Bharat Matrimony
-
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?
సాక్షి,ముంబై: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ భారత్ మ్యాట్రిమోనీ వివాదంలో ఇరుక్కొంది. హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కంపెనీ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. పవిత్ర హోలీని అవమానకరంగా చిత్రీకరించి హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్‌కాట్ భారత్ మోట్రిమోనీ అన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ యాడ్‌పై చర్చ కారణంగా ఇది ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. రంగుల పండుగ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై భారత్ మ్యాట్రిమోనీ ఒక వీడియోను పోస్ట్ చేసింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం,హోలీ సందర్బంగా మహిళలకు సురక్షిత వాతావరణాన్ని సృష్టించాలంటూ తన యాడ్‌లో కోరింది. కొన్ని కలర్స్( మరకలు) అంత తొందరగా మాసిపోవు. వేధింపుల వల్ల ప్రతీ ముగ్గురిలో ఒకమహిళ హోలీకి దూరంగా ఉంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం వారి శ్రేయస్సును గౌరవించే సమాజాన్ని సృష్టించడం ముఖ్యం అని పేర్కొంది. అంతే ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ‘‘మీకు హిందూ వినియోగదారులంటే లెక్కలేదా..సిగ్గుపడండి..బ్యాన్ భారత్ మోట్రిమోనీ’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ట్విటర్లో #BoycottBharatMatrimony ట్రెండింగ్‌లో నిలిచింది. హోలీని తిట్టడమే లక్ష్యం. హిందూ పండుగలను హిందూ వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకోకండి అని ఒకరు ట్వీట్ చేయగా, భారత్ మ్యాట్రిమోనీ యాడ్ హిందూ సంప్రదాయాలను అగౌరవపరిచేదిగాను, హిందూ మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మరికొందరు ఆగ్రహించారు. హిందువుల పండుగలప్పుడు మాత్రమే మహిళల రక్షణ, కాలుష్యం, జంతువుల హక్కులు గుర్తొస్తాయా అంటూ ఇంకొకరు మండిపడ్డారు. ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేయడంతోపాటు భారత్ మ్యాట్రిమోనీని నిషేధించాల్సిందేనని కమెంట్ చేస్తున్నారు. ఈ యాడ్‌లో తప్పేమీ లేదంటూ సంస్థ భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థించిన వారు లేకపోలేదు. అలాగే సంస్కృతి పేరుతో ప్రతిదీ మంచిది కాదు. సతి, వరకట్నం కూడా భారతీయ సంస్కృతిలో భాగమే. చెడును వ్యతిరేకించాలి. హోలీ రోజున మహిళలపై వేధింపులు నిజమే. దీని వల్ల మొత్తం పండుగకే చెడ్డ పేరు వస్తుందని మరికొంతమంది యూజర్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో క్యాప్షన్‌ను సవరించి, సోషల్ మీడియా పేజీలలో తాజా పోస్ట్‌లను అప్లోడ్ చేసింది. అయినా విమర్శల సెగ చల్లార లేదు. కాగా ప్రకటనలపై విమర్శలు, వివాదం చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఫ్యాబ్ఇండియా, తనిష్క్, సియట్ టైర్లు, అమోజాన్ లాంటి పలు సంస్థలు దాదాపు ఇలాంటి వివాదాల్లో పడ్డాయి. ఇటీవల ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ హోలీ ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తాయి. హోలీ సందర్భంగా ప్రజలు ఒకరిపై ఒకరు గుడ్లు విసురుకోవద్దంటూ ఢిల్లీలోని స్విగ్గీ బిల్బోర్డ్ వివాదానికి దారితీయడంతో తరువాత, దాన్ని స్విగ్గీ తొలగించింది. I will be single in my entire life but i will never register in this #BHARATMATRIMONY@bharatmatrimony is fully hypocrisy all this gyans are vanished in Christian and Muslim festivals Total Boycott 🚫 #BoycottBharatMatrimony — ÂkaSH আকাশ (@itzmeakashmazz) March 8, 2023 pic.twitter.com/pMTJCNRBwV — Ankit Bhuptani 🏳️🌈 (@CitizenAnkit) March 8, 2023 -
ధోని ఇక ‘పెళ్లి పెద్ద’
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని చరిష్మా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన హెలికాప్టర్ షాట్లతో.. కళ్లు చెదిరే రీతిలో చేసే కీపింగ్‌తో.. ఇక అన్నింటికి మించి మిస్టర్ కూల్‌గా తీసుకునే నిర్ణయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించడంతో జార్ఖండ్ డైనమైట్‌కు క్రేజ్ పెరుగుతూవస్తోంది. దీంతో ధోనికి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని పలుకంపెనీలు పోటీపడుతున్నాయి. తాజాగా ఆన్లైన్లో పెళ్లిసంబంధాలు కుదిర్చే పాపులర్ వెబ్సైట్ భారత్ మ్యాట్రిమోనికి ప్రచారకర్తగా ధోని నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఒప్పందం గురించి ధోనితో పాటు సంస్థ సీఈఓ జానకిరామన్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. (మ్యాచ్‌లో ధోని లేకపోయినా..) ‘గత 18ఏళ్లుగా ఎంతో మందికి తమ సహచర భాగస్వామిని ఎంపిక చేసుకోవటానికి భారత్ మ్యాట్రిమోని ఎంతగానో ఉపయోగపడింది. లక్షల వివాహాలు జరిపించింది. వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్నారు. అత్యంత నమ్మకమైన సంస్థతో పనిచేయడం ఆనందంగా, గర్వంగా ఉంది’అంటూ ధోని పేర్కొన్నారు. ఇక సంస్థ సీఈఓ జానకిరామన్ మాట్లాడుతూ..‘ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచిన ఎంఎస్ ధోనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అతడి వివాహ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. గొప్ప భర్తగా, బాధ్యత గల తండ్రిగా ధోని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు’అంటూ కొనియాడారు. ఇక ఈ డీల్‌ను ధోని స్పోర్ట్ మేనేజ్ మెంట్ కంపెనీ రితి స్పోర్ట్స్ కుదిర్చింది. (ధోని వేటుపై సచిన్ ఏమన్నాడంటే..) -
పెళ్లి మీది.. హడావుడి మాది
ఆకట్టుకుంటున్న మ్యాట్రిమోనీ ఎక్స్పో-2014 రాయదుర్గం: భారత్ మ్యాట్రిమోనీ ఆధ్వర్యంలో తెలుగు మ్యాట్రిమోనీ ఎక్స్పో-2014 పేరిట రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. పెళ్లి పత్రికలు మొదలుకొని వెడ్డింగ్ హాల్స్, కేటరర్స్, బ్రైడల్ మేకప్, ఆభరణాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వెడ్డింగ్ వేర్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, సన్నాయి మేళం వంటి 87 స్టాళ్లను అందుబాటులో ఉంచారు. మూడు రోజులపాటు ఈ ఎక్స్పో కొనసాగనుంది. తమ ఇళ్లలో పెళ్లి చేయాలనుకునే వారికి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే చోట పొందడానికి అవకాశం ఉండటంతో సంద ర్శకుల సంఖ్య గణనీయంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్పోను ప్రారంభించిన బనగానపల్లి ఎమ్మెల్యే మ్యాట్రిమోనీ ఎక్స్పో-2014ను కర్నూల్ జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ యజమాని బి.సి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మ్యాట్రిమోనీ సంస్థ బిజినెస్ హెడ్ లలిత్ మస్తా, రీజినల్ మేనేజర్ అనిల్‌కుమార్, ఏపీ హెడ్ సయ్యద్ అజహర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. -
సెలబ్రిటీ కాదు కంప్లీట్ మ్యాన్
యాడ్స్.. ప్రొడక్ట్ క్వాలిటీని ఎంతవరకు ప్రొజెక్ట్ చేస్తున్నాయో తెలియదు కానీ మారిన తరంలోని మానవ సంబంధాలను మాత్రం కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా మీసం మెలేసే మగాడు సున్నితంగా మారిన వైనానికి అద్దం పడుతున్నాయి!. ఓరియో బిస్కట్స్ నాన్న.. భారత్ మ్యాట్రిమోనీ భర్త.. క్యాడ్బరీ డెయిరీ మిల్క్ స్నేహితుడిని కలుపుకొని రేమండ్స్ ది కంప్లీట్ మ్యాన్ని ఆవిష్కరిస్తోంది! యాడ్స్‌లోనే కాదు ఇంట్లోనూ అలాగే ఉన్న ఈతరం పురుషుడి గురించి కథనం.. నిజమైన సంఘటనలే ఊపిరి సెలబ్రిటీలే కాదు కంప్లీట్ మ్యాన్‌కి అద్దంపట్టే సామాన్యూలూ ఉన్నారు. సికింద్రాబాద్‌కి చెందిన కోమల్‌రెడ్డి నేటి తరం పురుషుడికి ప్రతినిధి. ఆయన గురించి వాళ్లావిడ శిరీష ‘నాకు డిగ్రీ అవగానే పెళ్లయింది. పీజీ చేయాలని ఉండింది. కోమల్‌తో చెబితే ఓకే అన్నాడు. ఎంట్రెన్స్ రాస్తే సీట్ వచ్చింది. ఫస్టియర్ అయేటప్పటికి కన్సీవ్ అయ్యాను. సెకండియర్ ఎగ్జామ్స్ అప్పటికి చంటిబిడ్డ తల్లిని. రోజుల బిడ్డను పట్టుకొని ఎగ్జామ్స్ రాయడమా అని భయపడ్డాను. కోమల్ ధైర్యం చెప్పి పరీక్షలకు రెడీ చేశాడు. నేను ఎగ్జామ్నేషన్ హాల్లో.. తను బయట పాపను ఎత్తుకొని పచార్లు.. ఇలాంటి నేచర్ ఉన్న మగవాళ్లను ఇటు మా ఇంట్లోను, అటు వాళ్లింట్లోనూ చూడలేదు’ అంది. ‘శిరీష నా కోసం కొన్నింటిని శాక్రిఫైస్ చేసినప్పుడు ఆమె లైఫ్ యాంబిషన్ కోసం నేనెందుకు చూయకూడదని అనుకున్నాను. మా పాప అనన్య విషయంలో తల్లిగా తనకెంత బాధ్యత, ప్రేమ ఉన్నాయో, తండ్రిగా నాకూ అంతే బాధ్యత, ప్రేమ ఉన్నాయి’ అంటాడు కోమల్. యాడ్స్ ప్రభావం.. యాడ్స్‌కి రియల్ ఘటనలు ప్రేరణ ఇచ్చినట్టే యాడ్స్ ప్రభావమూ తన మీదుందంటాడు బాలశేఖర్. ‘సినిమాలు మగవాళ్లలోని సున్నితత్వాన్ని చంపేస్తుంటే ఇలాంటి యాడ్స్ మరింత సెన్సిటైజ్ చేస్తున్నాయి. నా పెళ్లయి తొమ్మిది నెలలైంది. నా భార్య శ్రావణి.. మంచి ఫ్రెండ్. ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోను. నేను మల్టీమీడియా చేశాను. తను బీటెక్. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్‌చేశాం. ఆడవాళ్లు సెకండ్ జెండర్కాదు.. మగవాళ్లతో ఈక్వల్. ఈ భావన నాలో కలగడానికి నాకున్న రీడింగ్ హాబీ ఒక కారణమైతే.. రేమండ్స్లాంటి యాడ్సూ కారణమే’ అంటాడు బాలశేఖర్. ‘నిజమే.. శేఖర్ భర్తగా కన్నా ఓ ఫ్రెండ్‌లా ఉంటాడు. అన్నీ షేర్ చేసుకుంటాను’ అంటుంది బాలశేఖర్ భార్య శ్రావణి.