Better treatment
-
మెరుగుపడిన ఆరోగ్యం..‘విశ్వభారతి’ నుంచి శ్రీలక్షి డిశ్చార్జి
సాక్షి ప్రతినిధి కర్నూలు : ఎంపీ అవినాశ్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను విశ్వభారతి ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. తదుపరి చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. తల్లి వెంట అవినాశ్ కూడా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనతో పాటు పలు వురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆస్పత్రి నుంచి అవినాశ్ బయటకు రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. మరోవైపు.. డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా ఎల్లో మీడియా శుక్రవారం ఉదయం నుంచి అవినాశ్ లక్ష్యంగా తప్పుడు కథనాలే ప్రసారం చేసింది. శ్రీలక్ష్మి డిశ్చార్జ్ కాగానే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టుచేస్తారని బ్రేకింగ్‌లు, డిబేట్లు నిర్వహించింది. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిపై, ఆమె బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌పై కనీస మానవత్వం లేకుండా చికిత్సపై, అవినాశ్ అరెస్టుపై ఇష్టారాజ్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన అవినాశ్ అక్కడ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘అమ్మ ఆరోగ్యం బాగుంది. గుండెలో రక్తనాళాలు బ్లాక్ కావడంతో తదుపరి చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాం. అమ్మను పరామర్శించేందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీడియాకు ఏదైనా ఇబ్బందులు జరిగి ఉంటే మనసులో పెట్టుకోవద్దు’.. అని ఆయన చెప్పారు. చేరిక నుంచి డిశ్చార్జ్ వరకూ తప్పుడు కథనాలే! అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరిన శ్రీలక్ష్మిని చూసేందుకు ఈ నెల 19న హైదరాబాద్ నుంచి అవినాశ్ పులివెందులకు బయల్దేరారు. పుల్లూరు టోల్గేట్ వద్ద సీబీఐ అధికారులు ఉన్నారని, అవినాశ్‌ను అరెస్టుచేయబోతున్నారని ‘పచ్చ’ చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. నిజానికి ఆ రోజు సీబీఐ అధికారులే రాలేదు. 20న కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేయబోతున్నారని ప్రచారం చేశారు. 22న సీబీఐ అధికారులు ఎస్పీని కలిశారని.. ఇక్కడి పోలీసుల సహకారం లేకపోవడంతో మధ్యాహ్నానికి కేంద్ర బలగాలు రానున్నాయని, కాసేపట్లో కర్నూలుకు చేరుకుంటాయని, అవినాశ్ అరెస్టు తప్పదని రోజంతా ఏబీఎన్, టీవీ5లో గంటల తరబడి డిబేట్లు నడిపించారు. కానీ, కేంద్ర బలగాలు కర్నూలుకు రాలేదు. అవినాశ్ ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులూ ‘ఈరోజు అరెస్టు తప్పదు’ అనే కోణంలోనే ప్రసారం చేశారు. చివరకు శ్రీలక్ష్మి శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని విశ్వభారతి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దీంతో సీబీఐ అధికారులు కర్నూలులో రహస్య ప్రాంతాల్లో ఉన్నారని, డిశ్చార్జ్ కాగానే అరెస్టుచేస్తారని కథనాలు ప్రసారం చేశారు. ఇలా వారం రోజులుగా ఎల్లో మీడియా చెప్పిన ఏ ఒక్కటి జరగలేదు. ఒక్క వార్తలోనూ వాస్తవంలేదు. దీంతో ఎల్లో మీడియా అవినాశ్ లక్ష్యంగా ఎలాంటి తప్పుడు వార్తలు రాసిందో ప్రజలకు స్పష్టమైంది. శ్రీలక్ష్మి ఆరోగ్యంపైనా తప్పుడు వార్తలే.. పులివెందులలో శ్రీలక్ష్మి ఇంట్లో బీపీ వచ్చి పడిపోవడంతో ఉన్నత వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలులో విశ్వభారతి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కార్డియాక్ ఎంజైమ్‌లో మార్పులు వచ్చాయని, ఈసీజీ తీశామని, రెండు రక్తనాళాలు కూడా బ్లాక్ అయ్యాయని డాక్టర్ హితేశ్‌రెడ్డి మీడియాకు చెప్పారు. కానీ, శ్రీలక్ష్మి ఆరోగ్యం బాగానే ఉందని, సీబీఐ నుంచి తప్పించుకునేందుకు అవినాశ్ తల్లిని పావుగా చేసుకున్నారనే కోణంలో కనీస మానవత్వం లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. టీడీపీ వ్యక్తులు, మద్దతుదారులతో డిబేట్లు నడిపించారు. చివరకు.. ఆవిడకు బీపీ ఎక్కువై అయానోట్రోపిక్ సపోర్ట్‌తో ఉన్నారని వైద్యులు చెప్పినా తప్పుడు వార్తలకు ఫుల్స్టాప్ పెట్టలేదు. బుధవారం రాత్రి నుంచి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగవుతూ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. రెండు రక్తనాశాలు బ్లాక్ కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీంతో పచ్చ చానళ్ల ప్రసారాల్లో ఏమాత్రం నిజంలేదని అందరికీ తేటతెల్లమైంది. -
