సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలో కనీస వసతులు లేకుండా ఉద్యోగుల తరలింపుపై గడువు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. 2017 జూన్ 2 తర్వాత కొత్త రాజధానికి తరలి వెళ్లే వారికి(ఉద్యోగులు, వారి పిల్లలు సహా) స్థానికత వర్తించదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.స్పష్టమైన కార్యాచరణ లేకుండా హడావుడి నిర్ణయాల వల్ల ఉద్యోగుల్లో అయోమయం పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. స్థానికత కల్పనకు డెడ్‌లైన్ విధించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగా వ్యతిరేకించలేకపోతున్నారు. కేడర్ నుంచి ఒత్తిడి వస్తున్నా... ప్రభుత్వంతో అంటకాగుతుండటం వల్ల గట్టిగా నిలదీయలేకున్నారు.
ఉద్యోగుల్లో అనుమానాలు ఇవీ..
►అమరావతిని రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడ కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. సీఎం కార్యాలయాన్ని కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు. సీఆర్‌డీఏలో పనిచేస్తున్న సిబ్బంది గుంటూరు లేదా విజయవాడలో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా గుంటూరుకు గడువులోగా తరలి వెళితే స్థానికత లభిస్తుందా? రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికత లభిస్తుందా?
►ఉద్యోగుల బదిలీ ఉత్తర్వుల తేదీని బట్టి వారి పిల్లల స్థానికత నిర్ణయిస్తారా? విద్యాసంస్థల్లో పిల్లల ప్రవేశాల తేదీని బట్టి నిర్ణయిస్తారా? కోర్సు మధ్యలో వెళ్లడానికి వీల్లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటి? స కొత్త రాజధానిలో అన్ని రకాల వసతులు ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారనే విషయంలో డెడ్‌లైన్ ప్రకటిస్తే బాగుంటుంది. స పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళితే.. అందుకు తగిన విధంగా స్కూళ్లు, కాలేజీలు ఉండాలి. వలసల వల్ల అద్దెలు, స్కూళ్ల ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. వాటి పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేక పెరిగిన అద్దెలు, ఫీజులు చెల్లించే బాధ్యతను తీసుకుంటుందా? సస్థానికత ఉద్యోగుల పిల్లలకే వర్తిస్తుందా? ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? 10 ఏళ్లపాటు హైదరాబాద్ మీద ఉన్న హక్కును కాదనుకొని డెడ్‌లైన్ తర్వాత ఏపీకి వెళితే.. స్థానికత లభించదా?
‘స్థానికత’కు డెడ్‌లైనా?
Published Sun, Oct 4 2015 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM
Advertisement
Advertisement