Bharatamma
-
సంబరంగా సంక్రాంతి వేడుక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతిఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, మెడికల్ కాలేజీ, నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్ధిన స్కూల్ భవనం, పాల కేంద్రం నమూనాలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. ముత్యాల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అచ్చం అసలు సిసలైన గ్రామీణ వాతావరణ ప్రతిబింబించేలా, మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీఎం దంపతులను మంత్రముగ్థుల్ని చేసేలా ఆ ప్రాంతం శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఏర్పాటుచేసిన శిలాతోరణం అందరినీ ఆకట్టుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం జగన్ దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. వారిరువురూ భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. హరిదాసుకు స్వయంపాకం, సారె సమర్పించారు. అలాగే, గోశాలలోని గోవులకు పూజచేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు. గంగిరెద్దులకు, తులసి చెట్టుకు పూజలు చేశారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం.. కలియుగ దైవమైన శ్రీహరికి పూజలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటుచేసిన వందేళ్ల క్రితం నాటి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నమూనా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ దంపతులు పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం.. అక్కడున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తొలుత.. కాణిపాక వినాయక విగ్రహానికి సీఎం జగన్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత.. కనకదుర్గమ్మకు.. అనంతరం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు కంకణం కట్టగా.. వేదపండితులు అందించిన మరో కంకణాన్ని భారతమ్మకు ముఖ్యమంత్రి జగన్ కట్టారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రముఖ సినీ నేపథ్యగాయని గోపిక పూర్ణిమ, ప్రముఖ గాయని శ్రీలలిత పాటల కార్యక్రమం శ్రవణపేయంగా సాగింది. అలాగే, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రాఘవ, కౌండిన్య, మెహర్, మానస్, చందు, రమేష్, హరేరాము, మహేష్, భాను తదితరుల లైవ్ పెర్ఫామెన్స్.. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు రిత్విక్ వెంకట్, చార్మి, చిన్నారి కేతనరెడ్డి నాట్య ప్రదర్శన.. నీలకంఠం మిమిక్రీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ బృందంచే సంక్రాంతి ప్రత్యేక గీతాల నృత్యం, మాస్టర్ భువనేష్ ప్రత్యేక గీతాలు.. వీటితో పాటు ప్రముఖ సినీగేయ రచయిత, సంగీత దర్శకులు విశ్వ.. ప్రముఖ సినీ మరియు ప్రజా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా రచయితలు మానుకోట ప్రసాద్, మాట్ల తిరుపతి, గాయకులు గద్దర్ నర్సిరెడ్డి, తేలు విజయల కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కృష్ణవేణి మల్లావఝుల వ్యవహరించారు. చివర్లో వీరందరిని సీఎం జగన్ దంపతులు సత్కరించి, మెమొంటోలు అందజేశారు. అంతేకాక.. ప్రాంగణంలో ఉన్న అందరితో సీఎం జగన్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెవిరెడ్డికి సీఎం అభినందనలు.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. విజయానందాలతో అడుగులు ముందుకేయాలి.. సీఎం జగన్ ట్వీట్ ఊరూ వాడా ఒక్కటై.. బంధుమిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపారు. -
సవతి తల్లికీ మనోవర్తి చెల్లించవలసిందే!
కేస్ స్టడీ భారతమ్మకు 60 సంవత్సరాలు. భర్త చనిపోయి మూడేళ్లయింది. చనిపోయేముందు ఆస్తిపంపకాలు చేసి, భార్య బాధ్యతను కొడుకులకు అప్పగించి వెళ్లాడామె భర్త. కొడుకులు భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆయన ప్రగాఢ నమ్మకం. అందుకే ఆమెకు చిల్లుగవ్వ కూడా ఇవ్వలేదు. దినవారాలు అయిన తర్వాత ముగ్గురు కొడుకులూ మూటాముల్లే సర్దుకుని ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్లిపోయారు. పనిలో పనిగా వారికి తండ్రి రాసిచ్చిన పొలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు తల్లి కోర్టుకు వెళుతుందనే భయంతో. ఇంటిగలాయన రెండు నెలలు చూసీ చూడనట్లుండి, అద్దె బకాయి పడగానే, ఇల్లు ఖాళీ చేయమని గొడవ ప్రారంభించాడు. పాపం భారతమ్మ పరిస్థితి ఘోరమైంది. కొడుకులపై మెయిన్టెనెన్స్ కేసు వేయమని ఎవరో సలహా ఇచ్చారు. అది కొడుకుల చెవిన పడింది. అసలు భారతమ్మ తమ కన్నతల్లి కాదని, సవతి తల్లి అనీ అందుకని ఆమెకు ఆ ఆస్తిలో భాగం రాదని ఆమెను హెచ్చరించారు. కళ్లనీళ్ల పర్యంతమైంది భారతమ్మ. నిజమే, తాను వారి