beheading threats
-
‘మోదీ, యోగిల తలలు నరుకుతాను’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీల శిరచ్ఛేదనం చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అంతేకాక జనాలు అభినందనలు తెలుపుతూ.. చప్పట్లు కొడుతూ అతడి వ్యాఖ్యలను స్వాగతించారు. వివరాలు.. రాష్ట్రీయ్ లోక్‌దళ్ నాయకుడు జయంత్ చౌదరి హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అతడిపై లాఠీ చార్జీ చేశారు. ఇందుకు వ్యతిరేకంగా మీరట్, ముజఫర్ నగర్, బాగ్పట్, బులంద్‌షహర్ అలీగఢ్, బిజ్నోర్ జిల్లాల్లో భారీ నిరసనలు జరిగాయి. అలానే ముజఫర్ నగర్లో మహాపంచాయత్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సభను ఉద్దేశించి ప్రసంగించాడు. ‘మనందరం ఏకం కావాలి. పీఎం మోదీ, సీఎం యోగిల తలలు నరికి మీ పాదాల చెంత పడేయాలనుకుంటున్నాను’ అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలు అతడి వ్యాఖ్యలను స్వాగతిస్తూ చప్పట్లతో అభినందించారు. దాంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.(చదవండి: భయంగా ఉంది.. వెళ్లిపోతాం!) Threat to PM CM. Behead them. This all happening before the muzzafarnagar panchayat at Baghpat pic.twitter.com/UnxRdI2ff1 — Anil Tiwari (@Interceptors) October 8, 2020 హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేసినందుకు నిరసనగా రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్తలు మధుర సమీపంలోని నౌహిల్ బజ్నా-అలీఘర్ రహదారిపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మలను కూడా ఆర్ఎల్డి కార్మికులు తగలబెట్టారు. -
మమతా బెనర్జీ తలపై రివార్డు ఎందుకు?
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముమ్మరంగా వదంతులు విహరిస్తున్నాయి. వీటికి సోషల్ మీడియా వేదిక అవుతోంది. ‘మెటియాబ్రజ్లో అల్లర్లు చెలరేగుతున్నట్లు ఇప్పుడే అందిన వార్త. సైన్యాన్ని పిలిపించారు.. కిడ్డెర్పోర్లో కూడా అల్లర్లు మొదలయ్యాయి.. పార్క్ సర్కస్ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా తిరుగుతున్నారు. ఘోరాలు జరగక ముందే ఇళ్లకు తరలిపోండి’ అంటూ గురువారం సోషల్ మీడియాలో వదంతులు ఊపందుకున్నాయి. నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం గమనార్హం. అసలు ఏమైనా ఉన్నా లేకపోయినా వదంతులకు మాత్రం కొదవ ఉండట్లేదు. సకాలంలో పోలీసుల స్పందన సకాలంలో పోలీసు అధికారులు స్పందించడంతో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ‘నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నట్లు దురుద్దేశంతో కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారు. వాటిని నమ్మకండి. నగరంలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా, ఎలాంటి అశాంతి పరిస్థితులు లేవు. ఉన్నాయంటూ ఎవరైనా వదంతులు వ్యాప్తిచేస్తే వారి గురించి వెంటనే మాకు తెలియజేయండి’ అంటూ పోలీసులు అదే సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో ప్రశాంత పరిస్థితులకు భంగం వాటిల్లలేదు. మధ్యాహ్నం ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా, అల్లరి మూక గొడవ చేసింది. రోడ్డును దిగ్భంధించింది. అక్కడ కూడా పోలీసులు సకాలంలో స్పందించడంతో ఏ గొడవ జరగలేదు. ముస్లింలు, హిందూ నాయకులు కూడా జోక్యం చేసుకొని ప్రశాంత పరిస్థితులకు భంగం వాటిల్లకుండా అడ్డుకున్నారు. ఎందుకీ ఉద్రిక్తతలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలనరికి తెచ్చినవారికి రూ. 11 లక్షల రివార్డు ఇస్తామని రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడు యోగేశ్ వివాదాస్పద ప్రకటన చేసిన నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో తీస్తా నది ఒప్పందం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనను మమతా బెనర్జీ తిరస్కరించడం, రాష్ట్రానికి రావాల్సిన 10,459 కోట్ల రూపాయలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదంటూ ఆమె విమర్శించడం, రాష్ట్రపతి పదవికి మోదీకి ఇష్టంలేని ఎల్కే అద్వానీ పేరును ఆమె ప్రతిపాదించడం కూడా ఉద్రిక్త పరిస్థితులకు తోడయ్యాయి. శ్రీనవమి ఉత్సవాలు మున్నెన్నడూ లేవు కనకదుర్గ పూజకు ప్రాధాన్యమిచ్చే బెంగాల్ రాష్ట్రంలో, ముఖ్యంగా కోల్‌కతాలో గత 300 ఏళ్లలో శ్రీరామనవమి ఉత్సవాలను కోలాహలంగా జరిపిన సందర్భాలు లేవు. ఈసారి కోలాహలంగానే కాదు, కత్తులు, కటార్లు పట్టుకొని నగరంలో ప్రదర్శనలు జరిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీజేపీ ఆధ్వర్యంలో మొదటిసారి ఇక్కడ నవమి వేడుకలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తాయి. అందుకే మమతా బెనర్జీ తలపై 11 లక్షల రివార్డును ప్రకటించిన యోగేశ్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. జాతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి తల తీయాలంటూ గతంలో పిలుపునిచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కూడా రాష్ట్ర పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రధానంగా ముస్లిం ఓట్లతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మమతా బెనర్జీ ముస్లిం మత గురువులకు ప్రభుత్వ వేతనాలు కల్పించడం పట్ల కూడా బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.