bcs development
-
బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి: సజ్జల
సాక్షి, అమరావతి: బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన జంగం కార్పొరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శైవ క్షేత్రాల్లో జంగం కులం వారిని పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
బీసీల అభివృద్ధికి అడ్డంకెవరు?
స్వాతంత్య్రం రాకముందు 1929 నాటి సైమన్ కమిషన్ ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు అమలు జరపాల్సి ఉండగా అది అమలు కాలేదు. ఉద్యోగరం గంలో 1993 నుంచి కేంద్రంలో రిజర్వేషన్లు అమలులోకి తెచ్చారు. అర్జున్ సింగ్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. జనాభాలో 52% దాకా ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిం చారు. అయితే కేంద్ర శాఖల్లో 1993 నుంచి నేటివరకూ ఓబీసీలకు అమలు జరిగిన రిజర్వేషన్లు 5-6% మాత్రమే. సరైన అర్హతలు లేవని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అర్హతలున్నవారిని ఎంపిక చేయడానికి నిరాకరించారు. మరుసటి ఏడాది వాటిని రిజర్వేషన్ల నుంచి తొలగించి జనరల్ కేటగిరీలో కలిపారు. అలా 6%లోపే బీసీ రిజర్వేషన్లు అమలయ్యాయి. 2008లో ప్రవేశ పెట్టిన విద్యారంగ రిజర్వేషన్లలో 8% మాత్రమే బీసీ విద్యార్థులకు సీట్లు లభించాయి. మిగతా 19% అన్యాక్రాంతమైపోయాయి. ఇలా 90 ఏళ్ల పోరా టం తర్వాత బీసీలకు 27% రిజర్వేషన్లు కూడా అమలు కావడంలేదు. పైగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్ అంటూ ఆదాయపరిమితి విధిస్తు న్నారు. అన్ని అవకాశాలను బీసీల్లోని సంపన్నవర్గాలే చేజిక్కించుకుంటా యని క్రీమీలేయర్ ప్రవేశపెట్టారు. మరి జనరల్ కేటగిరీలోనూ సంపన్నులు అన్నీ చేజిక్కించుకునే అవకాశం ఉంది. అందుకే జనరల్‌లో కూడా ఐఏఎస్ మొదలుకుని అన్ని కేటగిరీలకు క్రీమీలేయర్‌ను అమలు చేయడం అవసరం. ఎన్నికలతోపాటు అన్ని రంగాల్లో క్రీమీలేయర్‌ను అమలు జరిపితే 125 కోట్ల జనాభాలో కొంతమందయినా కొత్త తరాల నుంచి ఎదిగే అవకాశం ఏర్పడు తుంది. దేశంలో ఏ సామాజికరంగంలో లేని క్రీమీలేయర్ పద్ధతిని బీసీలకు అమలు జరిపే పేరిట 27% రిజర్వేషన్లలో 21% దాకా ఇతరులే దొంగిలిం చడం నేరం. దీన్ని జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని బీసీ కమిషన్ గమనిం చలేదు. ఇంత ప్రధాన కర్తవ్యాన్ని వదిలేసి జస్టిస్ ఈశ్వరయ్య తన సిఫా రసుల ద్వారా బీసీలకు ద్రోహం చేశారని చెప్పక తప్పదు. అన్ని రంగాల్లో క్రీమీలేయర్ అమలు జరిపేదాకా, 27% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలతో నిండే దాకా క్రీమీలేయర్‌ను అన్నిరంగాల్లో ఎత్తివేసినప్పుడే సామాజిక న్యాయం కొంతవరకైనా సాధ్యపడుతుంది. జస్టిస్ ఈశ్వరయ్య సిఫారసులను వ్యతి రేకిస్తూ, క్రీమీలేయర్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బ్యాక్లాగ్ పోస్టుల విధానం అమలులోకి తేవాలని బీసీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. (క్రీమీలేయర్ విధానం రద్దు డిమాండ్‌తో నేడు హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం) వకుళాభరణం కృష్ణమోహన్‌రావు వూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్: 9849912948 -
బీసీల అభివృద్ధికి అధిక నిధులివ్వండి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీవర్గాల అభివృద్ధికోసం కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసినా, సరిపడా నిధులివ్వక బీసీ వర్గాలు అభివృద్ధిని సాధించలేక పోయారని, కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా బీసీ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు సీఎం కే సీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, రాష్ట్ర చేతివృత్తుల కమిటీ ఛైర్మన్ వన్నాల శ్రీరాములు తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు. కార్పొరేషన్లకు కమిటీలను నియమించడంతోపాటు, ఒక్కో కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆయా కులాలను ఆదుకోవాలని కోరారు. చేనేత బోర్డుకు అప్పుల మాఫీ కింద రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. ఆయా ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సరఫరా, రాజీవ్ విద్యామిషన్ పనులన్నింటినీ ఆప్కోకు కేటాయించాలని కోరారు. అన్నివృత్తుల వారికి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. -
బీసీల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో రూ.30 వేలు మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం లక్ష రూపాయలకు పెంచామన్నారు. బీసీ కులాల్లో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిలో ప్రతి నియోజకవర్గంలో 2వేల మందికి బ్యాంకు లింకేజీ కింద రుణాల కోసం బడ్జెట్ విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2013-14లో 6 లక్షల మంది బీసీలకు ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. మండలాల్లో ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో కమిషనర్లు కన్వీనర్లుగా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. జీవో నెం.101 ప్రకారం ఈ నెల 21వ తేదీ నాటికి రుణాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేశామని, అయితే గడువు పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 40 వసతి గృహాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 38 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ, సహాయ సంక్షేమాధికారులు, హెచ్‌డబ్ల్యూఓలు, ఇతర మినిస్టీరియల్ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తెలిపారు. మంత్రికి బీసీ నేతల స్వాగతం.. మంత్రి బసవరాజు సారయ్య కర్నూలుకు వచ్చిన నేపథ్యంలో పలు బీసీ సంఘాల నాయకులు స్థానిక ప్రభుత్వ అతిథిగృహం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాంబాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ, బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ టి.శేషఫణి, బీసీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగస్వామి, పాలెగార్ సత్యనారాయణరాజు, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కె.జోషి తదితరులు స్వాగతం పలికారు.