సవతి తల్లి. కానీ, వారి తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ల నాన్న రెండోపెళ్లి చేసుకున్నాడు తనను. అప్పటినుంచి వాళ్లే తమ బిడ్డలని కళ్లల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసింది. తనకు పిల్లలు వద్దని కూడా నిర్ణయించుకుంది. మరి స్వార్థపరుడైన భర్తవల్ల, ఆమె అమాయకత్వం వల్ల ఈనాడు ఆమెకు ఈ గతి పట్టింది. అసలు చట్టం ఏమి చెబుతుందో అని ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన న్యాయవాదిని అడిగింది. ఆమె చెప్పిన విషయాలేమిటంటే... సవతి తల్లి కూడా సెక్షన్ 125 సిఆర్పీసీని అనుసరించి మనోవర్తి పొందవచ్చు. తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీలకు పిల్లలకు, తలిదండ్రులకు న్యాయం అందాలనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఏర్పరచడం జరిగింది. దీనిప్రకారం సవతి తల్లి కూడా అనాథగా మారకుండా చూడవలసిన బాధ్యత కొడుకుపై ఉంటుంది. అయితే సవతి తల్లి సవతి కొడుకు నుండి మనోవర్తి కోరేటప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 1. ఆమెకు వీరుగాక ఇతరత్రా ఎటువంటి సంతానం ఉండకూడదు. ఆమె విధవరాలు అయి ఉండాలి. భర్త జీవించి ఉంటే, అతడు పోషించలేని పరిస్థితుల్లో ఉండాలి. భారతమ్మకు ముగ్గురూ సవతి కొడుకులే. ముగ్గురినీ మనోవర్తి కేసులో పార్టీలుగా చేయవచ్చని తెలుసుకుని కేసు వేయడానికి సహాయపడమని ఆ న్యాయవాదిని వేడుకుంది భారతమ్మ. తప్పకుండా కేసు వేస్తామని, ఆమెను ఆదుకుంటామరని మాటిచ్చారు వాళ్లు. -
వధువుకు 15... వరుడికి 35 ఏళ్లు
-బాల్య వివాహ ఏర్పాట్లు అడ్డుకున్న అధికారులు మోమిన్‌పేట(మెదక్ జిల్లా) బాల్య వివాహ ఏర్పాట్లను అధికారులు అడ్డుకున్నారు. అమ్మాయికి మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని మోమిన్‌పేట తహసీల్దార్ విజయకుమారి బాలిక తల్లిదండ్రులను హెచ్చరించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బూర్గుపల్లికి చెందిన బుచ్చయ్య, భారతమ్మ దంపతుల ఏకైక కూతురు(15) స్థానిక పాఠశాలలో ఇటీవల 8వ తరగతి పూర్తి చేసింది. ఆమెకు మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరయ్య(35) రెండో వివాహం చేసేందుకు ఇరువర్గాల వారు శుక్రవారం ఏర్పాట్లు చేశారు. ఈవిషయమై వరుడికి బాలిక తల్లిదండ్రులు రూ.20 వేల కట్నం కూడా ఇచ్చారు. బాల్య వివాహ విషయంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న తహసీల్దార్ తదితరులు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను గురువారం తహసీల్దార్ కార్యాలయానికి రప్పించారు. తహసీల్దార్ విజయకుమారి వారికి కౌన్సెలింగ్ చేశారు. అమ్మాయికి మైనారిటీ తీరిన తర్వాతే పెళ్లి చేయాలని సూచించారు. అనంతరం వారితో హామీ పత్రం రాయించుకున్నారు. బాలికను హైదరాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ హోంకు తరలించనున్నట్లు సీడీపీఓ కాంతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్ తదితరులు ఉన్నారు. -
జల్సాలకు అడ్డొస్తున్నాడని..
♦ భర్తపై భార్య హత్యాయత్నం ♦ కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నం ♦ తీవ్ర గాయాలు..ఆస్పత్రికి తరలింపు దోమ : తన సరదాలకు అడ్డు తగులుతున్నాడనే కోపంతో భర్తను చితకబాది ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు యత్నించింది ఓ భార్య. ఈ సంఘటన దోమ మండలంలోని రాకొండలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాకొండకు చెందిన బోయిని వెంకటయ్య, భారతమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి పదేళ్లలోపు వయసున్న కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలంగా భార్య మద్యానికి బానిసైంది. భర్తతోపాటు పిల్లల బాగోగులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తరచూ చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకోవడం, దాడికి పాల్పడుతోంది. పద్ధతి మార్చుకోవాలని భర్త ఎన్నిసార్లు సూచించినా ఆమె పట్టించుకోలేదు. పై పెచ్చు అతడిపైనే దాడికి దిగేది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భర్త వేరే గ్రామానికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కుటుంబ విషయమై అతడితో వాగ్వావాదానికి దిగి కర్రతో చితకబాదింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అదే రాత్రి నిద్రిస్తున్న భర్తపై కిరోసిన్‌పోసి నిప్పంటించి పారిపోయింది. మంటలకు తాళలేక బయటకు పరిగెత్తుకు వెళ్లి గ్రామస్తులకు తెలపడంతో వారు అత డిని వెంటనే చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి సోదరుడు అంజిలయ్య మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ భీంకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.