రూ.1500 లకే స్పెషల్ హెల్మెట్
బెంగళూరు : ప్రమాదాలకు గురైన సమయంలో రక్షణ కోసమే కాదు.. దారి చూపేందుకు కూడా సహకరించే హెల్మెట్లు త్వరలో మార్గెట్లోకి రానున్నాయి. అంతర్గతంగా బ్లూటూత్ స్పీకర్ ఇందులో పొందుపరచబడి ఉంటుంది. దీని ద్వారా రూట్ విషయంలో వాహనదారుడికి సూచనలు అందుతుంటాయి. బెంగళూర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిని తయారు చేశారు.
గుల్బర్గాలోని పీడీఏ కాలేజీలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న యోగేష్, అభిజిత్‌లు ఈ హెల్మెట్‌ను రూపొందించారు. ‘హెల్మ్ట్లో ఇన్‌బిల్ట్‌గా ఓ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. దారి మరిచిపోయిన సందర్భంలో ఫోన్ బ్లూటూత్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌కు దీనికి అనుసంధానించే సౌలభ్యం ఉంటుంది. రూట్ తెలీక గందరగోళానికి గురయ్యే వాహనాదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అని ఆ విద్యార్థులు చెబుతున్నారు. ‘విదేశాల్లో వీటికి మంచి మార్కెట్ ఉంటుంది. కానీ, విద్యార్థుల కోరిక మేరకు 1500 రూ. దీనిని అమ్మాలని నిర్ణయించాం’ అని హెల్మెట్‌పై హక్కులు తీసుకున్న సంస్థ తెలిపింది.
ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఇది 6 గంటలు పని చేస్తుంది. ఛార్జింగ్ పోర్ట్‌తోపాటు, ముందు భాగంలో కూలింగ్ షీట్‌ను కూడా పొందుపరిచారు. త్వరలో బెంగళూర్‌తోపాటు మిగతా ప్రధాన నగరాల్లోని మార్కెట్ల్లోకి ఒకేసారి ఇవి అందుబాటులోకి రానున్నాయి.