బాబు..బోగస్ కుప్పం | bogus voter list in chandrababu constituency | Sakshi
Sakshi News home page

బాబు..బోగస్ కుప్పం

Published Fri, Jan 3 2014 2:02 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

bogus voter list in chandrababu constituency

కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లున్నాయని భన్వర్‌లాల్ వెల్లడి
 
 సాక్షి, చిత్తూరు/కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపు బాగోతం బట్టబయలైంది. ఆయన కుప్పంనుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించడానికి కుప్పలు తెప్పలుగా ఉన్న బోగస్ ఓట్లే కారణమని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కూడలిగా ఉంది. నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో 1.96 లక్షలకుపైగా ఓటర్లుండగా... అందులో 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ 15 రోజుల కిందట చేసిన ప్రకటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో కంగుతిన్న అధికారులు ఓటర్ల జాబితాను చక్కదిద్దే పనులను హడావుడిగా చేపట్టారు. ఈ క్రమంలో బోగస్ ఓటర్లపేర్లు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి.

 

ఇందులో సుమారు 20వేల వరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని అధికారులు చెబుతున్నారు. కుప్పం ప్రాంతంలో ఒక సావూజికవర్గానికి చెందిన ఓట్లు 40 శాతం వరకు ఉన్నాయి. ఈ సామాజికవర్గానికి చెందిన వారికి కుప్పం, తమిళనాడు రాష్ట్రంలో బంధువులు అధికంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం వీరందరూ రెండు రాష్ట్రాల్లోనూ ఓటరు, రేషన్‌కార్డులు పొంది ఉన్నారని వెల్లడైంది. ఇటీవల నియోజకవర్గ పరిధిలోని రావుకుప్పం వుండలం కెంచనబల్ల పంచాయుతీ పరిధిలోని ఓటర్ల జాబితాను అధికారులు పరిశీలించారు. ఈ పంచాయుతీ పరిధిలో 2,689 వుంది ఓటర్లున్నారు. వీరి పేర్లే శాంతిపురం వుండలం బడుగువూకులపల్లె, కుప్పం పట్టణంలోని బీసీ కాలనీలోని ఓటర్ల జాబితాలోనూ ఉన్నట్లు తేలింది. ఈ పంచాయుతీలోనే 500 పైగా బోగస్ ఓట్లు ఉన్నట్లు నిర్ధారించారు. గుడుపల్లె వుండలంలోని పొగురుపల్లె, గుండ్లసాగరం పంచాయుతీల్లో 100కు పైగా ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు తేలింది.
 
 టీడీపీ ఇన్‌చార్జ్ ఇలాకాలో భారీగా బోగస్ ఓట్లు
 
 కుప్పం నియోజకవర్గంనుంచి చంద్రబాబు నాయుడు 1989 నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. 1989లో 6,918, 1994లో 56,518, 1999లో 65,687, 2004లో 59,558, 2009లో 44,885 ఓట్ల మెజారిటీ సాధించారు. 1989లో మొదటిసారి సాధించిన మెజారిటీకి తరువాత 1994లో సాధించిన మెజారిటీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపించడం బోగస్ ఓట్ల వల్లనేనన్న విమర్శలు వినవస్తున్నాయి. అప్పటినుంచే బోగస్ ఓటర్ల నమోదుకు శ్రీకారం జరిగివుంటుందని, అందువల్లనే ఆ తరువాత జరిగిన ప్రతి సాధారణ ఎన్నికల్లో కూడా అదే మెజారిటీ కొనసాగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
 కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పీఎస్ వుునిరత్నం ఇలాకా కంగుంది పంచాయతీలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు బయుటపడటాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఈ పంచాయతీలో 5,124 మంది ఓటర్లు ఉన్నారు. తమిళనాడులోని తివ్ముంబట్ట సమీపం అరసనాపురం పంచాయుతీకి చెందిన గొల్లపల్లె వాసులు 1,000 వుందికిపైగా కంగుంది పంచాయుతీలోనూ బోగస్ ఓటర్లుగా ఉన్నారు. వీరి మధ్య బంధుత్వం ఉండటంవల్ల రెండు ప్రాంతాల్లోనూ ఓటర్లుగా చలావుణీ అవుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పంచాయతీలో ఇలా ఉంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతలు తమిళనాడు, కర్ణాటక ప్రాం తాల్లోని బంధువర్గానికి చెందిన 10నుంచి 20వేల మందిని ఇక్కడ ఓటర్లుగా న మోదు చేయించినట్లు తెలుస్తోంది. వారందర్నీ రప్పించి ఓట్లు వేసుకోవడం వల్లే బాబుకు మెజారిటీ తగ్గకుండా వస్తోందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
 
 విచారిస్తే వెలుగులోకి వాస్తవాలు:కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్ల వ్యవహారంపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 4 మండలాల్లోని పంచాయతీల్లో ప్రతి ఓటునూ తనిఖీ చేస్తే వేలసంఖ్యలో బోగస్ ఓట్లు వెలుగుచూడనున్నాయి. తమిళనాడులో ఉంటూ ఇక్కడ ఓటు పొం దిన వ్యక్తి ఇచ్చిన డోర్ నంబరులో ఇప్పుడు ఉంటున్నాడా లేక బంధువుల డోర్ నంబర్ ఇచ్చాడా అనేది పరిశీలించాల్సి ఉంది. ఇందుకోసం రెవెన్యూ యంత్రాం గం ఎక్కువ మంది సిబ్బందిని డెప్యుటేషన్‌పై నియమించి తనిఖీలు చేయాలి. ఇదే తరహా విచారణ కర్ణాటక సరిహద్దు గ్రామాల్లోనూ జరపాల్సి ఉంది.
 
 బోగస్ ఓట్లు తొలగిస్తాం: మునినారాయణ, తహశీల్దార్, కుప్పం
 
 వీఆర్వోలను క్షేత్రస్థాయిలో గ్రామాలకు పంపుతున్నాం. తమిళనాడు, కర్ణాటకవాసులు ఓటర్లుగా ఉన్న విషయమై విచారణ చేపడుతున్నాం. మూడు, నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. బోగస్ ఓట్లను తొలగిస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement