bear halchal
-
ఎలుగుబంటి హల్చల్.. టెన్షన్లో ప్రజలు..!
-
అర్ధరాత్రి ఆలయానికి ఎలుగు బంటి.. తాళాలు వేసి ఉండటంతో ఏం చేసిందంటే?
రొళ్ల(సత్యసాయి జిల్లా): మండల పరిధిలోని జీరిగేపల్లిలో అమ్మాజీ ఆలయంలో ఎలుగు బంటి ప్రత్యక్షమైంది. పూజల తర్వాత ఆలయ ప్రధాన అర్చకుడు మారన్న, ముడుపన్న బుధవారం సాయంత్రం ప్రధాన ఆలయ ద్వారానికి తాళం వేసుకొని ఇంటికి వెళ్లారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్న ఎలుగు బంటి ఆహారం కోసం అన్వేషిస్తూ అమ్మాజీ ఆలయంలోకి ప్రవేశించింది. ప్రధాన ద్వారానికి తాళాలు ఉండటంతో ఆలయ వరండాలో దొరికిన ఆహారాన్ని తినేసి వెళ్లి పోయింది. ఈ దృశ్యాలు ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. గురువారం ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన అర్చకులు ఈ విషయాన్ని గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. చదవండి: ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని.. యువకుడు ఎంత పని చేశాడంటే.. -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి
-
అమ్మో.. ఎలుగుబంటి
సాక్షి, బద్వేలు(కడప) : బద్వేలు సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. జనావాసాల్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి ఎటువెళ్లాలో తెలియక పొలాల వెంట పరుగులు తీస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఎలుగుబంటిని అడవిలోకి పంపించేందుకు 7 గంటల పాటు శ్రమించారు. ఒకానొక దశలో జనం పై దాడికి యత్నించడంతో ఓ విలేకరికి గాయాలయ్యాయి. చివరకు అటవీ సిబ్బంది వల్లెరవారిపల్లెబీట్లోని అటవీ ప్రాంతంలోకి ఎలుగుబంటిని తరిమి వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం బద్వేలు సమీపంలోని బయనపల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే ... మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీలో గల శ్రీనివాసపురం గ్రామ సమీపంలోకి సోమవారం తెల్లవారుజామున ఎలుగుబంటి ప్రవేశించినట్లు గుర్తించిన గ్రామస్తులు అక్కడి నుంచి తరిమివేశారు. అనంతరం అక్కడి నుంచి బయనపల్లె ఎస్సీకాలనీ సమీపంలోని ముళ్లపొదల్లో దాగి ఉండగా గ్రామస్తులు గుర్తించి అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎఫ్ఆర్ఓ సుభాష్, సిబ్బంది ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పొలాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఈ సమయంలో ముళ్లపొదల్లో దాక్కుని ఉన్న ఎలుగుబంటి జనం పై దాడికి యత్నించింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరికి గాయాలయ్యాయి. ప్రజలు, అటవీ సిబ్బంది ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా అక్కడి నుంచి చింతలచెరువు, గొడుగునూరు గ్రామాల మీదుగా కమలకూరు సమీపంలోని వల్లెరవారిపల్లెబీట్ అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అటవీ అధికారులు, సంబంధిత గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి పై ప్రొద్దుటూరు డీఎఫ్ఓ గురుప్రభాకర్ ఆరా తీసీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. -
అమ్మో.. ఎలుగుబంటి..!
