న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ధార్‌లోని పురాతన భోజ్‌శాల కట్టడంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా( ఏఎస్‌ఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం భోజ్‌శాలలో ఏఎస్‌ఐ చేస్తున్న సర్వే రిపోర్టుపై తమ అనుమతి లేకుండా ఎలాంటి చర్య తీసుకోవద్దని కోరింది.
భోజ్‌శాల కట్టడంలో ఏఎస్‌ఐ సర్వే చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అక్కడ మసీదు నిర్వహిస్తున్న మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, హిందూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
భోజ్‌శాల ఆవరణలో ప్రస్తుతమున్న స్థితిని మార్చే ఎలాంటి తవ్వకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయం అని హిందువులు వాదిస్తుండగా అది కమల్ మౌలా మాస్క్ అని ముస్లింలు అంటున్నారు.
ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు వివాదం.. సెల్లార్‌లో పూజలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment