Bin Laden
-
లండన్ వీధుల్లో బిన్ లాడెన్ ప్రతినిధి
సాక్షి, న్యూఢిల్లీ : 1998లో జరిపిన టెర్రరిస్టు దాడుల్లో 224 మంది మరణానికి కారణమై అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న దివంగత అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు అధికార ప్రతినిధి అయిన 60 ఏళ్ల అదెల్ అబ్దెల్ బేరీ ప్రస్తుతం లండన్ వీధుల్లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా ఎంబసీ కార్యాలయాలపై టెర్రరిస్టులు ఆగస్టు నెలలో జరిపిన వరుస బాంబు దాడుల్లో 224 మంది మరణించగా, 72 మంది గాయపడ్డారు. లండన్‌లోని తలదాచుకున్న అబ్దెల్‌ను బ్రిటన్ పోలీసులు 1999లో అరెస్ట్ చేసి, 2012లో అమెరికాకు అప్పగించారు. ఆయన అమెరికా కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. (చదవండి: ట్రంప్ రికార్డ్.. 130 ఏళ్లలో తొలిసారి) నాటి నుంచి న్యూజెర్సీలోని డిటెన్షన్ సెంటర్లో ఉన్న అబ్దెల్ బాగా లావు అవడంతోపాటు అస్థమాతో బాధ పడుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ అమెరికా ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న నేటి పరిస్థితుల్లో అయిన్ని సురక్షితంగా ఓ గదిలో నిర్బంధించడం తమ వల్ల కాదని డిటెక్షన్ సెంటర్ అధికారులు చేతులెత్తేయడంతో ఆయనకు ముందుగా క్షమాభిక్ష ప్రసాదించి మంగళవారం నాడు విడుదల చేశారు. ఆయన ఆ మరుసటి రోజు బుధవారం నాడే లండన్‌కు చేరుకున్నారు. మెయిడా వలేలోని తన ఫ్లాట్‌కు చేరుకున్నారు. 9.8 కోట్ల రూపాయల విలువైన ఆ ఫ్లాట్‌లో ఆయన భార్య రగా (59 ఏళ్లు) నివసిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన తన భార్యను కలసుకున్నారు. జన్మతా ఈజిప్షియన్ అయిన అబ్దెల్‌కు 1991 బ్రిటన్ ఆశ్రయం లభించింది. ఇప్పుడు ఆయన్ని వెనక్కి పంపించుదామంటే అమెరికా అధికారులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అటు ఈజిప్టుకు పంపిద్దామంటే మానవ హక్కుల సమస్య ఉత్పన్నం అవుతుందని బ్రిటన్ అధికారులు ఆందోళన పడుతున్నారు. మళ్లీ ఆయన టెర్రరిస్టు కార్యాకలాపాలవైపు వెళ్లకుండా ఆయనపై నిఘా కొనసాగించే విషయంలోనూ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. -
ఇమ్రాన్ లాడెన్‌ను కీర్తిస్తారా..!
ఇస్లామాబాద్ : అమెరికాపై భీకర దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడని సంబోధించడం పట్ల విపక్షం మాజీ క్రికెటర్‌పై విరుచుకుపడింది. ఇమ్రాన్ గురువారం పాక్ పార్లమెంట్లో మాట్లాడుతూ 2011లో అమెరికన్ దళాలు పాక్ నగరం అబాట్టాబాద్లోని లాడెన్ స్ధావరంపై దాడిచేసి ఆయనను మట్టుబెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ హెలికాఫ్టర్లు లాడెన్ స్ధావరంపై దాడికి తెగబడిన ఆపరేషన్ గురించి పాకిస్తాన్‌కు తెలియదని, అమెరికన్ దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చి అమరుడిని చేయడం పట్ల పాకిస్తానీలుగా మనం ఎంత ఇబ్బందులకు గురయ్యామో తాను ఎన్నటికీ మరవలేనని చెప్పుకొచ్చారు. కాగా ఇమ్రాన్ వ్యాఖ్యలను విపక్ష నేత, మాజీ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ తప్పుపట్టారు. కరుడుగట్టిన ఉగ్రవాదిని అమరుడిగా ఇమ్రాన్ ఖాన్ కొనియాడారని వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన సమయంలో అధికారంలో ఉన్న పీపీపీ నేత బిలావల్ బుట్టో జర్ధారి సైతం ఇమ్రాన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హింసాత్మక అతివాదాన్ని ప్రధాని సమర్ధిస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి : ఇమ్రాన్ ముందు అనేక సవాళ్లు -
ఇండియా 'లాడెన్' పట్టుబడిన ఆరు రోజులకు.. విషాదం!
గువాహటి: భారత ‘బిన్ లాడెన్’గా పేరొంది.. ప్రజలను చంపేస్తూ బీభత్సం సృష్టించిన ఓ ఏనుగు పట్టుబడిన ఆరు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అటవీ అధికారుల సంరక్షణలో బందీగా ఉన్న ఆ ఏనుగు ఆదివారం ఉదయం 5.30 గంటలకు చనిపోయిందని ఇక్కడి ఓరంగ్ నేషనల్ పార్కు అధికారులు తెలిపారు. తమ సంరక్షణలో బందీగా ఉన్న ఈ ఆరు రోజులుగా ఏనుగు చక్కగా ఉందని, ఈ క్రమంలో అనూహ్యంగా ప్రాణాలు విడిచిందని వివరించారు. అసోంలోని గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు తీసుకున్న ఈ ఏనుగును వారం కిందట అధికారులు పట్టుకున్నారు. భారత ఒసామా బిన్ లాడెన్‌గా పేరొందిన ఈ ఏనుగు గత అక్టోబర్‌లో గోల్పారా జిల్లాలో ఐదుగురు గ్రామస్తులను చంపింది. స్థానికంగా బీభత్సం సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న ఈ ఏనుగు గత అక్టోబర్ నెలలో గోల్పారా జిల్లాలో గ్రామాలపై దాడి చేస్తూ.. ఐదుగురు స్థానిక గ్రామస్తులను చంపేసింది. దీంతో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పేరును ఈ ఏనుగుకు స్థానికులు పెట్టారు. ఈ ఏనుగు పేరు చెబితేనే స్థానికులు హడలిపోయేవారు. ఈ క్రమంలో అటవీ అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి.. ఈ ‘లాడెన్’కు ఉచ్చుబిగించారు. చాలారోజులపాటు అడవిలో ఈ ఏనుగు సంచారాన్ని ట్రాక్ చేశారు. నిపుణులైన ఆర్చర్లు మత్తు మందుతో కూడిన బాణాలను సంధించడం ద్వారా ఈ ఏనుగును బంధించి.. అక్కడి నుంచి తరలించారు. -
మామూలోడుకాదు.. ఇండియా బిన్ లాడెన్!!
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్! ఇప్పుడు పోలీసుల దృష్టిలో ‘ఇండియా బిన్ లాడెన్’!! గణతంత్రదినోత్సవానికి కొద్ది రోజుల ముందు దేశరాజధానిలో సంచలన రీతితో పట్టుబడిన అబ్దుల్ సుభాన్ ఖురేషీ(46) అలియాస్ తౌఖీర్ మామూలోడుకాదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ ఘాజీపూర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్న ఖురేషీని ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. యాంటీ టెర్రరిస్టు వ్యవహారాలకు సంబంధించి ఖురేషీ అరెస్టు గొప్ప ముందడుగని పోలీసులు పేర్కొన్నారు. టెకీగా పలు కంపెనీల్లో : ఖురేషీ కుటుంబీకులు దశాబ్ధాల కిందటే ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వలసవచ్చారు. అతని విద్యాబ్యాసమంతా ముంబైలోనే సాగింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన ఖురేషీ.. పలు సంస్థల్లో ఉద్యోగాలు కూడా చేశాడు. ముంబై మతకలహాల తర్వాత ఉగ్రవాదానికి ప్రభావితులైన వ్యక్తుల్లో ఇతనూ ఒకడు. మొదట స్టుడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో చేరి క్రియాశీలకంగా పనిచేశాడు. ఆ సంస్థకు అనుబంధంగా దాడులకు పాల్పడే గ్రూపు ఒకటి 2008లో అహ్మదాబాద్‌లో వరుసపేలుళ్లకు పాల్పడింది. సాంకేతిక విషయాలపై గట్టిపట్టున్న ఖురేషీనే.. ఆ బాంబులు తయారుచేశాడని పోలీసులు చెబుతారు. నాటి ఘటనలో 56 మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖురేషీ.. అనంతరకాలంలో ‘ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం)’ ఉగ్రసంస్థ ఏర్పాటులోనూ విశేషమైన పోషించాడు. ఐఎం సహవ్యవస్థాపకుడిగా.. యువతను సమీకరించి, వారిలో జాతివ్యతిరేక భావజాలాన్ని పురిగొల్పేలా ఖురేషీ క్లాసులు తీసుకునేవాడు. విదేశాల నుంచి ఎందుకొచ్చినట్లు? : అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత చాలా కాలం కనిపించకుండా పోయిన ఖురేషీ అలియాస్ తౌఖీర్.. బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నట్లు 2004లో వెల్లడైంది. అంతకుముందు అతను నేపాల్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోనూ కొన్నాళ్లు గడిపినట్లు తెలిసింది. ఖురేషీని పట్టుకునేందుకు ప్రయత్నించిన అన్నిసార్లూ విఫలమైన భారత పోలీసులు.. ఇంటర్‌పోల్ ద్వారా అతనిపై రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయించారు. అతని తలపై రూ.4లక్షల బహుమతి కూడా ఉంది. ఇన్నాళ్లూ విదేశాల్లో గడిపిన ఖురేషీ.. ఏకంగా ఢిల్లీలో పట్టుబడటం సంచలనంగా మారింది. భారత్‌లో ఐఎం కార్యకలాపాలను పునఃప్రారంభించే క్రమంలోనే అతను ఇండియాకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఖురేషీ అరెస్టు నేపథ్యంలో రిపబ్లిక్‌డే వేడుకల బందోబస్తును మరింత పటిష్టంచేశారు. -
వారసుడొచ్చాడు.. ప్రపంచదేశాల గుండెల్లో రైళ్లు!
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలను గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్ర సంస్ధకు వారసుడొచ్చాడా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వివిధ ఉగ్రసంస్ధల సహచర్యంతో తిరుగులేని శక్తిగా ఎదగడానికి అల్‌ఖైదా యత్నిస్తున్నట్లు కూడా సమాచారం. అల్‌ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు 28 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ సంస్ధ పగ్గాలు చేపట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ పీడను వదిలించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్న ప్రపంచరాజ్యాలు.. కొత్తగా ఊపిరులూదుకుని ఓ శక్తిగా వస్తున్న అల్‌ఖైదాను ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచిస్తున్నాయి. ఇందుకోసం హమ్జా కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఒసామా బిన్ లాడెన్ మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తి. దీంతో ఒసామా కొడుకు హమ్జా పిలుపునిస్తే వేలాదిగా ముస్లిం యువత సంస్ధలో చేరి ప్రాణత్యాగానికి సిద్ధపడతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచదేశాల్లో మరింత భయం పెరుగుతోంది. గడిచిన రెండు సంవత్సరాల్లో యూరప్ ఖండంలో అత్యధిక సార్లు ఉగ్రదాడులు జరిగాయి. అల్‌ఖైదా పునరుజ్జీవనం పోసుకుంటుందనే వార్త ఆ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అల్‌ఖైదాకు చెందిన పలువురు అగ్ర నాయకులు కూడా గతంలో హమ్జానే వారసుడని తీర్మానించారు. రెండేళ్ల క్రితమే అతన్ని ‘గుహ నుంచి వచ్చిన సింహం’ అని అల్‌ఖైదా కీలక నేత అల్ జవహరి అభివర్ణించాడు. ఒసామాకు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం. సౌదీ అరేబియాకు చెందిన ఆమె మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో హమ్జా తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. మొదట సౌదీ అరేబియా, సుడాన్, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్లలో కూడా నివసించాడు. హమ్జాకు కూడా వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే, హమ్జా ఎదిగిన తర్వాతి ఫోటో ఇంతవరకూ బయటకు రాలేదు. కేవలం అతని చిన్ననాటి ఫోటోనే నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. హమ్జాను అల్‌ఖైదా కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు భావించేవారు. అయితే తాను దూరంగా ఎందుకుండాలంటూ హమ్జా వారితో వాదించేవాడట. అమెరికాలో దాడులు అనంతరం ఒసామా బిన్ లాడెన్, ఇతర అనుచరులు తూర్పు అఫ్ఘానిస్థాన్లోని తోరాబోరా కొండల్లో దాక్కున్నారు. అప్పుడే ఒసామా తన భార్యాపిల్లలను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు పంపించి వేశాడు. అనంతరం హమ్జా తండ్రిని పెద్దగా కలిసింది లేదు. ఇరాన్లో దాదాపుగా గృహ నిర్బంధంలో ఉన్నట్టుగా ఉండేవాడు. దీనిపై అసంతృప్తి చెందుతూ పవిత్ర సైనికుని(మొజాహిదీన్)గా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 2009లో తండ్రికి పెద్ద ఉత్తరం రాశాడు హమ్జా. ఉగ్ర పోరాటాలతో సాధ్యమైనన్ని మార్గాల్లో ఆయా దేశాలకు నష్టం కలిగించాలని అనుచరులకు హమ్జా చెబుతున్నట్టు తెలిసింది. -
'లాడెన్ భుజం మీదుగా మాపై తూటాలు'
జెనీవా: 'ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటూ అమెరికా, ఈయూలు పాకిస్థాన్ కు ఆయుధాలిస్తున్నాయి. వాస్తవం ఏమంటే పాకిస్థానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అల్ కాయిదా లీడర్ బిన్ లాడెన్ ఉదంతంలోనూ ఇది నిజమని తేలింది. ఒకవైపు లాడెన్ ను వేటాడేందుకు అమెరికా పాక్ కు భారీ ఎత్తున ఆయుధాలిచ్చింది. తీరా చూస్తే లాడెన్ పాకిస్థాన్ లోనే ఆశ్రయం పొందడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. లాడెన్ భుజం మీదుగా పాకిస్థాన్ పేల్చిన తుపాకి తూటాలకు బలైంది మా(బెలూచిస్థాన్) ప్రజలే' అంటూ ఐక్యరాజ్య సమితి మానవహక్కుల వేదికపై ఉద్వేగంగా ప్రసంగించారు బెలూచిస్థాన్ ప్రతినిధి మెహ్రాన్. పాకిస్థాన్‌కు అణుసామర్థ్యం గల ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని అమ్మాలన్న అమెరికా నిర్ణయాన్ని మొదటినుంచి వ్యతిరేకిస్తోన్న మెహ్రాన్.. శనివారం జనీవాలో జరిగిన ఐక్యర్యాజ్యసమితి మానవహక్కుల కమిషన్ వార్షిక సమావేశంలోనూ తన వాణిని వినిపించారు. అమెరికా, యురోపియన్ యూనియన్లు అందిస్తోన్న ఆయుధాలను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తున్నదని, బెలూచిస్థాన్ ప్రజలను అంతం చేసేందుకు వాటిని వినియోగిస్తున్నదని మెహ్రాన్ ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రపంచదేశాలు పాకిస్థాన్ కు ఆయుధాలివ్వటం మానేయాలని, ఆమేరకు ఐక్యరాజ్యసమితి కృషిచేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. బెలూచిస్థాన్ బాధేంటి? పాకిస్థాన్ లోని నాలుగు ఫ్రావిన్స్ లలో బెలూచిస్థాన్ ఒకటి. క్వెట్టా ప్రధాన నగరంగా ఉన్న ఈ ప్రాంతం 1947కు ముందు స్వతంత్ర్య రాజ్యం. ఇండియా నుంచి విడిపోయిన తర్వాత పాక్ సైన్యాలు బెలూచిస్థాన్ ను ఆక్రమించుకున్నాయి(1948 ఏప్రిల్ లో). పాక్ పాలనలో జీవించబోమంటూ బెలూచిస్థాన్ ప్రజలు అనేక ఆందోళనలు చేశారు. అయితే, ఈ ఆందోళనలను పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచి వేస్తూనే ఉంది. పాక్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే... వారిని, వారి కుటుంబీకులను గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలికుండా పాక్ సైన్యం అత్యంత దారుణంగా హతమారుస్తోంది. ఈ క్రమంలోనే వంద మంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చి చంపింది. ఈ దారుణం వెలుగు చూడటంతో, బెలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్ర రూపం దాల్చాయి. మీ రాక్షస పాలన మాకు వద్దంటూ, బెలూచ్ ప్రజలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేశారు. బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యాలు సాగిస్తోన్న అకృత్యాలివి(పాత ఫొటోలు) -
సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు అమెరికాలో న్యాయం
న్యూయార్క్ : ఉగ్రవాది అంటూ దూషణలతో పాటు దాడులకు గురయిన భారతీయ సంతతికి చెందిన ఓ సిక్కు వ్యక్తికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. గతేడాది సిక్కు జాతీయుడిని దూషించి అతడిపై ముష్టియుద్ధానికి దిగిన కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. 9/11 దాడుల నేపథ్యంలో సెప్టెంబర్ 8న ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ కొందరు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇందర్జిత్ సింగ్ ముక్కర్ చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ప్రస్తుతం విచారణకు రాగా నిందితుడికి శిక్ష పడిందని చికాగో పోలీసులు తెలిపారు. నిందితుడి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. అతడు ఇంకా టీనేజీలోనే ఉన్నందున జువెనైల్ హోమ్ కు తరలించినట్లు వివరించారు. సిక్కు కమ్యూనిటీకి 200 గంటల పాటు సేవ చేయడంతో పాటు దాదాపు రూ.3.24 లక్షలు ఫైన్ విధించారు. ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడి అతడికి ఊపిరాడకుండా చేశారని సిక్కు సంస్థ ఆరోపించింది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్‌లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇందర్ జిత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
అమెరికాలో లాడెన్ జెండా ఎగురవేయగలరా?
న్యూఢిల్లీ: మన దేశంలో ఉన్నంత స్వాతంత్ర్యం మరే దేశంలోనూ ఉన్నట్టు కనిపించడం లేదని కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ఒకవైపు దేశం కోసం సైనికులు ప్రాణాలు విడుస్తుంటే.. మరోవైపు కొన్ని వర్గాలు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. జేఎన్‌యూలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆయనను ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసిన వ్యవహారంపై ఆయన స్పందించారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అమెరికాలో ఒసామా బిన్ లాడెన్ జెండాను ఎగురవేయగలరా? ఇలాంటి ఘటనలు మనం దేశంలో కాకుండా మరో దేశంలోనూ జరగవని ఆయన అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడటమే కాదు.. విధులను కూడా నెరవేర్చాల్సిన అవసరముందన్నారు. -
కూలింది ‘బిన్ లాడెన్’ క్రేన్
మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో కూలిపోయి వందకుపైగా యాత్రికుల దుర్మరణానికి కారణమైన భారీ క్రే న్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీది. పాక్ భూభాగంలో అమెరికా జరిపిన కమాండో ఆపరేషన్‌లో అంతర్జాతీయ టైస్టు ఒసామా బిన్ లాడెన్ మరణించిన విషయం తెల్సిందే. బిలియనీర్ అయిన బిల్ లాడెన్ తండ్రి మొహమ్మద్ సౌదీ అరేబియాలో బిన్‌లాడెన్ గ్రూప్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. సౌదీ రాజుతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని మొహమ్మద్ అక్కడ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారు. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన బిన్‌లాడెన్ గ్రూపే మక్కా మసీదు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. అందుకనే బిన్‌లాడెన్ కుటుంబసభ్యులు భాగస్వామిగా ఉన్న జర్మనీ క్రేన్ కంపెనీ నుంచి భారీ క్రేన్లు తెప్పించి నిర్మాణ పనులు చేపట్టారు. ఒకేసారి 22 లక్షల మంది యాత్రికులు ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా 1,40,000 కోట్ల రూపాయలతో మసీదు విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు చెబుతుండగా, క్రేన్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక పోవడం వల్లనే ప్రమాదం సంభవించిందన్న వాదన కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది. -
బిన్ లాడెన్ అంటూ భారతీయుడిపై అమెరికాలో దాడి
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిపై ఉగ్రవాది అంటూ అగ్రదేశం అమెరికాలో దాడి జరిగింది. 'టెర్రరిస్టు', 'బిన్ లాడెన్' అంటూ దాడికి పాల్పడ్డారని ఇందర్జిత్ సింగ్ ముక్కెర్ అనే వ్యక్తి చికాగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 11 దాడుల నేపథ్యంలో ఓ భారతీయుడిపై అమెరికన్ దాడికి పాల్పడటం గమనార్హం. ప్రస్తుతం తమ అదుపులోనే నిందితుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందర్జీత్కు అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. గ్రాసరి స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం నాడు అక్కడి జాత్యహంకారవాదులు 'టెర్రరిస్ట్ గో బ్యాక్ టు యువర్ కంట్రీ, బిన్ లాడెన్' అంటూ నినాదాలు చేస్తూ ముక్కర్పై దాడికి పాల్పడ్డారని స్థానిక సిక్కు మతానికి చెందిన ఓ సంస్థ పేర్కొంది. ఓ వ్యక్తి తన మొహంపై పదేపదే పంచ్‌లు విసిరాడని దీంతో కొద్దిసేపు తనకు ఊపిరాడలేదని, స్పృహకోల్పోయినట్లు బాధితుడు ముక్కర్ చెబుతున్నాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసి ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. దవడ భాగంలో ఓ ఎముక ఫ్రాక్చర్ అయినట్లు కూడా సమాచారం. ' ఈ ఘటనపై స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు', సహించరాని నేరంగా దాడిని పరిగణించి దర్యాప్తు చేయాలని వారిని కోరుతున్నట్లు ముక్కర్ పేర్కొన్నాడు. సిక్కు మత వేషధారణలో ఉండటం వల్ల, అతడి జాతీయత కనిపించడంతోనే ఈ దాడి జరిగిందని సిక్కు మత లీగల్ డైరెక్టర్ హర్ సిమ్రన్ కౌర్ అన్నారు. గత ఆగస్టులో సందీప్ సింగ్ అనే వ్యక్తిని 'టెర్రరిస్టు' అంటూ న్యూయార్క్ సిటీలో దాడి చేసిన విషయం విదితమే. 2012లలోనూ ఓ సిక్కు వ్యక్తి ఇంట్లోకి చోరబడ్డ ఆగంతకుడు కాల్పులు జరిపి ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఘటన అప్పట్లో అమెరికాలో సంచలనం సృష్టించింది. -
లాడెన్ ఆల్‌ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆ సంస్థ పేరు మార్చాలనుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నాయి అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వర్గాలు. యూఎస్ సైన్యం చేతిలో లాడెన్ హతమయ్య కొద్ది రోజుల మందు.. ఆల్ ఖైదా సంస్థ పేరు మార్చాలని భావించాడని.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నిస్ట్ బుధవారం వాషింగ్టన్లో వెల్లడించారు. యూఎస్‌లో డబ్ల్యూటీసీ టవర్‌పై దాడి చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విధ్వంసానికి పాల్పడటంతో లాడెన్ ఆలోచనలో పడ్డాడు. అల్ ఖైదా మారణహోమానికి ప్రతీకగా నిలిచిందని లాడెన్ భావించాడు. ఇలాగే విధ్వంసం సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఖైదాకు మరింతచెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడు... అది కూడా ఇస్లాం మాతానికి చాలా దగ్గరగా ఉండేలా కొత్త పేరు పెట్టాలనుకున్నాడు. ఆ దిశగా ఆలోచనలు చేస్తూ...ఆల్‌ఖైదా నాయకులతో సమాలోచన చేసేందుకు చర్యలు కూడా చేపట్టాడని ఎర్నెస్ట్ వివరించారు. ఇంతలో లాడెన్ పాకిస్థాన్ అబోటాబాద్‌లోని బిలాల్ పట్టణంలో ఉన్నట్లు గుర్తించిన యూఎస్ సైన్యం... 2011, మే 2వ తేదీన అతడి నివాసంపై దాడి చేసి... అతడ్ని అంతమెందించింది. అనంతరం అతడి మృతదేహాన్ని యూఎస్ సైన్యం సముద్రంలో పడి వేసిన విషయం విదితమే.అయితే లాడెన్‌ను చంపేసిన తర్వాత అతడి నివాసంలో యూఎస్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో పలు కీలకమైన పత్రాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ పత్రాలను పరిశీలించిన యూఎస్ ఉన్నతాధికారులకు పలు ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.