మా కుమారుడికి మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, హైదరాబాద్ : తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించాలని చెంగిచర్ల ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనలో గాయపడిన వెంకట్‌నాయక్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వెంకట్ నాయక్ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను చెన్నయ్‌లో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. -
చిన్నారికి పెద్ద కష్టం
♦ పదోతరగతి చదువుతుండగా బ్లడ్ క్యాన్సర్ ♦ వైద్యం కోసం సహకరించని ఆర్థిక పరిస్థితి ♦ తల్లడిల్లుతున్న నిరుపేద కుటుంబం ♦ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.. సాలూరురూరల్ (పాచిపెంట) : మండలంలోని కేసలి పంచాయతి పరిధి మడవలస గ్రామానికి చెందిన బంటు జోగయ్య, మంగమ్మలది నిరుపేద గిరిజన కుటుంబం. నిర్వాసితులు. సెంటు భూమి లేదు. ప్రభుత్వం కట్టించి ఇచ్చే గూడులో కాలం వెళ్లదీస్తున్నారు. ఆలుమగలిద్దరూ కూలిపనులు చేస్తూ ఇద్దరు పిల్లలను సాకారు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. చిన్న కుమార్తె సాయిను పాచిపెంట కేజీబీవీలో చేర్పించారు. కుమార్తె చక్కగా చదువుకుంటుంటే సంబర పడ్డారు. తమ కష్టానికి ఫలితం దక్కుతుందని, ఉద్యోగం సాధిస్తుందని ఆశపడ్డారు. బాలిక పదోతరగతి చదువుతుండగా బ్లడ్ క్యాన్సర్ సోకింది. చిన్నారి ఆరోగ్యాన్ని ఛిదిమేసింది. ఆస్పత్రుల పాలచేసి చదువుకు దూరం చేసింది. చిన్నారి ఆరోగ్యాన్ని బాగుచేయించేందుకు ఉన్నకాడికి అప్పులు చేశారు. రూ.3 లక్షలు వ్యయం చేశారు. ఇప్పుడు నెలకు మందుల ఖర్చుకోసం రూ.2500 ఖర్చవుతోంది. ఆస్పత్రులకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. చేపలవేటతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న జోగయ్య,మంగమ్మలు కుమార్తె ఆరోగ్య పరిస్థితిని చూసి తల్లడిల్లుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు దయతలచి చదువుల తల్లిని కాపాడాలంటూ ప్రాథేయపడుతున్నారు. -
నేరెళ్ల బాధితుల వద్దకు డాక్టర్లను పంపండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల బాధితుల వద్దకు వరంగల్ ఎంజీఎంకు చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రా పురం గ్రామాలకు చెందిన ఆరుగురు బాధితు లను పరీక్షించి, వారి ఒంటిపై ఉన్న గాయాలు, వాటి తీవ్రత తెలుసుకోవాలని స్పష్టం చేసింది. ఆ వివరాలను రాతపూర్వకంగా నివేదిక రూపంలో నమోదు చేయాలని స్పష్టం చేసింది. బాధితులకు మరింత మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్య దర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలు, డాక్టర్ల నివేదిక తమ ముందుం చాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన దళితులపై పోలీసులు జరిపిన దాడిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే బాధితులను నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ బుధవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ ప్రారంభించింది. లారీల వల్ల స్థానికులు చనిపోతున్నారు తంగళ్లపల్లి వాగు నుంచి ఇసుక తీసుకుని నేరెళ్ల, జిల్లెల్ల, రామచంద్రాపురం మీదుగా రాత్రీపగలు ప్రతీరోజూ 150–200 లారీలు వెళుతున్నాయని విచారణ సందర్భంగా రఘునాథ్ చెప్పారు. దీనివల్ల ఆ గ్రామాల్లో తీవ్ర వాయు కాలుష్యంతోపాటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల మరణాలు కూడా చోటుచేసుకున్నాయని వివరించారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఈ మూడు గ్రామాల ప్రజలు అధికారులను కోరినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. పోలీసుల దెబ్బలకు బాధితుల అవయవాలు దెబ్బతిన్నాయని, వారికి తక్షణమే మెరుగైన వైద్యసాయం అందకుంటే శాశ్వతంగా ఆ అవయవాలు పనిచేయకుండా పోతాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎంజీఎంలో చికిత్సనందిస్తాం: ఏజీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపి స్తూ.. గతనెల 13న పీయూసీఎల్ నిజ నిర్ధారణ కమిటీ సంబంధిత గ్రామాలకు వెళ్లిందని, పిటి షన్ మాత్రం ఇప్పుడు దాఖలు చేశారన్నారు. పిటిషనర్ ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారికి చికిత్సను అందజే స్తామన్నారు. అయితే అంతకన్నా ముందు ఇద్దరు ఎంజీఎం వైద్యులను బాధితులు చికిత్స పొందుతున్న మనోరమ ఆసుపత్రికి పంపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదే శించింది. ఈ సమయంలో రఘునాథ్ జోక్యం చేసుకుంటూ.. డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్ వైద్యులను పంపాలని కోరారు. ముందు బాధి తులకు చికిత్స అందించడానికి ప్రాధాన్యం ఇద్దామని, అవసరమైతే ఫోరెన్సిక్ డాక్టర్లను పంపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎమ్మెల్సీ బోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడ సిటీ : బస్సు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వైద్యులను కోరారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అలాగే క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, నాయకులు కోమలి సత్యనారాయణ, విత్తనాల రమణ, కడియాల చిన్నబాబు తదితరులు ఉన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శ క్షతగాత్రులను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. వీరికి అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకుని, వీరికి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాయపడిన 12 మందిలో ముగ్గురిని డిశ్చార్జి చేశారని, మిగిలిన 9 మంది వైద్యం పొందుతున్నారని తెలిపారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఆలీం బాషా, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్ ఉన్నారు. -
మెరుగైన వైద్యం అందించాలి
ఏటూరునాగారం : ఏజెన్సీలోని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మా రెడ్డి అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీల్లోని సమస్యలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే మెరుగైన వైద్యం తెలంగాణ రాష్ట్రం లో అందుతుందనే స్థాయికి తీసుకెళ్లాలన్నారు. సర్కారు వైద్యంపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా వైద్య చికిత్సలు ప్రజలకు అందాలని కోరారు. ఈ రెండేళ్ల పాలనలో సర్కారు దవాఖానాల్లో ఓపీ, ఐపీ, డెలవరీలు పెరిగాయని వివరించారు. వరంగల్‌కు హెల్త్ హెడ్ క్వార్టర్‌గా పేరు రావడానికి స్థానిక మంత్రి చందూలాల్, జిల్లా కలెక్టర్ కరుణ, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కృషే కారణమన్నారు. వందశాతం సౌకర్యాలు కల్పిస్తాం సీఎస్సీలు, పీహెచ్‌సీలకు వంద శాతం సౌకర్యాలు కల్పించే బాధ్యత తమదని, మెరుగైన చికిత్సలు అందించే బాధ్యత వైద్యులపై ఉందని మంత్రి అన్నారు. ఇష్టంతో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని, డుమ్మాకొట్టే సిబ్బంది, వైద్యులపై చర్యలు తప్పవన్నారు. స్థానిక సామాజిక ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ 15 రోజుల్లో చేసేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే పహరీ నిర్మాణంతోపాటు కౌంటింగ్ మిషన్, అల్ట్రా సౌండ్ స్కానర్, బెడ్స్, ప్రసూతి ఆస్పత్రికి సామగ్రి అందజేస్తామన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టిపెట్టాలి ఏజెన్సీలో సీజనల్ వ్యాధులపై అందరూ దృష్టిపెట్టాలని మంత్రి సూచించారు. 