BCs issue
-
‘చంద్రబాబు మోసాలపై మోదీనే చెప్పారు.. ఇంకా సాక్ష్యం ఏం కావాలి’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు హయంలో ఎప్పుడైనా బీసీలకు పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాగా, మంత్రి కారుమూరి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీసీలకు వెన్నుదన్నుగా ఉన్నారు. అన్ని పదవుల్లో బీసీలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పనంతా దాచుకోవడం.. దోచుకోవడమే. మళ్లీ దోచుకోవడానికి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే. పోలవరం నిధులను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీయే అన్నారు’ అని తెలిపారు. -
ప్రతి బీసీ కులాన్ని చైతన్యం చేయడమే సీఎం జగన్ ఆశయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అట్టడుగులో ఉన్న బీసీ కులాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే సీఎం జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీల సమస్యలను రాజకీయంగా వాడుకుంటూ వారికి సమాజంలో కనీస గుర్తింపు లేకుండా చేసిన వైనాన్ని సీఎం జగన్ తన పాదయాత్రలో చూశారని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బీసీల అభ్యున్నతి కోసం కసరత్తు మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఈక్రమంలోనే బీసీలలో చాలామందికి తెలియని కులాలను కూడా వెతికి ఆ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేశారని వివరించారు. ఆ కార్పొరేషన్లతో ప్రతి బీసీ కులాన్ని చైతన్యవంతంగా మార్చడం సీఎం ఆశయమని వెల్లడించారు. చదవండి: లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్బుక్ తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పద్మశాలి కార్పొరేషన్ సమావేశంలో సజ్జల మాట్లాడారు. దేశానికి కళాత్మకమైన చేతి వృత్తి చేనేత అని, ప్రపంచంలోనే చేనేత వస్త్రాలకు గొప్ప ఆదరణ ఉందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఆయన సూచించారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న ఆఖరి వ్యక్తికి అందేలా చూడటం మన లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు. చదవండి: సాయి తేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు.. మోహన్‌బాబు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో సీఎం జగన్ బీసీలను భారతీయ సంస్కృతిగా అభివర్ణించారని గుర్తుచేశారు. బీసీలను సమాజానికి వెన్నెముకలా మార్చాలని సీఎం ఆశయమని తెలిపారు. నేతన్న నేస్తం ద్వారా కరోనా కష్టకాలంలో చేనేత కుటుంబాలకు సీఎం జగన్ భరోసా కల్పించారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఆప్కో చైర్మన్ మోహన్ రావు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
'బీసీలపై బాబు, కేసీఆర్ నిర్లక్ష్యం'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లు బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఇప్పటివరకు 29 సార్లు ఢిల్లీ వచ్చిన ఇరువురు ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో మూడు సార్లు భేటీ అయినప్పటికీ బీసీ బిల్లుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. అఖిలపక్షాలతో ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాకుంటే బాబు, కేసీఆర్‌లకు బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఏపీ, తెలంగాణ అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసినా కేంద్రంపై తగిన ఒత్తిడి తేలేకపోతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 542 మంది ఎంపీల్లో బీసీ ఎంపీలు 270 మందికిగాను 115 మంది మాత్రమే ఉన్నారన్నారు. ఏపీలోని 25 మంది ఎంపీలకుగాను ముగ్గురు, తెలంగాణలో 17 మంది ఎంపీలకుగాను ఇద్దరు బీసీ ఎంపీలే ఉన్నారని వివరించారు. అస్సాంలోని బోడో, రాజస్థాన్‌లోని గుజ్జర్, శ్రీలంకలోని తమిళ ఈలం పోరాటాలను చూసి నేర్చుకోవాలని బీసీలకు పిలుపునిచ్చారు. నేను 25 ఏళ్ల యువకుడినైతే ఏకే 47 పట్టుకుని బీసీల కోసం పోరాడేవాడినని కృష్ణయ్య అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, రూ.50 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ప్రైవేటు రంగాల్లో రిజర్వేషను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర పభుత్వాల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మన్ రాజు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కెసన శంకర్రావు, తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావుతోపాటు కర్ణాటక, తమిళనాడు, యూపీ నుంచి బీసీ కార్యకర్తలు తరలివచ్చారు.