The body
-
యోగ యోగి యోగాంతం
సాధారణంగా యోగ ప్రధానలక్ష్యం భగవంతుని ఉనికిని అనుభవించడం, అదీ అంతిమంగా సమాధిస్థితిలో. భగవంతుడు అంటే మన ఊహకి గాని, ఆలోచనకి గాని అందనివాడు అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఊహకే అందని ఆ భగవంతుడిని యోగా ద్వారా అర్థం చేసుకోవడం ఎలా? ఆయనను చేరుకోవడం ఎలా? అన్న ప్రశ్నలకు సమాధానమే క్రియాయోగ. మన మేధస్సుకు అసాధ్యంగా భావించే ఈ స్థితిని క్రియా యోగ ద్వారా ఎలా సుసాధ్యం చేయవచ్చో చూద్దాం. యోగసాధనలో మనకు అనేక దశలు అనుభవంలోకి వస్తాయి. మొదటి దశ శరీరంలో అనుభూతి తో మొదలవుతుంది. అదెలాగంటే యోగసాధన చేస్తున్నప్పుడు శరీరం క్రమేణా ఆరోగ్యవంతమవుతుంది. శారీరక బాధలు, నొప్పులు తగ్గిపోతాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమపద్ధతిలో జరుగుతాయి. నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇదంతా యోగాసనాల సాధన ద్వారా తొలిదశలో సాధ్యం అవుతుంది. యోగసాధకుల శరీరంలో జరిగే ఈ ఆరోగ్య ప్రక్రియే భగవంతుని శక్తి. ఇక భగవంతుని ఉనికి తెలుసుకోవడంలో తదుపరిదశ మానసికమైనది. భావోద్వేగాలు, విపరీత ధోరణులు సద్దుమణిగి పోతాయి. ఆందోళనలు, కోపతాపాల స్థానంలో భక్తి, ప్రేమ, వాత్సల్యం చోటు చేసుకుంటాయి. కుటుంబీకులు, బంధుమిత్రుల ద్వారా సంభవించిన అవమానాలు, కష్టనష్టాల తాలూకు భావనలన్నీ కుండలినీ ప్రాణాయామం ద్వారా సమసిపోతాయి. ఉఛ్వాస నిశ్వాసాలను క్రమబద్ధీకరించే ఈ మానసిక ప్రక్రియ ప్రాణాయామం ద్వారా మానసిక రుగ్మతలే కాకుండా, కడుపులో పుండ్లు, ఉబ్బసం వంటివి కూడా తగ్గిపోతాయి. ఇక తరవాతిదశలోకి వద్దాం. ఈ దశలో భావోద్వేగాలన్నీ భక్తిభావమయం అయి భగవంతునివైపు సాగిపోయే భక్తిప్రవాహంలా జీవితం మారిపోతుంది. భజనలు, కీర్తనల ద్వారా భగవదారాధన నిత్యకృత్య మవుతుంది. యోగాప్రక్రియ నిరంతర సాధన ద్వారానే ఇది సాధ్యమవుతుంది. క్రమేణా యోగిలో ఏకాగ్రత (ధారణ), ధ్యానం అలవడతాయి. మనసు నిశ్చలస్థితికి చేరుకుంటుంది. ఎటువంటి అలజడులు లేని ఈ మానసిక స్థితి అద్భుతమైనది. ఈ స్థితినుంచి జీవనయానం క్రమేణా సమాధిస్థితి వైపు సాగిపోతుంది. ఎటువంటి ఆలోచనలు లేని నిశ్చలస్థితికి యోగి మనసు చేరుకుంటుంది. సద్గురు ఇచ్చే ప్రత్యేకమైన, విశేషమైన సూచనల ద్వారా మనసు క్రమేణా అంతర్ముఖమవుతుంది, అంతరంగం ప్రకాశవంత మవుతుంది. అంతమాత్రాన భగవంతుని ఉనికిని అర్థం చేసుకునే స్థితికి మనసు చేరుకున్నట్టు కాదు. నిరంతర యోగసాధన ద్వారా మాత్రమే యోగి క్రమేణా ఈ స్థాయికి చేరువ అవుతాడు. ఆ తర్వాత మరింత యోగసాధన ద్వారా యోగి తనను తాను అర్పించుకునే స్థితికి చేరుకుంటాడు. మనసంతా ఆధ్యాత్మిక వెలుగుతో తేజో మయమవుతుంది. ఆ తేజస్సులో లీనమైన అనుభూతిని పొందుతుంది. క్రమేణా యోగి తానే తేజస్సుగా మారిపోతుంటాడు. మానసిక పరిపక్వత పరిఢవిల్లుతుంది. చైతన్యం, చురుకుతనం వికసిస్తాయి. దేవీదేవతలు, సాధు పుంగవుల సాక్షాత్కారం అనుభవంలోకి వస్తుంది. యోగి తను భక్తుడిననే స్పృహ æకోల్పోయే సర్వికల్ప సమాధిస్థితికి చేరతాడు. అనంతరం యోగితేజస్సులో లీనమయ్యే స్థితికి చేరువవుతాడు. ఆ తేజస్సులో తాదాత్మ్యం చెందుతాడు. బ్రహ్మానందభరితుడవుతాడు. యోగమార్తాండ యోగి రాజ సిద్ధనాథ్ ఒక హిమాలయ యోగి. క్రియాయోగ సాధనపై శిక్షణ ఇస్తారు. హైదరాబాద్, విశాఖపట్నంలో త్వరలో జరగబోయే కార్యక్రమాల వివరాలకు www.hamsakriya.org చూడచ్చు. – సిద్ధనాథ్ హంస యోగ్ సంఘ్ ►నిరంతర యోగసాధన ద్వారా ఇలా శారీరక రుగ్మతలు, బాధలను అధిగమించే స్థితినుంచి నిర్వికల్ప సమాధిస్థితికి చేరుకోగలుగుతాడు. సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఉనికిని అనుభవించగలుగుతాడు, క్రమేణా మహావతార బాబాజీ అధ్యాత్మ స్థితికి చేరుకుంటాడు. అంతిమంగా తేజస్సులో లీనమైపోతాడు. ఆది, అంతం లేని విశ్వవ్యాపమైన నిరంజన, నిర్వాణ, కైవల్యస్థితిలో ముక్తి పొందుతాడు. భగవంతునిలో లీనమైపోతాడు. -
వెబ్ సిరీస్‌తో క్రేజ్ సంపాదించుకున్న శోభిత
‘గూఢచారి’తో తెలుగులో క్రేజ్ సంపాదించికున్న శోభితా దూళిపాల.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఆమె నటించిన ‘మేడ్ ఇన్ హేవెన్’ వెబ్ సిరీస్ విశేషాదరణ పొందింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌లో తార పాత్రలో నటి శోభితా ధూళిపాల జీవించిందనే చెప్పవచ్చు. ఇందులో ఆమె నటించిన ‘తార’ అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రకు జనాలు ఫిదా అయిపోయారు. ‘మేడ్ ఇన్ హేవెన్’ సక్సెస్ కావడంతో తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంటూ.. ‘విభిన్న కోణాలున్న ‘తార’ పాత్ర నాకు ప్రశంసల్ని అందించింది. నటిగా నేను నా పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాననుకుంటున్నా. ‘తార’లాగే నిజ జీవితంలోనూ నేను ఎవరినీ జడ్జ్ చేయను. తార పాత్రలోని సున్నితత్వం, చైతన్యం, సంఘర్షణ నటిగా నా ఎదుగుదలకు తోడ్పడుతాయి. ప్రస్తుతం ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎవరూ చేయని విభిన్న పాత్ర చేయాలనుంది’ అని శోభిత తెలిపారు. తన తదుపరి చిత్రాలపై స్పందిస్తూ.. ‘జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రిషి కపూర్, ఇమ్రాన్ హష్మీతో కలిసి ‘ద బాడీ’ చిత్రంలో నటించాను. గీతూ మోహన్‌దాస్, నివిన్ పౌలీతో నటించిన సాహస చిత్రం ‘మూతాన్’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణ సంస్థ రూపొందించిన ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ అనే చారిత్రక చిత్రంలో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపారు. -
బాలీవుడ్ ఆఫరొచ్చిందోచ్
రాఘవ లారెన్స్ హారర్ కామెడీ మూవీ ‘ముని’తో తెలుగు ఆడియన్స్‌కు పరిచయ మయ్యారు హీరోయిన్ వేదిక. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, ఎక్కువగా తమిళం, మలయాళ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్గా వేదికకు బాలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఆఫరొచ్చింది. సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీతో మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ రూపొందిస్తున్న ‘ది బాడీ’ సినిమాలో హీరోయిన్గా వేదికను సెలెక్ట్ చేశారు. హిందీలో ఫస్ట్ మూవీలోనే ఇమ్రాన్ హష్మీ, రిషీ కపూర్‌తో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేశారు వేదిక. ‘‘ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు సూపర్ ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు వేదిక. స్పానిష్ మూవీ ‘ది బాడీ’కి రీమేక్‌గా ఈ సినిమాను వయాకామ్ 18 మూవీస్, సునీర్ కేటర్‌పాల్ నిర్మిస్తున్నారు. -
నవ్వుతో నాజూకు దేహం
