‘సుప్రీం’ బృందం పరిశీలన
♦ అత్యవసరాల కోసం నిత్యం పాట్లు
♦ ‘గిరి’ పాఠశాలల్లో మరుగుదొడ్లు కరువు
♦ నేడు ఏజెన్సీలో సుప్రీంకోర్టు బృందం పర్యటన
నెల్లికుదురు/తొర్రూరు/నర్సింహులపేట/కేసముద్రం/విద్యారణ్యపురి : సుప్రీంకోర్టు నియమించిన బృందం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం సందర్శించింది. సర్కారు బడు ల్లో మౌలిక వసతులపై సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పు అమలు తీరును పరిశీలించిం ది. నివేదికను సుప్రీంకోర్టుకు అందించనున్నట్లు బృందం సభ్యులు అశోక్ కుమార్‌గుప్తా, పీవీ రత్నం, వెంకటేశ్వర్లు తెలిపారు. హన్మకొండలోని మర్కజీ హైస్కూల్, కాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాల, కరీ మాబాద్‌లోని ప్రభుత్వ హైస్కూ ల్, మామునూర్‌లోని జెడ్పీఎస్‌ఎస్, వర్ధన్నపేట మండలం పంథిని, కట్య్రాల జెడ్పీఎస్‌ఎస్, నెక్కొండ మండలం అలంఖానిపేటలోని జెడ్పీఎస్‌ఎస్‌లనూ సుప్రీకోర్టు బృందం సందర్శించింది.
ఆయా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాలబాలికలకు వేర్వురుగా మరుగుదొడ్ల సౌకర్యం ఉందా... తాగునీటి వసతులు ఎలా ఉన్నారుు... సురక్షిత నీరే విద్యార్థులు తాగుతున్నారా.. వంటి అం శాలను పరిశీలించారు. ఈ మేరకు అయా పాఠశాలల్లోని విద్యార్థులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, స్థానికులతో మాట్లాడారు. అక్కడక్కడ నిర్వహణ లోపం ఉన్నట్లు బృందం సభ్యులు గుర్తించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు సక్రమంగా లేవనే అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆయూ వసతులు కల్పిస్తామని ఈ ఏడాది మార్చి వరకు ప్రభుత్వం గడువు తీసుకుంది. స ర్వశిక్షాభియన్ ద్వారా వసతులు కల్పనకు శ్రీకారం చుట్టింది. గడువు ముగియడంతో సుప్రీంకోర్టు బృందం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతిపై ప్రత్యక్ష పరిశీలన చేపట్టింది. నెల్లికుదురులోని ప్రభుత్వ ఉన్నత, జెడ్పీఎస్‌ఎస్, ప్రాథమిక పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్వహణను వీరు తనిఖీ చేశారు. మరుగుదొడ్ల వినియోగంలో ఉన్నాయూ లేవా అనే విషయూన్ని నోట్ చేసుకున్నారు. తాగునీటి సౌకర్యంపై అక్కడి ఎంఈఓ, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
తొర్రూరులో..
తొర్రూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగు దొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతిని సుప్రీం న్యాయవాదుల బృందం పరిశీలించింది. పాఠశాలలో 800 మంది విద్యార్థులకుగాను రెండు, మూడు మరుగుదొడ్లు, మూత్రశాలలే ఉండడంపై విస్మయం వ్యక్తం చేసింది. నీటి సౌకర్యం కల్పించకపోవడంపై ఉపాధ్యాయులను నిలదీసింది.
దంతాలపల్లిలో..
నర్సింహులపేట : మండలంలోని దంతాలపల్లి హైస్కూల్‌లో మరుగుదొడ్లను, నీటి వసతిని, గదులను న్యాయవాదులు పరిశీలించారు. వసతులపై ఎంఈఓ బుచ్చయ్యను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్వాహణపై ఆరా తీశారు. ఆయూ మండలాల్లో బృందం వెంట సర్వశిక్ష అభియాన్ పీఓ రాజమౌళి, ఈఈ రవీందర్‌రావు, డీఈ జయశంకర్, ఎంఈఓలు బుచ్చయ్య, సోమదాసు, ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
కేసముద్రంలో..
కేసముద్రం : మండలంలోని కేసముద్రంవిలేజ్, కేసముద్రం స్టేషన్ జెడ్పీఎస్‌ఎస్‌లో సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం పర్యటించినట్లు ఎంఈఓ అహ్మద్ జానీ తెలిపారు. మరుగుదొడ్లు, తాగునీటి కుళాయిలను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
రాయపర్తిలో..
రాయపర్తి : మైలారం, రాయపర్తి జెడ్పీఎస్‌ఎస్‌లను సుప్రీం బృందం శుక్రవారం పరిశీలించింది. వీరితో ఏఎంవో శ్రీనివాస్, ఏఎస్‌ఓ రాజేశ్వర్, ఏఈ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ జయసాగర్, హెచ్‌ఎం శోభారాణి పాల్గొన్నారు.
మండలంలోని కన్నాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో 130 మంది విద్యనభ్యసిస్తున్నారు. బాత్రూములు లేక వీరు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరారుు. పక్కనే ఉన్న పొలాలే వీరికి మరుగుదొడ్లు. రాత్రి వేళలోఇద్దరు ముగ్గురు కలిసి చెట్ల పొదల్లోకి వెళ్లాల్సి వస్తోంది. తాగునీటి సౌకర్యం లేక పాఠశాల వెనుక ఉన్న బోరుబావిని ఆశ్రరుుస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విద్యార్థుల కోసం నీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. కానీ నేటికీ ఆ ఆదేశాలు పూర్తిస్థారుులో అమలుకాని పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే అత్యవసరమైతే పొదలచాటుకు వెళ్లాల్సిన దుస్థితి. మారుమూల ఆశ్రమ పాఠశాలల్లోనైతే పొలాల బాట పట్టే స్థితి. కోర్టు ఆదేశాల మేరకు సర్కారు బడుల్లో వసతులు ఏ మేరకు కల్పించారో పరిశీలించేందుకు నేడు ఏజెన్సీలో సుప్రీంకోర్టు నియమించిన బృందం పర్యటించనుంది.