్ తొలినాటి ఆశయం ఈ దేశం నుంచి బ్రిటిష్ జాతి నిష్క్రమించడం కాదు కూడా. జాతీయ కాంగ్రెస్ ఉద్యమం తొలిదశ (1885–1905)లో ఈ వైఖరి సుస్పష్టం. విన్నపాలతో, వినతిపత్రాలతో వేడుకోవడం వినా మరో మార్గం లేదని ఆనాటి నాయకత్వం భావించింది. ఈ ధోరణిని తీవ్రంగా ద్వేషించిన భారతీయులు కోకొల్లలు. గదర్ పార్టీ నేపథ్యాన్ని చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. తరువాత కాలాలలో ఆవిర్భవించిన హిందుస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ల ఆశయం కూడా ఇదే బాటలో సాగింది. తుపాకీని తుపాకీతోనే ఎదిరించాలన్నది వారి సిద్ధాంతం. బ్రిటిష్ పాలకుల అకృత్యాలు అలాంటి యువకులను సాయుధ పోరుబాట పట్టేలా చేశాయి. సోహన్‌సింగ్ భాక్నా, కర్తార్‌సింగ్ శరభ, రాస్బిహారీ బోస్, శ్యామ్‌జీ కృష్ణవర్మ, దర్శి చెంచయ్య, పృథ్వీసింగ్ ఆజాద్ వంటి జాతీయ వాదులు పనిచేసిన గదర్ పార్టీ 1913లో అమెరికాలో ఆవిర్భవించింది. జాతీయవాదాన్ని నమ్ముతూ, కన్నుకు కన్ను సిద్ధాంతంతో ఆవిర్భవించిన గదర్ పార్టీ ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించినవారే లాలా హరదయాళ్.‘నీవు విదేశాలలోనే ఉంటూ స్వాతంత్య్ర పోరాటానికి అండదండలను ఇవ్వు. ఈ పోరుకు విదేశాలలో ఉంటున్న భారతీయల సంఘీభావాన్ని కూడగట్టు’ అని లాలా లజపతిరాయ్ ఇచ్చిన సలహా మేరకే హరదయాళ్ విదేశాలలో ఉండి పనిచేశారు. మరి ఇంకెప్పుడూ ఆయన మాతృభూమికి తిరిగి రాలేదా? రాలేదు. లాలా హరదయాళ్ (అక్టోబర్ 14, 1884–మార్చి 4, 1939) ఢిల్లీలో పుట్టారు. తల్లి భోలీ రాణి, తండ్రి గౌరీ దయాళ్ మాథుర్. మొదటి నుంచి ఆయన మంచి విద్యార్థి. ఢిల్లీలోని కేంబ్రిడ్జ్ మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత సెయింట్ స్టీఫెన్ కళాశాలలో సంస్కృతం ప్రధానాంశంగా గ్రాడ్యుయేషన్ చేశారు. ఆపై పంజాబ్ శ్వవిద్యాలయంలో చేరి ఒక్క సంవత్సరంలోనే సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, తరువాత ఆంగ్ల సాహిత్య విద్యార్థిగా చేరారు. అన్ని స్థాయిలలోను అతడు చూపించిన ప్రతిభకు విస్తుపోయిన ప్రభుత్వం తనకు తానుగానే ఆయనకు విద్యార్థి వేతనం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ వేతనంతోనే ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ ఉండగానే ‘ది సోషియాలజిస్ట్’ పత్రికను నిర్వహిస్తున్న గై అల్డ్రెడ్తో పరిచయం కలిగింది. అల్డ్రెడ్ అనార్కిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మేవాడు. ఆ పత్రికలోనే హరదయాళ్ తొలి రచన అచ్చయింది. తన ఆశయం ప్రభుత్వాన్ని సంస్కరించడం కాదు, దానిని సమూలంగా నిర్మూలించడమని అందులో పేర్కొన్నారు. దీనితోనే ఇంగ్లండ్ గూఢచర్య విభాగం ఆయన మీద నిఘా పెట్టింది. అప్పటికే ఆయన ఐసీఎస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. 1907లో దానిని కూడా వదిలిపెట్టేశారు. 1908లో భారతదేశానికి వచ్చి కొంతకాలం ఉన్నారు. అప్పుడే లాలా లజపతిరాయ్ సలహా మేరకు పారిస్ వెళ్లిపోయారు. అక్కడే మేడం కామా నడుపుతున్న ‘వందేమాతరం’, ‘తల్వార్’ పత్రికలకు సంపాదకత్వం వహించారు (గదర్ పార్టీ ఆవిర్భావం తరువాత ఉర్దూ, గుర్ముఖి భాషలలో వెలువరించిన గదర్ పత్రికను స్థాపించినవారు కూడా ఆయనే). పారిస్ నుంచి మళ్లీ అల్జీరియా, అక్కడ నుంచి మార్టినిక్లకు ఆయన వెళ్లారు. చివరికి 1911లో అమెరికా చేరుకుని, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తత్త్వశాస్త్ర విభాగాలలో ఆచార్యునిగా చేరారు. ఆయన అక్కడ పాఠాలు చెప్పడానికే పరిమితం కాలేదు. కార్మికులను, భారత జాతీయులను ఐక్యం చేయడం కోసం ఎంతో పనిచేశారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ వరల్డ్ చాప్టర్‌కు కార్యదర్శిగా పనిచేశారు. రష్యా దేశపు అరాచకవాద సిద్ధాంతకర్త మైఖేల్ బకూనిన్ అన్నా హరదయాళ్‌కు ఆరాధన. అనార్కిస్ట్ సిద్ధాంతవేత్త ఆయనే. బకూనిన్ పేరుతో అక్కడ ఒక అధ్యయన కేంద్రాన్ని స్థాపించారు. ఓక్లాండ్లో ఆరు ఎకరాల స్థలాన్ని ఒక సంస్థ ఇవ్వడంతో అందులోనే ఆ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు. అనార్కిజానికి ఇది మొదటి ఆరామమని హరదయాళ్ చెప్పేవారు. వీటన్నిటి ఫలితంగానే ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆపై హరదయాళ్ కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో ఉన్న రైతులతో స్నేహం పెంచుకున్నాడు. అక్కడ ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గురుగోవింద్ సింగ్ పేరిట విద్యార్థి వేతనం ఏర్పాటు చేశాడు. లండన్‌లో శ్యామ్‌జీకృష్ణవర్మ నిర్వహిస్తున్న తీరులోనే భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులకు ఒక వసతి గృహం ఏర్పాటు చేశారు. ఆరుగురు విద్యార్థులు ఈ కేంద్రానికి రావడానికి అంగీకరించారు. ఆ ఆరుగురు విద్యార్థులలో నందసింగ్ షెరా, దర్శి చెంచయ్య, గోవింద బెహారీలాల్ కూడా ఉన్నారు. వీరంతా వసతి గృహంలో ఉంటూ భారతదేశంలో వైస్రాయ్‌ని చంపడం గురించి పథకాలు రచిస్తూ ఉండేవారు. మొదటి ప్రపంచయుద్ధం ఆరంభానికి కొంచెం ముందు ఆరంభించిన గదర్ పార్టీ ఒక దావానలంలా అమెరికాలో ఉంటున్న భారతీయులను ఆకర్షించింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు, అనార్కిస్ట్ కార్యకలాపాలు నెరపుతున్నాడన్న ఆరోపణతో 1914, ఏప్రిల్‌లో అమెరికా ప్రభుత్వం హరదయాళ్ను అరెస్టు చేసింది. అరెస్టు చేసినప్పటికీ ఆయనను ఇండియా పంపేయాలన్న బ్రిటిష్ ప్రభుత్వం డిమాండ్‌ను మాత్రం అమెరికా అంగీకరించలేదు. హరదయాళ్ చాలా శ్రమించి బెయిల్ తెచ్చుకున్నారు. అక్కడ నుంచి బెర్లిన్ పారిపోయారు. అప్పటికే బెర్లిన్ కేంద్రంగా విప్లవ కార్యకలాపాలు నడుపుతున్న వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, ఎం.బర్కతుల్లా, చంపకరామన్ పిళ్లై, భూపేంద్రనాథ్ దత్‌లను కలుసుకున్నారు. ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీని ఏర్పాటు చేసి, భారతదేశంలో అణచివేతకు గురవుతున్న తీవ్ర జాతీయవాదులకు ఆశ్రయం కల్పించేవారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పదేళ్ల పాటు హరదయాళ్ స్వీడన్లో ఉన్నారు. అక్కడే కళాశాలల్లో భారతీయ సాహిత్య, తత్వశాస్త్రాలను బోధించారు. మళ్లీ 1930లో లండన్ యూనివర్సిటీలో పరిశోధన చేసి, డాక్టరేట్ తీసుకున్నారు. లజపతిరాయ్ సలహా మేరకు హరదయాళ్ ఫ్రాన్స్ వచ్చారు. కొద్దికాలం మాత్రమే ఉన్నారు. ఆ దేశ వాతావరణం ఆయనకు నచ్చలేదు. అందుకే అల్జీరియా వెళ్లిపోయారు. ఆ దేశం కూడా ఆయనకు నచ్చలేదు. క్యూబా లేదా జపాన్ వెళ్లాలనుకున్నారు. ఆ క్రమంలో మార్టినిక్ వెళ్లారు. అక్కడే ఆయన పూర్తి నిరాడంబర జీవితం ఆరంభించారు. ఇక్కడ ఉండగానే ఆర్య సమాజ్ ప్రచారకుడు భాయి పరమానంద్ ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. ఈ ఇద్దరు నిరంతరం చర్చించుకునేవారు. బౌద్ధానికి సమీపంగా ఉండే ఒక కొత్త మతం అవసరం ఉందని కూడా భావించారు. పరమానంద్ సలహా మేరకు తిరిగి అమెరికా వెళ్లి అక్కడ భారతీయ పురాతన సంస్కృతి, ఆర్యజాతి గురించి బోధించడానికి హరదయాళ్ అంగీకరించారు. బోస్టన్, కాలిఫోర్నియా, ఆపై హోనొలూలు (హవాయ్) వెళ్లారాయన. అక్కడే వైయాక్కి బీచ్‌లో తపస్సు చేశారు. చిత్రంగా జపాన్ దేశం నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులతో పరిచయం ఒకవైపు, మార్క్సిజం గురించి అధ్యయనం మరోవైపు ఆయన జీవితంలో అక్కడ జరిగిన పరిణామాలు. ఆయన ఎన్నో రచనలు