Bhagavan Sathya Sai Baba
-
పట్టుమని పది కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేకున్నా ప్రపంచ ఖ్యాతి
సాక్షి, పుట్టపర్తి: సత్య, ధర్మ ,శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు మానవతా విలువలను పాటించినవారే నిజమైన మానవులనీ, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవనీ ప్రవచించిన భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. పట్టుమని చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణం కూడా లేని కుగ్రామం విశ్వ చైతన్య శక్తిగా ఎదిగింది. జిల్లాలోనే అతి చిన్న మున్సిపాలిటీగా ఉన్న పుట్టపర్తి.. నేడు శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా అందరినీ దృష్టిని ఆకట్టుకుంటోంది. దీంతో పర్యాటకులు, సత్యసాయి భక్తులతో పాటు జిల్లా కేంద్రంలోని వివిధ కార్యాలయాలకు పనులపై వచ్చే వారి సంఖ్య పెరిగింది. అటు కొత్తచెరువు... ఇటు బుక్కపట్నం పుట్టపర్తికి ఓ వైపు బుక్కపట్నం చెరువు.. మరో వైపు కొత్తచెరువు ఉంటాయి. కేవలం పది కిలోమీటర్ల వ్యవధిలోనే మూడు మండల కేంద్రాలు ఉండడం మరో విశేషం.భగవాన్ సత్యసాయిబాబా నడియాడిన ప్రాంతం కావడంతో పుట్టపర్తిలో నివసించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. దీంతో ఆధునాతన ఎతైన భవంతులు వెలిసాయి. మాంసాహారం నిషేధం.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశీయులు నెలల తరబడి పుట్టపర్తిలోనే మకాం ఉంటారు. ఫలితంగా పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. దేశవిదేశీయులు మెచ్చే వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. అత్యధికంగా తమిళనాడు, కేరళ శైలి వంటకాలు లభ్యమవుతాయి. ఇక క్రిస్పీగా ఉంటూ కాస్త కారంతో ఉండే ఫాస్ట్ఫుడ్ అంటే విదేశీయులు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. అయితే కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ పుట్టపర్తిలో మాంసాహారం పూర్తిగా నిషేధం. కనీసం కోడి గుడ్డు కూడా ఇక్కడ లభ్యం కాదు. అలాగే సినిమా థియేటర్లూ ఉండవు. జిల్లా కేంద్రమే అయినా బార్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయాలకు అనుమతుల్లేవు. అత్యంత పవిత్ర ప్రాంతంగా నేటికీ భావిస్తూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. చాలా హోటళ్లలో బర్గర్, పిజ్జాలతో పాటు పలు రకాల శాకాహార వంటలు అందుబాటులో ఉంటాయి. ఓ వైపు నుంచి చూడాల్సిందే.. కొత్తచెరువు, బుక్కపట్నం మండల కేంద్రాలకు పుట్టపర్తికి మధ్యలో బుక్కపట్నం చెరువు ఉంటుంది. ఈ చెరువు చుట్టూ ఓ వైపు పుట్టపర్తి, మరోవైపు కొత్తచెరువు, ఇంకోవైపు పుట్టపర్తి ఉంటాయి. మూడు మండల కేంద్రాలు పది కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. అయితే ఎటు వైపు నుంచి చూసినా పుట్టపర్తి కనిపించదు. చుట్టూ కొండలే కనిపిస్తాయి. కేవలం ‘బుక్కపట్నం – నల్లమాడ’ మార్గంలో నుంచి మాత్రమే పుట్టపర్తిని దూరం నుంచి చూసే అవకాశం ఉంది. పుట్టపర్తి ముఖచిత్రం చూడాలంటే ఏరియల్ వ్యూ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పుట్టపర్తికి ఓ వైపు చిత్రావతి నది, మరో వైపు విమానాశ్రయం, ఇంకోవైపు చెరువు సరిహద్దులుగా ఉంటాయి. -
సనూతన సారధి...సేవా వారది
సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే విలువల ఆచరణే నిజమైన ఆధ్యాత్మ సాధనని, కర్మ, భకి,్త జ్ఞాన యోగాల సమన్వయ భావనే సేవగా మానవుడు ఆధ్యాత్మ సాధన కొనసాగించాలని... ఈ సత్యబోధనందించటానికే తాను వచ్చానని చెప్పారు భగవాన్ సత్యసాయి బాబా. ఆయన మహా పరినిర్వాణం చెంది, నేటితో నాలుగేళ్లు పూర్తయింది.ఈ సందర్భంగా ఆయన సేవలను, బోధలను స్మరించుకుందాం. ముందు డొక్క నింపాలని, తరువాత మనసుని నింపాలని, ఆపై హృదయం నిండేలా ఆధ్యాత్మ ప్రబోధం కొనసాగాలని తలచి, అన్నార్తుల ఆకలి తీర్చిన అన్నదాత, లక్షలాది మంది దాహం తీర్చిన జలదాత, విలువలతో కూడిన విద్యనందించిన విద్యాదాత, ప్రేమ, కరుణ, దయ, మానవత్వంతో కూడిన వైద్యం అందించిన ఆరోగ్య ప్రదాత. ఎవరి జీవితమైనా మరొకరికి ఆసరా కావాలి, ఏ సంపదైనా అందరికీ ఆధారం కావాలి, సాటివారికి సహాయపడని జీవితం వ్యర్థం, జీవించినంత కాలం ఆనందం, శాంతి, ప్రేమ, నిజ స్వభావంగా ఉండాలి... అని బోధించిన ఆచార్యోత్తముడు సాయి. అలసత్వం, లాలస విడనాడి, అనునిత్యం కర్మిష్టిగా కాలాన్ని వినియోగించాలని బోధించేవారు బాబా. మతాలన్నీ మార్గాలేనని, మత బోధనల మూలమంతా శాంతి, సహనం, ప్రేమ, ఆనందమనేవారు. ఏ మార్గంలో ఉన్నా ఉన్నత స్థితిలో జీవయాత్ర సాగించాలని మార్గనిర్దేశనం చేసిన ఆ మహనీయమూర్తి చూపిన బాటలో నడుద్దాం... ఆయన పలుకులోని తీపిని అందుకుందాం. ఆయన అందించిన ప్రేమ పరిమళాలను అందరికీ పంచుదాం. - డి.వి.ఆర్. -
ప్రేమస్వరూపుడు పుడమిపై పుట్టిన వేళ...
రత్నాకరం సత్యనారాయణ రాజు... ఈ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు కానీ, భగవాన్ సత్యసాయిబాబా అని చెబితే మాత్రం ప్రతిఒక్కరికీ తెలుసు. 1923, నవంబర్ 23న అనంతపురం జిల్లా గొల్లపల్లి గ్రామంలో (నేటి పుట్టపర్తి) ఈశ్వరాంబ, పెదవెంకమరాజు దంపతులకు జన్మించిన సత్యనారాయణరాజు భగవాన్ సత్యసాయిబాబాగా మానవతా విలువలతో కూడిన విద్యనందించిన విద్యాదాతగా... ప్రేమ, కరుణ, దయ, మానవత్వంతో కూడిన వైద్యం అందించిన ఆరోగ్య ప్రదాతగా... అధ్యాత్మ విద్యను సర్వమానవాళికి బోధించిన జ్ఞానదాతగా... నమ్మిన వారికి స్వామిగా... సాయి భగవానుడిగా... అఖండమైన కీర్తిని గడించారు. కోట్లాది మంది భక్తుల హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అజరామరమైన బోధనలతో, అనితర సాధ్యమైన సేవానిరతితో బాబా కీర్తిప్రతిష్ఠలు జిల్లాలు, రాష్ట్రాలే కాదు... ఖండాంతరాలు దాటి, విశ్వవ్యాప్తమయ్యాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే సనాతనధర్మాలను బోధిస్తూ, ఆచరిస్తూ, అనతికాలంలోనే పుట్టపర్తిని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. తోటివారికి సాయపడటంలోనే భగవంతుడున్నాడని బోధించిన సాయి, అదే విధానాన్ని తాను అక్షరాలా ఆచరించి, అతి సామాన్యుని నుంచి అసామాన్యుడి దాకా, చిరుద్యోగి నుంచి, సీఎం వరకు, ప్రభుత్వోద్యోగి నుంచి ప్రధాన మంత్రి వరకు, దరిద్ర నారాయణుని నుంచి దేశాధ్యక్షుని వరకు, కార్మికుని నుంచి, క్రీడాకారుల వరకు... కొన్ని కోట్ల గుండెల్లో కొలువుదీరారు. నేడు ఆయన మన మధ్య లేకున్నా, ఆయన అందించిన మకరంద బిందువులు కొన్ని... కులం, మతం, జాతి, ప్రదేశం, దేశం... ఇవన్నీ మనం గీసుకున్న పరిధులు. వీటన్నింటి మధ్య సమన్వయం ప్రధానం. సంఘర్షణకు తావులేని రీతిలో మన ఆలోచనలు సాగాలి. నేను ఆత్మనని తెలుసుకోవటమే సత్యం, పవిత్ర జీవనమే శివం, ఆదర్శజీవితమే సుందరం. ఆత్మ నిగ్రహం అన్నింటికన్నా ముఖ్యం: రాముడు 34 విద్యలలో ఆరితేరితే రావణుడు 64 విద్యలు అభ్యసించాడు. రామునికంటె అధికంగా చదువుకున్నప్పటికీ ఇంద్రియ నిగ్రహం లేకపోవడం మూలంగా రావణుడు రాక్షసుడయ్యాడు. ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉన్న రాముడు దేవుడయ్యాడు. నమ్మిన దైవం యెడల దృఢవిశ్వాసం, దృఢమైన బలం కలిగి ఉండాలి. నిర్మలత్వం ఇందుకు తోడుగా ఉండాలి. ఆధ్యాత్మికతనే అంటిపెట్టుకోవాలి: ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను వదలనిది, నీ దగ్గరనుంచి కదలనిది, నిన్ను అన్ని విధాల సన్మార్గంలో పెట్టేది ఆధ్యాత్మిక ధనమొకటే. దైవం కోసం పరితపించాలి: లౌకిక విషయాలను కాకుండా దైవాన్ని మాత్రమే కోరుకున్నప్పుడు విజయం వరిస్తుంది. మాలిన్యాన్ని వదిలించుకోవాలి: తుప్పు పట్టిన ఇనుమును అయస్కాంతం ఆకర్షించనట్లే మనసులో మాలిన్యం ఉన్న వానికి భగవంతునిపై ఆసక్తి ఉండదు. మంచిని మాత్రమే వెదకాలి: ఇతరుల తప్పులను వెదకడం గొప్ప కాదు, వారిలోని మంచిని గుర్తించి, ప్రేమించాలి. సమర్థించుకోవడం కాదు... సమర్థతను పెంచుకోవాలి: మనలో దోషముంచుకుని, దానిని కప్పిపుచ్చుకునేందుకు దారులు వెదకటం తప్పు, సమర్థతను పెంచుకోవాలి ఆయన బోధనల ప్రకారం ఆకలిగొన్న వారికి అన్నం పెట్టటం, ఆపదలో ఉన్న వారికి ఆసరా ఇవ్వటం, కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవటం, సేవ చేసేందుకు మార్గాన్ని వెతుక్కుని, సేవతోనే జీవితాన్ని లీనం చేయడమే భక్తులు ఆయనకు సమర్పించే పుట్టిన రోజు కానుక. - డి.వి.ఆర్. సేవార్తుడు తాగేందుకు గుక్కెడు నీరు లేక దప్పికతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు కొన్ని వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి, 1700 గ్రామాలకు తాగునీరందించిన అపర భగీరథుడు సత్యసాయి. ఈ వితరణను తన జిల్లాకే పరిమితం కాకుండా కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, ఉభయ గోదావరితో సహా మరికొన్ని జిల్లాల ప్రజలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా దాహం తీర్చిన సేవార్తుడు. ఈ సేవామూర్తిని, ప్రేమస్వరూపుని సందర్శించటానికి దాదాపు 180 దేశాలనుంచి భక్తులు పుట్టపర్తికి వచ్చేవారు. సాయి కుల్వంత్ హాలులో ఎత్తై ఆసనంపై నుంచి తనను సందర్శించటానికి వచ్చిన వేలాది భక్తులకు ఆశీస్సులందించిన సత్య సాయి నేడు మన మధ్య లేరు. అయితేనేం... ఆయనను నమ్మిన వారికి ఆయన మహాసమాధే అనంతమైన ఓదార్పుగా... కొండంత అండగా నిలుస్తోంది.