Bhojshala row
-
భోజ్‌శాల కాంప్లెక్స్: ప్రభుత్వం చేతికి ఏఎస్ఐ రిపోర్టు
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్స్‌లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేపట్టింది. తాజాగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్టును సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.సర్వే రిపోర్టు ప్రకారం.. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేయబడ్డ 31 నాణేలను గుర్తించారు. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15-16వ శతాబ్దం), మొఘల్ (16-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్(19-20వ శతాబ్దం)వారికి చెందినవిగా పేర్కొంది. మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణాలు బయటపడినట్లు పేర్కొంది.బయటపడిన ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయబడినట్లు తెలిపింది. ఈ శిల్పాలు హిందూ దేవుళ్లు వినాయకుడు, బ్రహ్మ, నరసింహ, భైరవలో పాటు పలు జంతువులు, మానవుల రూపంలో ఉన్నాయి. వాటితో పాటు సింహం, ఎనుగులు, గుర్రాలు, కుక్క, కోతి, పాము, తాబేలు, పక్షులతో కూడిన శిల్పాలను గుర్తించినట్లు తెలియజేసింది. పలు శాసనాలపై సంస్కృతం, ప్రాకృత భాష రాసి ఉన్నట్లు పేర్కొంది. వాటిపై విద్యావ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు సూచిస్తున్నాయి. మరోవైపు.. భోజ్ రాజు హాయాంలో అక్కడి విద్యాకేంద్రం ఉన్నట్లు ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తోంది.మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు పూర్తి సర్వే రిపోర్టును జూలై 15వరకు సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూలై 22కు వాయిదా వేసింది. -
‘భోజ్‌శాల’ సర్వేపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ధార్‌లోని పురాతన భోజ్‌శాల కట్టడంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా( ఏఎస్ఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం భోజ్‌శాలలో ఏఎస్ఐ చేస్తున్న సర్వే రిపోర్టుపై తమ అనుమతి లేకుండా ఎలాంటి చర్య తీసుకోవద్దని కోరింది. భోజ్‌శాల కట్టడంలో ఏఎస్ఐ సర్వే చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అక్కడ మసీదు నిర్వహిస్తున్న మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, హిందూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. భోజ్‌శాల ఆవరణలో ప్రస్తుతమున్న స్థితిని మార్చే ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయం అని హిందువులు వాదిస్తుండగా అది కమల్ మౌలా మాస్క్ అని ముస్లింలు అంటున్నారు. ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు వివాదం.. సెల్లార్లో పూజలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ -
MP: ‘భోజ్‌శాల’ కాంప్లెక్సులో ఆర్కియాలజీ సర్వే
భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్సులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య డజను మంది ఆర్కియాలజీ సిబ్బంది, ధార్ జిల్లా అధికారులు సర్వే మొదలు పెట్టారు. సర్వే జరుగుతుండగా ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతా డ్రిల్ చేపట్టారు. ‘2022 మేలో మేం ఆర్కియాలజీ సర్వే కోసం కోర్టులో పిటిషన్ వేశాం. కార్బన్ డేటింగ్ సహా పూర్తిస్థాయి టెక్నాలజీ వాడి సర్వే చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సర్వే మొదలైంది. ఆరు వారాల తర్వాత సర్వే నివేదిక వస్తుంది’ అని భోజ్‌శాల సర్వే కోసం పిటిషన్ వేసిన హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ ఆశిశ్ గోయెల్ చెప్పారు. కాగా, మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. ఇదీ చదవండి.. కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు -
ఆరెస్సెస్ కార్యాలయంపై హిందూ శ్రేణుల దాడి!
ధార్: మధ్యప్రదేశ్ ధార్‌లోని త్రిమూర్తినగర్‌లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యాలయంపై హిందూ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. కార్యాలయంపై రాళ్లు రువ్వి.. కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. బసంత పంచమీ సందర్భంగా ఇక్కడి భోజ్‌శాల కమల్ మౌలా మసీదు విషయమై వివాదం తలెత్తింది. ఈ ప్రాంగణంలో ఏకకాలంలో పూజలు చేసేందుకు హిందువులు, ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు రావడంతో శుక్రవారం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భోజ్‌శాలలోకి ప్రవేశించవద్దని ఆరెస్సెస్ నాయకత్వంతోపాటు, ధర్మ జాగరణ్ మంచ్, భోజ్ ఉత్సవ సమితి హిందువులకు పిలుపునిచ్చింది. దీనిపై హిందూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆరెస్సెస్ నాయకులు భోజ్‌శాలను అమ్మేశారంటూ మండిపడ్డారు. స్థానిక ఆరెస్సెస్ నాయకుడు విజయ్‌సింగ్ రాథోడ్ ఇంటి వద్ద భారీగా మూగి ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం విజయ్‌సింగ్ రాథోడ్ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కయి.. ఈ వ్యవహారంలో ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ వారు నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజ్‌శాలలోకి ప్రవేశించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆరెస్సెస్ నాయకత్వం తీరుపై మండిపడుతూ హిందూ కార్యకర్తలు ఆ సంస్థ కార్యాలయంపై దాడి దిగారు.