చేశారు. విద్య మీద ఆలోచనలు, హిందూ జాతి సామాజిక విజయం, లాలా హరదయాళ్ రచనలు, జర్మనీ, టర్కీలలో నలభయ్ నాలుగు మాసాలు అందులో కొన్ని. హరదయాళ్ జీవన ప్రస్థానం ఎవరికైనా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. అలాగే ఆయన పాండిత్యం కూడా. సంస్కృతంతో పాటు ఆయన ఉర్దూ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషలలో విశేషమైన పాండిత్యం సంపాదించారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఆయన నిరాడంబర జీవితం మరొక ఎత్తు. ఆయన సాధారణంగా ఒక సన్యాసాశ్రమంలో వ్యక్తిలా జీవించేవారు. ఉడికించిన గింజలు, బంగాళాదుంపలు మాత్రమే తింటూ, నేల మీద పడుకునేవారు. 1908లో భారతదేశం వచ్చినప్పుడు హరదయాళ్ వివాహం చేసుకున్నారు. ఆమె పేరు సుందరరాణి. రెండేళ్ల తరువాత ఒక కొడుకు పుట్టాడు. కానీ కొద్దికాలానికే చనిపోయాడు. తరువాత కూతురు పుట్టింది. సుందరరాణి భర్తతో కాపురం చేసిన కాలం చాలా తక్కువ. ఇక కూతురు (శాంతి) జీవితకాలంలో తన తండ్రిని చూడలేదు. హరదయాళ్ ఫిలడెల్ఫియాలో ఆకస్మికంగా కన్నుమూశారు. గుండె ఆగి మరణించారని మొదట తేల్చారు. కానీ ఆ మరణం ఒక మిస్టరీగానే చరిత్రలో మిగిలిపోయింది. హరదయాళ్తో కలసి పనిచేస్తూ, ‘భారతమాత సొసైటీ’ని స్థాపించిన ఆయన మిత్రుడు లాలా హనుమంత్ సాహే అది సహజ మరణం కాదని చెప్పేవారు. విషప్రయోగం జరిగిందని సాహే ప్రగాఢ నమ్మకం. -
గవర్నర్ జాయింట్ సెక్రటరీకి గాయాలు
నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో గవర్నర్ నరసింహన్ జాయింట్ సెక్రటరీ బసంత్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైయ్యింది. కుటుంబసభ్యులతో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు టైర్ పగిలి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో బసంత్ కుమార్‌కు గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనేసమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
గందరగోళంలో భూపంపిణీ
=గ్రీన్‌సిగ్నల్ ఇవ్వని ప్రభుత్వం =ఈ నెలలో భూపంపిణీ లేనట్లే =నీటి వసతి లేని 3 వేల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టదలచిన 7వ విడత భూపంపిణీ కార్యక్రమం గందరగోళంలో పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ నెలలో భూపంపిణీ లేనట్లేనని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే పంపిణీ చేసిన భూముల్లో చాలా వరకు నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి. సాక్షి, చిత్తూరు: నియోజకవర్గాల వారీగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వ అసైన్మెంట్ భూములను పంపిణీ చేసేలా వైఎస్ హయాం లో భూపంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికి 6 విడతలు భూపంపిణీ చేశా రు. జిల్లాలో 7వ విడత భూపంపిణీని రచ్చబండకు ముందే నిర్వహించాలనుకున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. గతంలో భూపంపిణీని నవంబర్లోనే చేపట్టి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భూపంపిణీని ఇన్చార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా చేయించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల, తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలే దు. దీంతో ఈ నెలలో భూపంపిణీ నిర్వహించడం సందేహమేనని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇచ్చిన భూముల్లో ఇందిర జలప్రభ ద్వారా బోర్లు వేసినా చాలా చోట్ల నీళ్లు పడకపోవడంతో సాగులోకి రాలేదు. సమస్యలు అధికం కొన్ని మండలాల్లో 7వ విడత భూపంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వ భూములు లేవని నివేదికలు