నీళ్ల కోసం వెళ్లి తిరిగిరాని యువతి
మంచి నీళ్ల కోసం వెళ్లిన యువతి అదృశ్యమైన ఘనట విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. విశాపట్టణం అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండిబాగూడ గ్రామానికి చెందిన బిమల (18) ఈనెల 7న ఇంటి నుంచి మంచినీళ్లు తేవడానికి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సోమావారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు.