
ముంబై: ప్రముఖ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్‌కుమార్ చక్రవర్తి (95) మంగళవారం సాయంత్రం ముంబైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో బెంగుళూరులో చిక్కుకున్న మిథున్ చక్రవర్తి ముంబై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ తమ తండ్రి మరణించారని బసంత్‌కుమార్ రెండో కుమారుడు నామాషి చక్రవర్తి తెలిపారు. బెంగాళీ నటి రీతూపర్ణ సేన్‌గుప్తా ట్విటర్ వేదికగా.. మిథున్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
(చదవండి: మహమ్మారి కేంద్రంగా మహారాష్ట్ర..)
Comments
Please login to add a commentAdd a comment