వెళ్లాయి. అలాంటి చోట్ల రెవెన్యూశాఖకు సంబంధం లేకుం డా, వేరే ప్రభుత్వ విభాగాల అధికారులను రంగంలోకి దించుతున్నారు. భూ పంపిణీకి అవసరమైన భూమి నిజంగా నే లేదా, అక్కడ ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమిటనే వివరాలను జిల్లా ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఇలా ఇతర విచారణ చేయించినా ఆ వివరాలు ఎప్పటికి అందుతాయో అర్థం కాని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా దాదాపు 900 గ్రామాల్లో లబ్ధిదారులకు పంచేందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేదని నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. గడిచిన 6 విడతల భూపంపిణీలో 14,862 మందికి 17,818 ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. భూ అభివృద్ధికి పెట్టుబడులు లేక ఎస్సీ, ఎస్టీలు 50 శాతానికిపైగా భూములను అలాగే ఉంచేశారు. ఇందిర జలప్రభ కింద భూపంపిణీలో ఇచ్చిన భూములకూ డ్వామా ద్వారా సాగునీటి వసతి కల్పించేందుకు కొన్ని చోట్ల బోర్లు వేశారు. నారాయణవనం మండలంలో బోరు వేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. మోటారు బిగించలేదు. ఇక్కడే మరొక లబ్ధిదారుడికి బోరు వేసి మోటారు బిగించారు. అయితే స్టార్టర్ బోర్డుకు ఫీల్డ్ అసిస్టెంట్ తాళం వేసుకుని వెళ్లడంతో భూమి సాగుచేసుకునేందుకు నీళ్లు వదులుకునే పరిస్థితి లేదు. ఇలా మదనపల్లె, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మొత్తం 1029 బోర్లు డ్వామా వేస్తే 894 చోట్ల నీళ్లు పడ్డాయి. 374 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినా మోటార్లు లేకపోవడంతో భూములు నిరుపయోగంగా మారాయి. 520 బోర్లకు మాత్రమే అధికారులు మోటార్లు బిగించారు. వీటిల్లో పలుచోట్ల మామిడిమొక్కలు నాటేందుకు ఉపాధి హామీలో చేపట్టిన పనులు గుంతలకే పరిమితమయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం సదుంలో 37, కుప్పంలో 37, శ్రీకాళహస్తిలో 17, చంద్రగిరిలో 32, కలికిరిలో 33, పుత్తూరులో 31, మదనపల్లెలో 26, చిత్తూరులో 15, ములకచెరువులో 21 బ్లాకుల్లో 3,000 ఎకరాలు నీటి వసతి లేక నిరుపయోగంగా ఉన్నాయి. 7వ విడత ప్రతిపాదనలు ఇలా 7 విడత భూపంపిణీకి తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లలో 5,558 ఎకరాలను గుర్తించారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్ లో 180 గ్రామాల్లో, తిరుపతి రెవెన్యూ డివిజన్ లో 98 గ్రామాల్లో, మదనపల్లె రెవెన్యూ డివిజ న్లో 285 గ్రామాల్లో భూపంపిణీ చేయాలని నిర్ణయించారు. చిత్తూరులో 14,95, తిరుపతిలో 1,483, మదనపల్లెలో 2,576 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరికి త్వరలో నిర్వహించే భూపంపిణీలో పట్టాలు అందజేస్తారు. భూ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం: బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ జిల్లాలో 7వ విడత భూ పంపిణీకి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు, భూములు అందజేస్తాం. -
పౌరసరఫరాలను పటిష్టం చేస్తాం
=గ్రామ స్థాయికి సంక్షేమ పథకాలు తీసుకెళ్తాం = విద్య, వైద్య ఆరోగ్యశాఖల పటిష్టతకు చర్యలు = సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత = ఆధ్యాత్మిక జిల్లాకు రావడం పూర్వజన్మ సుకృతం = ‘సాక్షి’తో జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్ సాక్షి, చిత్తూరు: పేదలకు ఆహారం అందించే పౌరసరఫరాల విభాగం పారదర్శకతతో పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తానని నూతన జాయింట్ కలెక్టర్ పి.