సాక్షి, జనగామ: అది జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయం.. సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయం.. కార్యాలయం సమీపంలో ఓ నల్లటి ఆకారం... ఏదో జంతువు మాదిరిగా అటూ ఇటూ తిరుగుతోంది.. అది గమనించిన కొంత మంది యువకులు దగ్గరగా వెళ్లి చూస్తే ఎలుగుబంటి.. వారు భయభయంగానే దానిని తరిమివేసేందుకు ప్రయత్నించారు.. అది నేరుగా ఆర్టీసీ డిపోలో చొరబడి ఓ చెట్టెక్కి కూర్చొంది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ, పోలీసు, అటవీశాఖల అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎలుగుబంటి కిందకు దిగే ప్రయత్నం చేయడంతో చెట్టుచుట్టూ ముళ్లకంపను వేశారు. పెద్ద ఎత్తున జనాలు గుమిగూడటంతో అది మరింత పైకి వెళ్లింది. చివరకు నాలుగు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన అధికారులు ఎలాగోలా భల్లూకాన్ని బంధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలా వచ్చింది... చంపక్‌హిల్స్ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి పసరమడ్ల, శామీర్‌పేట గ్రామాల మీదుగా 2.30 గంటలకు జనగామ పట్టణానికి చేరుకుంది. రోడ్డుపై వస్తున్న ఎలుగుబంటిని చూసిన కొమురవెల్లి స్పెషల్ ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డీసీసీ కార్యాలయం సమీపంలోని కుర్మవాడలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఎలుగుబంటిని ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు యువకులు కర్రలతో బెదిరించారు. దీంతో అది పరుగులు పెడుతూ ఆర్టీసీ బస్ డిపోలోకి చొరబడింది. గుడ్డేలుగును చూసి అందులో ఉన్న పలువురు సిబ్బంది లగెత్తారు. డిపోలోని ప్రహరీ పక్కనే వరంగల్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కింది. 6 గంటలకు పారెస్ట్ అధికారులకుసమాచారం.. ఉదయం ఆరు గంటల సమయంలో ఫారెస్ట్ అధికారులకు గుడ్డేలుగు వచ్చిన సమాచారాన్ని అధికారులు అందించారు. మత్తుమందు.. డాక్టర్.. రెస్క్యూ టీం.. బోను.. వలలను వెంట బెట్టుకుని తొమ్మిది గంటలకు జనగామకు చేరుకున్నారు. జూసంరక్షణ పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ గన్ సహాయంతో వరుసగా రెండుసార్లు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. పదిహేను నిమిషాల తర్వాత కూడా గుడ్డేలుగు స్పృహలోనే ఉండడంతో.. మరో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఇరవై నిమిషాలు నిరీక్షించినా.. గుడ్డేలుగు కొంతమేర తప్పటడుగులు వేసినా.. మరుక్షణమే తేరుకుంది. అప్పటికే డిపో లోపలి భాగంతో పాటు వరంగల్ హైవే పై చెట్టుకు రెండు వైపులా వలలు వేసి సిద్ధంగా ఉంచారు. చెట్టు పై నుంచి కిందకు ఎంతకూ రాకపోవడంతో గుడ్డేలుగును కర్రల సహాయంతో కిందకు నెట్టేసే ప్రయత్నం చేయడంతో.. వారిపైకి వచ్చే ప్రయత్నం చేసి.. మళ్లీ పైకి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత మెళ్లగా చెట్టు దిగే ప్రయత్నంలో వలలో పడేలా శతవిధాలా ప్రయత్నం చేశారు. చెట్టుపై నుంచి బస్‌డిపో గోడపై ఉన్న ఫెన్సింగ్ తీగలను చొచ్చుకుని..అందులో ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫారెస్ట్ సిబ్బందితో పాటు ఆర్టీసీ సివిల్ ఇంజినీర్ బాబాపైకి గుడ్డేలుగు పరుగులు పెట్టడంతో వణికిపోయారు. తప్పించుకుందామనుకునే లోపే... గుడ్డేలుగు వారి పైకి వచ్చేసినంత పని చేసింది. ఆ సమయంలోనే అక్కడే న్న రోడ్డు రోలర్‌కు గుడ్డేలుగు బలంగా తాకడంతో... వారు తృటిలో ప్రా ణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గా యంతో ఇబ్బందులు పడ్డ గుడ్డేలుగు.. డిపోలోని సిబ్బంది రెస్ట్ తీసుకునే గది వెనకకు వచ్చి చేరింది. వలతో అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. గంటన్నర పాటు ముప్పు తిప్పలు.. డిపోలో చొరబడ్డ గుడ్డేలుగును పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ముప్పుతిప్పలు పడ్డారు. మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చినా.. అటు వైపు వెళ్లిన వారిపైకి వచ్చేందుకు ప్రయత్నించిం ది. ప్రహరీ దూకి భవానీనగర్ వైపు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. గుడ్డేలుగును పట్టుకునే విజువల్స్‌ను కవరేజ్ చేస్తున్న మీడియాపైకి సైతం రంకెలు వేయడంతో పరుగులు పెట్టారు. రెండుసార్లు వలలో చిక్కినట్టే చిక్కుకుని.. సంకెళ్లను తెంపుకుని బయటకు వచ్చింది. అతికష్టం మీద...11.05 నిమిషాలకు గుడ్డేలుగును పట్టుకుని.. బోనులో బంధించారు. అనంతరం మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన ప్రదేశంలో.. ప్రాథమిక పరీక్షలు చేసి...ఏటూరునాగారం– తాడ్వాయి అటవీ ప్రాంతానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ అర్బన్, జనగామ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రామలింగం పర్యవేక్షించగా, ఎఫ్ఆర్ఓలు శ్రీనివాస్‌కుమార్, మంగీలాల్ రేంజ్ ఆఫీసర్ పున్నంచందర్, కంపౌండర్ ఆకేష్, రిస్క్ టీం నాగేశ్వరావు, స్వామి, క్రిష్ణ ఉన్నారు. అడవిలో ఆహారం లేకనే అడవులు అంతరించి పోతుండడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయని డీఎఫ్ఓ రామలింగం అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుమారు 12 సంవత్సరాల వయస్సు కలిగి.. 80 కేజీలు ఉంటుందన్నారు. అడవుల్లో తాగునీటి కొరత లేకుండా సాసర్ కుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి గాయాలు లేకుండా.. యాక్టివ్‌గా ఉండడంతో.. జనావాసాలు లేని తాడ్వాయి– ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో వదిలి పెడతామన్నారు. చెట్టు పైనుంచి సురక్షితంగా కిందకు దింపేందుకే సమయం ఎక్కువగా తీసుకున్నామన్నారు. -డీఎఫ్ఓ రామలింగం -
ఆలయ తలుపుల్ని పగలగోట్టిన ఎలుగుబంటి
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండ లం కట్కూర్ గ్రామంలో గురువారం రాత్రి ఎలుగుబంటి సంచరిండం గ్రామస్తులను కలవరపెట్టింది. అర్ధరాత్రి గ్రామంలో ఎలుగుబంటిని చూ సి కుక్కలు అరవగా గ్రామస్తులు దానికి గమనించి భయంతో తలుపులు వేసుకున్నారు. గ్రామ నడిబొడ్డునఉన్న హనుమాన్ ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లింది. అదే సమయంలో అటు గా వెళ్తున్న కొందరు ఎలుగుబంటిని చూసి అం దరికీ ఫోన్లో సమాచారం అందించారు. కాగా కుక్క లు తరమడంతో ఎలుగుబంటి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయి ంది. కాగా ఎలు గుబంటు భయంతో పాలవ్యాపారులు వ్యవసాయ కూలీలు, రైతులు ఒంటరిగా బయటకు రాలేదు. రాత్రి వేళ గ్రామం లోని జీపీ కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఎలుగుబంటి దృశ్యాలు న మోదయ్యాయి. సంబంధిత అధికారులు ఎలుగుబంటిని పట్టుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హరేసముద్రంలో అలజడి
- ఎలుగుబంట్ల స్వైరవిహారం - ఇద్దరిపై దాడి యత్నం - భయాందోళనలో జనం - రంగంలోకి అటవీ అధికారులు మడకశిర రూరల్ : మడకశిర మండలం హరేసముద్రంలో అలజడి చెలరేగింది. గ్రామానికి ఆనుకుని ఉన్న చిన్నచెరువు కింద సాగు చేసిన పంట పొలాల్లోకి ఎలుగుంట్లు రావడం కలకలం రేపింది. మొక్కజొన్న పంట సమీపంలో పశుగ్రాసం కోస్తునగ్రామానికి చెందిన దొడ్డక్క, ఆమె పిల్లలపై ఎలుగుబంటి దాడికి యత్నించడం, వారు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వందలాది మందిఅ క్కడికి చేరుకున్నారు. రెండ్రోజుల కిందట బహిర్భూమికి వెళ్లిన తిప్పేస్వామిపైనా ఎలుగుబంటి దాడికి యత్నించగా ఆయన కేకలు వేసుకుంటూ గ్రామంలోకి చేరుకున్నాడు. వరుస సంఘటనలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గుమిగూడిన జనం మొక్కజొన్న పంట పొలానికి సమీపంలోని పాడుబడిన గదిలోకి ఎలుగుబంట్లు వెళ్లాయని భావించిన వందలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. స్థానిక సెక్షన్ ఆఫీసర్ శాంప్లానాయక్, సిబ్బందితో అక్కడికి చేరుకుని ఎలుగుబంట్లు వెళ్లిన ప్రదేశానికి ఎవరినీ వెళ్లకుండా పోలీసుల ద్వారా నిలువరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలుగుబంట్ల కోసం జనం నిరీక్షించారు. అయినా అవి బయటకు రాకపోవడంతో సాయంత్రం బాణసంచా పేల్చుతూ పెద్ద ఎత్తున శబ్దాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఎలుగుబంట్లు అటవీ ప్రాంతానికి వెళ్లి పోయి ఉంటాయని అధికారులు ప్రకటించారు. అటవీ శాఖాధికారి వేణుగోపాల్ కూడా ఎలుగుంట్లు ఉన్న ప్రదేశాన్ని సాయంత్రం పరిశీలించారు. వివరాలడిగి తెలుసుకున్నారు. రాత్రి కూడా సిబ్బంది అక్కడే ఉండి ఎలుగుబంట్లు కనిపిస్తే అడవిలోకి వెళ్లిపోయేలా చూడాలని ఆయన ఆదేశించారు. రైతుల్లో భయం..భయం.. ఎలుగుబంట్లు సంచరిస్తున్న ప్రదేశంలో 30 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. దీంతో రైతులు ఇప్పుడు తమ పొలాల వైపు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. పంట సంగతి దేవుడెరుగు.. ప్రాణాలు కాపాడుకుంటే చాలనుకుంటున్నారు.