bengal election
-
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్‌కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్‌ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్‌కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్‌గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్ పుట్టినరోజు ఇవాళే. చదవండి: మిథున్ కొడుకుపై రేప్ కేస్ -
బెంగాల్ రాజకీయాల్లో సమూలమార్పు
బెంగాల్లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఎనిమిది దశల్లో సుదీ ర్ఘంగా సాగుతున్న శాసనసభ ఎన్నికల ముగింపు సందర్భంగా ఒక విషయం మాత్రం తేటతెల్లమైంది. అదేమిటంటే బెంగాల్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గతంతో పోలిస్తే మరింత ఘోరంగా తయారయ్యాయి.. నేను ఇక్కడ ఎన్నికల ఫలితం గురించి జోస్యం చెప్పబోవడం లేదు. త్వరలోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రానున్నాయి. అప్పుడు బెంగాల్ రాజకీయ రణరంగంలో జరిగిన సంకుల సమరం ఎలా ముగుస్తుందో మనకు స్పష్టత కలగవచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీగానే జరిగాయి. కాంగ్రెస్ పార్టీతో, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో కూటమి గట్టిన వామపక్ష కూటమి బెంగాల్ రాజకీయ రంగస్థలంపై మరోసారి ప్రభావం చూపవచ్చన్న అంచనా తేలిపోయినట్లే చెప్పవచ్చు. బెంగాల్ మూడో శక్తిగా చెబుతున్న ఈ కూటమి 10 శాతం పాపులర్ ఓట్లతో అధికారానికి ఆమడదూరంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఓట్లు ప్రతిఫలించనప్పటికీ బెంగా>ల్లో అత్యంత తీవ్రమైన ఎన్నికల పోటీ ఈసారి మాత్రమే చోటు చేసుకుందని నా అంచనా. టీఎంసీ, బీజేపీలు మొత్తం ఓట్లలో 80 శాతం వరకు కైవసం చేసుకోనున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరొక 40:40 నిష్పత్తిలో ఓట్లు వచ్చినట్లయితే బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. మమతకు అనుకూలంగా 42:38 నిష్పత్తిలో ఓట్లు వస్తే ఆమె నాయకత్వం గురించి, ప్రశాంత్ కిషోర్ మైక్రో మేనేజ్మెంట్ ఘనత గురించి మీడియా విజయగీతాలు మొదలెడతాయి. దీనికి భిన్నంగా బీజేపీకి అనుకూలంగా ఇదే నిష్పత్తిలో ఓట్లు వస్తే మోదీ– అమిత్ షా ద్వయం సృష్టించిన మహా కాషాయ దళ ప్రభంజనం గురించి టీవీ స్టూడియోలు చెక్కభజన మొదలెడతాయి. నూతన రాజకీయ కూటములకు నాంది మే 2న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేదానితో నిమిత్తం లేకుండానే, పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం మౌలికంగానే రాజకీయ పునరేకీకరణ చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ సాధించిన అసాధారణ విజయం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. 2011 ఎన్నికల్లో కూడా బీజేపీకి బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో 4.1 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016లో 10.2 శాతం ఓట్లు సాధించినప్పటికీ బీజేపీకి అదనంగా 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడం గమనార్హం. అంటే ఇటీవలి కాలం వరకు బెంగాల్లో బీజీపీ ఉనికి కనీసమాత్రంగానే కనిపించేది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. బెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాలకుగాను 18 సీట్లతో, 40.2 శాతం ఓట్లు కొల్లగొట్టిన బీజేపీ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజాదరణ కారణంగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి ప్రధాన పోటీదారుగా సవాల్ చేసే స్థాయికి ఎగబాకింది. స్పష్టంగానే టీఎమ్సీ, బీజేపీల మధ్య రాజకీయ స్పర్థ కొంత కాలంపాటు కొనసాగనుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇలాంటిది బెంగాల్లో సంభవిస్తుందని ఊహామాత్రంగా కూడా భావించేవారు కాదు. కొత్త సామాజిక ఏకీకరణ ఈ పరిస్థితి బెంగాల్లో సామాజిక శక్తుల పునరేకీకరణకు చోటు కల్పించింది. ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాలు, సామాజిక బృందాలను తన వైపునకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ బెంగాల్ రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఉత్తర బెంగాల్, పశ్చిమ బెంగాల్‌లోని జంగిల్ మహల్ లోని వెనుకబడిన ప్రాంతాలలో బీజేపీ ప్రారంభ విజయాలను సాధించింది. దళితులు, ఆదివాసీలు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు, పట్టణ ప్రాంతాల్లోని హిందీ మాట్లాడే వారిని ఆకర్షిం చడం ద్వారా బీజేపీ బెంగాల్లో తనదైన పునాదిని సృష్టించుకుంది. 2019 నుంచి ఈ సెక్షన్లను దాటి బీజేపీ తన పరిధిని విస్తరించుకుంది. ఈసారి అది గ్రామీణ దక్షిణ బెంగాల్ కేంద్ర స్థానంలోకి చొచ్చుకుపోయింది. పైగా బెంగాల్ మధ్యతరగతి భద్రలోక్ ప్రజల్లో కాస్త చోటు సంపాదించుకుంది. చాలాకాలంగా పశ్చిమబెంగాల్లో అణ చిపెట్టిన కుల రాజకీయాలను ప్రేరేపించడం ద్వారా బీజేపీ ఈసారి కొత్త తరహా అస్తిత్వ రాజకీయాలను సృష్టించవచ్చు. ఈ తరహా రాజకీయాలకు ఆధారం హిందూ సమీకరణే కావచ్చు. పాపులర్ ఓటు ఎక్కడైనా సరే 40 శాతానికి దగ్గరగా వచ్చిందంటే దానర్థం.. రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న హిందూ ఓటర్లలో మూడింట రెండు వంతుల మందిని తనవైపునకు తిప్పుకోవడంలో బీజేపీ విజయం సాధించిందనే. 30 శాతం మేరకు ముస్లిం ఓటర్లు ఉన్న రాష్ట్రంలో హిందువులను తారస్థాయిలో సంఘటితం పర్చుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. 1940లలో హిందూ–ముస్లిం హింసకు కేంద్రబిందువుగా ఉన్న మతపరమైన గతంలోకి బెంగాల్ మరో సారి వెళ్లిపోనుందని దీనర్థం. మనీ, మెషిన్ సరికొత్త పాత్ర బెంగాల్ రాజకీయాల్లో పార్టీల భుజబల ప్రదర్శనకు ఈసారి డబ్బు, ఎన్నికల యంత్రాంగం తోడై నిలిచాయి. భుజబల ప్రదర్శన బెంగాల్ రాజకీయాలకు కొత్త కాదు. 1960లలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఘర్షణలు, ఆ తర్వాత కమ్యూనిస్టుల మధ్య అంతర్గత ఘర్షణలలో దీని పునాదులు మనకు కనిపిస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థులపై వామపక్ష కూటమి పాలన సాగించిన హింసా ప్రయోగం బహిరంగ రహస్యమే. ఈ వారసత్వాన్ని మమతా బెనర్జీ కొనసాగించడమే కాకుండా మరింత వేగవంతం చేసింది. 2018 పంచాయితీ ఎన్నికల్లో టీఎంసీ నాయకులు సాగించిన మితిమీరిన హింసాకాండ పాలకపార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు వామపక్ష సానుభూతిపరుల్లో బలమైన వర్గం తమ విధేయతను బీజేపీవైపు మళ్లించడంతో బీజేపీ ఇప్పుడు అదే హింసను కొనసాగిస్తోంది. ఇకపోతే, రాష్ట్ర చరిత్రలో ఇంత అత్యధికంగా డబ్బు వెదజల్లిన ఎన్నిక ఇదేనని స్పష్టమవుతోంది. బెంగాల్ మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో డబ్బు వెదజల్లుతున్నారు. ఒకసారి ఈ ధోరణి మొదలైందంటే ఇక వెనక్కు పోవడం ఉండదు. పైగా బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత పక్షపాత దృష్టిని ఎన్నికల కమిషన్ ప్రదర్శించడం గమనార్హం. కేంద్రంలోని అధికార పార్టీకి సహాయపడటంతో ఎన్నికల కమిషన్ హద్దులు మీరిపోయింది. చివరగా ఎన్నికల విషయంలో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది రాష్ట్ర చరిత్రలో కొత్త మలుపుగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్న మమత ప్రశాంత్ కిషోర్ టీమ్‌ని ఆహ్వానిం చింది. పీకే టీఎంసీ పార్టీలో సమాంతర వ్యవస్థను సృష్టించారు. కొత్త, పాపులర్ విధానాల రూపకల్పనతో పార్టీకి సరికొత్త ఇమేజీ తేవడంలో పీకే టీమ్ తోడ్పడింది. ఇది మమతను మూడో సారి కూడా అధికార పీఠంపై నిలబెడుతుందా అనేది చెప్పలేం కానీ, బెంగాల్లో రాజకీయ నేతలు, కేడర్లు పాత తరహా ఎన్నికల నిర్వహణవైపు మళ్లడం ఇక అసాధ్యం. భారత రాజకీయాల్లో అనేక ధోరణులకు బెంగాల్ మినహాయింపుగా ఉండేది. ఇక్కడ పార్టీల మధ్య స్పర్థ విశిష్టంగా ఉండేది. రాజకీయ కేడర్ సిద్ధాంతపరమైన భాషలో ప్రచారం సాగించేవారు. కులం, కమ్యూనిటీ, డబ్బు ప్రసక్తి లేకుండా ఎన్నికలు జరిగేవి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న బెంగాల్‌కి ఈ ఎన్నికలు ముగింపు పలకవచ్చు. బెంగాల్ ఒకవైపు, దేశమంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అమెరికన్ శైలి రాజకీయ నిర్వహణగా ఈ ఎన్నికలు మార్చివేయవచ్చు. వ్యాసకర్త: యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా సంస్థాపకులు -
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి
-
బెంగాల్ దంగల్: ‘అమిత్ షా అబద్ధాలు ఇవిగో..’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతోంది. రాజకీయ నాయకుల పరస్పర విమర్శలతో వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2020 అక్టోబర్‌లో ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌లోని ప్రతి జిల్లాలో బాంబు తయారీ కర్మాగారాలున్నాయని వ్యాఖ్యానించారు. మమతపై విమర్శలు చేసే క్రమంలో బెంగాల్‌ను కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడారు. బెంగాల్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమిత్ షా మితిమీరిన వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో బాంబు కర్మాగారాలపై సమాచారం కోసం ఆర్టీఐలో దరఖాస్తు చేయగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎలాంటి సమాచారం లేదని జవాబిచ్చిందని తెలిపారు. ప్రముఖ న్యూస్ చానళ్లు సైతం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని గుర్తు చేశారు. కొన్ని పత్రికలు పక్షపాతవైఖరిని అవలంభిస్తున్నాయని సాకేత్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, సాకేత్ ట్వీట్‌పై నెటిజన్లు, టీఎమ్సీ నాయకులు స్పందించారు. ఎన్నికల్లో లాభం పొందడం కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, అంతేకాకుండా బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీసేలా చూస్తోందని ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా ధ్వజమెత్తారు. బెంగాల్లో ఎలాంటి బాంబు తయారీ కర్మాగారాలు లేవని తేలిందన్నారు. అబద్దపు ఆరోపణలు చేసే బీజేపీ కర్మాగారానికి కొంచెం విశ్రాంతిని ఇవ్వండని హితవు పలికారు. ఇదిలాఉండగా.. బెంగాల్లో బాంబ్ తయారీ కర్మాగారాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ బెంగాల్‌ను ‘రెండో కశ్మీర్’ గా మార్చారని విమర్శలు గుప్పించారు. చదవండి: మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల Not a *single* media house had the spine to report on the fact that Union Home Minister Amit Shah lied on national television. What’s up @aroonpurie? While u shamelessly preach to the Congress on what Opposition should do, why do you get so silent when it comes to the BJP govt? https://t.co/RY6ueQGFmt— Saket Gokhale (@SaketGokhale) March 10, 2021 -
సర్వే సంచలనం
-
బెంగాల్ ఫైట్: బీజేపీ నేత సువేందు అధికారికి నోటీసులు
కోల్‌కతా: బీజేపీ నేత సువేందు అధికారి తనపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. జనవరి 19న ఖేజూరిలో జరిగిన బహిరంగ సభలో తన పరువుకు భంగం కలిగే విధంగా అసత్యమైన ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ సువేందు అధికారికి లీగల్ నోటీసులు పంపారు. 36 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, అతనిపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని అభిషేక్ బెనర్జీ తరపున లాయర్ పేర్కొన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితుడైన సువేందు.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఏంటని అభిషేక్ ప్రశ్నించారు. అహంకారంతో విర్రవీగుతున్న సువేందు.. ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరాలను మరిచిపోయారని ధ్వజమెత్తారు. శారదా చిట్ ఫండ్ స్కాం, నారద లంచం కేసుల్లో సువేందు ప్రమేయాన్ని నోటీసుల్లో ప్రస్థావించారు. అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు. కాగా, గతంలో టీఎంసీ కీలక నేతల్లో ఒకరైన సువేందు.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించారు. ఆయన ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. సువేందుతో పాటు పలువురు టీఎంసీ నేతలు కమల తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార టీఎంసీ, భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మమతను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. -
బెంగాల్ వార్
మోదీ సర్కారుపై జనం అంచనాలు... రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో తృణమూల్ ఎన్ని సీట్లు సాధిస్తుంది? బీజేపీ బలం రెండు నుంచి 15 సీట్లకు దాటుతుందా.... అనే కీలక అంశాలుండటంతో బెంగాల్ ఎన్నికలపై రాజకీయవర్గాల్లో వాడీవేడి చర్చ సాగుతోంది. పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని 42 సీట్లలో 15 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకుంటే దేశ తూర్పు ప్రాంతంలో కూడా బలమైన శక్తిగా అవతరించడానికి వీలవుతుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో కాషాయపక్షం అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. హిందీ రాష్ట్రాల్లోని 225 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 190 గెలుచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఒకవేళ ఈ ప్రాంతాల్లో తనకు తగ్గే సీట్లను పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భర్తీ చేసుకోవాలనే పట్టుదలతో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ముస్లింలు 27 శాతానికి పైగా ఉండడం, 2009 లోక్‌సభ ఎన్నికల నుంచీ సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు ఎన్నికల్లో చతికిలపడడం, మరో పక్క అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ మధ్య బలహీనం కావడం బీజేపీకి ఇప్పుడు కలిసొచ్చే అంశాలయ్యాయి. కిందటి ఎన్నికల్లో మోదీ గాలిలో సైతం బీజేపీ కేవలం రెండు సీట్లనే బెంగాల్లో గెలుచుకోగలిగింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరగకపోయినా కమ్యూనిస్ట్ పార్టీల పునాదులు మరింత కదిలిపోయాయి. బెంగాల్ బెబ్బులి దీదీ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 34 ఏళ్లు ఏలిన మార్క్సిస్టుల బాటలోనే పయనిస్తూ ప్రతిపక్షాలను ప్రధానంగా వామపక్షాల ఉనికిని బాగా దెబ్బతీస్తోంది. తృణమూల్ పాలనలో మార్క్సిస్టుల స్థానంలోకి నెమ్మదిగా బీజేపీ చేరుకోగలిగింది. మమత సర్కారును, తృణమూల్ కాంగ్రెస్ పోకడలను ఢీకొనే స్థితికి బీజేపీ చేరుకోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలన్న పట్టుదల మోదీ–షా ద్వయంలో పెరిగింది. మోదీ, మమతా హోరాహోరీ ప్రచారం మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా ఉధృత స్థాయిలో ప్రచారం చేశారు. మమతపైన వ్యక్తిగత స్థాయిలో వారు తీవ్ర ఆరోపణలు చేశారు. మమత సైతం అంతే దీటుగా బీజేపీ విమర్శలకు జవాబిచ్చారు. పూర్వపు వామపక్షాల సర్కార్ల