Berkeley University
-
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్‌లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్‌లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
రాహుల్ ఒక విఫల రాజవంశీయుడు...
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. రాహుల్ ఒక విఫల రాజవంశీయుడని విమర్శించారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో తన విఫల రాజకీయం గురించి చెప్పుకోవడమే దారుణమని, విదేశాల్లో ప్రధాని నరేంద్రమోదీని తక్కువ చేస్తూ మాట్లడటంసహించరానిదని ఆమె స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. భారత్‌లో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను చూస్తే కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయా లేదా అన్నది రాహుల్‌కు అర్ధమవడం లేదా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లోనే భారత ప్రజలు గాంధీ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పట్టారని, ప్రధాని నరేంద్రమోదీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా ఆమె స్పష్టంచేశారు. అంత పెద్ద వేదికపై నేతల అహంకారమే కాంగ్రెస్‌ను దెబ్బతీసిందని రాహుల్ అనడమే దారుణమని స్మృతి ఇరానీ విమర్శించారు. -
హింస వల్లే తండ్రి, నానమ్మలను కోల్పోయా!
నోట్ల రద్దు ఏకపక్ష నిర్ణయం వారసత్వ రాజకీయాలు తప్పట్లేదు మోదీ మంచి వక్త.. కానీ... అందుకే ఎన్నికల్లో ఓడిపోయాం బర్క్లీ యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ సాక్షి, వాషింగ్టన్: భారత్ తప్ప మరేయితర ప్రజాస్వామిక దేశం అత్యధిక జనాభాను పేదిరికం నుంచి బయట పడేలేకపోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికా బర్క్లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం ఆయన ప్రసంగించారు. భారత్‌లో సమకాలీన పరిస్థితులపై ఆయన ఉపన్యసించారు. దేశ ప్రజలను ఐక్యం నిలిపింది ఒక్క అహింస మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. అయితే మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ అహింసపైనే ఇప్పుడు కొందరు దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. కోపం, హింస వినాశనానికి దారితీస్తుందన్న రాహుల్ రాజకీయ వైషమ్యాలు పతనం వైపు నడిపిస్తాయని చెప్పారు. 1984 అల్లర్ల అంశాన్ని ఉటంకిస్తూ... న్యాయం కోసం పోరాడే వారికి తాను మద్ధతుగా ఉంటానని, హింసను ఖండిస్తానని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీలను హింసే బలితీసుకున్నాయని.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకే తెలసని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్ష, వామపక్ష రహిత(లెఫ్ట్ ఆర్ రైట్) దేశాల్లో దేని వైపు భారత్ ఉంటుందన్న ప్రశ్నకు .. తాము ముక్కుసూటిగా(స్ట్రెయిట్) గా ఉంటామని ఇందిర చెప్పేవారని ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు. ప్రజాస్వామిక వాతావరణంలో అత్యధిక ఉద్యోగాల కల్పన చేపడుతున్న దేశాలు చైనా, భారత్ మాత్రమేనని రాహుల్ అన్నారు. అయితే ఆర్థిక సలహాదారుల, చట్ట సభలను సంప్రదించకుండా డీమానిటైజేషన్ లాంటి నిర్ణయం తీసుకోవటం ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సంప్రదింపుల ద్వారానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప బలవంతంగా ప్రజలపై తమ అభిప్రాయాలను రుద్దబోదని స్పష్టం చేశారు. 2012 సమయంలో పార్టీలో కొందరు నేతల మధ్య అహంకారం పెరిగిపోవటం మూలంగానే ఓటమి పాలయ్యామని ఆయన అన్నారు. కీలక బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న రాహుల్.. అది మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం.. పార్టీ అధిష్టానం నిర్వహించే ఎన్నికలు.. ఇలా ఓ క్రమపద్ధతి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రజాస్వామిక పరిస్థితులు కాస్త భిన్నంగా తయారయ్యాయని.. వారసత్వ పాలన పరిస్థితులే కనిపిస్తున్నాయని అఖిలేష్ యాదవ్, స్టాలిన్, చివరకు సినిమాల్లో అభిషేక్ బచ్చన్. వ్యాపార రంగంలో అంబానీ తనయుడు ఇలా పలువురి పేర్లను చెప్పుకొచ్చారు. రాజకీయంగా తనపై వస్తున్న సెటైర్లపై ఓ ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. వెయ్యి మందితో కూడిన ఓ బీజేపీ యాంత్రంగం కంప్యూటర్ల ముందు కూర్చుని తనను తిడుతున్నారని, దేశాన్ని నడిపించే ఓ పెద్దాయన వారిని ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. తొమిదేళ్ల పాటు మన్మోహన్, చిదంబరం, జైరామ్ రమేశ్ లాంటి రాజకీయ వేత్తలతో తాను జమ్ము కశ్మీర్ వ్యవహారంపై పని చేశానని, తమ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఉగ్ర వాదం జాడలు లేకుండా పోయిందని... కశ్మీర్ లో శాంతి కూడా నెలకొందని రాహుల్ అన్నారు. ముఖ్యంగా మన్మోహన్ హయాంలో 2013 లో ఉగ్రవాద నడ్డివిరిచిన సమయంలో తాను సంతోషంతో మన్మోహన్ సింగ్‌ను హత్తుకుని మనం సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని చెప్పానని రాహుల్ గుర్తు చేశారు. కశ్మీర్ అధికార పార్టీ పీడీపీ యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పని చేసిందని.. కానీ, ఎప్పుడైతే బీజేపీతో చేతులు కలిపిందో.. అప్పుడే మోదీ పీడీపీని సర్వనాశనం చేశారని రాహుల్ అన్నారు. మోదీ హయాంలోనే కశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదులు చెలరేగిన పోతున్నారని.. హింస కూడా చెలరేగి పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని పేర్కొన్నారు. అయితే మోదీ ఓ మంచి వక్త అన్న రాహుల్.. ఒక జనసందోహంలో ఉన్న మూడు నాలుగు గ్రూపులకు సముదాయించేలా మాట్లాడటం ఒక్క మోదీకే చెల్లతుందని చెప్పారు. కానీ, పార్టీలో తనతో పాటు పని చేసే సభ్యులతో మాత్రం ఆయన(మోదీ) సంబంధం లేనట్లు ఉంటారని.. ఈ విషయం బీజేపీ పార్టీకి చెందిన కొందరు నేతలు తనతో చెప్పారని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తమ గుప్పిట్లో పెట్టుకోవటం మూలంగా ప్రభుత్వ లోపాలను, అవినీతిని సమాజానికి తెలియజేయాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నానికి ఆటంకంగా మారిందని రాహుల్ గాంధీ తెలిపారు.