
అమ్మాజీ ఆలయంలో ప్రవేశించిన ఎలుగుబంటి
రొళ్ల(సత్యసాయి జిల్లా): మండల పరిధిలోని జీరిగేపల్లిలో అమ్మాజీ ఆలయంలో ఎలుగు బంటి ప్రత్యక్షమైంది. పూజల తర్వాత ఆలయ ప్రధాన అర్చకుడు మారన్న, ముడుపన్న బుధవారం సాయంత్రం ప్రధాన ఆలయ ద్వారానికి తాళం వేసుకొని ఇంటికి వెళ్లారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్న ఎలుగు బంటి ఆహారం కోసం అన్వేషిస్తూ అమ్మాజీ ఆలయంలోకి ప్రవేశించింది. ప్రధాన ద్వారానికి తాళాలు ఉండటంతో ఆలయ వరండాలో దొరికిన ఆహారాన్ని తినేసి వెళ్లి పోయింది. ఈ దృశ్యాలు ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. గురువారం ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన అర్చకులు ఈ విషయాన్ని గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
చదవండి: ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని.. యువకుడు ఎంత పని చేశాడంటే..
Comments
Please login to add a commentAdd a comment