కంటే ఎక్కువగా మమత ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగోవంతుకుపైగా జనాభా ఉన్న ముస్లింలను బుజ్జగించే విధానాలు అమలు చేస్తోందనీ, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను అనుమతిస్తోందంటూ బీజేపీ నిప్పులు చెరుగుతోంది. గతంలో జరిగిన శారద, నారద కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ తృణమూల్ సర్కారును ఇరుకున పెడుతోంది. అయినా, బీజేపీ ఆర్థికబలం, అంగబలం తృణమూల్‌కు సమానంగా ఉంటాయని మమత ఊహించలేదు. తృణమూల్ నేతలు, కార్యకర్తల దూకుడు ముందు నిలబడలేక పోతున్న సీపీఎం ఒక దశలో తన ఉనికి కాపాడుకోవడానికి బీజేపీకి పరోక్షంగా సాయపడింది. కొన్ని వారాల క్రితం మాల్దాలో అమిత్‌షా బహిరంగ సభను ప్రభుత్వ మైదానంలో జరుపుకోవడానికి మమతా బెనర్జీ సర్కారు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో సీపీఎం సీనియర్ నేత ఒకరు తన సొంత స్థలాన్ని బీజేపీ నేత సభకు అద్దెకు ఇచ్చారని కూడా వార్తలొచ్చాయి. ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో బలపడుతున్న బీజేపీ ఉత్తర బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో బీజేపీ బలపడుతోందని ఈ పార్టీ ఎన్నికల సభలకు హాజరయ్యే జనం, ఎన్నికల ప్రచారం తీరు చూస్తే అర్థమౌతోంది. ఉత్తర బెంగాల్లో కమ్యూనిస్టులు ఊహించని స్థాయిలో పట్టు కోల్పోయారు. ఫలితంగా పాలకపక్షాన్ని ధైర్యంగా ప్రతిఘటించే అవకాశం బీజేపీకి లభించింది. సరిహద్దు జిల్లాల్లో ముస్లింల జనాభాతోపాటు ప్రజల్లో మతపరమైన చీలిక ఉండడం కూడా బీజేపీ ఈ ప్రాంతాల్లో తన పునాదులు బలోపేతం చేసుకోవడానికి దోహదం చేసింది. బీజేపీ కేంద్ర నాయకత్వం బెంగాల్‌పై ఎప్పుడూ లేనంతగా దృష్టి కేంద్రీకరించింది. మొదటి ఐదు దశల పోలింగ్ సమయంలోనూ తృణమూల్ నేతలు, కార్యకర్తలతో బీజేపీ ఢీ అంటే ఢీ అనేలా పోటీపడింది. ఎనిమిదేళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల కొన్ని రంగాల్లో సాధించిన విజయాలతో కొన్ని చోట్ల బాగా బలపడింది. కొన్ని రంగాల్లో దీదీ సర్కారు విధానాల వల్ల కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నాయి. పెరుగుతున్న బీజేపీ బలం పశ్చిమబెంగాల్లో గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలో ఈసారి బీజేపీ పట్టుబిగిస్తోంది. 2014 ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అంచనా వేసినా ఈసారి బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుందని నిపుణులు తేల్చి చెపుతున్నారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను డేటాని బట్టి చూసినా కామ్రేడ్ల స్థానంలో కాషాయం ఆక్రమిస్తున్న విషయం దృఢపడుతోంది. బీజేపీ ఓట్ల శాతం 2014లో 16.8 శాతం ఉంటే అది ఈ ఎన్నికల్లో 23.32 శాతానికి పెరగవచ్చునని భావిస్తున్నారు. అలాగే బీజేపీ సీట్ల శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశాన్ని సర్వేలు నొక్కి చెపుతున్నాయి. దాదాపు 12.7 శాతం ఓట్లు బీజేపీకి పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ నెల 12, 19 తేదీల్లో జరిగే చివరి రెండు దశల ఎన్నికలను తృణమూల్ కాంగ్రెస్ అత్యంత కీలకంగా భావిస్తోంది. ఆరో దశలో పోలింగ్ కనీసం నాలుగు నియోజకవర్గాల్లో ఆదివాసీలదే అధిక జనాభా కావడంతో తృణమూల్ కాంగ్రెస్ వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. చివరి రెండు దశల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఆరోదశలో జరిగే 8 స్థానాల్లో నాలుగింటిలో ఆదివాసీలదే కీలక భూమిక. సరిహద్దు స్థానాల్లో గట్టి పోటీ మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన జార్ఖండ్ సరిహద్దుల్లోని మూడు జిల్లాల పరిధిలో విస్తరించిన ప్రాంతాన్ని జంగిల్ మహల్ గా పిలుస్తారు. ఒకప్పుడు ఇక్కడ సీపీఎం ప్రభావవంతమైన పాత్ర నిర్వహించింది. ప్రస్తుతం ఉనికిని కోల్పోయిన పరిస్థితి.