bias
-
ఓ చెంచాడు అయినా లేకపోతే...
కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మన పక్షాన లేడు.. అనుకుంటాం. దేముడు చల్లగా చూసాడు–అని సుఖం కలిగినప్పుడు అనుకుంటుంటాం. కానీ భగవంతుడికి ఏ పక్షపాతమూ లేదు, ఆయన ఎవరిపక్షాన ఉండడు. ‘‘దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో/ ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:/ తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః / సమప్రవత్తికః కదా సదాశివం భజామ్యహమ్.’’ కటిక నేలనుంచీ, హంసతూలికా తల్పం వరకూ, మహారాజు నుండి సామాన్యుడి వరకు, మిత్రపక్షం అనీ, శత్రుపక్షం అనీ తేడా లేకుండా అన్నిటినీ సమాన దృష్టితో చూసే ఆ సదాశివుడికి నమస్కారం.. అంటాం. వివేకానందుడు చెప్పినట్టు – ఈ ప్రపంచమంతా నీ పూజా మందిరంగా చూసే శక్తి రావాలి. భగవంతుడిని ఏమార్చి ఆయనను మన పక్షానికి తీసుకురావడం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన ప్రీతి పొందేది మన నడవడికనుబట్టే. మన నడవడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. మనం సముద్రమంత ప్రయత్నం చేయవచ్చుగాక, కానీ ఓ చెంచాడంత భగవదనుగ్రహం ఉండకపోతే కార్యాలు సఫలీకృతం కావు. ‘ఆచార్య ప్రభవో ధర్మః. ధర్మం అనేది కేవలం పుస్తకాలలో చదువుకుంటేనో, అన్నీ నాకు తెలుసనుకుంటేనో అన్వయం కాదు. నీవు ఎంత అనుష్ఠించావో అదే ధర్మం. ధర్మాత్ముడు.. అనిపించుకోవాలంటే నీ నడవడిక మొత్తం ధర్మబద్ధంగా ఉండాలి. ఆచరించినది ధర్మం. ఆచరించనిది ఎప్పటికీ ధర్మం కాదు. అమెరికాకు అధ్యక్షులుగా చేసినవారిలో చిరస్మరణీయుడైన అబ్రహాం లింకన్ ఒక మాటన్నారు...‘‘దేముడు నీ పక్షాన ఉన్నాడా అని ఆలోచించడం కాదు, దేముడి మార్గంలో నీవు ఉన్నావా !’’ అని చూసుకొమ్మన్నారు. ఆయన బాల్యంనుంచీ అలానే బతికారు. నిరుపేద. చిన్నతనంలో ఒక దుకాణంలో పనిచేస్తుండేవాడు.. ఒక వినియోగదారుడి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సొమ్ము తీసుకున్నారు. ఆ తరువాత లెక్కలు చూసుకుంటుంటే తెలిసింది. దుకాణం మూసేసి అర్థరాత్రి వినియోగదారుడి ఇల్లు వెతుక్కుంటూ పోయి తాను ఎక్కువగా తీసుకొన్న మొత్తాన్ని ఇచ్చేసి మరీ వచ్చాడు. అదీ అనుష్ఠానం లో ధర్మం అంటే... ఈ పరిణతి ఆయన ఎంతసేపు పూజ చేసాడు, ఎంత సేపు ప్రార్థన చేసాడు.. అన్న దానినిబట్టి రాలేదు... చిన్నతనం నుంచి అదే నిబద్ధతతో బతకబట్టి వచ్చింది. మీకు ధర్మంపట్ల అనురక్తి ఉండి ఆచరించినదేదో అదే ధర్మం. అదే సదాచారం. ధర్మంపట్ల అనురక్తి లేకుండా స్వప్రయోజనం చూసుకుంటే అది దురాచారం. ఎక్కడ సదాచారం ఉన్నదో అక్కడ భగవదనుగ్రహం ఉండి తీరుతుంది. ఎక్కడ సదాచారం లేదో అక్కడ దేముని కృప ఎలా సాధ్యం! నీకు ఆకలేస్తే నువ్వే తినాలి. నీకు నిద్రవస్తే నీవే నిద్రపోవాలి. అలాగే నీ నడవడికలో దోషాలను నీవే దిద్దుకోవాలి. సదాచారం పెరుగుతూ ఉండాలి, దురాచారం తగ్గుతూ పోవాలి. ధర్మం చెప్పేది కూడా... నీవు నన్ను కాపాడు.. నేను నీ పక్షాన ఉండి నిన్ను కాపాడతా...అనే. -
పక్షపాతమన్న ప్రశ్నే లేదు : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : మూడు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంలో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ ఏర్పాటులో రైతుసంఘాల ఆరోపణలను తోసిచ్చింది. ఈ కమిటీ ఏర్పాటులో పక్షపాతానికి తావులేదని స్పష్టం చేసింది. అలాగే సుప్రీం నియమించిన నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పుకున్నందున పునర్నిర్మాణం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలకువ్యతిరేకంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జనవరి 26న చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీ, ఇతర నిరసనలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సృష్టం చేసింది. అఫిడవిట్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించడంతో దీన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. వ్యవసాయ చట్టాల వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతుల సంఘాలు ఆరోపించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం కోసమే కమిటీ ఏర్పాటు చేశామని, దీనికి ఎలాంటి న్యాయాధికారమూ లేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే కమిటీలో నిపుణులను నియమించినట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులపై ముద్రలు వేయడం సరికాదు. గతంలో అభిపప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన వారిని నిందించడం తగదని సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అది ఫలితాన్ని ప్రభావితం చేయదని రైతు నేతలకు సూచించారు. ఉత్తమ న్యాయమూర్తులకు కూడా ఒకవైపు నిర్దిష్ట అభిప్రాయాలున్నా... మరొకవైపు తీర్పులు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా సుప్రీం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై ఉద్యమకారులు, రైతు సంఘాలతో కాంగ్రెస్, అకాలీదళ్ సహా ఇతర ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కమిటీలోని నలుగురు సభ్యులు గతంలో వివాదాస్పద చట్టాలకు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి, కిసాన్ మహాపాంచాయత్ రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారించింది. -
పదోన్నతుల్లో మహిళలకు మొండిచేయే!
న్యూయార్క్: పదోన్నతులు, వేతనాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ అవకాశాలు లభిస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్బుక్ సంస్థ చీఫ్ ఆరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండబర్గ్, మెక్‌కెన్సీ అండ్ కంపెనీతో కలసి ఈ విషయాలపై అధ్యయనం చేశారు. 46 లక్షల కార్మికులు ఉన్న 132 కంపెనీల్లో, 34 వేల మందికిపైగా ఉద్యోగులను సర్వే చేశారు. పదోన్నతుల కోసం పురుషులతోపాటు మహిళలు పోటీ పడుతున్నా వారికి సరైన అవకాశాలు దక్కడంలేదని, బాస్‌లుగా, దూకుడుగా ఉండడానికి వారు భయపడుతున్నారని తేలింది. శరీర రంగు కూడా ఆడవారి పురోగతికి అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించారు. -
లా అండ్ ఆర్డర్లో రాజకీయ జోక్యం
ఆదిలాబాద్ క్రైం : సాధారణంగా లా అండ్ ఆర్డర్ పేరు చెప్పగానే నేరాలు చేసే వారిలో వణుకుపుడుతుంది. నేరం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడే పోలీసుల చేతుల్లో ఉండాల్సిన లా అండ్ ఆర్డర్ ఇప్పుడు జిల్లాలో కొంత మంది అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోతోందనే ఆందోళన కలుగుతోంది. శాంతిభద్రతల విషయంలో పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేసి.. బాధ్యులకు శిక్ష పడేలా చేయడమే లా అండ్ ఆర్డర్ పని. కానీ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రోజురోజుకూ పోలీసుల కేసుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. ఒకప్పుడు తప్పు చేసే వారికి పోలీసులంటే భయం ఉండేది. కానీ ప్రస్తుతం తాము ఏ కేసులోనైనా తప్పు చేసినా తమను విడిపించేందకు నాయకులున్నారనే నమ్మకం వారిలో పెరిగిపోయిది. అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో ఒకే వర్గానికి, నేరం చేసిన వారికి మద్దతు తెలిపి పోలీసులపై ఒత్తిడి తేవడం సరైంది కాదని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ఎదుటి వ్యక్తికి న్యాయం జరుగదు. ప్రస్తుతం జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోనైతే ఇలాంటి సంఘటనలకు అంతులేకుండా పోతోందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. చోటామోటా నాయకులదే పెత్తనం.. జిల్లాలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా ఒక చిన్న కేసు నమోదైతే చాలు.. ఆ వెంటనే సంబంధిత పోలీసు అధికారికి ఫోన్లు వస్తున్నాయి. ఎలాంటికేసైనా సరే అందులో తమవారున్నారని.. వెంటనే విడుదల చేయాలని హెచ్చరించడం పరిపాటి. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల కంటే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొంత మంది చోటామోటా నాయకులే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కటేమిటి.. ట్రాఫిక్, ఆర్టీవో నిబంధనలు పాటించని వాహనదారుడికి జరిమానా వేసినా.. ఘర్షణల్లో తోటి వారిపై దాడి చేసినా.. పేకాట ఆడుతూ దొరికిపోయినా.. అక్రమ మద్యం విక్రయిస్తున్నా.. మరే కేసుల్లోనైనా అందులో ఉండే బాధ్యులు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారుంటే చాలు.. కేసు పక్కతోవ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పు తమదేనని తెలిసినా.. కేసులో పేరు ఉండకూడదని పోలీసులకు ఫోన్లు రావడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. సంబంధిత పోలీసు అధికారి కేసు విషయంలో రాజీపడని పక్షంలో అధికారంలో ఉన్నామని కొంత మంది చోట నాయకులు హెచ్చరిస్తుండడం శోచనీయం. చిన్నచిన్న కేసుల్లో జోక్యం చేసుకుంటుండడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులను సైతం తీసేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో చెప్పనక్కర్లేదు. రాజకీయ జోక్యం ఎందుకు..? పోలీసు కేసుల్లో రాజకీయ జోక్యంతో బాధితుడికి న్యాయం జరగకపోగా.. నేరస్థులు కేసు నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. పోలీసులు మనవారే ఉన్నారనే ధైర్యంతో కొంత మంది నాయకులు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న తగదాల్లో జోక్యం చేసుకొని పోలీసు స్టేషన్లకు వచ్చిన వారిని విడిపించేందుకు అధికార పార్టీ నాయకులు కొం దరు ప్రయత్నించడంతో సామాన్యులకు న్యాయం జరగడం లేదు. పోలీసులు సైతం ఇలాంటి కేసుల్లో చేతులె త్తేస్తున్నట్లు తెలుస్తోంది. చట్టాన్ని శాసించి.. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. ఇది పోలీసు వ్యవస్థలో ప్రతిఒక్కరూ చెప్పే మాటే. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే చట్టం పోలీసుల చేతుల్లోంచి.. రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోననే భయం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలీసు వ్యవస్థలో చట్టాన్ని శాసించే స్థాయిలో రాజకీయ జోక్యం జరుగుతుండడం బాధాకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసు వ్యవస్థలో రాజకీయ జో క్యం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.