Bhadradri Power Plant
-
సమగ్ర నివేదిక సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా ప్రమాదానికి లోనైన యూనిట్–1ను పునరుద్ధరించి విద్యుదుత్పత్తిని పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. మధిరలో జెన్కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అగ్నిప్రమాదాన్ని తనిఖీ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి బీహెచ్ఈఎల్ నిపుణుల బృందం వస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు. ఆ తర్వాతే నష్టంపై పూర్తి అంచనాకు రాగలుగుతామన్నారు. బీటీపీఎస్‌కు రూ.25 కోట్ల నష్టం!జాగ్రత్తలన్నీ తీసుకున్నా పిడుగు పడిందన్న అధికారులు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణకు 45 నుంచి 60 రోజులు!మణుగూరు టౌన్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం రాత్రి పిడుగు పడటంతో జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలంగాణ జెన్కో అధికారులు అంచనాకు వచ్చారు. జెన్కో థర్మల్ విభాగం డైరెక్టర్ బి.లక్ష్మయ్య, సీఈ బి.రత్నాకర్... బీటీపీఎస్ సీఈ బిచ్చన్నతో కలిసి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ పిడుగు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా పిడుగుపడినట్లు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు గుర్తించామని తెలిపారు. ఇందుకుగల కారణాలపై విచారణ చేపడుతున్నామన్నారు. మరోవైపు 270 మెగావాట్ల ఒకటో యూనిట్‌లోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్, ఇతర పరికరాలు దగ్ధమవగా పునరుద్ధరించడానికి 45 నుంచి 60 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ను విడదీసే పనిలో నిమగ్నమయ్యారు. తప్పిన భారీ ప్రమాదం.. జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో 80 వేల లీటర్ల లిక్విడ్ ఆయిల్ ఉండగా పిడుగుపాటుతో దాని బుష్‌ల నుంచి ఆయిల్ లీక్ అయి మంటలు ఎగసిపడ్డాయని అధికారులు చెబుతున్నారు. మంటలు దగ్గరలోని జనరేటర్‌కు వ్యాపించి ఉంటే మొత్తం యూనిట్–1 దగ్ధమై ఊహించలేని ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ కేంద్రాల రక్షణపై పిడుగు!
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులోని 1,080 (4్ఠ270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై శనివారం రాత్రి పిడుగు పడటం రాష్ట్రంలోని కీలక థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించే పటిష్ట ఏర్పాట్లు ఉన్నా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడటం అనేక సందేహాలకు తావిస్తోంది. పిడుగుల నుంచి రక్షణ కల్పించేందుకు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ లైట్నింగ్ అరెస్టర్లు, ఎర్తింగ్ టవర్లు, ఎర్త్పిట్ల వంటి రక్షణ వ్యవస్థలన్నీ విఫలం కావడంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగు పడినా మంటలు వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి నైట్రోజన్ ఇంజెక్షన్, స్ప్రింక్లర్ల వ్యవస్థలు సైతం అనుకున్న రీతిలో పనిచేయలేదన్న చర్చ జరుగుతోంది. దీంతోనే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒకటో యూనిట్‌కు సంబందించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమైనట్లు కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థల డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణలో లోపాలతోనే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.దీంతో రూ. వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టులో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 9 మంది ఇంజనీర్లు, ఇతర సిబ్బంది మృతిచెందడం తెలిసిందే. నాటి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించినా వారిపై జెన్కో యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. అందువల్లే ఆ తరహాలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ వ్యవస్థలన్నీ విఫలం... భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఒక్కో యూనిట్లో 16.8 కేవీ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్‌ను 400 కేవీ సామర్థ్యానికి పెంచితేనే గ్రిడ్‌కు సరఫరా చేయడానికి వీలవుతుంది. ఆ పనిని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు చేస్తాయి. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రాంతాన్ని స్విచ్యార్డ్గా పిలుస్తారు. అక్కడ సబ్ స్టేష న్కు సంబంధించిన అన్ని పరికరాలు ఉంటాయి. పిడుగుల నుంచి రక్షణ కల్పించడానికి స్విచ్‌యార్డ్ చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 400 కేవీ విద్యుత్ బయటకు సరఫరా అయ్యే చోట ఓ లైట్నింగ్ అరె స్టర్ ఉంటుంది.వెలుపలి ప్రాంతాల్లో ఎక్కడైనా పిడ గు పడినా స్విచ్యార్డ్కి అధిక వోల్టేజీ సరఫరా కాకుండా ఈ లైట్నింగ్ అరెస్టర్ రక్షణగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిడుగు నేరుగా స్విచ్‌యార్డ్ మీద పడినా ప్రమాదం ఉండకుండా దాని చుట్టూ టవర్లు ఉంటాయి. ఆ టవర్లన్నింటినీ వైర్లతో అనుసంధానించి భూమిలోకి ఎర్తింగ్ చేస్తారు. దీంతో స్విచ్యార్డ్పై పిడుగు పడి నా అందులోంచి హై వోల్టేజీ విద్యుత్ భూమిలోకి వెళ్లిపోయేలా ఈ వ్య వస్థ పనిచేస్తుంది. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగు పడకుండా దారిమళ్లించడానికి దానికి రెండు వైపులా లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చే స్తారు.ఒకవేళ పిడుగు పడినా దాని ప్రభావం భూమిలోకి వెళ్లిపోతుంది. ఇక స్విచ్‌యార్డ్ కింద భూగర్భంలో అర మీటర్ లోపల మెటాలిక్ ప్లేట్లతో ఫెన్సింగ్ మెష్ తరహాలో వలయం ఏర్పాటు చేస్తారు. లైట్నింగ్ అరెస్టర్లను వాటితో అనుసంధానిస్తారు. స్విచ్‌యార్డ్ లోపుల ఎర్త్ పిట్లు కూడా ఉంటాయి. భూగర్భంలో 5 మీటర్ల లోతు వరకు రాడ్డును పాతి ఎర్తింగ్ వ్యవస్థతో కనెక్ట్ చేస్తారు. వాటన్నింటికీ తోడుగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ భూగర్భంలో సొంత ఎర్తింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఏకకాలంలో విఫలం కావడం వల్లే భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జనరేటింగ్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్న చర్చ జరుగుతోంది. సరిగ్గా పనిచేయని రక్షణ వ్యవస్థలు.. పిడుగుపాటు లేదా ఇతర కారణాలతో జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగితే తక్షణమే మల్సిఫైయర్ యాక్టివేట్ అయి మంటలకు ఆక్సిజన్ అందకుండా నిరంతరం నీళ్లను చల్లుతుంది. దీంతో ఆక్సిజన్ అందక మంటలు ఆగిపోతాయి. ఇక టాన్స్ఫర్మర్ వద్ద మరో రక్షణ వ్యవస్థగా నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ మరుగుతూ వేడిగా ఉంటుంది. ఆయిల్ ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరితే ట్రాన్స్ఫార్మర్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యే ప్రమాదం ఉంటుంది.అందుకే నిరంతరం ఆయిల్ ఉష్ణోగ్రతలను నైట్రోజన్ ఇంజెక్షన్ సిస్టమ్ కనిపెడు తూ ఉంటుంది. ఒకవేళ మంటలు చెలరేగే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరిగితే తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను ట్రిప్ చేయడంతోపాటు అందులోని ఆయిల్ లో 10 శాతాన్ని బయటకు పంపిస్తుంది. అలా ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని నైట్రోజన్‌తో నింపేస్తుంది. దీంతో ఆక్సిజన్ అందక ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగవు. భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ రక్షణ వ్యవస్థలు సైతం సరిగ్గా పనిచేయలేదనే చర్చ జరుగుతోంది.ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ కాలంజనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను 2020లో ప్రారంభించగా ఇప్పటికే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసింది. ఇన్సూ్యరెన్స్ చేయించి ఉంటేనే జెన్కోకు నష్టం తప్పనుంది. లేకుంటే సొంత ఖర్చుతో మరమ్మతులు నిర్వహించక తప్పదు. బీహెచ్ఈఎల్–¿ోపాల్ ఈ ట్రాన్స్ఫార్మర్ను తయారు చేసింది. -
జెన్కోకు మళ్లీ చుక్కెదురు!
భద్రాద్రి పవర్ ప్లాంట్‌పై స్టే యథాతథం ♦ స్టే ఎత్తివేతకు నిరాకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ ♦ కేంద్రం తప్పుడు నివేదిక ఇచ్చిందని ♦ అఫిడవిట్ దాఖలు చేసిన జెన్కో సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080(270x4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు మళ్లీ చుక్కెదురైంది. ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఈ నెల 2న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉప సంహరించుకోవాలని జెన్కో చేసిన విజ్ఞప్తిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ హ్యూమన్ రైట్స్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం చెన్నైలోని దక్షిణ ప్రాంత ఎన్జీటీ విచారణ జరిపింది. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్ 14నే ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేసినా... పనులు కొనసాగించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తప్పుడు విచారణ నివేదిక సమర్పించిందని జెన్కో ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది. జెన్కో అఫిడవిట్‌పై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్జీటీ ధర్మాసనం ఫిర్యాదుదారులను ఆదేశిస్తూ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించిందని హ్యూమన్ రైట్స్ ఫోరం గతేడాది ఫిర్యాదు చేయడంతో ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని అప్పట్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి జెన్కో నిర్మాణ పనులను కొనసాగిస్తోందని ఫిర్యాదుదారులు మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. పర్యావరణ అనుమతి పొందకుండానే జెన్కో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించిందని, ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత సైతం పనులు కొనసాగించి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. జెన్కో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించిన ఎన్జీటీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు భద్రాద్రి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత ఏప్రిల్ 7న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఈ నెల 2న జరిగిన విచారణ సందర్భంగా జెన్కో చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్జీటీ..తాజాగా మంగళవారం జరిగిన విచారణలో సైతం అందుకు నిరాకరించింది. -
భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు ‘గ్రీన్’ ట్రబుల్!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) తీవ్ర చిక్కుల్లో పడింది. ఈ ప్లాంట్ నిర్మాణానికి జెన్కో పర్యావరణ అనుమతులు కోరితే మంజూరు చేయవద్దని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తాజాగా ఆదేశించింది. ఈ ప్లాంట్‌కి పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని సోమవారం జరిగిన విచారణలో ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఇంధన శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివాదాల నేపథ్యం... భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌ను ‘సబ్ క్రిటికల్’ బాయిలర్ టెక్నాలజీతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్తో జెన్కో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అతి తక్కువ సమయంలో.. మార్చి 2015 నుంచి 32 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. నాలుగు యూనిట్లలో తొలి యూనిట్‌ను 24 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉండగా.. తర్వాత మూడు నెలలకో ప్లాంట్ చొప్పున మొత్తం 32 నెలల్లో నాలుగు ప్లాంట్లు నిర్మించాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఈ ప్లాంట్‌ను నిర్మించడం పట్ల తొలుత కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం తెలిపింది. అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారాలని, లేకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలని షరతులు విధించింది. అయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత నేపథ్యంలో అతితక్కువ కాలంలో నిర్మించాలన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సబ్ క్రిటికల్ బ్రాయిలర్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందకుండానే గతేడాది ఈ ప్లాంట్ నిర్మాణ పనులను జెన్కో ప్రారంభించడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుపై స్పందించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులను నిలుపుదల చేస్తూ స్టే విధించింది. స్టేను ఉల్లంఘించి జెన్కో పనులను కొనసాగించడంతో కేంద్ర పర్యావరణ శాఖతో ఎన్జీటీ విచారణ జరిపించింది. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుడు ఎన్జీటీకి నివేదించారు. దీంతో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని గత నెల 7న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ నెల 5, 6వ తేదీల్లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఢిల్లీలో సమావేశమై దేశంలో నిర్మించనున్న కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు పర్యావరణ అనుమతులు జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమావేశంలోనే భద్రాద్రి ప్లాంట్‌కి కూడా అనుమతుల అంశాన్ని పరిశీలించే విధంగా కేసు విచారణను ఈ నెల 17 నుంచి ముందుకు జరపాలని జెన్కో చేసిన విజ్ఞప్తి పట్ల ఎన్జీటీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు సోమవారం ఎస్జీటీ విచారణ జరిపింది. డిసెంబర్ 14న పనులు ఆపేశామని, ఈ విషయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ తప్పుడు నివేదిక సమర్పించిందని జెన్కో వాదించింది. ఈ విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పిస్తే తామే స్వయంగా విచారణ జరిపించి వాస్తవాలు తేలుస్తామని ఎన్జీటీ పేర్కొంది. అప్పటి వరకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయవద్దని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు తెలిసింది. -
ఒంటరి పోరాటం
పవర్ ప్లాంట్ నిర్మాణం.. భూమి పోయినా చిన్నపాటి ఉద్యోగం వస్తుందిలే అనే ఆశ.. తీరా పనులు మొదలయ్యూయి.. ప్రస్తుతం పనిచ్చేవారు.. పట్టించుకునేవారు కరువయ్యూరు.. ప్లాంట్ సందర్శనకు వచ్చిన ఉన్నతాధికారులు ముందొకమాట.. తర్వాతో మాట.. నిర్వాసితుల పక్షాన నిలవాల్సిన పార్టీలు రంగులు మార్చి వ్యవహరిస్తున్నారుు..భూములు కోల్పోరుు.. కొలువు కావాలని కోరుతున్న యువతీ యువకులు ఏకాకులుగా మిగిలారు.. ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. - ‘పవర్’ నిర్వాసితుల పరేషాన్ - వీరిపక్షం వహించేదెవరు? - లబ్ధి కోసమే నేతల డ్రామా - ఉపాధి ఊసెత్తని ఉన్నతాధికారులు - ప్రశ్నార్థకంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితుల భవిష్యత్ పినపాక: మండలంలోని ఉప్పాక పంచాయతీ సీతారాంపురం గ్రామం వద్ద భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉపాధి కోసం పోరుబాట పట్టారు. కొన్ని పార్టీలు నిర్వాసితుల పక్షాన నిలవాల్సిందిపోయి.. పోరాటం చేస్తున్నట్లు ఒక పక్క నటిస్తూ.. మరోవైపు విద్యుత్ ప్లాంట్‌లో జరుగుతున్న పనులపై ఆధిపత్యం కోసం పావులు కదుపుతుండటాన్ని నిర్వాసితులు గమనించారు. ఎవరి మద్దతు లేకుండా నిర్వాసితులు పోరాటాలు చేసేందుకు సిద్ధమయ్యూరు. ఈ తరుణంలో పార్టీల నాయకులు రంగప్రవేశం చేసి నిర్వాసితుల నోరు నొక్కేస్తున్నారనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. కొన్ని నెలలుగా తమకు రావాల్సిన పరిహారం, ఐటీఐలో ప్రవేశాలు, ఉద్యోగావకాశాలపై నిర్వాసిత కుటుంబాలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. ప్రతి సందర్భంలో నాయకులు నిర్వాసితుల పక్షాన నిలబడినట్లు నటించి అధికారుల తాత్కాలిక హామీలు తీసుకొని మమ అనిపించిన సంఘటనలు అనేకం. వీటితో విసిగి వేసారిన నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు, పినపాక మండలాల్లో ఉన్న భూ నిర్వాసితులు ఏకతాటిపైకి వచ్చారు. శుక్రవారం భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో పనుల పరిశీలనకు వచ్చిన టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడం.. స్థానిక అధికారుల తీరుకు నిరసనగా శనివారం భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదుట రాస్తారోకోకు దిగారు. రాస్తారోకోకూ రంగేశారు! రాస్తారోకోకు ప్రధాన పార్టీల నాయకులు మద్దతు తెలిపి రాజకీయ రంగు పులమడం గమనార్హం. భూ నిర్వాసితుల పక్షాన సుమారు 2 గంటలపాటు రాస్తారోకో చేసిన పార్టీల నాయకులు ఒక్కసారిగా ఆందోళన నుంచి లేచి నిర్వాసితులను ఆందోళన విరమించాలని కోరడం విశేషం. అసలు ఎవరి కోసం ఆందోళనకు మద్దతు తెలిపారని, అధికారుల నుంచి ఎలాంటి హామీ రాకుండానే ఆందోళన విరమించమని చెప్పడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నించారు. శనివారం రాస్తారోకోకు దిగిన భూ నిర్వాసితులకు సర్ది చెప్పేందుకు వచ్చిన పార్టీల నాయకులకు ఇలా చేదు అనుభవం ఎదురైంది. మాకు రాజకీయం అవసరం లేదని.. నాయకుల మాటలు వినమని నిర్వాసితులు తెగేసి చెప్పారు. ‘అసలు మీరు ఎందుకు వచ్చారు? ఎవరికి న్యాయం చేస్తారు? గతంలో ఎన్ని హామీలు ఇచ్చారు? 6 నెలల నుంచి ఏం సాధించారు?’ అంటూ ప్రశ్నల తూటాలు సంధించారు. తమకు ప్రభుత్వం నుంచి సరైన హామీ వచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని తెలిపారు. ఈ ఊహించని పరిణామంతో రాస్తారోకోలో పాలుపంచుకున్న వివిధ పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిర్వాసితులను బతిమాడో..బామాడో ఆందోళన విరమించేలా చేశారు. ప్రశ్నర్థకంగా భవిష్యత్ భూములు కోల్పోయిన భద్రాద్రి భూ నిర్వాసితుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వాసితుల తరఫున పోరాడేందుకు ఒక్క పార్టీ ముందుకు రాకపోవడం గమనార్హం. భూ నిర్వాసితుల్లో ఉన్న ఆగ్రహాన్ని రెచ్చగొట్టి.. రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఆందోళన బాట పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, ఐటీఐలో ప్రవేశాలు, ఉద్యోగావకాశాలు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రశాంత వాతావరణంలో సాధించుకునేందుకు మార్గాలు ఎంచుకోవాల్సి ఉంది. పార్టీల మాయలో పడి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసుకోకుండా భూ నిర్వాసితులు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. భూ నిర్వాసితులపై కేసు నమోదు పినపాక : సీతారాంపురం గ్రామం వద్ద గల భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో జెన్కో అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన భూ నిర్వాసితులపై ఏడూళ్ళబయ్యారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐ జీడి సూర్య ప్రకాష్ తెలిపిన ప్రకారం.. పవర్ ప్లాంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న జెన్కో అధికారులు, సిబ్బంది విధులకు పినపాక, మణుగూరు మండలాలకు చెందిన ఏడూళ్ళబయ్యారం, చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, సీతారాంపురం గ్రామాలకు చెందిన 13మంది ఆటంకం కలిగించారు.