ఈ ప్రాంతంలోని స్థానాల్లో పోటీ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్యే ఉంది. 2014లో తృణమూల్‌కి అత్యధికంగా 54 శాతం ఓట్లను తెచ్చిపెట్టిన స్థానం ఝర్గ్రామే. 42ఏళ్ళపాటు సుదీర్ఘకాలం కమ్యూనిస్టుల పట్టులోనుంచి 2014 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి పులిన్ బిహారీ బాస్కే నుంచి ఈ లోక్‌సభ స్థానాన్ని తృణమూల్ ఉమాసోరెన్ కైవసం చేసుకున్నారు. ఈసారి సీపీఎం అభ్యర్థి దెబ్లీనా హెమ్బ్రామ్పై తృణమూల్ కాంగ్రెస్ బీర్భా సోరెన్‌ను బరిలోకి దింపింది. బీజేపీ నుంచి ఇక్కడ కునార్ హెమ్బ్రం పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మమత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనీ, ప్రజలు మార్పుని కోరుకుంటున్నారనీ విశ్లేషకుల అంచనా. అందుకే మావోయిస్టు ప్రాబల్యంలోని ఈ ప్రాంతాన్ని తమ అదుపులోకి తెచ్చుకునేందుకు మమతా బెనర్జీ నగదు పంపిణీ పథకాలు, ఆదివాసీలకు 2 కిలోల బియ్యం లాంటి పథకాలను ప్రవేశ పెట్టింది. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బీజేపీ వాసనలే లేని ఈ ప్రాంతంలో ప్రస్తుతం బీజేపీ తన బలం పెంచుకుంటోందనడానికి ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి. చివరి దశలో పశ్చిమబెంగాల్లో జరిగే ఎన్నికల్లో తృణమూల్‌కి కీలకస్థానంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీచేస్తోన్న స్థానం డైమండ్ హార్బర్. ఇక్కడ బీజేపీ తరఫున నీలంజన్ రాయ్, సీపీఎం నుంచి ఫౌద్ హలీమ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అభిషేక్ బెనర్జీ మళ్లీ బరిలో నిలిచారు. కమ్యూనిస్టులకు పెట్టని కోటలాంటి జాదవ్‌పూర్‌లో ఈసారి టాలీవుడ్ సినీతార మీమీ చక్రవర్తిని తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సీపీఎంకి పట్టు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థిగా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బికాష్ రంజన్ భట్టాచార్యను బరిలోకి దింపారు. బీజేపీ నుంచి అనుపమ్ హజ్రా బరిలో ఉన్నారు. ఆరో దశ పోలింగ్ జరిగే ప్రాంతాలు తామ్లుక్, కాంతి, ఘాటల్, ఝర్గ్రామ్, మేద్నీపూర్, పురూలియా, బంకూరా, బిష్ణూపూర్ చివరి దశ డమ్‌డమ్, బారాసాత్, బసిర్హాట్, జయనగర్, మథురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, దక్షిణ కోల్‌కతా, ఉత్తర కోల్‌కతా -
పరామర్శకు వచ్చాను.. రాజకీయం చేయను!
కోల్‌కతా: ఫ్లైఓవర్ కూలిన ఘటన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం సందర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో బాధితులకు అండగా నిలబడేందుకు తాను వచ్చానని, అంతేకానీ రాజకీయాలు చేయడానికి కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కోల్‌కతా లో ఫ్లై ఓవర్లో కూలిపోయిన ఘటనలో అనేకమంది సామాన్యుల బతుకులు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసన్సోల్లోని కుల్తీ ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలి చాలామంది చనిపోయారని, దీనిపై రాజకీయాలు చేయకూడదని సీఎం మమతాబెనర్జీ చెప్పారని, అందుకే తాను రాజకీయ ప్రకటనలు చేయడం లేదని పేర్కొన్నారు. బెంగాల్ జరిగిన శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి అని, అయినా దీనిపై మమత ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్-వామపక్షాల పొత్తుతో మరోసారి మమత సర్కార్ రాబోదనే విషయంలో ప్రజలకు అర్థమైందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పించడంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని తెలిపారు.