పరిపరి శోధన నవ్వు నాలుగు విధాల చేటు అనే సామెతకు ఏనాడో కాలం చెల్లింది. నవ్వు నలభై విధాల గ్రేటని జనాలు తెలుసుకున్నారు. నవ్వు వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చని, శారీరకంగా చురుగ్గా ఉండొచ్చని కూడా పలు పరిశోధనలు తేల్చాయి. రోజులో ఎక్కువ సేపు నవ్వులు చిందిస్తూ ఉండటం వల్ల శరీరం నాజూకుతనాన్ని సంతరించుకుంటుందని ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు తేల్చారు. పెదవులు అరవిరిసేలా చిందించే చిరునవ్వుల కంటే, పగలబడి నవ్వే నవ్వుల వల్ల ముఖ కండరాలకు, పొట్ట కండరాలకు తగినంత వ్యాయామం లభించి, కేలరీలు కరుగుతాయని జీవశాస్త్రవేత్త కూడా అయిన బ్రిటిష్ హాస్యనటి డాక్టర్ హెలెన్ పిల్చర్ చెబుతున్నారు. -
కూరగాయలతో కాంతి
బ్యూటిప్స్ క్యాబేజీ ఆకులను గుజ్జులా చేసి, అందులో బాదం నూనె కొద్దిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దేహానికి పట్టించి, మృదువుగా రుద్ది, ఆ తర్వాత శుభ్రపరచాలి.కీరా ముక్కలను మెత్తగా రుబ్బి, అందులో కొద్దిగా పంచదార, కొబ్బరినూనె కలిపి శరీరానికి పట్టించి మృదువుగా రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి. టొమాటో గుజ్జులో కొద్దిగా తేనె కలిపి శరీరానికి పట్టించి, రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి. -
కడసారి చూపు కోసం తల్లిదండ్రుల నిరీక్షణ
ఆస్ట్రేలియాలో మృతిచెందిన శ్రీవాత్సంక నేడు సిడ్నీ నుంచి మృతదేహం రాక 30న హన్మకొండలో అంత్యక్రియలు కేయూక్యాంపస్ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈనెల 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హన్మకొండకు చెందిన నల్లాని చక్రవర్తుల శ్రీవాత్సంక మృతదేహం గురువారం సిడ్నీ నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకవచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ డాక్టర్ ఎన్వీఎన్ చారీ కుమారుడైన శ్రీవాత్సంక రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీకి వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ సిడ్నీలో ఎంఎస్(ఎంటెక్) మెకానికల్ ఇంజినీరింగ్‌లో ప్రవేశంపొంది రెండు నెలల క్రితమే ఆ కోర్సును పూర్తి చేశాడు. పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఆయన ఈనెల 23న సిడ్నీ నుంచి పూజ కోసం ఓ గ్రామానికి స్నేహితుడితో కారులో వెళ్తూ చెట్టుకు డీకొన్న సంఘటనలో మృతిచెందిన విషయం విధితమే. ఉన్నత విద్య కోసం వెళ్లిన తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తల్లిదండ్రులకు కడపుకోత మిగిల్చింది. కడసారి చూపు కోసం తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో నిరీక్షిస్తున్నారు. సిడ్నీలో శ్రీవాత్సంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఇక్కడికి తరలించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. ఈనెల 29న ఉదయం 10 గంటలకు సిడ్నీ నుంచి విమానంలో శ్రీవాత్సంక మృతదేహం హైదరాబాద్‌కు రానుంది. అదేరోజు అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈనెల 30వ తేదీ ఉదయం ఆరు గంటలకు హన్మకొండలోని తమ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకరానున్నారు. ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుపుతామని డాక్టర్ ఎన్వీఎన్ చారీ బుధవారం వెల్లడించారు. ఎంఎస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీవాత్సంక హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ రెండోగేట్ సమీపంలో నివాసం ఉండే డాక్టర్ ఎన్వీఎన్ చారీ కుమారుడు ఎన్సీహెచ్ శ్రీవాత్సంక విద్యార్థి దశ నుంచి చదువులో ప్రతిభ కనపర్చేవాడు. హన్మకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, 8, 9 తరగతులు రామన్ స్కూల్లో, పదో తరగతి తేజస్వినీ హైస్కూల్ విద్యను పూరి ్తచేశాడు. హైదరాబాద్‌లో శ్రీ చైతన్యలో ఇంటర్ ఎంపీసీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కిట్స్ కళాశాలలో 2013లో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తరువాత రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఇంజినీరింగ్‌లో ఎంఎస్ కోర్సు చదివేందుకు వెళ్లి ఆ కోర్సును కూడా రెండు నెలల క్రితం పూర్తిచేశాడు. మరో వైపు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఎంబీఏ డిప్లోమా కోర్సును కూడా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీవాత్సంక ఒకటి రెండు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు. -
పసి ప్రాణంపై కసి
*కనకదుర్గమ్మ వారధి వద్ద ఘోరం *నదిలోకి విసిరేసి అన్న కుమారుడిని అంతం చేసిన బాబాయి *తాతయ్య, నానమ్మల వద్దకు వచ్చి బాబాయి చేతికి చిక్కిన చిన్నారి *ఇంటికి రాలేదని వెతుకుతూ వస్తుండగా కనిపించిన మృతదేహం * గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముద్దుముద్దు మాటలు మూగబోయాయి.. బుడిబుడి అడుగులు ఆగిపోయాయి.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న చిన్నారి ఇక లేడని తెలిసిన ఆ తల్లిదండ్రుల హృదయాలు తల్లడిల్లాయి. హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజను సొంత బాబారుు హరిహరన్ బుధవారం అర్ధరాత్రి దాటాక కనకదుర్గమ్మ వారిధి పై నుంచి కృష్ణానదిలోకి విసిరి కసిగా ఉసురు తీశాడని తేలడంతో గుండెలు పగిలేలా ఆ దంపతులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. తాడేపల్లి రూరల్(గుంటూరు) : అసూయ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఘాతుకానికి కారకుడైన నిందితుడూ కనిపించకుండా పోయాడు. అసూయతో ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని సొంత బాబాయే కాలయముడై కృష్ణానదిలోకి విసిరి హత్య చేయడం సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతి చెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. కనకదుర్గమ్మ వారధి 28, 29 ఖానాల మధ్య నదిలో తేలియాడుతున్న మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ(18 నెలలు)ను తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, కుటుంబీకులు బంధువుల కథనం మేరకు మోక్షజ్ఞతేజ హత్యోదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అతని ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ తమ కుమారుడైన చిన్నారి మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. ఏఎస్ఐ రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్ కూడా ఉద్యోగంలో స్థిరపడగా, మూడవ కుమారుడు, ఈ సంఘటనలో నిందితుడైన హరిహరణ్ ఇంజినీరింగ్ చదివినప్పటికీ జులాయిగా తిరుగుతుండేవాడని బంధువులు తెలిపారు.ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చిన్నారి మోక్షజ్ఞతేజ తండ్రి భాస్కరరావు తెనాలి వచ్చి పద్ధతి మార్చుకోవాలని తమ్ముడైన హరిహరణ్‌కు హితబోధ చేసి వెళ్లారు. దీనిని మనసులో పెట్టుకున్న హరిహరణ్.. బుధవారం సాయంత్రం ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు చేరుకున్న రాంబాబు రెండో కుమారుడు చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్ద సంఖ్యలో జనం ఉండడంతో కంగారుపడి వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. దీంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ ‘బాబాయి చేతిలో బలైపోయావా నాన్నా’ అంటూ బోరున విలపించాడు. అనంతరం అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు, తాడేపల్లి ఎస్ఐ దుర్గాసి వినోద్‌కుమార్‌లకు జరిగిన విషయాన్ని చంద్రశేఖర్ వివరించారు. చిన్నారిని తీసుకువచ్చిన బాబాయి హరిహరణ్ వారధిపై నుంచి విసిరి నదిలో పడేసి ఉంటాడనే నిర్ధారణకు వచ్చారు. వారధిపై ఇంటి నుంచి నిందితుడు తెచ్చిన పంచను పోలీసులు కనుగొని ఇక్కడ నుంచే హత్య చేసి ఉంటాడని భావించారు. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అడవిలో యువతి మృతదేహం
ముసునూరు మండలం లోపూడి-చెక్కపల్లి అటవీ ప్రాంతంలో ఖననం ఇసుకలో నుంచి పాక్షికంగా బయటపడిన వైనం హత్యేనని అనుమానం లోపూడి(ముసునూరు) : మండలంలోని లోపూడి పరిధిలో గల అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుకు వెళ్లే వాగులో యువతి మృతదేహం కనిపించింది. ఇసుకలో పూడ్చిపెట్టిన మృతదేహం పాక్షికంగా బయట పడటాన్ని పశువుల కాపరులు శుక్రవారం చూసి గ్రామ పెద్దలకు తెలియజేశారు. వారు అందించిన సమాచారంతో నూజివీడు సీఐ కె.వి.సత్యనారాయణ, ముసునూరు ఎస్సై పి.శోభన్‌కుమార్, నూజివీడు టౌన్ ఎస్సై ఆదిప్రసాద్, తహశీల్దార్ డి.వనజాక్షి ఘటనాస్థలికి వచ్చారు. ఘటనాస్థలిలో పంజాబీ డ్రెస్ ఉండటంతో మృతురాలు 20 సంవత్సరాల వయస్సుగల యువతి అయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహం పాడై ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో ఘటనాస్థలిలోనే పోస్టుమార్టం జరిపించాలని అధికారులు నిర్ణయించారు. ఫోరెన్సిక్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పోస్టుమార్టం శనివారం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. వారం లేదా పదిరోజుల కిందట ఆమెను ఎక్కడో చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. లోపూడి-చెక్కపల్లి రోడ్డు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడకు తీసుకువచ్చి ఇసుకలో పూడ్చిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. సర్పంచ్ పేరం మద్దిరామయ్య, ఎంపీటీసీ సభ్యుడు పంజగల వెంకయ్య, చెక్కపల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు కోటగిరి రాజానాయన తదితరుల ఆధ్వర్యంలో తహశీల్దార్ డి.వనజాక్షి సమక్షంలో పంచనామా నిర్వహించారు. యువతి మృతదేహం కనిపించిందని ప్రచారం జరగడంతో లోపూడి, చెక్కపల్లి, సూరెపల్లి, గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో లోపూడి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు శ్రమించారు. -
గిరిజ మృతదేహం వెలికితీత
ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజ మృతి చెందింది. మూడు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం రాత్రి ముగిసింది. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామ సమీపంలోని బోరుబావి నుంచి ఐదేళ్ల చిన్నారి గిరిజ మృతదేహాన్ని రాత్రి 8:15 నిమిషాల ప్రాంతంలో రెస్క్యూటీం బయటకు తీసింది. 56 గంటలపాటు గా కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం గిరిజ మృతదేహం బయటకు రాగలింది. చిన్నారి మృతిని అధికారికంగా సోమవారం మధ్యాహ్నమే ధ్రువీకరించినా.. మృతదేహం వెలికితీతకు మరింత సమయం పట్టింది. 45 అడుగుల లోతులో కూరుకుపోయి న గిరిజ మృతదేహం ఉబ్బిపోవడం వెలికితీతకు అవరోధం అయింది. చివరకు గిరిజ మృతదేహాన్ని కేసింగ్ పైపుల ద్వారా లాగారు. 50 శాతం శరీర భాగాలను మాత్రమే వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.