ఇండియా 'లాడెన్‌' పట్టుబడిన ఆరు రోజులకు.. విషాదం! | Assam Rogue Elephant Dies After Six Days In Captivity | Sakshi
Sakshi News home page

ఇండియా 'లాడెన్‌' పట్టుబడిన ఆరు రోజులకు.. విషాదం!

Published Sun, Nov 17 2019 4:14 PM | Last Updated on Sun, Nov 17 2019 4:16 PM

Assam Rogue Elephant Dies After Six Days In Captivity - Sakshi

గువాహటి: భారత ‘బిన్‌ లాడెన్‌’గా పేరొంది.. ప్రజలను చంపేస్తూ బీభత్సం సృష్టించిన ఓ ఏనుగు పట్టుబడిన ఆరు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అటవీ అధికారుల సంరక్షణలో బందీగా ఉన్న ఆ ఏనుగు ఆదివారం ఉదయం 5.30 గంటలకు చనిపోయిందని ఇక్కడి ఓరంగ్‌ నేషనల్‌ పార్కు అధికారులు తెలిపారు. తమ సంరక్షణలో బందీగా ఉన్న ఈ ఆరు రోజులుగా ఏనుగు చక్కగా ఉందని, ఈ క్రమంలో అనూహ్యంగా ప్రాణాలు విడిచిందని వివరించారు.

అసోంలోని గోల్పారా జిల్లాలో స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తూ పలువురి ప్రాణాలు తీసుకున్న ఈ ఏనుగును వారం కిందట అధికారులు పట్టుకున్నారు. భారత ఒసామా బిన్‌ లాడెన్‌గా పేరొందిన ఈ ఏనుగు గత అక్టోబర్‌లో గోల్పారా జిల్లాలో ఐదుగురు గ్రామస్తులను చంపింది. స్థానికంగా బీభత్సం సృష్టిస్తూ ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న ఈ ఏనుగు గత అక్టోబర్‌ నెలలో గోల్పారా జిల్లాలో గ్రామాలపై దాడి చేస్తూ.. ఐదుగురు స్థానిక గ్రామస్తులను చంపేసింది. దీంతో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ పేరును ఈ ఏనుగుకు స్థానికులు పెట్టారు. ఈ ఏనుగు పేరు చెబితేనే స్థానికులు హడలిపోయేవారు. ఈ క్రమంలో అటవీ అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి.. డ్రోన్లు, పెంపుడు ఏనుగులను ఉపయోగించి.. ఈ ‘లాడెన్‌’కు ఉచ్చుబిగించారు. చాలారోజులపాటు అడవిలో ఈ ఏనుగు సంచారాన్ని ట్రాక్ చేశారు. నిపుణులైన ఆర్చర్లు మత్తు మందుతో కూడిన బాణాలను సంధించడం ద్వారా ఈ ఏనుగును బంధించి.. అక్కడి నుంచి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement