board directors
-
నాయకత్వ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: దేశంలోని 100 అగ్రగామి కంపెనీల డైరెక్టర్ల బోర్డుల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా గడిచిన నాలుగేళ్లలో ఇది గణనీయంగా మెరుగుపడినట్టు ‘ఎక్స్‌లెన్స్ ఎనేబులర్స్’ 5వ కార్పొరేట్ గవర్నెన్స్ సర్వే వెల్లడించింది. 2024 మార్చి నాటికి కేవలం ఐదు కంపెనీల్లోనే మహిళా స్వతంత్ర డైరెక్టర్ ఒక్కరూ లేని పరిస్థితి నెలకొన్నట్టు తెలిపింది. ఇవన్నీ ప్రభుత్వరంగ సంస్థలే (పీఎస్‌యూ) కావడం గమనార్హం. నాలుగు పీఎస్‌యూలతోపాటు, ఒక ప్రభుత్వరంగ బ్యాంక్‌లో మహిళా డైరెక్టర్ ఒక్కరూ లేరు.2021 మార్చి నాటికి అగ్రగామి 100 కంపెనీల్లో మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ లేని కంపెనీలు 21 ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. కంపెనీల బోర్డుల్లో కనీసం ఒక్క మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినా ఉండాలని కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 149 నిర్దేశిస్తోంది. సమర్థత కలిగిన మహిళలను గుర్తించి, కెరీర్ పురోగతి దిశగా అవకాశాలు కల్పించడం ద్వారా బోర్డుల్లో ప్రాతినిధ్యాన్ని పెంచగలమని ఈ సర్వే అభిప్రాయపడింది.ఇదీ చదవండి: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్పార్ట్స్నిదానంగా పురోగతి..కంపెనీ బోర్డుల్లో కీలక పదవుల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2021 మార్చి నాటికి మహిళా మేనేజింగ్ డైరెక్టర్లు కలిగిన కంపెనీలు రెండు ఉంటే, 2024–25 మార్చి నాటికి ఐదుకు పెరిగినట్టు తెలిపింది. అలాగే, 2021 మార్చి నాటికి రెండు కంపెనీలకు మహిళా ఛైర్పర్సన్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఐదుగురు ఈ స్థానానికి చేరుకున్నట్టు వెల్లడించింది. నాయకత్వ బాధ్యతల్లో మహిళల పాత్ర గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెరుగుతూ వచ్చినట్లు తెలిపింది. లింగ సమానత్వం మెరుగ్గా లేకపోయినప్పటికీ.. కీలకమైన పాలన బాధ్యతల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు పేర్కొంది. -
కనీసం ఇద్దరు.. ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం
ముంబై: బోర్డులో ఎండీ, సీఈవోతోపాటు ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల సబ్సిడరీలను ఆర్బీఐ కోరింది. వారసత్వ బదిలీకి వీలుగా ఈ సూచన చేసింది. బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న సంక్లిష్టతల నేపథ్యంలో ప్రస్తుత, భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సమర్థవంతమైన సీనియర్ మేనేజ్మెంట్ బృందం అవసరమని గుర్తు చేసింది. ‘‘ఇలాంటి సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేయడం వల్ల నాయకత్వ బదిలీకి కూడా సాయపడుతుంది. ఎండీ, సీఈవోలకు సంబంధించి గరిష్ట వయసు నిబంధనల అమలుకు వీలు కల్పిస్తుంది’’అని ఆర్బీఐ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. కార్యకలాపాల స్థాయి, వ్యాపారం, సంక్లిష్టతలు, ఇతర అంశాల ఆధారంగా బోర్డులో గరిష్టంగా ఎంత మంది హోల్‌టైమ్ డైరెక్టర్లు ఉండాలనే అంశాన్ని బ్యాంక్‌ల బోర్డులు నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. హోల్‌టైమ్ డైరెక్టర్లకు సంబంధించి ప్రస్తుత బ్యాంక్ బోర్డులు కనీస అవసరాలకు అనుగుణంగా లేవంటూ.. ఇక్కడి నుంచి నాలుగు నెలల్లోగా హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకం విషయమై ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది. -
పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్
సాక్షి హైదరాబాద్: ఈ నెల 8 నుంచి ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లు బోర్డు గుర్తించింది. దీంతో బోర్డు ఇతర జిల్లాలోని కాలేజి ప్రిన్సిపాల్స్‌ను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ విద్యార్థులకు వాట్స్అప్ ద్వారా పేపర్లను పంపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బోర్డు సెక్రెటరీ ప్రశ్నాపత్రాల లీక్ విషయమై ఆ ఇన్స్టిట్యూట్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ పైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిక్కుల్లో లక్ష్మీ విలాస్ బ్యాంకు!
న్యూఢిల్లీ: మరో ప్రైవేటు బ్యాంకులో ముసలం మొదలైంది. చెన్నై కేంద్రంగా దక్షిణాదిలో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించే లక్ష్మీ విలాస్ బ్యాంకు ఆరోపణల్లో చిక్కుకుంది. బ్యాంకు బోర్డు డైరెక్టర్లకు వ్యతిరేకంగా మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలతో ఢిల్లీలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. ‘‘ఢిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం 2019 సెప్టెంబర్ 23న ఎల్వీబీ బోర్డు డైరెక్టర్లు, తదితరులపై మోసం, విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కన్నాట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది’’అంటూ ఎల్వీబీ బీఎస్ఈకి సమాచారం అందించింది. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు వివరించింది. తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్‌ను లక్ష్మీ విలాస్ బ్యాంకు దుర్వినియోగం చేసిందన్నది రెలిగేర్ ఫిన్వెస్ట్ ఆరోపణ. ‘‘రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ నిధులను చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎల్వీబీ కేంద్రంగా పనిచేసింది’’ అని ఫిర్యాదులో రెలిగేర్ ఫిన్వెస్ట్ ఆరోపించినట్టు సమాచారం. అయితే, బ్యాంకు డైరెక్టర్ల బోర్డు మొత్తంపై ఈ ఆరోపణలు చేసిందా లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్న స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఇటీవలే పీఎంసీ బ్యాంకు ఒకటి సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ను లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీనం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. విలీనానికి అనుమతి కోరుతూ ఈ సంస్థలు ఆర్బీఐ వద్ద దరఖాస్తు కూడా దాఖలు చేశాయి. తాజా పరిణామాలు విలీనంపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అయితే, రెలిగేర్ ఫిన్వెస్ట్ 2018 మే నెలలో మొదటిసారి ఈ అంశాన్ని లేవనెత్తిందని, విలీన చర్చలు ఆ తర్వాతే మొదలైనందున కేసు ప్రభావం విలీనంపై ఉండబోదన్న అభిప్రాయం బ్యాంకు వర్గాల నుంచి వ్యక్తమైంది. మార్కెట్లో షేర్ లోయర్ సర్క్యూట్.. మోసం సహా పలు ఆరోపణల ఆధారంగా లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్వీబీ) డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలవడం శుక్రవారం కంపెనీ షేర్లను కిందకు పడదోసింది. అమ్మకాల సెగకు షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ.36.50 వద్ద, బీఎస్ఈలో రూ.36.55 వద్ద షేరు ముగిసింది. -
టాటా గ్లోబల్ బెవరేజెస్ బోర్డులోకి మాజీ బ్యాంకర్
సాక్షి, ముంబై : యాక్సిస్ బ్యాంకు మాజీ సీఎండీ శిఖాశర్మ టాటా గ్లోబల్ బెవరేజెస్ బోర్డులో స్వత్రంత్ర, అదనపు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవమున్న శిఖా శర్మతోపాటు పిడిలైట్ ఇండస్ట్రీస్ ఎండీ భరత్ పూరినీ కూడా బోర్డులోకి తీసుకున్నట్టు సంస్థ మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. వీరి నియామకం మే 7, 2019 నుంచి అమల్లోకి వచ్చిందని, అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని టాటా గ్లోబల్ బేవరేజెస్ ప్రకటించింది. దీనికి రానున్న సాధారణ వార్షిక సమావేశంలో వాటా దారుల అనుమతి తీసుకోవాల్సింది అని తెలిపింది. కాగా శిఖా శర్మ 2004, జూన్ నుంచి డిసెంబరు 2018 వరకు యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరించారు. 1980లో ఐసీఐసీఐ బ్యాంకులో కరీయర్‌ను ప్రారంభించిన శర్మకు ఆర్థిక రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1982లో ఏసియన్ పెయింట్స్‌తో కరియర్‌ను ప్రారంభించిన భారత్ పూరి 2009 లో పిడిలైట్ ఇండస్ట్రీస్‌లో అదనపు డైరెక్టర్‌గా చేరారు. అనంతరం ఏప్రిల్, 2015 లో మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. -
అతివలే ఆలయ పెద్దలు
ఏపీలో తొలిసారి ఒక గుడికి మహిళా సభ్యులతోనే పాలకమండలి ఏర్పాటు ఇదో నూతన అధ్యాయం: ఏపీ అర్చక సమాఖ్య సింగుపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డులో అందరినీ మహిళలనే నియమించడం ద్వారా కమిషనర్ అనురాధ కొత్త ఒరవడి సృష్టించారని ఏపీ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో కొనియాడింది. సాక్షి, హైదరాబాద్: ఏపీలో తొలిసారి ఓ గుడికి మొత్తం మహిళలతోనే పాలక మండలి ఏర్పాటైంది. ఆ గుడి అభివృద్ధికి మహిళలు పడుతున్న శ్రమను చూసి ఊరు ఊరంతా మంత్ర ముగ్ధులైంది. ఈసారి గుడి పాలకమండలిని ఆ మహిళలతోనే ఏర్పాటు చేయాలని ఆ ఊరి ప్రజలు తీర్మానించుకున్నారు. గ్రామ సర్పంచ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆయన దేవాదాయ శాఖకు సిఫార్సు చేశారు. దీంతో మొత్తం ఆరుగురు మహిళా సభ్యులతో ఆ గుడికి పాలక మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ జనవరి 22న ఉత్తర్వులు జారీ చేశారు. అతివలే ఏలే ఆ ఆలయం.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం, సింగుపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం. కొత్తగా నియమితులైన పాలకమండలి బుధవారం ఉదయం 10:30 గంటలకు ఆ గుడిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతోందని ఆలయ ఈవో సాంబశివరావు ‘సాక్షి’కి తెలిపారు. బాగోగులన్నీ వాళ్లే.. ఏటా రూ. 2 లక్షలు ఆదాయం ఉండే ఆ గుడికి మరమ్మతులు కోసం నిధులు సరిపోకపోతే.. ఆ మహిళలే ఊరి ప్రజల నుంచి రూ. 8.5 లక్షల విరాళాలు సేకరించి మరమ్మతులు చేయించారు. అర్చకుడి కోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టించారు. గుడికి కొత్తగా విద్యుదీకరణ చేయించారు. దేవుడి రథానికి కొత్త షెడ్ కట్టించారు. ఇలా మహిళలు పడుతున్న శ్రమ చూసి గ్రామస్తులందరి సూచనతో సర్పంచి ప్రేమాజీ ఆ మహిళలతోనే గుడి పాలకమండలి ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను కోరారు. ఆ విజ్ఞప్తిని ఆయన దేవాదాయ శాఖ కమిషనర్‌కు విన్నవించారు.