Bharat Heavy Electricals
-
ప్రయోగాత్మకంగా స్వర్ణ రథ పరిశీలన
తిరుమల: తిరుమలలో సోమవారం శ్రీవారి స్వర్ణరథాన్ని ప్రయోగాత్మకంగా ఊరేగించి పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటలకు రథ మండపం నుంచి రథాన్ని వెలుపలకు తీసారు. ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు లాగారు. ఎస్ఈ రమేష్‌రెడ్డి, ఈఈలు జీవీ కృష్ణారెడ్డి, నరసింహమూర్తి, ఏఈ దేవరాజులు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సీఎండీ ప్రసాదరావు, ఇతర ఇంజనీరింగ్ నిపుణులు .. రథం పనితీరును పరిశీలించారు. రథచక్రాల హైడ్రాలిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో చూశారు. మలుపుల వద్ద ఎంత దూరంలో ఉన్నప్పుడు ముందుజాగ్రత్తలు తీసుకునే విషయంపై అధ్యయనం చేశారు. శ్రీవారి చక్రస్నానం తిరుమలలో సోమవారం శ్రీవారి చక్రస్నానం నిర్వహించారు.ఏటా భాద్రపద మాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య చక్రస్నానం నిర్వహించారు. -
బీహెచ్ఈఎల్ లాభం రూ. 194 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వ రంగ దిగ్గజం బీహెచ్ఈఎల్ నికర లాభం భారీగా క్షీణించి రూ. 193.5 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 465.4 కోట్ల లాభాన్ని ఆర్జించింది. విద్యుత్, పారిశ్రామిక విభాగాల నుంచి అమ్మకాలు పడిపోవడం ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. ఇక ఆదాయం కూడా రూ. 6,353 కోట్ల నుంచి రూ. 5,068 కోట్లకు క్షీణించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 1% లాభంతో రూ. 224 వద్ద ముగిసింది. విద్యుత్ విభాగం ఆదాయం రూ. 5,379 కోట్ల నుంచి రూ. 4,144 కోట్లకు క్షీణించగా, పారిశ్రామిక విభాగం ఆదాయం సైతం రూ. 1,293 కోట్ల నుంచి రూ. 1,133 కోట్లకు తగ్గింది. కాగా, ఐదు ఇతర పీఎస్‌యూలతో కలసి రాజస్తాన్‌లో 4,000 మెగావాట్ల భారీ సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌ను బీహెచ్ఈఎల్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్‌కాగా, ఈ జేవీలో బీహెచ్ఈఎల్కు 26% వాటా ఉంటుంది. మిగిలిన సంస్థలలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్(ఎస్ఈసీఐ) 23%, సంభార్ సాల్ట్(ఎస్ఎస్ఎల్) 16%, పీజీసీఐఎల్ 16%, సట్లుజ్ జల్ విద్యుత్(ఎస్జేవీఎన్ఎల్) 16%, రాజస్తాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్(ఆర్ఈఐఎల్) 3% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌కు పరికరాలను బీహెచ్ఈఎల్ సరఫరా చేస్తుంది. -
బీహెచ్ఈఎల్ లాభం సగానికి డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్ఈఎల్) నికరలాభం 2013-14లో సగానికి పైగా క్షీణించి రూ. 3,228 కోట్లుగా నమోదైంది. అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండటం, దేశీ విద్యుత్ రంగంలో సమస్యలు తదితర అంశాలు ఇందుకు కారణం. 2012-13లో సంస్థ నికర లాభం రూ. 6,615 కోట్లు. 2013-14లో టర్నోవరు సైతం రూ. 40,366 కోట్లకు (గతేడాది రూ. 50,156 కోట్లు) తగ్గిందని కంపెనీ తెలిపింది. ఆర్డర్ల రాక సైతం రూ. 31,650 కోట్ల నుంచి రూ. 28,007 కోట్లకు క్షీణించింది. బీహెచ్ఈఎల్ ఆర్డర్ బుక్ విలువ సుమారు రూ. 1,01,538 కోట్లకు పరిమితమైంది.