bogus voter list
-
దొంగ ఓట్లతో రాజకీయం చేసేదీ టీడీపీనే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా తాము వ్యవహరించమని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో తాను గాని, తన కుటుంబం కానీ ఓట్లు వేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఉంటున్న రెయిన్‌ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్ట్మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోనూ, రెండో వైపున ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఉంటాయని తెలిపారు. ఓటర్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోనూ పేర్లు నమోదు చేయడం జరిగిందని అన్నారు. విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాల్సిందిగా జనవరి 31వ తేదీనే దరఖాస్తు చేశామని తెలిపారు. ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించే ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. ఇన్నాళ్ళ ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదని అన్నారు. తప్పుడు పద్ధతుల్లో, కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా ఎన్నికల్లో తలపడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గత ఐదేళ్ల ప్రభుత్వపాలనే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు.ప్రజలు నిశితంగా వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని సజ్జల తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓట్లు వేయలేదు. పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టుగా.. @JaiTDP నాయకుడు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. -వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#BanYellowMediaSaveAP… pic.twitter.com/eF95qaleNi — YSR Congress Party (@YSRCParty) February 14, 2024 -
సీఈసీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఓట్ల తొలగింపుపై భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఈసీని కలిశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీతో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీస్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు మేము అవకతవకలకు పాల్పడుతున్నామని ఆయన అంటుంటే దొంగే దొంగ అన్నచందాన ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. 2014-19 వరకు బాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని, ఆ లెక్క సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తూనే దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీదేనని అన్నారు. వెంటనే ఓటరు కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని.. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకతతో జరిపించాలని ఈసీని కోరినట్టు స్పస్టం చేశారు. ఈ దఫా అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు జరిగిందని 2019లో 3,98,34776 ఓట్లు ఉంటే, ఇప్పుడు 3,97,96,678 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఎక్కడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని అన్నారు. ఎన్నికలకు నిజమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. చంద్రబాబు సేవా మిత్ర, మై టీడీపీ ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, టీడీపీ ఓటరు ప్రొఫైలింగ్ ఆపాలని ఈసీని కోరినట్టు తెలిపారు. దీనిపై ఈసీ ఫుల్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చంద్రయాన్-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్ రూట్ మార్చిన ఇస్రో -
టీడీపీ బోగస్ ఓట్లపై ఏపీ సీఈవోకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ బోగస్ ఓట్ల వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఆమంచి కృష్ణమోహన్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఏపీ సీఈవోను కలిసిన ఆమంచి.. పర్చూరులో టీడీపీ నేతలు చేర్చిన 40వేల బోగస్ ఓట్లను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో.. దొంగఓట్లు చేర్చిన ఏలూరు సాంబశివరావు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్చూరు వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. 1000మంది ఉన్న జనాభా రేషియోకు సుమారుగా 600మంది ఓటర్లు ఉండాలి. 2014 ఎన్నికల సమయంలో 20,801 ఓట్లు కొత్తగా అక్రమంగా చేరాయి. ఎలక్టరోల్ టు పాపులేషన్ రేషియో గణనీయంగా 760కి పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. బోగస్ ఓట్లు భారీగా పెరిగినట్టు 2014లో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ కేసును నీరుగార్చారు. 2014లో పెట్టిన ఆ కేసు ఇప్పటికే తేలలేదు. అందుకే ఇప్పుడు ఆ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయమని ఈసీని కోరాం. పర్చూరులో బాగా చదువుకున్నవారు ఎక్కువమంది ఉన్నారు. 128మంది ఎన్నారైలు 6A ద్వారా ఇక్కడ ఓటు హక్కు కొనసాగిస్తున్నారు. వాళ్ళ బంధువుల ద్వారా దొంగఓట్లు వేస్తున్నారు. కారంచేడులో పక్క ఊర్లు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు 142 ఉన్నాయి. భారతదేశంలో ఏ పౌరుడికైన ఓటు ఒక్క చోటే హక్కు ఉండాలి. పెళ్ళైన మహిళల ఓట్లను ఇంకా అక్కడే ఉంచుతున్నారు. కర్ణాటక జిల్లా రాయచూరులో స్థిరపడి అక్కడ ఓట్లు ఉన్నవారికి పర్చూరులో ఓట్లు ఉన్నాయి. వేరే ఊర్లలో ఉంటూ పర్చూరులో బోగస్ ఓట్లు నమోదు చేసుకున్నారు. ఎలక్షన్ టైంకి బస్సులు, కారుల్లో వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. 2014, 2019లో మొత్తం 40వేల దొంగఓట్లు చేర్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను సొంతంగా పెట్టుకుని దొంగ ఓట్లను కొనసాగిస్తున్నారు. వీఆర్వోల ద్వారా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్తున్నాయి. పూర్తి ఆధారాలు ఈసీకి సమర్పించాను. 2014, 19లో దొంగ ఓట్లు చేర్చిన టీడీపీ నేతలతోపాటు వీఆర్వో, ఎమ్మార్వో, డేటాఎంట్రీ ఆపరేటర్లపై కేసులు నమోదు చేయాలి. చట్ట ప్రకారం శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ కోరాం అని ఆమంచి తెలియజేశారు. -