75 వేల దోమ తెరలు కావాలని మలేరియా జిల్లా వైద్యాధికారి పైడిరాజు మంత్రిని కోరారు. అవి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రం నుంచైనా వచ్చేలా చూస్తానని మంత్రి అన్నారు. ప్రతి ఆస్పత్రిలో ల్యాబ్ పరీక్షలు జరగాలని, బయటకు పంపించొద్దని చెప్పారు. పరీక్షలతో రోగాలు తెలిసి సరైన వైద్యం అందుతుందన్నారు. కళాజాత ప్రోగ్రాంలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావును ఆదేశించారు. మూఢనమ్మకాలు వీడాలి ఏజెన్సీ ప్రజలు మూఢనమ్మకాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, వాటిని వీడాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్ అన్నారు. రొయ్యూర్ పీహెచ్సీలో వైద్యులు లేక రోగులు రావడం లేదని, మూడు నెలల వరకు రోగుల సంఖ్య పెంచాలని వైద్యాధికారి రవికుమార్‌ను ఆదేశించారు. హరితహారం కూడా వైద్యశాఖకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో పీఓ అమయ్‌కుమార్, జెడ్పీటీసీ వలియాబీ, ఎంపీపీ మెహరున్నీసా, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీసీహెచ్ఓ సంజీవయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ అప్పయ్య, ఏపీఓ వసంతరావుతోపాటు అధికారులు పాల్గొన్నారు. అనంతరం సీజనల్ వ్యాధులపై రూపొందించిన పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. -
మండే మైగ్రేన్
త్వరలో మైగ్రేన్ నొప్పికి మరింత మెరుగైన చికిత్స! కళ్లు మిరుమిట్లు గొలుపుతూ వెలుగుతూ ఆరుతూ (ఫ్లిక్కరింగ్) ఉన్న శక్తిమంతమైన కాంతిపుంజాలతో ఒకవైపు నొప్పి అని పిలిచే పార్శ్వపు నొప్పి వచ్చేస్తుంది. పైగా ఈ వేసవిలోని అత్యధిక కాంతికి మైగ్రేన్ సాధారణం. దీనికితోడు సమ్మర్ సెలవులంటూ ఈతకు వెళ్లేవారిలోనూ మైగ్రేన్ కనిపిస్తుంటుంది. వీకెండ్, ఆదివారాల్లో విశ్రాంతిగా ఉండే... సోమవారంనాడు తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్లాల్సివచ్చి... తీవ్రమైన ఒత్తిడికి గురైనా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ ఎంతకూ తగ్గని వ్యాధిగా పేరొందింది. ఒకవేళ తగ్గినా మళ్లీ మళ్లీ వచ్చే వ్యాధి అనే అపప్రథా ఉంది. దీని బాధ అంతా ఇంతా కాక అనుభవించేవారికే తెలుస్తుంది. అయితే ఇటీవల దీన్ని తీవ్రతను తగ్గించేందుకు, గతంలో ఉన్న సంప్రదాయ మందులు, చికిత్స ప్రక్రియల స్థానంలో సాధ్యమైనంత త్వరలోనే చాలా కొత్తదైన ఓ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రానుంది. మైగ్రేన్ గురించి వివరాలతో పాటు... త్వరలో అందుబాటులోకి రానున్న ఆ సరికొత్త చికిత్స గురించి తెలుసుకుందాం... యువతీయువకులు తమ బాల్యం వీడి యుక్తవయసులోకి వచ్చే సమయంలో చాలామందిలో కనిపించే ఈ వ్యాధి యువతుల్లో మరీ ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడేవారిలో 70 శాతం మంది కౌమార బాలికలే (అడాలసెంట్ గళ్స్). చాలా సందర్భాల్లో ఇది నుదుటికి ఒకవైపే వస్తుంది కాబట్టి మన వాడుక భాషలో దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా వ్యవహరిస్తుంటారు. దోహదపడే అంశాలు ఎన్నో అంశాలు మైగ్రేన్‌కు దోహదపడు తుంటాయి. అవి... తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలసట (మానసిక, శారీరక) పెద్ద శబ్దాలు కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతులు ఘాటైన దుర్వాసనలు డీహైడ్రేషన్ ఎక్కువ ఉపవాసాలు చేయడం, నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం చాక్లెట్లు ఎక్కువగా తినడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. ఆల్కహాల్ లేదా నైట్రేట్ పాళ్లు ఉండే కొన్ని మందులతో మైగ్రేన్ వస్తుంది లేదా మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుత చికిత్స సాధారణంగా మైగ్రేన్ ఉన్నవారికి రెండు రకాల చికిత్స చేస్తుంటారు. ఒకటి తక్షణం నొప్పి తగ్గించేందుకు మందులు ఇస్తుంటారు. దీన్ని అబార్టివ్ ట్రీట్మెంట్గా పేర్కొంటారు. దీనికి తోడుగా మైగ్రేన్ మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మందులు ఇస్తారు. దీన్ని ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అని వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్‌ను మామూలు తలనొప్పిగా భావించి, తలనొప్పి తగ్గేందుకు ఇచ్చే ఇబుప్రొఫెన్, కాంబీఫ్లామ్, సారిడాన్ వంటి సాధారణ నొప్పి నివారణ మందులు ఇస్తే అది మందులకు లొంగని మొండి వ్యాధిగా పరిణమిస్తుంది. ఈ పరిస్థితినే ‘ఎన్ఎస్ఏఐడీ రీబౌండ్ హెడేక్’ అంటారు. అబార్టివ్ చికిత్స నొప్పి వచ్చినప్పుడు తక్షణ చికిత్స కోసం కొన్ని అరుదైన ఎన్ఎస్ఏఐడీ (నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వాడతారు. నొప్పి తరచూ వస్తుంటే ట్రిప్టాన్స్, ఎర్గాట్స్ అనే మందులు ఉపయోగిస్తారు. ఫ్రొఫిలాక్టిక్ చికిత్స కాల్షియుం ఛానెల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ వంటి వుందులు ఇస్తారు. యాంటీడిప్రెస్సెంట్స్ కూడా ఇస్తారు. ఇక బొటాక్స్తోనూ చికిత్స చేస్తారు. ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. కాబట్టి మైగ్రేన్‌కు దోహదపడే అంశాలను పాటిస్తూ దాన్ని రాకుండా నివారించుకోవడం అవసరం. లేకపోతే అది ఏదో దశలో మళ్లీ మళ్లీ కనిపిస్తూ బాధించే అవకాశాలున్నాయి. కొన్ని పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు కొన్ని సందర్భాల్లో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ ఆకస్మికంగా తగ్గిపోవచ్చు లేదా రావచ్చు. ఉదాహరణకు రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్ వచ్చిన) మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల అంతకు ముందు వచ్చే మైగ్రేన్ తలనొప్పి ఆకస్మికంగా మాయం కావచ్చు. లేదా ఇంకొంతమందిలో ఆకస్మికంగా మొదలుకావచ్చు. గర్భం దాల్చిన మహిళల్లో 70 శాతం మందిలో ఇది ఆకస్మికంగా తగ్గిపోవచ్చు. పొరబాట్లకు తావిచ్చేదిలా కొంతమంది చిన్న పిల్లలలో మైగ్రేన్ తన మామూలు లక్షణాలతో కాకుండా కాస్త వేరుగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు వాంతుల వంటివి. దాంతో ఒక్కోసారి కొందరు డాక్టర్లు సైతం దీన్ని మైగ్రేన్‌గా గాక... అపెండిసైటిస్‌గా పొరబడే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్లో దీన్ని నిర్ధారణ చేసే సమయంలో చాలా నిశితంగా, అప్రమత్తంగా ఉండాలి. + త్వరలోనే తాజాగా అందుబాటులోకి రానున్న సరికొత్త చికిత్స ప్రక్రియ... ఇప్పుడు ఒక సరికొత్త చికిత్స ప్రక్రియను త్వరలోనే మైగ్రేన్ బాధితులకు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు, డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా లాపరోస్కోపిక్ చికిత్సతో ముక్కు లోపలే ‘నూడుల్స్’ (స్పాఘెటీ) షేప్‌లో ఉండే ఒక పైప్ లాంటి దాన్ని అమర్చుతారు. అందులో నొప్పినివారణ మందు అయిన ‘లిడోకెయిన్’ (జైలోకెయిన్) నిండి ఉంటుంది. పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు ఇందులోంచి కొంత మోతాదులో మందు విడుదల అవుతూ ఉంటుంది. 1 నుంచి 10 వరకు నొప్పి స్థాయులు ఉండే నొప్పిని కొలిచే స్కేలుపై 8.25 నొప్పి తీవ్రతతో బాధపడుతున్న 112 మంది మైగ్రేన్ బాధితులకు ప్రయోగాత్మకంగా ఈ తరహా చికిత్స చేశారు. వారిలో ఒక నెల తర్వాత 88 శాతం మందికి నొప్పి చాలావరకు తగ్గడమో లేదా పూర్తిగా తగ్గడమో జరిగింది. అయితే తీవ్రంగా నొప్పి వచ్చే సమయంలో మాత్రల అవసరం లేకుండా నొప్పిని తగ్గించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ రాకుండా ప్రొఫిలాక్టిక్ చికిత్స కోసం వాడే మందులు ఇస్తారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే ‘‘ద యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ’’ సమావేశాల్లో ఈ సరికొత్త పరిశోధన ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు. డాక్టర్ పద్మ వీరపనేని సీనియర్ న్యూరో అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఆ సీఎం మాట తప్పారు.. మరి కేసీఆర్..?
చేవెళ్లః ‘చేవెళ్లలో ప్రస్తుతమున్న ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు అభివృద్ధి చేస్తాం. కొద్ది రోజుల్లోనే మీ ఆశలు నెరవేరుతాయి. గ్రామీణ ప్రజలకు మరింత ఆధునిక, మెరుగైన వైద్యం లభిస్తుంది’ ఇవి.. 2012లో ఇందిరమ్మ బాటలో భాగంగా చేవెళ్లలో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాటలు. ఆ మాటలు మాట్లాడి రెండేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతమున్న 50 పడకల ఏరియా ఆస్పత్రి కూడా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఆస్పత్రి గురించి ప్రస్తుత సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆస్పత్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. చేవెళ్లలో కమ్యూనిటీ ఆస్పత్రిని అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ఏర్పాటు చేయించారు. 30 పడకలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అప్పట్లో ప్రసూతి శస్త్రచికిత్సలు చేసేవారుకాదు. వైద్యులు ఒకరిద్దరు మాత్రమే ఉండటంతో పేదలకు వైద్యం అందడమే గగనంగా మారింది. 2002లో మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డి చేవెళ్ల ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా స్థాయిని పెంచారు. అయినప్పటికీ సేవల్లో మార్పులేకపోవడంతో స్థానికులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించక తప్పేది కాదు. 2008లో శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభం కావ డంతో బెంగుళూరు- ముంబయి మార్గంలో వాహనాలను షాద్‌నగర్ నుంచి చేవెళ్ల మీదుగా కంది వద్ద హైవే రోడ్డుకు దారిమళ్లించారు. దీంతో ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాల సంఖ్య కూడా తీవ్రమైంది. అప్పట్లో నిత్యం ఐదారు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అత్యవర సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చినా సౌకర్యాల ఏర్పాటులో అధికారులు విఫలమయ్యారు. కనీస సౌకర్యాలు కరువు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీసం మరుగుదొడ్లు, రోగులకోసం వచ్చే సహాయకులకు ఉండడానికి వసతిలేకపోవడం, రాత్రివేళల్లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం లాంటి సమస్యలు రోగులపాలిట శాపంగా పరిణమించాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ప్రతిసారి బెడ్లు చాలక మహిళలను ఒక్కో మంచంపై ఇద్దరిని లేకపోతే నేలపై పడుకోబెట్టడమో జరుగుతోంది. సర్జన్లు, ప్రసూతి, మత్తు, పిల్లలు, దంత వైద్యులు ఉన్నా తగిన యంత్రాలు లేకపోవడం, ఉన్నా అవిసరిగా పనిచేయకపోవడంతో వారి సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే పరిస్థితి లేకుండాపోయింది. స్థాయి పెంచితే ఎంతో లాభం చేవెళ్ల ఏరియా ఆస్పత్రి స్థాయి పెంచితే ఎన్నో సౌకర్యాలు సమకూరుతాయి. వైద్యనిపుణులు, వైద్యులు, సిబ్బంది, స్టాఫ్ నర్సుల సంఖ్య పెరుగుతుంది. రేయింబవళ్లు అందుబాటులో వైద్యులుంటారు. తాగునీరు. బాత్రూంలు తదితర కనీస సౌకర్యాలుంటాయి. అంతేకాకుండా ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లు మరిన్ని రోగులకోసం అందుబాటులో ఉంటాయి. ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు. కేసీఆర్ హామీ నెరవేరేనా.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇటీవల టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చేవెళ్ల, శంకర్‌పల్లిలో ఆస్పత్రుల స్థాయిపెంచి ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అయితే కనీసం కేసీఆర్ అయినా ఈ హామీని నెరవేరుస్తారో లేక గత సీఎంలాగే మళ్లీ నిరాశకే గురిచేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.