బసంత్‌కుమార్ అన్నారు. పేదలకు అన్ని ర కాల పౌరసరఫరాలు సకాలంలో అందేలా చూస్తామని, జాప్యం నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. అక్టోబరు 11న జిల్లా జేసీగా బాధ్యతలు చేపట్టిన ఆ యన సమ్మె అనంతరం శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులను శాఖల వారీగా పిలిపించి మాట్లాడుతూ పాలన వ్యవహారాలపై పట్టుబిగించే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు రాష్ర్ట గవర్నర్ నర్సింహన్ వద్ద జాయింట్ సెక్రటరీగా, అంతకుముందు వివిధ శాఖల్లో ఉన్నత అధికారిగా పని చేసిన బసంత్‌కుమార్ జాయింట్ కలెక్టర్‌గా చిత్తూరు జిల్లాలో తొలిసారి బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఁసాక్షిరూ.కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిత్తూరులో పోస్టింగ్ ఎలా భావిస్తున్నారు? అధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి ఉన్న చిత్తూరు జిల్లాకు జాయింట్కలెక్టర్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గవర్నర్ వద్ద పని చేసిన అనుభవంతో సీఎం సొంత జిల్లాలో క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నా పీయూసీ చదువు రెండేళ్లపాటు పలమనేరులో సాగింది. ఆ రకంగా చిత్తూరు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. పాలనపరంగా మీ ప్రాధాన్యతలు? ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటే అన్ని రంగాలు అభివృద్ధిలో ముందుకెళ్తాయి. ఈ క్రమంలో జిల్లాలో ప్రభుత్వ విద్యావస్థను ఇంకా బలోపేతం చేసి పేద విద్యార్థులకు గ్రామస్థాయి నుంచి నాణ్యమైన విద్య అందేలా దృష్టిపెడతాం. ఆ తరువాత కీలకమైనది ఆరోగ్యశాఖ. జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏరియా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపరిచేందుకు, వీలైనన్ని ఎక్కువ వైద్యసదుపాయలు ప్రజలు అందుబాటులోకి తెచ్చేలా పనిచేస్తాం. పౌరసరఫరాల వ్యవస్థను ఎలా సంస్కరిస్తారు? అవినీతి ఆరోపణలు లేకుండా, నిజాయితీగా పారదర్శకతతో పౌరసరఫరాలు జరిగే విధంగా అధికారుల పనితీరును మెరుగుపరుస్తాం. పౌరసరఫరాలు అందజేయటంలో జరుగుతున్న జాప్యం నివారించటం, అవి సక్రమంగా ప్రజలకు అందేలా చూడ్డమే ప్రథమ ప్రాధాన్యం. త్వరలో జిల్లావ్యాప్తంగా పౌరసఫరాల గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. సంక్షేమపథకాల అమలు ఎలా? ఆహారభద్రతతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న పింఛన్, రాజీవ్‌ఆరోగ్యశ్రీ, ఒక్క రూపాయికే కిలోబియ్యం వంటి సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ప్రజలకు సరిగ్గా చేరేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తాం. లోపాలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తేలితే తక్షణం చర్యలు చేపడతాం. అభివృద్ధిపథకాల అమలులో రాష్ట్రంలో ఇతర జిల్లాలకు ఒక నమూనాగా ఉండేట్లు పనిచేస్తాం. రెవెన్యూ పనితీరు మారుస్తారా? మండల స్థాయిలో రెవెన్యూ వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు చర్యలు చేపడతాం. సమ్మెకారణంగా తహశీల్దారు కార్యాలయాల్లో 28వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మీసేవల ద్వారా దరఖాస్తుదారులకు అందించేందుకు 15 రోజులు గడువు నిర్ణయించాం. ఇతర వ్యవహారాల్లోనూ రెవెన్యూ సిబ్బంది జాప్యం లేకుండా ప్రజా సమస్యలు పరిష్కరించేలా చూస్తాం. గ్రీవెన్స్‌సెల్, ప్రజావాణి కార్యక్రమాలను పటిష్టం చేస్తాం. ఒకసారి అర్జీ ఇచ్చిన ప్రజలు తిరిగి తిరిగి అదే అర్జీ ఇవ్వకుండా వారి సమస్య ఏ దశలో ఉంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది లేదంటే పరిష్కారం కాదా అన్న విషయం తెలిపే దిశగా దృష్టిపెడతాం.