సర్వేల పేరుతో ఓట్లను తొలగిస్తున్నారు
-
బాబు..బోగస్ కుప్పం
-
బాబు..బోగస్ కుప్పం
కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లున్నాయని భన్వర్‌లాల్ వెల్లడి సాక్షి, చిత్తూరు/కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపు బాగోతం బట్టబయలైంది. ఆయన కుప్పంనుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించడానికి కుప్పలు తెప్పలుగా ఉన్న బోగస్ ఓట్లే కారణమని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కూడలిగా ఉంది. నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో 1.96 లక్షలకుపైగా ఓటర్లుండగా... అందులో 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ 15 రోజుల కిందట చేసిన ప్రకటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో కంగుతిన్న అధికారులు ఓటర్ల జాబితాను చక్కదిద్దే పనులను హడావుడిగా చేపట్టారు. ఈ క్రమంలో బోగస్ ఓటర్లపేర్లు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. ఇందులో సుమారు 20వేల వరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని అధికారులు చెబుతున్నారు. కుప్పం ప్రాంతంలో ఒక సావూజికవర్గానికి చెందిన ఓట్లు 40 శాతం వరకు ఉన్నాయి. ఈ సామాజికవర్గానికి చెందిన వారికి కుప్పం, తమిళనాడు రాష్ట్రంలో బంధువులు అధికంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం వీరందరూ రెండు రాష్ట్రాల్లోనూ ఓటరు, రేషన్‌కార్డులు పొంది ఉన్నారని వెల్లడైంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలోని రావుకుప్పం వుండలం కెంచనబల్ల పంచాయుతీ పరిధిలోని ఓటర్ల జాబితాను అధికారులు పరిశీలించారు. ఈ పంచాయుతీ పరిధిలో 2,689 వుంది ఓటర్లున్నారు. వీరి పేర్లే శాంతిపురం వుండలం బడుగువూకులపల్లె, కుప్పం పట్టణంలోని బీసీ కాలనీలోని ఓటర్ల జాబితాలోనూ ఉన్నట్లు తేలింది. ఈ పంచాయుతీలోనే 500 పైగా బోగస్ ఓట్లు ఉన్నట్లు నిర్ధారించారు. గుడుపల్లె వుండలంలోని పొగురుపల్లె, గుండ్లసాగరం పంచాయుతీల్లో 100కు పైగా ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు తేలింది. టీడీపీ ఇన్చార్జ్ ఇలాకాలో భారీగా బోగస్ ఓట్లు కుప్పం నియోజకవర్గంనుంచి చంద్రబాబు నాయుడు 1989 నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. 1989లో 6,918, 1994లో 56,518, 1999లో 65,687, 2004లో 59,558, 2009లో 44,885 ఓట్ల మెజారిటీ సాధించారు. 1989లో మొదటిసారి సాధించిన మెజారిటీకి తరువాత 1994లో సాధించిన మెజారిటీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపించడం బోగస్ ఓట్ల వల్లనేనన్న విమర్శలు వినవస్తున్నాయి. అప్పటినుంచే బోగస్ ఓటర్ల నమోదుకు శ్రీకారం జరిగివుంటుందని, అందువల్లనే ఆ తరువాత జరిగిన ప్రతి సాధారణ ఎన్నికల్లో కూడా అదే మెజారిటీ కొనసాగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పీఎస్ వుునిరత్నం ఇలాకా కంగుంది పంచాయతీలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు బయుటపడటాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఈ పంచాయతీలో 5,124 మంది ఓటర్లు ఉన్నారు. తమిళనాడులోని తివ్ముంబట్ట సమీపం అరసనాపురం పంచాయుతీకి చెందిన గొల్లపల్లె వాసులు 1,000 వుందికిపైగా కంగుంది పంచాయుతీలోనూ బోగస్ ఓటర్లుగా ఉన్నారు. వీరి మధ్య బంధుత్వం ఉండటంవల్ల రెండు ప్రాంతాల్లోనూ ఓటర్లుగా చలావుణీ అవుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పంచాయతీలో ఇలా ఉంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతలు తమిళనాడు, కర్ణాటక ప్రాం తాల్లోని బంధువర్గానికి చెందిన 10నుంచి 20వేల మందిని ఇక్కడ ఓటర్లుగా న మోదు చేయించినట్లు తెలుస్తోంది. వారందర్నీ రప్పించి ఓట్లు వేసుకోవడం వల్లే బాబుకు మెజారిటీ తగ్గకుండా వస్తోందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. విచారిస్తే వెలుగులోకి వాస్తవాలు:కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్ల వ్యవహారంపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 4 మండలాల్లోని పంచాయతీల్లో ప్రతి ఓటునూ తనిఖీ చేస్తే వేలసంఖ్యలో బోగస్ ఓట్లు వెలుగుచూడనున్నాయి. తమిళనాడులో ఉంటూ ఇక్కడ ఓటు పొం దిన వ్యక్తి ఇచ్చిన డోర్ నంబరులో ఇప్పుడు ఉంటున్నాడా లేక బంధువుల డోర్ నంబర్ ఇచ్చాడా అనేది పరిశీలించాల్సి ఉంది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాం గం ఎక్కువ మంది సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించి తనిఖీలు చేయాలి. ఇదే తరహా విచారణ కర్ణాటక సరిహద్దు గ్రామాల్లోనూ జరపాల్సి ఉంది. బోగస్ ఓట్లు తొలగిస్తాం: మునినారాయణ, తహశీల్దార్, కుప్పం వీఆర్వోలను క్షేత్రస్థాయిలో గ్రామాలకు పంపుతున్నాం. తమిళనాడు, కర్ణాటకవాసులు ఓటర్లుగా ఉన్న విషయమై విచారణ చేపడుతున్నాం. మూడు, నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. బోగస్ ఓట్లను తొలగిస్తాం.