Basic amenities
-
ఉపాధి వెతలు
⇒ కరువు నేపథ్యంలో రోజురోజుకూ పెరుగుతున్న కూలీల సంఖ్య ⇒ అప్పుడే ప్రతాపం చూపుతున్న భానుడు ⇒ పని ప్రదేశాల్లో మౌలిక వసతులు నిల్.. మెడికల్ కిట్లు, పరదాల కరువు ⇒ 35 మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ⇒ పలు చోట్ల ఫీల్డ్అసిస్టెంట్లు, సీఓలు, ఏపీఓల కొరత ⇒ పాతబడిన కంప్యూటర్లు, ప్రింటర్లు.. నెమ్మదించిన నెట్వర్క్ జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ పెరుగుతోంది. గ్రామాల్లో కరువు పరిస్థితులు రోజురోజుకూ తారాస్థాయికి చేరడంతో కూలీలు ఉపాధి పనుల కోసం ఎగబడుతున్నారు. రెండు, మూడు రోజులుగా ఉపాధి పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య పెరుగుతోంది. అయితే.. వేసవి సీజన్ ఆరంభానికి ముందే ఎండ తీవ్రత పెరగడంతో సాధారణ ప్రజలతోపాటు ఉపాధి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీప రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినా.. ఎండల తీవ్రత నుంచి ఉపాధి కూలీలకు రక్షణ కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పని జరుగుతున్న ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించక పోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగేళ్ల క్రితం కూలీలకు మౌలిక వసతులు కల్పించేందుకు సరఫరా చేసిన టెంట్లు, మెడికల్ కిట్లు కంటికి కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం పనిజరిగే ప్రాంతాల్లో కూలీలకు తాగేందుకు గుక్కెడు నీరు కూడా కరువైంది. మరో పలు మండలాల్లో ఉపాధి సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో పనులు గుర్తింపు ప్రక్రియ ఆగిపోయింది. పెరుగుతున్న కూలీలు ....నాలుగు రోజుల నుంచి ఉపాధి పనులకు డిమాండ్ పెరిగింది. జనవరి 29న 1.71లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా...30న 1.74 లక్షలు, ఫిబ్రవరి ఒకటిన 1.68 లక్షలు, ఫిబ్రవరి రెండున 1.77 లక్షల మంది కూలీలు పనులకు హాజరయ్యారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఫిబ్రవరి 2న కూలీలు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం మీద 3,94,448 కుటుంబాలకు ఉపాధి కల్పించగా.. ఇందులో వంద రోజుల ఉపాధి పొందిన కుటుంబాలు 12,782 మాత్రమే ఉన్నాయి. ఉపాధి నిబంధనల మేరకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి సగటున వంద రోజుల ఉపాధి కల్పించాలి. కానీ.. ఒక్కో కుటుంబానికి ఫిబ్రవరి నాటికి 37 రోజుల పని మాత్రమే కల్పించారు. కొంతకాలంగా ఉపాధి పథకం అమలు స్తబ్దుగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. జాడలేని మెడికల్ కిట్లు, పరదాలుపనులు జరిగే ప్రదేశాల్లో ఉపాధి కూలీల సౌకర్యార్థం మెడికల్ కిట్లు, పరదాలు, గడ్డపారలు అందించాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. 2012లో చివరి సారిగా పరదాలు సరఫరా చేశారు. గడ్డపారలు 25 వేలు, మెడికల్ కిట్లు 16 వేలను జిల్లా వ్యాప్తంగా అప్పుడున్న గ్రూపులకు అందజేశారు. నాలుగేళ్ల క్రితం సరఫరా చేసిన సామాగ్రి ఎప్పుడో మాయమైంది. మెడికల్ కిట్లలో మందులు, బ్యాండేజీ, కత్తెర, కాటన్ వంటివి లేకపోవడంతో బాక్సులను మూలనపడేశారు. పనిజరిగే ప్రదేశంలో తప్పనిసరిగా కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చిక్సిత కోసం మెడికల్ కిట్లు తప్పనిసరి అవసరం. ఎండ వేడి నుంచి కాస్తాంత ఉపశమనం పొందేందుకు పరదాల అవసరం ఉంటుంది. గతంలో తాగేందుకు నీటిని సరఫరా చేయడాన్ని కూడా ఉపాధి కిందనే పరిగణించేవారు. ఇప్పుడు అలాంటి వసతులు ఏమీ కల్పించిన దాఖలాల్లేవు. సిబ్బంది కొరత...పనుల గుర్తింపులో జాప్యం మండలాల్లో ఉపాధి సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. ఏడేళ్ల నుంచి బదిలీలు లేకపోవడంతో ఎక్కడి వారు అక్కడే సుదీర్ఘకాలం నుంచి పాతుకుని పోయారు. దీంతో పనులు చేయించడంలో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 35 మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. మూడు మండలాలకు ఏపీఓలు లేరు. 20 గ్రా మాలకు ఫీల్డ్ అసిస్టెంట్ల అవసరం ఉంది. మండ లాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపని కొంతమంది ఉపాధి సిబ్బంది పైరవీలతో పట్టణాలకు వచ్చి స్థిరపడ్డారు. దీంతో 204 గ్రామాల్లో 50-75 శాతం మాత్రమే పనులు అందుబాటులో ఉన్నాయి. 100-200 శాతం పనులు అందుబాటులో ఉన్న గ్రామాలు 646 ఉన్నాయి. 200 శాతానికి పైబడి పనులు అందుబాటులో ఉన్న గ్రామాలు 236 మాత్రమే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1170 గ్రామ పంచాయతీలకు గాను 1095 పంచాయతీల్లో 1,28,098 పనులు.. అంటే దాదాపు 119 శాతం పను లు అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కునారిల్లుతున్న హాస్టళ్లు
♦ నాసిరకం సన్నబియ్యం.. మౌలిక వసతులు కరువు ♦ రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లపై సర్వేలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి దళారుల చీడ అంటుకుంది. ‘సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం నాసిరకంగా ఉంటోంది. మిల్లర్లు, పంపిణీదారులు ఫైన్ క్వాలిటీకి బదులు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది..’ అని ఇటీవల హాస్టళ్లలో సర్వే నిర్వహించిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఎత్తి చూపింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంటోందని.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని... మండలం యూనిట్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను విలీనం చేసి సమీకృత (ఇంటిగ్రేటేడ్) హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. విద్యా సంవత్సరం ముగిసే సమయం దగ్గరపడుతున్నా చాలా హాస్టళ్లలో విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ చేయలేదని స్పష్టం చేసింది. ఇటీవలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక విభాగం కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) ఆధ్వర్యంలో సర్వే చేయించింది. రాష్ట్రంలోని మొత్తం 1,394 హాస్టళ్లు, సగం రెసిడెన్షియల్ స్కూళ్లలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం, కొత్తగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మౌలిక సదుపాయాల పరిస్థితిని సీఎస్డీ అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా గుర్తించిన లోటుపాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను ఇటీవలే ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు సమర్పించింది. ఆ నివేదికలో ప్రణాళికా విభాగం ప్రస్తావించిన పలు కీలకమైన అంశాలు.. ► హాస్టళ్ల నిర్వహణ సాఫీగా జరిగేందుకు మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను విలీనం చేసి ఇంటిగ్రేటేడ్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని 41 శాతం హాస్టళ్లలో 70 మందికి మించి విద్యార్థులు లేరు. ► 2011లో నిర్ణయించిన డైట్ చార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఏడాదికోసారి డైట్ చార్జీలను సవరించాలి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ చార్జీలు కొంత మెరుగ్గా ఉన్నా... పెరిగిన ధరల దృష్ట్యా మరికొంత పెంచాల్సిన అవసరముంది. ► ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టల్ భవనాలు అధ్వానంగా ఉన్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ► విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించేందుకు కొన్ని హాస్టళ్లలో అమర్చిన ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. హాస్టళ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు తక్కువగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేయటం లేదు. ► అత్యధిక హాస్టళ్లలో టాయిలెట్లు, పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామపంచాయతీ లేదా ఇతర సిబ్బందితో వీటి నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. ► హాస్టల్ వార్డెన్లు, ఉన్నత పాఠశాలల్లోని హెడ్మాస్టర్లకు మధ్య సమన్వయాన్ని మెరుగుపరించేందుకు చర్యలు చేపట్టాలి. దాంతో హాస్టల్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ► బీసీ హాస్టళ్లలో పదో తరగతి వారికి బోధించే ట్యూటర్లకు ఇచ్చే వేతనాన్ని ఎస్సీ హాస్టళ్లలో ఇస్తున్న స్థాయికి పెంచాలి. ఎనిమిదో తరగతి ► హాస్టళ్లన్నిటా దాదాపు 20 శాతం విద్యార్థులు గైర్హాజరవుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని అన్ని హాస్టళ్లకు విస్తరించాలి. హాజరు విధానం సంక్లిష్టంగా ఉండకుండా సరళం చేయాలి. ► చాలా హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారికి రెండు మూడు హాస్టళ్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో నిర్వహణపై ప్రభావం కనబడుతోంది. -
‘స్థానికత’కు డెడ్‌లైనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలో కనీస వసతులు లేకుండా ఉద్యోగుల తరలింపుపై గడువు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. 2017 జూన్ 2 తర్వాత కొత్త రాజధానికి తరలి వెళ్లే వారికి(ఉద్యోగులు, వారి పిల్లలు సహా) స్థానికత వర్తించదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.స్పష్టమైన కార్యాచరణ లేకుండా హడావుడి నిర్ణయాల వల్ల ఉద్యోగుల్లో అయోమయం పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. స్థానికత కల్పనకు డెడ్‌లైన్ విధించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగా వ్యతిరేకించలేకపోతున్నారు. కేడర్ నుంచి ఒత్తిడి వస్తున్నా... ప్రభుత్వంతో అంటకాగుతుండటం వల్ల గట్టిగా నిలదీయలేకున్నారు. ఉద్యోగుల్లో అనుమానాలు ఇవీ.. ►అమరావతిని రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడ కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. సీఎం కార్యాలయాన్ని కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు. సీఆర్డీఏలో పనిచేస్తున్న సిబ్బంది గుంటూరు లేదా విజయవాడలో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా గుంటూరుకు గడువులోగా తరలి వెళితే స్థానికత లభిస్తుందా? రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికత లభిస్తుందా? ►ఉద్యోగుల బదిలీ ఉత్తర్వుల తేదీని బట్టి వారి పిల్లల స్థానికత నిర్ణయిస్తారా? విద్యాసంస్థల్లో పిల్లల ప్రవేశాల తేదీని బట్టి నిర్ణయిస్తారా? కోర్సు మధ్యలో వెళ్లడానికి వీల్లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటి? స కొత్త రాజధానిలో అన్ని రకాల వసతులు ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారనే విషయంలో డెడ్‌లైన్ ప్రకటిస్తే బాగుంటుంది. స పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళితే.. అందుకు తగిన విధంగా స్కూళ్లు, కాలేజీలు ఉండాలి. వలసల వల్ల అద్దెలు, స్కూళ్ల ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. వాటి పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేక పెరిగిన అద్దెలు, ఫీజులు చెల్లించే బాధ్యతను తీసుకుంటుందా? సస్థానికత ఉద్యోగుల పిల్లలకే వర్తిస్తుందా? ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? 10 ఏళ్లపాటు హైదరాబాద్ మీద ఉన్న హక్కును కాదనుకొని డెడ్‌లైన్ తర్వాత ఏపీకి వెళితే.. స్థానికత లభించదా? -
‘సుప్రీం’ బృందం పరిశీలన
♦ అత్యవసరాల కోసం నిత్యం పాట్లు ♦ ‘గిరి’ పాఠశాలల్లో మరుగుదొడ్లు కరువు ♦ నేడు ఏజెన్సీలో సుప్రీంకోర్టు బృందం పర్యటన నెల్లికుదురు/తొర్రూరు/నర్సింహులపేట/కేసముద్రం/విద్యారణ్యపురి : సుప్రీంకోర్టు నియమించిన బృందం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం సందర్శించింది. సర్కారు బడు ల్లో మౌలిక వసతులపై సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పు అమలు తీరును పరిశీలించిం ది. నివేదికను సుప్రీంకోర్టుకు అందించనున్నట్లు బృందం సభ్యులు అశోక్ కుమార్‌గుప్తా, పీవీ రత్నం, వెంకటేశ్వర్లు తెలిపారు. హన్మకొండలోని మర్కజీ హైస్కూల్, కాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాల, కరీ మాబాద్‌లోని ప్రభుత్వ హైస్కూ ల్, మామునూర్‌లోని జెడ్పీఎస్ఎస్, వర్ధన్నపేట మండలం పంథిని, కట్య్రాల జెడ్పీఎస్ఎస్, నెక్కొండ మండలం అలంఖానిపేటలోని జెడ్పీఎస్ఎస్లనూ సుప్రీకోర్టు బృందం సందర్శించింది. ఆయా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలబాలికలకు వేర్వురుగా మరుగుదొడ్ల సౌకర్యం ఉందా... తాగునీటి వసతులు ఎలా ఉన్నారుు... సురక్షిత నీరే విద్యార్థులు తాగుతున్నారా.. వంటి అం శాలను పరిశీలించారు. ఈ మేరకు అయా పాఠశాలల్లోని విద్యార్థులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, స్థానికులతో మాట్లాడారు. అక్కడక్కడ నిర్వహణ లోపం ఉన్నట్లు బృందం సభ్యులు గుర్తించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు సక్రమంగా లేవనే అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయూ వసతులు కల్పిస్తామని ఈ ఏడాది మార్చి వరకు ప్రభుత్వం గడువు తీసుకుంది. స ర్వశిక్షాభియన్ ద్వారా వసతులు కల్పనకు శ్రీకారం చుట్టింది. గడువు ముగియడంతో సుప్రీంకోర్టు బృందం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతిపై ప్రత్యక్ష పరిశీలన చేపట్టింది. నెల్లికుదురులోని ప్రభుత్వ ఉన్నత, జెడ్పీఎస్ఎస్, ప్రాథమిక పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్వహణను వీరు తనిఖీ చేశారు. మరుగుదొడ్ల వినియోగంలో ఉన్నాయూ లేవా అనే విషయూన్ని నోట్ చేసుకున్నారు. తాగునీటి సౌకర్యంపై అక్కడి ఎంఈఓ, హెచ్ఎంలు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తొర్రూరులో.. తొర్రూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగు దొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతిని సుప్రీం న్యాయవాదుల బృందం పరిశీలించింది. పాఠశాలలో 800 మంది విద్యార్థులకుగాను రెండు, మూడు మరుగుదొడ్లు, మూత్రశాలలే ఉండడంపై విస్మయం వ్యక్తం చేసింది. నీటి సౌకర్యం కల్పించకపోవడంపై ఉపాధ్యాయులను నిలదీసింది. దంతాలపల్లిలో.. నర్సింహులపేట : మండలంలోని దంతాలపల్లి హైస్కూల్లో మరుగుదొడ్లను, నీటి వసతిని, గదులను న్యాయవాదులు పరిశీలించారు. వసతులపై ఎంఈఓ బుచ్చయ్యను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్వాహణపై ఆరా తీశారు. ఆయూ మండలాల్లో బృందం వెంట సర్వశిక్ష అభియాన్ పీఓ రాజమౌళి, ఈఈ రవీందర్రావు, డీఈ జయశంకర్, ఎంఈఓలు బుచ్చయ్య, సోమదాసు, ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కేసముద్రంలో.. కేసముద్రం : మండలంలోని కేసముద్రంవిలేజ్, కేసముద్రం స్టేషన్ జెడ్పీఎస్‌ఎస్‌లో సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం పర్యటించినట్లు ఎంఈఓ అహ్మద్ జానీ తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీటి కుళాయిలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాయపర్తిలో.. రాయపర్తి : మైలారం, రాయపర్తి జెడ్పీఎస్‌ఎస్‌లను సుప్రీం బృందం శుక్రవారం పరిశీలించింది. వీరితో ఏఎంవో శ్రీనివాస్, ఏఎస్ఓ రాజేశ్వర్, ఏఈ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ జయసాగర్, హెచ్ఎం శోభారాణి పాల్గొన్నారు. మండలంలోని కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో 130 మంది విద్యనభ్యసిస్తున్నారు. బాత్రూములు లేక వీరు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరారుు. పక్కనే ఉన్న పొలాలే వీరికి మరుగుదొడ్లు. రాత్రి వేళలోఇద్దరు ముగ్గురు కలిసి చెట్ల పొదల్లోకి వెళ్లాల్సి వస్తోంది. తాగునీటి సౌకర్యం లేక పాఠశాల వెనుక ఉన్న బోరుబావిని ఆశ్రరుుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విద్యార్థుల కోసం నీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. కానీ నేటికీ ఆ ఆదేశాలు పూర్తిస్థారుులో అమలుకాని పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే అత్యవసరమైతే పొదలచాటుకు వెళ్లాల్సిన దుస్థితి. మారుమూల ఆశ్రమ పాఠశాలల్లోనైతే పొలాల బాట పట్టే స్థితి. కోర్టు ఆదేశాల మేరకు సర్కారు బడుల్లో వసతులు ఏ మేరకు కల్పించారో పరిశీలించేందుకు నేడు ఏజెన్సీలో సుప్రీంకోర్టు నియమించిన బృందం పర్యటించనుంది.